సోమాజీగూడలో స్క్వేర్ ఫీట్ బాగా చీప్..! పంజాగుట్ట యమా రిచ్..!  

కుష్‌ మెన్‌ అండ్ వేక్‌ ఫీల్డ్‌ సర్వే రిపోర్ట్

1

హైదరాబాద్‌లో బాగా రిచ్ ఏరియా ఏది అనంటే ఠక్కున రెండు పేర్లు చెప్తాం. ఒకటి జూబ్లీహిల్స్‌. ఇంకోటి బంజారాహిల్స్‌. అవి శ్రీమంతులుండే ఏరియాలు కాబట్టి... ఎటు చూసినా అద్దాల మేడలు కనిపిస్తాయి కాబట్టి.. డూప్లెక్స్ హౌజులు ఉంటాయి కాబట్టి.. ఆ మాత్రం అనుకోవడంలో తప్పులేదు. కానీ వాస్తవానికి సీన్ మీరనుకున్నట్టు లేదు. హైదరాబాదులో ఖరీదైన ప్రాంతాల పేరు మారింది. కుష్‌ మెన్‌ అండ్ వేక్‌ ఫీల్డ్‌ చేసిన సర్వేలో హైదారాబాద్‌ పాటు భారత్‌, ప్రపంచంలోనే మోస్ట్‌ ఎక్స్‌ పెన్సివ్‌ కమర్షియల్‌ స్పేస్‌లకు సంబంధించి ఒక ఆసక్తికర రిపోర్టు విడుదల చేసింది. అదేంటో మీరే చదవండి.

ఇండియన్‌ రియల్‌ ఎస్టేట్‌ సెక్టర్‌లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే శరవేగంగా విస్తరిస్తున్న ఈ – కామర్స్‌ మార్కెట్‌, సంప్రదాయ రిటైల్‌ షాపులకు సవాళ్లు విసురుతోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను సైతం తట్టుకుని హైదరాబాద్‌లో కొత్త రిటైల్‌ షాపులు తెరిచేందుకు బడా బ్రాండ్‌లు ముందుకొస్తున్నాయి. వాణిజ్య ప్రాంతాల్లో చాలా వరకు ఖాళీలు లేనందున కొత్త మాల్స్‌ అందుబాటులోకి వస్తే కమర్షియల్‌ స్పేస్‌ రెంట్‌ మరింత పెరుగుతుందని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 462 రిటైల్‌ ప్రాంతాల్లోని అద్దెల వివరాలతో మెయిన్‌ స్ట్రీట్స్‌ అక్రాస్‌ ది వరల్డ్‌ 2016 పేరుతో కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ ఫీల్డ్‌ తన రిపోర్టులో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ప్రముఖ రిటైల్‌ మార్కెట్‌లను పరిగణలోకి తీసుకుని కుష్‌మెన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ సంస్థ ప్రైమ్‌ రిటైల్‌ రెంట్స్‌ రిపోర్టును విడుదల చేసింది. సెప్టెంబర్‌ నెల అద్దెల ప్రకారం ప్రధాన రహదారుల పక్కనే ఉన్న షాపుల రెంట్ల విషయంలో హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా పంజాగుట్ట నిలిచింది. అక్కడ ఒక చదరపు అడుగుకు నెలకు చెల్లిస్తున్న అద్దె 155 రూపాయలు. హిమాయత్‌ నగర్‌, కూకట్‌ పల్లి ప్రాంతాల్లో స్క్వేర్‌ ఫీటుకు 140 రూపాయలు ఇస్తున్నారు. అత్యంత ఖరీదైన ప్రాంతంగా భావించే జంజారాహిల్స్‌ లో మంత్రీ రెంటల్‌ 130 రూపాయలు మాత్రమే. ఇక అమీర్‌ పేట్‌, జూబ్లీహిల్స్‌ ఏరియాల్లో చదరపు అడుగుకు 125 రూపాయలు చెల్లిస్తుండగా, AS రావ్‌ నగర్‌లో 120, ఆబిడ్స్‌, ఎంజీ రోడ్‌, SP రోడ్‌లో స్క్వేర్‌ ఫీటుకు 110 రూపాయలు, మాదాపూర్‌లో చదరపు అడుగుకు 100 రూపాయల అద్దె చెల్లిస్తున్నారు. రిటైల్‌ మార్కెట్‌ లో రెంట్‌ పరంగా చూస్తే సోమాజీగూడ ప్రాంతం అంత్యంత అందుబాటు ధరలో ఉందని కుష్‌మన్‌ రిపోర్టు స్పష్టం చేసింది. స్క్వేర్‌ ఫీట్‌ కమర్షియల్‌ స్పేస్‌కు ఇక్కడ నెలవారీ అద్దె 90 రూపాయలు మాత్రమే.

