ఆ మాత్రం ఒత్తిడి ఉంటే తప్ప మహిళలకు విజయం సిద్ధించదు

జీవిత పాఠాలు చెబుతున్న అంబిగా ధీరాజ్MU Sigma తో మేనేజ్ మెంట్ పాఠాలుసమస్యల నుంచి అవకాశాలు సృష్టించుకోవాలి

0

MU సిగ్మా... ప్రముఖ మెనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ. చికాగోలో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది. బెంగళూరులో ఓ బ్రాంచ్ ద్వారా ఇండియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. MU సిగ్మా ఫౌండర్ అంబిగా ధీరాజ్. ఇంతకీ ఏంటీ కంపెనీ. అంబిగా ధీరాజ్.. నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు.

మహిళా ఇంజనీర్లు

ఇంజనీరింగ్ విభాగంలో మహిళలు కీ రోల్ పోషించడం పెద్ద కష్టటమేం కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇంజనీరింగ్ రంగంలో మహిళలు దూసుకుపోతున్నారు. లెక్కలు తీస్తే పురుషులతో సమానంగా మహిళలు ఇంజనీరింగ్ ఫీల్డ్‌లో సెటిల్ అవుతున్నారు. కాని కొంత మంది మహిళలు వ్యక్తిగత సమస్యలతో ఇంజనీరింగ్ ప్రొఫెషన్‌కు దూరమవుతున్నారు. అలాంటి మహిళల్లో మార్పు తెచ్చి మళ్లీ వారిని ఇంజనీరింగ్ వైపు ప్రొత్సహించడమే MU సిగ్మా పని. ఉద్యోగంతో సహా కుటుంబాన్ని సరిదిద్దుకోగలిగేలా వారి జీవితాలను తీర్చిదిద్దాలన్నదే MU సిగ్మా ప్రయత్నం.

సొసైటీ ఎవరి మీదా ఎక్కువ ఒత్తిడి తేవడం ఉండదు. ఇంజనీరింగ్ కెరీర్‌లో పురుషులు రాణించలేకపోయినప్పుడు సమాజంపై చాలా ఒత్తిడి పడుతుంది. కాని మహిళ విషయానికొచ్చే సరికి అదేం కన్పించదు.

ఇక్కడే మహిళ విషయంలో సమాజం వివక్ష చూపుతోంది. ఇది చాలా తప్పు. ఫ్యామిలీని చూసుకోవడంలో ఆత్మ సంతృప్తి ఉంటుంది. అందరి కెరీర్ అన్ని సమయాల్లోనూ మంచిగా ముందుకెళ్తుందని ఆశించలేం. మనం నెక్ట్స్ జెనరేషన్ కు విలువలతో కూడిన దారి చూపించాలి. కొంత మంది మాత్రమే తమ వృత్తిపై ఇష్టంతో పని చేస్తారు.

MU సిగ్మా లక్ష్యాలు

మా దగ్గరకొచ్చే ప్రతి కస్టమర్ సమస్యకు బెస్ట్ సొల్యుషన్ ఇవ్వడమే మా ముందున్న ఏకైక లక్ష్యం. అలా ఇండియాను అభివృద్ధి పథంలో దూసుకెళ్లేందుకు మావంతు సహాయం చేస్తాం. భారత్ లో కొత్త ఆవిష్కరణలు జరగాలన్నదే మా ధ్యేయం.

సలహా

జీవితం మన చేతుల్లో నిమ్మకాయి పెడితే దాన్ని నిమ్మరసం చేసుకోగలగాలి. ప్రతీ సమస్య నుంచి ఓ అవకాశాన్ని సృష్టించుకోగలగాలి. ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి. మహిళలు ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్ తో ముందుకెళ్లాలి.

వచ్చే ఐదేళ్లలో

మే మరింత మంది కస్టమర్స్ ను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త ప్రాడెక్టులు లాంఛ్ చేయాలని చూస్తున్నాం. అలాగే యూఎస్ తో పాటు మిగతా ప్రాంతాల్లో ము సిగ్మా సేవలు విస్తరించాలన్నదే మా లక్ష్యం. ఇప్పటికే దీనిపై అడుగులు పడుతున్నాయి. మా కస్టమర్ల కోసం సరికొత్త ఆవిష్కరణలు దిశగా ముందుకెళ్తున్నాం.