2015లో దూసుకుపోతున్న 8 ఫుడ్ స్టార్టప్స్

ప్రారంభించిన మూడు నెలలకే ఫండ్ రెయిజింగ్స్టార్టప్ చరిత్రలో ఫుడ్ టెక్ కొత్త అధ్యాయంబెంగళూరు,ఢిల్లీ,ముంబై... సిటీ ఏదైనా ..ఫుడ్ టెక్ స్టార్టప్‌కి కేరాఫ్ అవుతున్న మెట్రో నగరాలు

2015లో దూసుకుపోతున్న 8 ఫుడ్ స్టార్టప్స్

Monday April 20, 2015,

4 min Read

స్టార్టప్ టౌన్‌లో ఫుడ్ టెక్ గురించే హాట్ హాట్ చర్చ జరుగుతోంది. టెక్నాలజీ స్టార్టప్‌లు ఈ కామర్స్‌లో తనదైన మార్క్ వేసిన తర్వాత టాక్సీ, రియల్ ఎస్టేట్‌లు దాన్ని ఫాలో అయ్యాయి. గతేడాది నుంచి బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో ప్రతిరోజూ ఏదో ఒక స్టార్టప్ ప్రారంభమవుతూనే ఉంది. ఈ నగర వాసుల ఆఫీసులు, ఇళ్లు, వారి డెస్క్‌ల దగ్గరకు సేవలు అందించడానికి ఈ స్టార్టప్ లు సిద్ధపడుతున్నాయి. ఇప్పుడు అదే కోవలోకి మరికొన్ని వచ్చి చేరుతున్నాయి. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, బెవరేజస్, స్నాక్స్, సలాడ్స్... ఇలా ఎన్నో రుచులు మన నోటికే అందించడానికి రెడీ అవుతున్నాయి కొత్త స్టార్టప్‌లు.

Image Credits: shutterstock.com

Image Credits: shutterstock.com


ఫుడ్ టెక్ అనేది చాలా పెద్ద మార్కెట్. ఫుడ్ డెలివరి స్టార్టప్ అందులో ఒక పార్ట్‌ మాత్రమే. మార్కెట్ చాలా రకాలుగా విభజించబడింది. వినియోగదారుడి కోణంలో మనం చూస్తే వీటిని ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

డిస్కవరి-

ఏ రెస్టారెంట్‌కి వెళ్లాలి ? (ఉదా: జొమాటోలో తెలుసుకోవచ్చు)

తినాల్సిన డిష్ ఏది ? (ఉదా: క్వింటో)

షెఫ్, ఇంట్లో వంట చేయడానికి అతనితో లేదా ఆమెతో రిజర్వేషన్ (ఉదా: షెఫ్ హెస్ట్

డీల్ లేదా కూపన్ (ఉదా: మీ డైన్)

OTT లేదా కన్వీనియెన్స్ సర్వీసెస్-

రెస్టారెంట్లలో పేమెంట్లు ( ఉదా: మొమియి)

రెస్టారెంట్ లో ఆర్డరింగ్ 

టేబుల్ బుకింగ్ (ఉదా: డైన్ అవుట్)

డెలివరి-

ఇంటికి కావాల్సిన గ్రాసరీ( ఉదా: బిగ్ బాస్కెట్) - (దీన్నే వర్టికల్ ఈ కామర్స్ అని కూడా అంటారు)

రిసీపీ బాక్స్ ఎట్ హోమ్ (ఉదా: హాఫ్ టీ స్పూన్)

ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. 2015 లో మీ ఇంటి దగ్గరకు ఫూడ్‌ని ‌ డెలివరీ చేసే ఎనిమిది రకాల ఫూడ్ స్టార్టప్స్ గురించి తెలుసుకుందాం.

ఈట్లో (Eatlo):

ముందుగా ఈట్లో. దీన్ని సాయిప్రియా మహాజన్, రాహుల్ హరిక్రిష్ణ ప్రారంభించారు. ఇద్దరుకూడా ఫ్యాషన్ అండ్ యూ, అర్బన్ టచ్ కోర్ టీంలో పనిచేసిన వారే. 