మాల్స్‌ కమర్షియల్‌ స్పేస్‌ విషయానికొస్తే... బంజారా హిల్స్‌ ప్రాంతంలో అద్దె ఎక్కువగా ఉంది. ఇక్కడ స్క్వేర్ ఫీట్‌ అద్దె నెలకు 260 రూపాయలు. మాదాపూర్‌లో ఇది 235 రూపాయలుకాగా.. కూకట్‌పల్లిలో 180 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇక హిమాయత్‌ నగర్‌లోని మాల్స్‌ లో చదరపు అడుగుకు నెలకు 150 రూపాయల అద్దె వసూలు చేస్తుండగా... పంజాగుట్టలో 140, సోమాజిగూడలో 120 రూపాయల చొప్పున రెంట్‌ తీసుకుంటున్నారు.

ఇక లీజుల విషయానికొస్తే... గచ్చిబౌలి ప్రధాన రహదారిపై ఉన్న కమర్షియల్‌ స్పేస్‌ కోసం బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ స్క్వేర్‌ ఫీట్‌కు 15వేల రూపాయలు చెల్లిస్తోంది. అదే ఏరియాలో యారో కంపెరీ చదరపు అడుగుకు 3వేలు, హిమాయత్‌ నగర్‌లో బర్గర్‌ కింగ్‌- స్క్వేర్‌ ఫీటుకు 2వేల రూపాయల లీజు చెల్లిస్తున్నాయి.

గత రెండేళ్లుగా హైదరాబాద్‌లో కొత్త కమర్షియల్‌ స్పేస్‌లు అందుబాటులోకి రాలేదు. గచ్చిబౌలి, చందానగర్‌లో రెండు మాల్స్‌ నిర్మాణం జరుగుతున్నా అవి పూర్తికావడానికి మరో ఆర్నెల్లు ఏడాది పట్టే అవకాశముంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఉప్పల్‌ DSL మాల్‌లో 3లక్షల స్క్వేర్‌ ఫీట్లు, చందానగర్‌ GSM ఇన్ఫ్రా మాల్‌లో 4లక్షల 25 వేల చదరపు అడుగుల కమర్షియల్‌ స్పేస్‌ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లి ప్రాంతాల్లో కమర్షియల్‌ స్పేస్‌లు ఖాళీగా లేవు. మిగతా ప్రాంతాల్లోని మాల్స్‌ లో కేవలం 5శాతంలోపు వాణిజ్య స్థలాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం థర్డ్‌ క్వార్టర్‌లో ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌, అప్పారెల్‌ సెగ్మెంట్‌ బ్రాండ్లు మాల్స్‌ లోని కమర్షియల్‌ స్పేస్‌ కోసం క్యూ కట్టాయి. బర్గర్‌ కింగ్‌, డంకిన్‌ డోనట్స్‌, సత్యపౌల్‌, వ్యాన్ తదితర బ్రాండ్లు కొత్త స్టోర్లు ఓపెన్‌ చేశాయి.

