షీ టీమ్స్ చూస్తున్నాయి.. బీ కేర్ ఫుల్

ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా 5కే రన్,2కే రన్

షీ టీమ్స్ చూస్తున్నాయి.. బీ కేర్ ఫుల్

Tuesday February 28, 2017,

2 min Read

షీ టీమ్స్ ను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం మార్చి 5న నెక్లెస్ రోడ్ లో 5కే, 2కే రన్ నిర్వహించబోతున్నారు. ఇందులో పాల్గొనాలనుకునే వారు www.sheforchange.com వెబ్ సైట్ లో రిజస్ట్రేషన్ చేసుకోవాలి.

షీ టీమ్స్ బాస్ స్వాతి లక్రా బాధ్యతలు తీసుకున్న ఈ రెండేళ్లలో అనేక మార్పుల్ని తీసుకొచ్చారు. చిన్నపాటి గల్లీ నుంచి అత్యంత రద్దీ ఏరియాల దాకా షీ టీమ్స్ ఎక్కడా ఏమరుపాటుగా లేవనే విషయాన్ని చాటిచెప్పారు. ఎక్కడా ఏ పోకిరీ అడ్వాంటేజ్ గా తీసుకోకుండా.. ఆడపిల్లను కామెంట్ చేయాలంటేనే వణికిపోయేలా.. ఒకభయాన్ని క్రియేట్ చేయడంలో షీ టీమ్స్ వందశాతం సక్సెస్ సాధించాయి. ఇవాళ మహిళ ఒంటరిగా బస్టాపులో నిలబడిందీ అంటే అందుకు కారణం షీ టీమ్స్ అని నిస్సంకోచంగా చెప్పొచ్చు.

image


హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్స్ ఏర్పాటైన దగ్గర్నుంచి ఇప్పటి వరకు 2 వేల 742 ఫిర్యాదులు అందుకున్నారు. 52 మందిని నిర్భయ చట్టం కింద జైలుకు పంపారు. వీరితో పాటు వాట్సప్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో యువతులను వేధిస్తున్న మరో 41 మందిని ఐటీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. అందిన ఫిర్యాదుల ఆధారంగా 723 మంది మేజర్లకు 267 మంది మైనర్లకు బ్రెయిన్ వాష్ చేసి పంపించారు.

ప్రస్తుతం సిటీలో వంద షీ టీమ్ లతో మహిళల రక్షణకు భరోసా కల్పిస్తున్నారు. షీటీమ్స్ పై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 5న నెక్లెస్ రోడ్స్ లో 5K Run, 2K Run నిర్వహించనున్నారు. సుమారు పదివేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. నాలుగో తేదీన కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళల భద్రత, సైబర్ క్రైమ్స్ పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఈవెంట్స్ చేపడుతున్నారు. షీ టీమ్స్ సక్సెస్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న రోజుల్లో హైదరాబాద్ ను మరింత సేఫ్ సిటీగా మారుస్తామంటున్నారు షీ టీమ్స్ బాస్ స్వాతిలక్రా.