ఆ తర్వాత వారు మై గోలా, అటు తర్వాత ఫ్రీచార్జ్‌ లో జాయిన్ అయ్యారు స్టార్టప్స్‌ని కొన్నేళ్లు టేస్ట్ చేసిన తర్వాత వీళ్లిద్దరూ కలసి ఈట్లో స్థాపించారు. ఈట్లో అనేది ఫూడ్ డెలివరీ యాప్. బెస్ట్ షెఫ్‌లు తయారు చేసిన ఆహారాన్క్షని ణాల్లో మీ ముందుంచే సౌలభ్యం దీని యూజర్లకు ఉంది. ఈట్లోకి బెంగళూరులో సొంత కిచెన్ కూడా ఉంది. దీనికి బ్యాకింగ్‌లో ఉన్న ఇన్వెస్టర్లు కూడా మహా మహులే. దీప్ ఉభి (టైని ఒవెల్‌లో ఇన్వెస్టర్, గతంలో BURRP కి ఫౌండర్), అభిషేక్ గోయల్ (ట్రాక్షన్, అర్బన్ టచ్ తో పాటు యాక్సల్ పాట్నర్‌గా ఉన్నారు). ఈట్లో వీళ్లతో క్రౌడ్ మార్కెట్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 550కి పైగా లంచ్ బాక్సుల ఆర్డర్లను రోజుకి డెలివరీ చేస్తున్నారు. హెచ్.ఎస్.ఆర్. లే అవుట్, కోరమంగళ, బెల్లందూర్, సర్జాపూర్, ఇందిరానగర్, డోమ్లూర్‌లో డెలివరీలు చేస్తున్నారు. (eatloapp.com) ఈట్లో యాప్ డాట్ కామ్ పేరుతో వెబ్సైట్. ఈట్లోయాప్ డాట్ కామ్ స్లాష్ యాప్ పేరుతో ఆండ్రాయిడ్ యాప్ ఉన్నాయి. ఐ ఓఎస్ యాప్ ని తొందరలోనే లాంచ్ చేయనున్నారు.

ఫ్రెష్ మెనూ:

బెంగళూరు కేంద్రంగా ఉన్న ఫ్రెష్ మెనూ క్రిష్ణ గణేష్, మీనా గణేష్‌ల సీరియల్ స్టార్టప్ ఫ్యాక్టరీల గ్రోత్ స్టోరీ. ఫ్రెష్ మెనూ అనేది లంచ్, డిన్నర్, రోజులో ఎప్పుడైనా సాండ్విచ్ , సాలడ్, డిస్సెర్ట్‌లను మీరు కోరిన చోటికి తీసుకొచ్చి అందిస్తుంది. తన అద్భుతమైన మెనూతో ఫూడీ సర్కిల్‌లో ఇప్పటికే ఫ్రెష్ మెనూ ప్రకంపనలు చేస్తోంది. షెఫ్ ప్రిపేర్ చేసిస ప్లేట్ మీల్స్‌ను వీరు ఆఫర్‌ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మెనూలో మార్పులు చేస్తుంటారు. యాప్ ద్వారా లేదా ఫోన్ కాల్ ద్వారా ఫూడ్ ఆర్డర్స్ తీసుకుంటారు.

హోలాషెఫ్ :

2014లో ముంబై కేంద్రంగా హోలాషెఫ్‌ని సౌరభ్ సక్సేనా, అనిల్ గెర్లా ప్రారంభించారు. దీన్ని ఫైన్ డైన్ రెస్టారెంట్ ఇన్ క్లౌడ్‌గా చెప్పుకొచ్చారు. మొబైల్ ద్వారా మీల్స్ సప్లై చేసే ఈ స్టార్టప్ భారతఖండం నుంచే రెండు కోట్ల ఫండింగ్‌ను రెయిజ్ చేయగలిగింది. ఫండింగ్ టీంకి సేల్స్, మార్కెటింగ్ , టెక్నాలజీలో మంచి అనుభవం ఉండటం కలిసొచ్చే విషయం.

స్పూన్ జాయ్ :

స్పూన్ జాయ్ డాట్ కామ్ పండ్లూ, మొలకలను ఆ రెండితో కలిపిన సాలడ్‌తోపాటు లంచ్ స్నాక్స్ అందిస్తుంది. యూజర్లకు వీక్లీ సబ్‌స్క్రిప్షన్ బేసిస్‌లో సేవలను కొనసాగిస్తోంది. ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా డెలివరీ చేస్తారు. ఫ్లిప్ కార్ట్‌లో సిఈవో, సిపివో లుగా పనిచేస్తోన్న సచిన్ భన్సాల్, మెకిన్ మహేశ్వరి లు స్పూన్ జాయ్‌లో గతేడాది డిసెంబర్ లో పెట్టుబడులు పెట్టారు.

వీరితో పాటు ట్రాక్సన్ ఫౌండర్ అభిషేక్ గోయల్, ఢిలివరి కో ఫౌండర్ సహిల్ బారువాలు పెట్టుబడులు పెట్టిన వారిలో ఉన్నారు. ఇది అక్కడి సిబ్బందికి క్యాపిటల్ ఇన్‌కమ్ లాగా పనికొచ్చింది. గైడ్ లైన్స్ పరంగా చూసి పెట్టుబడులు పెట్టిన వారి సలహాలు కూడా ఫుడ్ స్టార్టప్‌కి ఎంతగానో పనికొచ్చాయి. అనుభవం ఉన్న వ్యక్తుల నుంచి ఫండింగ్ తీసుకోవడాన్నే స్మార్ట్ మనీ అనొచ్చేమో !

