అమ్మమ్మ కథలు చెప్పే బుల్ బుల్! దానికి ఫండింగ్ చేసిన కిక్ స్టార్టర్

0

చిట్టిపొట్టి చిన్నారులకోసం టుక్ టుక్ యాప్ డెవలప్ చేయడానికి బుల్ బుల్ సిద్ధపడుతోంది. దీనికి కావల్సిన ఫండింగ్ ను కిక్ స్టార్టర్ అందిస్తోంది. స్థానిక పరిస్థితులకు అనుకూలంగా ప్రీస్కూల్ చిన్నారులకు అవసరమైన కంటెంట్ అందించడమే ఈ టుక్ టుక్ లక్ష్యం.

అమ్మమ్మ కధలు

చిన్నతనంలో అమ్మమ్మ కథలంటే అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజుల్లో పిల్లలకు ఆ కధలు చెప్పడానికి అవకాశం కానీ, వారి తల్లిదండ్రులకు అవసరం కానీ లేనట్లు తయారైంది పరిస్థితి. కార్పొరేట్ ఉద్యోగులే కాదు సాధారణ వ్యాపారం చేసే వారి ఇళ్లలో కూడా ఆ పాత మధురాలను గుర్తు చేసుకోవడం తప్పితే వాటిని తర్వాతి తరానికి అందించడానికి సరైన ఫ్లాట్ ఫాం లేదు. యూనిసెంట్రిక్ లైఫ్ స్టైల్ తో చిన్న కుటుంబాలు నగరాల్లో సర్వసాధారణమైపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చిన్నారులకు పాత తరం నాటి కధలను, పద్యాలను అందించాలనే ఉద్దేశంతో ప్రారంభమైంది టుక్ టుక్ యాప్.

ఇది మొదలు

బుల్ బుల్ యాప్స్ ప్లాట్ ఫాం అందరికీ తెలిసిందే. ఇందులో చాలా రకాల యాప్స్ ఉండటమే కాదు ఎన్నో ఉపయోగకరమైన కంటెంట్ అందుబాటులో ఉంటోంది. యాక్టివ్ యూజర్ల సంఖ్య కూడా ఎక్కువే. అయితే దీనిలో ఉన్న యూజర్ ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా రీసెర్చి చేసిన సంస్థ టుక్ టుక్ ని ప్రారంభించింది.

“ఇంగ్లీష్ రైమ్స్ తో ప్రాంతీయ భాషల్లో ఉన్న పద్యాలు, చిట్టిపొట్టి కధలను మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది,” ఫౌండర్ ప్రకాశ్ దంతులూరి

బుల్ బుల్ యాప్ ఫౌండర్ అయిన ప్రకాశ్ అభిప్రాయం ఇది. దీన్న మళ్లి తిరిగి మొబైల్ ఫ్లాట్ ఫాంలోకి అందుబాటులోకి తీసుకు రావాలని సంస్థ ప్రయత్నిస్తోంది. అది సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. సరైన ప్లాట్ ఫాం లేకపోవడమనే సమస్యకు తాము పరిష్కారం చూపిస్తామని ప్రకాశ్ చెప్పుకొచ్చారు. 50కి పైగా యాప్స్ తో బుల్ బుల్ ప్లాట్ ఫాం ని తయారు చేశామని ఆయన అంటన్నారు. బుల్ బుల్ తో కలసి పనిచేయడానికి ముందుకొచ్చే వారితో కలవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. చిన్నారులు, తల్లిదండ్రులతో పాటు వారి ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగపడే ఈ యాప్ లను తాము ఒకే గొడుగు కిందకి తెచ్చామని అభిప్రాయపడ్డారు.

‘బుల్ బుల్’ నుంచి ‘టుక్ టుక్’

బుల్ బుల్ ప్రాడక్టుగా జనం ముందుకొస్తోన్న టుక్ టుక్ చిన్నారులు యాప్స్ కు సరికొత్త నిర్వచనం ఇవ్వనుందని ప్రకాశ్ చెప్పుకొచ్చారు. టుక్ టుక్ అనేది చిన్నారులకు మాత్రమే ఉపయోగపడే యాప్. స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ లో అందుబాటులో ఉంటుంది. స్థానిక పిల్లల కోసం వారి సిటీ లొకేషన్ లోకి వెళితే సరిపోతుంది. హైదరాబాద్ లేదా విజయవాడల్లో స్థానిక తెలుగు భాషలో కంటెంట్ అందుబాటులో ఉంటుందన్న మాట. విజువల్ , ఇంట్రాక్టిక్ మేనర్ లో తయారు చేసిన ఈ యాప్ ఎంతో చక్కని ఫీచర్స్ తో ఆకట్టుకుంటుందని ప్రకాశ్ అంటున్నారు. నేర్చుకోవాలనుకునే చిన్నారులకు, లేదా పిల్లలకు ఏదైనా నేర్పించాలను కునే తల్లిదండ్రులకు దీని ఉపయోగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు.

ఫండింగ్

క్రౌడ్ ఫండింగ్ కంపెనీ కిక్ స్టార్టర్ బుల్ బుల్ యాప్ కు ఫండింగ్ చేస్తోంది. 2వేల అమెరికన్ డాలర్లను దశల సీడ్ ఫండింగ్ లో అందించారు. టుక్ టుక్ యాప్ ప్రారంభించడానికి మొదటి సీడ్ ఫండింగ్ ఉపయోగించనున్నారు. దీన్ని 25రోజుల్లో పూర్తిగా వినియోగిస్తామని ప్రకాశ్ అంటున్నారు. కిక్ స్టార్టర్ ఇచ్చిన కిక్ తో దూసుకు పోతామన్నారు. మా కేటగిరీలో వేరే కాంపిటీటర్లు లేకపోవడంతో మాకు ఫండ్ రెయిజింగ్ కోసం కొద్దిగా కష్టపడ్డాం. అయితే తమతో ఆ సెక్టార్ మొదలు కావడం ఆనందంగా ఉందన్నారు.

వివిధ దశల్లో మొత్తం 250వేల అమెరికన్ డాలర్లను ఇన్వెస్టర్లు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం బుల్ బుల్ యాప్ 30కిపైగా దేశాల్లో 50కి పైగా ఇంగ్లీష్, హిందీ,తెలుగు భాషల్లో పుస్తకాలను కలిగి ఉంది. దాదాపు 8అంశాలకు సంబంధించిన పద్యాలు, పాటలు, రజకుమారుడి కధలు, భారతీయ పురాన ఇతిహాసాలు, మొఘల్, కృష్ణ సిరీస్ ఉన్నాయి. వీటిని మరింత విస్తరించడానికి ఫండింగ్ ను ఉపయోగిస్తామన్నారు.

భవిష్యత్ ప్రణాలికలు

భారతదేశంలో యూజర్ బేస్ తో భారీ విజయాన్ని పూర్తి చేసిన తర్వాత టుక్ టుక్ న్యూయార్క్ , లండన్, దుబాయి, హాంగ్ కాంగ్, టోక్యో లకు తమ సేవలను విస్తరించాలని చూస్తోంది. అయితే ఈ టార్గెట్ కూడా 6నెలల్లోనే పూర్తి చేయాలని చూస్తోంది.

"డిజిటల్ మాధ్యమంలో బుల్ బుల్ యాప్ ది సరికొత్త ఆవిష్కరణ అని ముగించారు ప్రకాశ్"
ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories