భాగ్యనగరంలో స్టార్టప్ శకానికి స్వాగతం పలికిన 2016

భాగ్యనగరంలో స్టార్టప్ శకానికి స్వాగతం పలికిన 2016

Thursday December 31, 2015,

4 min Read

2015. హైదరాబాద్ స్టార్టప్ లో ఓ కొత్త ఒరవడి తీసుకొచ్చిన ఏడాది. టీ హబ్ లాంటి ప్రపంచ స్థాయి ఇంక్యుబేషన్, ఇన్నోవేటివ్ ఐడియాలతో కొత్త సంస్థలను ప్రారంభించిన ఔత్సాహికులు, ఇన్వెస్ట్ మెంట్ తోపాటు భారీ ఈవెంట్లతో హైటెక్ సిటీ కాస్తా స్టార్టప్ సిటీగా మారిపోయింది.

కొత్త స్టార్టప్ ల ప్రారంభం

హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 100 కు పైగా స్టార్టప్ లు ప్రారంభమయ్యాయి. నాస్కామ్ ఇచ్చిన వివరాల ప్రకారం ఆగస్ట్ ఫెస్ట్ నాటికే 40 స్టార్టప్ లు నాస్కాల్ 10k స్టార్టప్ లలో స్థానం సంపాదించుకున్నాయి. ప్రారంభమైన చాలా కంపెనీలకు సీడ్ ఫండింగ్ అందడం విశేషం. దీంతో పెర్ఫార్మన్స్ పరంగా 2016 అత్యంత ప్రాధాన్యం గల ఏడాదిగా చెప్పాలి. కొత్తగా నగరంలో కో వర్కింగ్ స్పేస్ లు ఏర్పడటంలాంటివి ఈ ఏడాదే ఎక్కువ. అన్నింటి కంటే ప్రధానంగా ఈ ఏడాది ప్రారంభమైన స్టార్టప్ లు టెక్ , బిజినెస్ తోపాటు అన్ని రకాల కేటగిరీల్లో సముచిత స్థానం సంపాదించుకున్నాయి.

“మొబైల్ గేమ్స్ ఆడేవారి సోషల్ నెట్ వర్కింగ్ గా జనం ముందుకొచ్చింది మా స్టార్టప్” ప్లేజాప్ ఫౌండర్ రవి సాతనపల్లి .

ఈ ఏడాది ప్రారంభమైన ప్లేజాప్ ప్రారంభించిన రోజు నుంచే ఆదాయ మార్గాలను అన్వేషించుకొని ఫండింగ్ అవసరం లేకుండా దూసుకు పోతోంది.

image


టీ హబ్

హైదరాబాద్ అంటే చార్మినార్, హైటెక్ సిటీ గా గతంలో చెప్పుకొనే వారు. కానీ 2015 తర్వాత టీ హబ్ ను కలిపి చెప్పాల్సిన అవరం ఉంది. ఇండియన్ స్టార్టప్ గాడ్ రతన్ టాటా ప్రారంభించిన టీ హబ్ దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేషన్‌ సెంటర్. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్టార్టప్ ఈకో సిస్టమ్ కు మద్దతుగా ఏర్పాటు చేసిన టీ హబ్ మైదలైంది ఏడాదిలోనే.

“నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు మాకు తెలిసింది ట్యాంక్ బండ్ అంతే.. ఇప్పుడు భాగ్యనగరమంటే టెక్నాలజీ, టీ హబ్ కూడా,” సత్య నాదెళ్ల

ఇది ఇటీవల టీ హబ్ కు వచ్చిన మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాట. ఐటి, టెక్నాలజీ లో దేశ విదేశాల్లో ఉన్న ఎంతో మంది ని టీ హబ్ ఆకర్షించింది.

“దేశానికి హైదరాబాద్ స్టార్టప్ క్యాపిటల్ గా మారబోతోంది,” ఐటి మంత్రి కెటిఆర్

టీ హబ్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ అన్న మాటలివి. ఐడియాతో టీ హబ్ లోనికి ప్రవేశిస్తే ప్రాడక్టుతో బయటకు వెళ్లేలా అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారాయ.

image


ఈవెంట్స్

గతంలో ఎన్నడూ లేని స్టార్టప్ ఈవెంట్స్ 2015లో హైదరాబాద్ లోజరిగాయి. ఆగస్ట్ ఫెస్ట్ లో వేల సంఖ్యలో ఔత్సాహికులు, విద్యార్థులు పాల్గొన్నారు.

“స్టార్టప్ ఈకో సిస్టమ్ లో మార్పు వస్తుందనడానికి ఇది శుభ సూచకం,” ఆగస్ట్ ఫెస్ట్ నిర్వాహకులు

ఆగస్ట్ ఫెస్ట్ ను స్టార్టప్ లో గ్లోబల్ బ్రాండ్ గా చేస్తామని దీమా వ్యక్తం చేస్తున్నారు. లమాకాన్ లో ప్రతి నెలా రెండో శనివారం జరిగే స్టార్టప్ సాటర్ డే , స్టార్టప్ లీడర్షిప్ , స్టార్టప్ వీకెండ్ తోపాటు చాలా చోట్ల స్టార్టప్ కోసం ఎన్నో ఈవెంట్స్ జరిగాయి.

image


ఈ ఏడాది ఇన్నో ఫెస్ట్ కూడా బ్రహ్మాండంగా జరిగింది. సరికొత్త ఆవిష్కరణలకు వేదికైంది. స్టార్టప్ కోసం చర్చలకు ఎక్కువ ఆస్కారం కలిగించడంలో ఈ ఈవెంట్స్ ఎంతగానో సాయపడ్డాయి. స్టార్టప్ క్రికెట్ లీగ్ పేరుతో ఓ ఇన్నో వేటివ్ ఐడియా ప్రారంభమైంది.

“ఎస్సిఎల్ స్టార్టప్ ఫెస్ట్ అంటే ఇన్వెస్ట్ మెంట్ టాక్స్, ఎగ్జిబిషన్స్ మాత్రమే కాదు. దానికి మించిన ఎన్నో అంశాలున్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్ దీనిలో పాల్గొనడానికి ఆసక్తి కనపరుస్తున్నారు.” సాయి కిరణ్

మెమైలాగ్ ఫౌండర్ అయిన సాయికిరణ్ ఈ ఎస్ సి పి నిర్వహణలో భాగస్వామ్యులుగా ఉన్నారు.

image


ఫండింగ్

హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన స్టార్టప్ లు ఈ ఏడాది ఫండింగ్ సాధించడంలో క్యూ కట్టాయి. బెంగళూరు స్థాయిలో ఫండింగ్ రాకపోయినా సరికొత్త గణాంకాలను చూపించగలిగాయి. పోర్ట్ ఫోలియో ఇంటిగ్రేషన్, సోషియో యాక్టివిటీలే టార్గెట్ గా ప్రారంభమైన స్టాక్ రూం ఈ ఏడాది ఫండింగ్ లో సూపర్ స్టార్ అని చెప్పాలి.

“5 నెలల్లోనే 70 వేల డాలర్ల ఫండ్ రెయిజ్ చేశాం,” కో ఫౌండర్ నరేన్

బిటుబి సెగ్మెంట్ లో ఈ హైదరాబాదీ స్టార్టప్ సరికొత్త రికార్డ్ సాధించింది. దీంతో పాటు చాలా కంపెనీలకు సీడ్ ఫండింగ్ అందడం స్టార్టప్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది.

ఇన్వెస్ట్ మెంట్

హైదరాబాద్ కేంద్రంగా స్పార్క్ 10 అనే ఓ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ ప్రారంభమైంది. భాగ్యనగరంలో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్ధపడుతున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది.

“హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో స్టార్టప్ లకు అనుకూల వాతావరణం ఉంది,” కో ఫౌండర్ సుబ్బరాజు

దీంతో పాటు చాలా ఏంజిల్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీలు హైదరాబాద్ లో కేంద్రాలను ప్రారంభించాయి. 99 స్ప్రింగ్ బోర్డ్ లాంటి కంపెనీలు స్టార్టప్ ఈకో సిస్టమ్ లో భాగమవుతున్నాయి.

image


అవార్డులు

దేశంలో చాలా చోట్ల జరిగిన ఎన్నో స్టార్టప్ ఈవెంట్లతో పాటు రాష్ట్రప్రభుత్వాల తరుపు నుంచి ఎన్నో అవార్డులను అందుకున్నాయి హైదరాబాద్ స్టార్టప్ లు.

హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన మైక్లాస్ బోర్డ్ ఫౌండర్ అజయ్ శాకమూరి బెస్ట్ ఇన్నోవేటర్ గా డిఐపిపి అవార్డ్ తీసుకున్నారు. దీంతోపాటు రవి కోరుకొండ ఫౌండర్ గా ఉన్న హైదరాబాద్ స్టార్టప్ పర్పుల్ టాక్స్ ప్రతి ఏడాది లాగానే బెస్ట్ టెక్ అవార్డులను గెలుచుకుంది.

image


వెల్ కమ్ 2016

మొదటి దశ నుంచి ఫండింగ్ దాకా వెళ్లిన కంపెనీలు, ఇంకా ఫండింగ్ కోసం ఎదురు చూస్తున్న కంపెనీలు, పూర్తి స్థాయి సెల్ఫ్ ఫండెడ్ అయి, ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్న స్టార్టప్ లు అన్ని కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్నాయి. కోటి ఆశలతో సరికొత్త ఏడాదిలో వచ్చే మార్పుల కోసం ఎదురు చూస్తున్నాయి. నరేంద్ర మోడీ ఇచ్చిన ‘స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా’ పిలుపును అందుకొని ఔత్సాహికులు , స్టార్టప్ క్రౌడ్ కొత్త ఏడాదికి వెల్ కమ్ చెబుతున్నారు. మరిన్ని కంపెనీలకు ఫండింగ్ రావాలని, మరిన్ని కొత్త స్టార్టప్ లు ప్రారంభం కావాలని, మరింత మంది ఆంత్రప్రెన్యువర్లు హైదరాబాద్ నుంచి మొదలు కావాలని యువర్ స్టోరి తెలుగు కోరుకుంటోంది.