ఇక భారత్‌లో అత్యంత ఖరీదైన కమర్షియల్‌ ఏరియాగా ఢిల్లీలోని ఖాన్‌ మార్కెట్‌ నిలిచింది. షాప్‌ పెట్టుకోవాలంటే చదరపు అడుగుకు నెలకు 12వందల 50 రూపాయల అద్దె చెల్లించాల్సిందే. అందుకే మోస్ట్‌ ఎక్స్‌ పెన్సివ్‌ కమర్షియల్‌ మార్కెట్ ప్లేస్‌లో ఈ ప్రాంతం ప్రపంచంలోనే 28వ స్థానంలో నిలిచింది. అయితే గతేడాదితో పోలిస్తే మాత్రం ఢిల్లీ ఖాన్‌ మార్కెట్‌ ర్యాంకు రెండు స్థానాలు దిగజారింది. ఇందుకు కారణం ఇతర దేశాల్లో అద్దెలు పెరగడమే. అంతేకానీ ఇక్కడ అద్దెలు తగ్గలేదని రిపోర్టు స్పష్టం చేసింది. ఇక ఆసియా పసిఫిక్‌ దేశాల్లో ఢిల్లీ ఖాన్‌ మార్కెట్‌ 15వ స్థానంలో నిలిచింది. వ్యాపారానికి అత్యంత అనువైన ప్రాంతం కావడం ఖాన్‌ మార్కెట్‌ గిరాకీ పెరిగేందుకు ఒక కారణమైతే... చుట్టుపక్కల సంపన్నుల నివాసాలు ఉండటం ఉండటం మరో కారణం. చదరపు అడుగు అద్దె నెలకు 850 రూపాయలు పలుకుతున్న కన్నాట్‌ ప్లేస్‌.. దేశంలో ఖరీదైన కమర్షియల్‌ ప్రాంతాల్లో రెండో స్థానంలో నిలిచింది. గురుగ్రామ్‌లోని DLF గలేరియా 800రూపాయల రెంట్‌తో థర్డ్‌ ర్యాంక్‌ సొంతం చేసుకుంది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల కమర్షియల్‌ ఏరియాల రెంట్‌లను గమనిస్తే అగ్రరాజ్యం అమెరికా ఈ విషయంలో నెంబర్‌ స్థానంలో నిలిచింది. షాపుల అద్దెల విషయంలో న్యూయార్క్ ఫస్ట్ ర్యాంక్‌ కొట్టేసింది. అప్పర్‌ ఫిఫ్త్‌ ఎవెన్యూలో షాపు తెరవాలంటే స్క్వేర్‌ ఫీట్‌ జాగాకు ఏడాదికి 3వేల డాలర్లు చెల్లించాలని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. హాంకాంగ్‌లోని కాజ్‌వే బే 2,878 డాలర్లతో రెండో స్థానాన్ని దక్కించుకోగా... పారిస్‌లోని ఎవెన్యూ డెస్‌ చాంప్స్‌ ఎలిసీస్‌లో చదరపు అడుగుకు ఏడాదికి 1,368 డాలర్ల అద్దెతో థర్డ్‌ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. 1,283డాలర్లతో లండన్‌లోని న్యూ బాండ్‌ స్ట్రీట్‌, 1,249డాలర్ల అద్దెతో టోక్యోలోని గింజా తర్వాతి స్థానాలు ఆక్రమించాయి. ఇటలీలోని మిలన్‌ లో చదరపు అడుగు స్థలానికి ఏడాదికి 1,239 డాలర్లు, సిడ్నీలోని పిట్‌ స్ట్రీట్‌ మాల్‌లో స్క్వేర్‌ ఫీట్‌ కమర్షియల్‌ స్పేస్‌కు 968 డాలర్లు చెల్లిస్తున్నారు. ఇక సౌత్‌ కొరియాలోని సియోల్‌లో 908, స్విట్జర్లాంట్‌లోని జూరిట్‌ 868, వియన్నాలోని కోహి మార్కెట్‌లో షాపు అద్దె రూపంలో చదరపు అడుగుకు ఏటా 477 డాలర్లు చెల్లిస్తున్నారని కుష్‌మెన్‌ అండ్‌ వేక్‌ ఫీల్డ్‌ రిపోర్టును బట్టి అర్థమవుతోంది.