స్విగ్గి :

ఆగస్టు 2014లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన ఫుడ్ స్టార్టప్ స్విగ్గి. అందరిలా కాకుండా స్విగ్గీకి ఫుడ్ ఆర్డరింగ్ ఫ్లాట్ ఫాంలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. డెలివరి చేసే వ్యక్తులు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. యాప్ రూటింగ్ వాళ్లకు తెలుస్తుంది. ఆర్డర్ ఎక్కడ ఇచ్చారనేది ఖచ్చితంగా గుర్తించవచ్చు. దీంతో స్విగ్గీ నిరాటంకంగా.. ఆర్డర్లు ఇచ్చిన క్షణాల్లోనే డెలివరీని ఇవ్వగలుగుతోంది. మినిమమ్ ఆర్డర్‌ని లెక్కలోనికి తీసుకోకుండా.. కస్టమర్లు కోరిన వాటిని.. వారి డోర్ స్టెప్‌కి చేర్చడంతో స్విగ్గీ పై మార్కెట్‌లో మంచి గుడ్ విల్ వచ్చింది. అందుకే ప్రారంభమైన ఎనిమిది మాసాల్లోనే రెండు మిలియన్ డాలర్ల ఫండింగ్‌ను యాక్కెల్ పాట్నర్స్, సైఫ్ పాట్నర్స్ నుంచి పొందగలిగింది.

ట్యప్ కిబో: 

శశంక్ శేఖర్ సింఘాల్ , మోనికా రస్తోజీలు అక్టోబర్ 2014లో ట్యాప్ కిబోని ప్రారంభించారు. ఆన్ డిమాండ్ ఫుడ్ కోర్ట్ మొబైల్ యాప్‌గా ప్రాచుర్యం పొందింది ట్యాప్ కిబో. చిన్న చిన్న రెస్టారెంట్లకు ఆన్ లైన్ సేల్స్‌కి ట్యాప్ కిబో ఓ అద్భుత మైన ఫ్లాట్ ఫాం. ఫ్రీ చార్జ్ సిఈవో, మోనికా భర్త అయిన అలోక్ గోయెల్ ట్యాప్ కిబోలో పెట్టుబడులు పెట్టారు. మొబైల్ బేస్డ్ ఫుడ్ ప్లేస్ పై విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే పనిలో ట్యాప్ కిబో టీం పనిచేస్తోంది.

టైని ఒవెల్ :

మార్చి 2014 లో ముంబై కేంద్రంగా ప్రారంభమైన టైని ఒవెల్.. పేరులాగా చిన్న దైతే కాదు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్ లతో కస్టమర్లు దగ్గర్లో ఉన్న రెస్టారెంట్‌ల నుంచి ఫుడ్‌ని ఆర్డర్ చేసుకునే సౌలభ్యాన్ని కలిగిస్తోంది. డీప్ ఉభి దీనిలో పెట్టుబడులు పెట్టారు. ఏప్రిల్ లో సందీప్ ఠాండన్ మూడు మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టారు. సికోయ క్యాపిటల్, నెక్సస్ వెంచర్ పాట్నర్స్ డిసెంబర్ 2014లో వందకోట్ల పెట్టుబడులను దీనిలోకి తీసుకొచ్చారు.

యమిస్ట్

గుర్గావ్ కేంద్రంగా జుమాటో మాజీ సిఈఓ అలోక్ జైన్ అభిమన్యూ మహేశ్వరి నవంబర్ 2014లో యమిస్ట్‌ని ప్రారంభించారు. ఒహ్రీస్ వెంచర్ పాట్నర్స్ నుంచి ఈ ఫిబ్రవరిలో ఫండ్ ని రెయిజ్ చేయగలిగారు. హోమ్లీ డెలివరి మీల్స్‌ని ప్రొవైడ్ చేయడమే లక్ష్యంగా యుమిస్ట్ పనిచేస్తోంది. ఫుడ్, లాజిస్టిక్స్, టెక్ ఈ మూడింటిని యుమిస్ట్ సొంతంగానే అనుసంధానం చేసుకుంది. వేడి వేడి తినుభండారాలను 30నిముషాల్లోనే అందించే యుమిస్ట్.. ఆన్ లైన్ యాప్ మార్కెట్‌లో తన బ్రాండ్‌ని క్రియేట్ చేసుకుంది. టీం ఫౌండర్‌లో ఒకరైన మహేశ్వరికి ఫుడ్ అండ్ బెవరేజస్‌లో పనిచేసిన అనుభవం ఉండటం యమిస్ట్‌కు కలసొచ్చే విషయం.

వీటితో పాటు టేక్ యువర్ పిక్ .. మార్కెట్ లో టిఫిన్లు అందించడంలో తన దైన మార్క్ ను తీసుకు రాగలిగింది. ఫుడ్ ఇన్ కిలోస్ ఫుడ్ డెలివరీకి ఓ కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. ఇవి గతేడాది ఫుడ్ టెక్ స్టార్టప్‌ల విజయ గాధలు. వీటితో పాటు మీకు కూడా ఇతర ఫుడ్ స్టార్టప్‌లపై సమాచారం ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి.