స్టీవ్ జాబ్స్ గురించి కొన్ని తెలియని విషయాలు

స్టీవ్ జాబ్స్ గురించి కొన్ని తెలియని విషయాలు

Saturday February 25, 2017,

2 min Read

స్టీవ్ జాబ్స్. పరిచయం అక్కర్లేని పేరు. వరల్డ్ మోస్ట్ వాల్యూబుల్ కంపెనీ ఆపిల్ సహ-వ్యవస్థాపకుడు. అనేక రంగాలను ప్రభావితం చేసిన విజనరీ. రివల్యూషనరీ. సరికొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేసిన ఇన్నోవేటర్. గాడ్ ఆఫ్ టెక్నాలజీ గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలియవు.

image


ఏ మతం స్వీకరించాడంటే..

స్టీవ్ జాబ్స్ బౌద్ధ సన్యాసి. ఎప్పటినుంచో బౌద్ధం స్వీకరించాలని అనుకున్నాడు. 1974లో ఇండియాకు వచ్చిన సందర్భం కూడా అదే.

ఫేవరెట్ డిష్

స్టీవ్ జాబ్స్ కు ఇష్టమైన ఆహారం చేపలకూర. క్యారెట్లు, పళ్లరసాలంటే కూడా ఇష్టమే. కొన్నాళ్లపాటు కేవలం ఫ్రూటీరియన్ గానే బతికాడు. అంటే పళ్లు, విత్తనాలు, గింజలు, కూరగాయలు, ధాన్యాలు ఇవి మాత్రమే తిన్నాడు.

పెద్దగా చదువుకోలేదు

స్టీవ్ జాబ్స్ కాలేజీ డ్రాపవుట్. ఏడాదిన్నర మాత్రమే కాలేజీకి వెళ్లాడు. కాలిగ్రఫీ మీద ఆసక్తితో దానిపై దృష్టిపెట్టాడు. తర్వాత టైపోగ్రఫీ మీద కాన్‌సన్‌ట్రేట్ చేశాడు.

చివరి మాటలు ఇప్పటికీ సస్పెన్సే

స్టీవ్ జాబ్స్ తుది శ్వాస విడిచేటప్పుడు ఏ మాట్లాడాడు అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఓహ్ వావ్ అనే పదాన్ని మూడు సార్లు రిపీట్ చేశాడట .. అయితే దాని వెనుక రీజన్ మాత్రం తెలియదు.

సాదాసీదా డ్రెస్

స్టీవ్ జాబ్స్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది తాబేలు మెడలాంటి నల్లటి షర్టు, లెవిస్ జీన్స్, కాళ్లకు స్నీకర్స్. ఇదే అతని డ్రెస్ కోడ్. అన్నట్టు తన వాడ్రోబ్ లో లెవిస్ జీన్స్ వంద వరకు ఉన్నాయట. జీవితాంతం వాటినే ధరించాడు.

27 ఏళ్ల తర్వాత సోదరిని కలిశాడు

మోనా సింప్సన్ స్టీవ్ జాబ్స్ బయలాజికల్ సిస్టర్. 27 ఏళ్ల తర్వాత ఆమెని కలిశాడు. కారణం స్టీవ్ జాబ్స్ కన్నతల్లిదండ్రులు వేరు.. పెంచిన అమ్మానాన్నలు వేరు . అందుకే తోడబుట్టిన చెల్లిని కలవడానికి అన్నేళ్లు పట్టింది.

ఆపిల్ పేరే ఎందుకు ?

ఆపిల్ పేరు పెట్టడం వెనుక చాలా సంఘర్షణ వుంది. చర్చోపచర్చలు నడిచాయి. అయినా పేరు విషయంలో క్లారిటీ రాలేదు. బేసిగ్గా ఫ్రూటీరియన్ అయిన స్టీవ్.. ఎక్కువగా ఆర్గానిక్ ఫామ్ నుంచే ఆపిల్స్ తెచ్చుకుంటుంటాడు. అలా ఒకసారి తోటకు వెళ్లినప్పుడు, బుర్రలో ధన్ మని మెరిసింది. కంపెనీ పేరు ఆపిల్ అనే ఎందుకు పెట్టకూడదు అని. అలా అతనికి ఇష్టమైన పండుపేరే కంపెనీ నామధేయంగా ఫిక్సయిపోయింది.

ఆపిల్ వదిలేసి మళ్లీ వచ్చాక

ఆధిపత్య పోరు మూలంగా స్టీవ్ జాబ్స్ సొంతకంపెనీ నుంచి వైదొలిగాల్సివచ్చింది. ఆ తర్వాత ఆపిల్ తీవ్ర సంక్షోభంలో ఉన్న టైంలో మళ్లీ సొంతగూటికి చేరుకున్నాడు. 1997లో స్టీవ్ రాక సంస్థకు ఎంతో కలిసొచ్చింది. దివాళా తీసే టైంలో కంపెనీని లాభాల బాట పట్టించాడు. సంస్థ సీఈవోగా ఉన్న ఆ రోజులు.. తన జీవితంలో మోస్ట్ క్రియేటివ్ పీరియెడ్ అంటాడు.

చండశాసనుడు

స్టీవ్ జాబ్స్ టఫ్ బాస్. రూలంటే రూలే. పద్ధతంటే పద్ధతే. ఫాలో అవుతాడు.. ఫాలో అవ్వాలని చెప్తాడు. తేడా వస్తే చండశాసనుడిలా మారుతాడు.

ఎమోషన్స్ కోసం స్పెషల్ టీం

ఎమోషన్స్ స్టడీ చేయడానికి స్టీవ్ జాబ్స్ కి ఒక స్పెషల్ టీం ఉంటుంది. ప్రతీ ప్రాడక్టుకి సంబంధించి అది లోతుగా పరిశీలిస్తుంది. ఇప్పుడది ఆపిల్ ఉత్పత్తుల్లో సర్వసాధారణమైంది.

ఎన్ని పేటెంట్స్ ఉన్నాయంటే

స్టీవ్ జాబ్స్ కు దాదాపు 300 పేటెంట్ హక్కులున్నాయి. ఆఫిల్ స్టోర్ లో గ్లాస్ స్టెయిర్ కేసు అందులో అన్నిటికంటే ప్రత్యేకమైంది. స్టోర్ లోకి రప్పించడానికి అదొక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్తారు.