పేమెంట్ ప్రాసెస్‌ అత్యంత సులువుగా మార్చిన 'జస్‌పే'

సునాయాసంగా, సౌకర్యంగా ఆన్‌లైన్‌ చెల్లింపులకు కొత్త యాప్‌మొబైల్‌ పాస్‌వర్డ్‌ ఎంట్రీకి అత్యాధునిక కీబోర్డు క్యాష్‌లెస్‌ కొనుగోళ్లకు సింగిల్ క్లిక్‌ చాలు

పేమెంట్ ప్రాసెస్‌ అత్యంత సులువుగా మార్చిన 'జస్‌పే'

Wednesday June 24, 2015,

3 min Read

ఆన్‌లైన్‌లో కొనుగోలు జరపడం అంత వీజీ కాదు. కార్డు నెంబర్‌ ఎంటర్ చేసిన తర్వాత ఒన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (OTP) కోసం ఎదురుచూస్తూ..విసిగిపోయే మధ్యలో డ్రాప్ అయ్యే వాళ్లు ఎందరో. ఆన్ లైన్ లావాదేవీలు జరిపే ప్రతీ ఒక్కరికీ ఎప్పుడో ఒకసారి ఈ సమస్య ఎదురయ్యే ఉంటుంది.

ఇదేదో మన దేశంలోనే ప్రత్యేకం అనుకోకండి. ప్రపంచమంతా ఇదే సమస్య. అన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారిలో 21 శాతం మంది ఈ సుదీర్ఘ ప్రాసెస్‌తో చిరాకెత్తిపోయి, కొనడమే మానేస్తుంటారని సర్వేలో తేలింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ సరళతరం చేయడానికి పేపాల్‌ వారు మూడు నెలల క్రితం ఓ ప్రయోగం చేశారు. మర్చంట్‌ యాప్స్‌ కోసం సింగిల్‌ క్లిక్‌ చెల్లింపు పద్ధతిని ప్రవేశపెట్టింది. మొబైల్‌ వినియోగదారులు ఒకసారి తమ యూజర్‌ నేమ్‌, పాస్‌ వర్డ్‌లతో లాగిన్‌ అయితే చాలు. ఆ తర్వాత జరిపే కొనుగోళ్లకు 'బై' బటన్‌ టచ్‌ చేయడంతో పని జరిగిపోతుంది.

వెబ్‌, మొబైల్‌ ద్వారా 1-క్లిక్‌ పేమెంట్లు జరపడంద్వారా కలిగిన అనుభవంతో విమల్‌ కుమార్‌, రామనాథన్‌ 2012లో మరో అడుగు ముందుకేశారు. బెంగళూరుకు చెందిన జస్‌పే టెక్నాలజీస్‌ తాజాగా జస్‌పే సేఫ్‌ ఆరంభించింది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, చెల్లింపు అప్లికేషన్ల నిమిత్తం ప్రత్యేకంగా రూపొందించినది యాప్ ఇది. సంప్రదాయిక బ్రౌజర్లలో అన్‌లైన్‌ గేమింగ్‌ నుంచి ముఖ్యమైన బ్యాంకింగ్‌ అప్లికేషన్ల వరకు ఒకే తరహాలో కీబోర్డు పనిచేస్తుంది. జస్‌పే సేఫ్‌ వారు బ్యాంకింగ్‌ వినియోగదారుల భద్రతనుకూడా దృష్టిలో పెట్టుకున్నారు. నెట్‌వర్క్‌ ఆప్టిమైజేషన్‌ టెక్నాలజీస్‌ద్వారా డిజిటల్‌ పేమెంట్లు విస్తృతం కావడానికి అనువుగా రూపొందించారు. బరువైన పర్సు లేకుండానే బజారుకు వెళ్లడానికి అలవాటుపడేలా ప్రయత్నించారు.

జస్‌పే సేఫ్‌ స్టాండీతో జస్‌పే సహ స్థాపకులు విమల్‌ కుమార్‌, రామనాథన్‌

జస్‌పే సేఫ్‌ స్టాండీతో జస్‌పే సహ స్థాపకులు విమల్‌ కుమార్‌, రామనాథన్‌


జస్‌పే మొట్టమొదటగా 'ఎక్స్‌ ప్రెస్‌ చెక్‌అవుట్‌'ను ప్రవేశపెట్టింది. ఈ ఆప్షన్‌ చెల్లింపుల నిమిత్తం కార్డు నిల్వతోకూడినది. రెడ్‌బస్‌ డాట్‌ ఇన్‌, స్నాప్‌డీల్‌, ఫ్రీచార్జ్‌, న్యూస్‌హంట్‌ వంటివి జస్‌పే క్లయింట్లలో ఉన్నాయి. ఈ రెండు ఉత్పాదనలతోనే కంపెనీ నెలకు 40 లక్షల పైచిలుకు లావాదేవీలు జరుపుతోంది.

స్మార్ట్‌ ఫోన్ల వినియోగం పెరగడంతో జస్‌పే సేఫ్‌ చెల్లింపులలో సౌలభ్యం, భద్రత రెండింటినీ మెరుగుపరిచింది. జస్‌పే సేఫ్‌ మొబైల్‌ బ్రౌజర్‌ కావడంతో, యాప్స్‌లో చేర్చుకోవచ్చు. ఇందుకుగాను నిమిషాల వ్యవధిలోనే మొబైల్‌తో డిఫాల్ట్‌ గా వచ్చే వెబ్‌వ్యూ బ్రౌజర్‌ డాట్‌ యాప్‌ని రీప్లేస్‌ చేసుకోవడానికి అనువుగా ఇంటెగ్రేట్‌ చేశారు.

1. భద్రతలో సాటి లేదు

వినియోగదారులను మోసగించడానికి ప్రయత్నిస్తే జస్‌పే సేఫ్‌లో చెల్లదు. బ్యాంక్‌ పేజీలవలె కనిపించే బూటకపు వెబ్‌సైట్లను గుర్తించడానికిగాను అంతర్నిర్మిత భద్రత ఉంది. బ్యాంకింగ్‌ అప్లికేషన్ల కోసం ప్రత్యేక కీబోర్డు కూడా ఉంది. థర్డ్‌ పార్టీ వారు లాగిన్‌ అయి, వినియోగదారుల గోపనీయ సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా భద్రత కల్పిస్తుంది. మొబైల్‌ లావాదేవీలకు వేలిముద్రల గుర్తింపు డివైజ్‌తో సమన్వయ పరిచేందుకుగాను బ్యాంకులతో కలిసి పనిచేయాలనికూడా జస్‌పే ఆలోచిస్తోంది. దీనివల్ల మోసగాళ్లకంటే ఒకడుగు ముందుండడానికి వీలు కలుగుతుంది.

2. అత్యంత సౌలభ్యం

లావాదేవీలకు పట్టే సమయాన్ని తగ్గించి, చెల్లింపులు వేగంగా జరపడానికి వీలైనంత సౌలభ్యాన్ని జస్‌పే సేఫ్‌ కల్పించింది. ఆటో ప్రాసెసింగ్‌ , 2జి మొబైళ్లలో వేగంగా పేజీ లోడ్‌ కావడం, తేలికగా పాస్‌వర్డ్‌ ఎంట్రీకి కీబోర్డు, నావిగేషన్‌ నియంత్రణను పెంచడంవంటి అనేక విభిన్న ఫీచర్లను కలిగి ఉంది. వినియోగదారుల ఇబ్బందులను తొలగించి, చెల్లింపులు అత్యంత సరళంగా జరిగేలా చూడడంపైనే జస్‌పే సేఫ్‌ దృష్టి కేంద్రీకరించింది.

image


కంపెనీ భవిష్య అంచనాలు, నిధులు

100 కోట్ల మంది మొబైల్‌ ద్వారా 1-క్లిక్‌ పేమెంట్లు సురక్షితంగా జరిపేలా చూడడమే జస్‌పే లక్ష్యం. ఇందుకుగాను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ చెల్లింపులను సమన్వయపరిచే పనిలో ఉంది. మొబైల్‌ద్వారా చెల్లింపులకు సంబంధించి 95%కి మించి సక్సెస్‌ రేట్‌ సాధించాలని ఆరాట పడుతోంది.

జస్‌పే సహస్థాపకుడు విమల్‌ కుమార్‌ మాటల్లో చెప్పాలంటే... 'వినియోగదారులకు చక్కటి సేవలందించడానికి, సక్సెస్‌ రేటు పెంచుకోవడానికి వీలుగా వ్యాపారులకు పేమెంట్స్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ అందిస్తున్నాం. మా ద్వారా చెల్లింపులు జరగవు. అయితే, అన్ని పేమెంట్‌ గేట్‌వేలకు పైన ఒక లేయర్‌ వలె పనిచేస్తాం' అన్నారు.

మీడియా రంగంలో విశేషానుభవంగల హరీష్‌ చావ్లా జస్‌పేకి భారీగా నిధులు సమకూర్చారు. ఆయన గతంలో నెట్‌వర్క్‌18, వయాకామ్‌18 మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో గ్రూప్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సిఈవో)గా పనిచేసి, ప్రస్తుతం ఇండియా వేల్యూ ఫండ్‌ అడ్వయిజర్స్‌ (ఐవిఎఫ్‌ఎ)భాగస్వామిగా ఉన్నారు. ఆయన కృషితోనే 2001లో 1.2 కోట్ల డాలర్ల విలువ చేసిన నెట్‌వర్క్‌18, 11 ఏళ్లు తిరిగేసరికి 2012నాటికి 50 కోట్ల డాలర్ల స్థాయికి వెళ్లింది. ఐఐటి బొంబాయి, ఐఐఎం కలకత్తా పూర్వ విద్యార్థి అయిన హరేష్‌ గతంలో స్థిరాస్తి పోర్టల్‌ హౌసింగ్‌ డాట్‌ కామ్‌లోనూ పెట్టుబడులు పెట్టారు.

జస్‌పే బృందం

జస్‌పే బృందం


ఫ్లిప్‌కార్ట్‌ ఆదాయంలో సగానికి పైగా మొబైల్‌ద్వారానే వస్తుంది. దీనినిబట్టే ఇండియాలో మొబైల్‌ ఇంటర్‌నెట్‌ వినియోగదారులు క్రమంగా పెరుగుతున్నారని గుర్తించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌, క్లియర్‌ట్రిప్‌ లేదా రెడ్‌బస్‌ డాట్‌ ఇన్‌... ఇలా ఏదయినా కావచ్చు, ఎవరి వినియోగదారులకైనా సరళమైన సురక్షితమైన చెల్లింపు విధానాన్ని జస్‌పే సేఫ్‌ సమకూరుస్తోంది. దీని ఫలితంగా, మొబైల్‌ చెల్లింపులకు సంబంధించి లావాదేవీల ప్రక్రియ తేలికైంది. విసుగెత్తి జారిపోయే వినియోగదారుల శాతం చాలామటుకు తగ్గిపోయింది.

మా దగ్గరున్న ఇంజినీర్లు, డిజైనర్లు అత్యంత నాణ్యమైన ఉత్పాదనను ఇవ్వడానికి తగిన శ్రద్ధతో పనిచేస్తున్నారు. మా ఉత్పాదనలను ఇండియాలో అత్యధిక జనాభా వినియోగించుకునే రోజుకోసం ఎదురుచూస్తున్నాం. అందుకోసం వంచిన తల ఎత్తకుండా అహర్నిశలూ శ్రమిస్తుంటాం' అని విమల్‌ అంటున్నారు.