తినే బొకేలు తయారు చేస్తున్న 'కాన్ అఫెట్టో '

గిఫ్ట్‌లకు ప్రత్యామ్నాయం చూపిన స్టార్టప్కేకులతో బొకేలు చేసి వినూత్న ఆవిష్కరణకు తెరప్రకృతికి ప్రత్యామ్నాయం ఓ సవాలే అంటున్న ఫౌండర్ అల్పన

తినే బొకేలు తయారు చేస్తున్న 'కాన్ అఫెట్టో '

Wednesday June 17, 2015,

3 min Read

ఎవరికైనా ఒక సరైన మంచి బహుమతి ఇవ్వాలాంటే దాన్ని ఎందుకోవటం చాలా కష్టం. ముఖ్యంగా పండుగలూ, ప్రత్యేక సందర్భాల వంటి పెద్ద జాబితా ఉండే మనదేశంలో మరీ కష్టం. బాగా వాడుకలో ఉన్న, అత్యంత సులువైన బహుమతి పుష్పగుచ్ఛాలివ్వటం. కానీ పూలు వాడిపోతాయి. ఎలాంటి విలువాలేకుండా ఎండిపోతాయి. చివరికివాటిని చెత్తబుట్టలో వేయటం చాలా బాధాకరం.ఈ రోజుల్లో ఓ మంచి ఫ్లవర్ బొకే సగటు ఖరీదు రూ. 500 నుంచి 600 కు తక్కువ ఉండదు. వీటిని ఆర్డర్ చేసేటప్పుడు చాలామంది వాటి విలువ గురించి ఆలోచించే ఉంటారు. కాసేపట్లో మూలనపడేసేవాటికి ఇంత ఖర్చు చేస్తున్నామా అని అనుకుంటారు. కానీ అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా సెలెక్ట్ చేయడం వీటికి ఉన్న ప్లస్ పాయింట్. అందుకే ఆ ఆలోచనకు ఒక పరిష్కారం కనుక్కున్నామంటున్నారు కాన్ అఫెట్టో కో ఫౌండర్ ఉపాసనా మాన్ సింఘికా.

తనకు తాను ప్రతిసారీ ఇలాంటి సమస్య ఎదుర్కుంటున్న అల్పన దీనికొక ప్రత్యామ్నాయం కనుక్కోవాలనుకుంది. పెట్టిన ఖర్చుకు తగిన విలువ ఉండాలన్నది ఆమె అభిప్రాయం. అందుకే రుచికరమైన మార్గం కనిపెట్టింది. “ పూల అందంతో బాటు కుకీలు, కప్ కేక్స్, కేక్ ట్రఫుల్స్ లాంటి డెజర్ట్స్ జోడించి తినగలిగే బొకేలు రూపొందించాం '' అంటారు అల్పన. 

ప్రస్తుతానికి ఈ కంపెనీ ఇరవై రకాలకు పైగా బొకేలు తయారుచేస్తోంది. కోరుకున్నవిధంగా తీర్చిదిద్దటంతో బాటు కార్పొరేట్ సంస్థలకు వాళ్ళ లోగో కుకీ కూడా కలిపి అందించటం వీళ్ళ ప్రత్యేకత. అన్ని విభాగాలలోనూ ఐదు ఫ్లేవర్స్‌ను ఎంచుకునే అవకాశముంది. కాన్ అఫెట్టో అందించే తినగలిగే బొకేలు రూ.600 నుంచి 3000 వరకు అందుబాటులో ఉన్నాయి. ఎన్ని పూలు పెట్టాలి, ఎంత పరిమాణం ఉండాలి అనేది కస్టమర్ కోరుకున్నవిధంగా తయారుచేసి అందిస్తారు.

చాక్లెట్ బొకే

చాక్లెట్ బొకే


ఎలా మొదలైంది ?

ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే, అల్పన 32వ పుట్టిన రోజు నాడు వాళ్ల చెల్లెలు ఆఫీసు నుంచి హడావిడిగా వస్తూ ఒక బొకే, ముదురు రంగు చాక్లెట్ కేక్ తెచ్చింది. పూలు పారేసేవరకూ చాలా బాగున్నాయనిపించింది. కానీ పారేయటం మాత్రం చాలా బాధగా ఉంటుంది. ఇది ఎప్పుడూ అనిపించేదేకాని ఈ సారి మాత్రం అల్పనను ఆలోచింప జేసింది.

image


హాబీ పరంగా అల్పన ఒక బేకర్. కానీ ఇప్పుడు ఆమెకు వృత్తిగా మారింది. పూల అందానికి రుచికరమైన డిజర్ట్స్ జోడించి రెండింటి ఉత్తమ లక్షణాలనూ అందించటం ఒక ప్రత్యేకత అయింది. చెల్లితో తన ఆలోచన పంచుకోగానే ఇద్దరూ కలిసి ఈ ఆలోచనలు ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎంతయినా, ప్రకృతికి ప్రత్యామ్నాయం కనుక్కోవటం కష్టం. ఐడియా ఒక్కటే పనిచేయదు. రకరకాల ప్రయోగాలు చేయాల్సి వచ్చింది. అలా రుచికరమైన పూలు తయారయ్యాయి. రెండు నెలల్లో తొలినమూనా సిద్ధమైంది. ఇద్దరూ కార్పొరేట్ సంస్థలకు వెళ్ళి వాళ్ళ ఉత్పత్తులు ప్రదర్శించటం మొదలుపెట్టారు. మొదట్లో కాస్త ఒడిదుడుకులు ఎదురైనా స్టార్టప్‌లో ఎంబసీలు, కార్పొరేట్ సంస్థలతోబాటు రిటైల్ క్లయింట్స్ కూడా వీళ్ళ కస్టమర్ల జాబితాలో చేరారు. భారతదేశంలో పండుగలూ, పబ్బాలకూ, సామాజిక సందర్భాలకూ బహుమతులిచ్చే సాంస్కృతి బాగా పెరుగుతోంది. ఇంటి ఖర్చుల్లో అదీ ఒక భాగమై పోయింది. 

“ మా ఈ-స్టోర్ తో కస్టమర్లు వాళ్ళకు కావాల్సిన నమూనా ఎంచుకొని ఆర్డర్ చేయవచ్చు. వాళ్ళు కోరుకున్న మెసేజ్‌తో గిఫ్ట్ లు, బొకేలు రూపొందించి అందజేస్తాం “ అంటారు అల్పన.
image


చెల్లెలితో అల్పన(కుడి)

చెల్లెలితో అల్పన(కుడి)


ప్రకృతికి ప్రత్యామ్నాయం ఓ సవాలు

“ ఇదేమంత సులభంగా సాధ్యం కాలేదు. ప్రకృతికి ప్రత్యామ్నాయం రూపొందించటం ఒక ప్రధానమైన సవాలు. అది అసాధ్యం కూడా. ప్రకృతిసహజమైన పుష్పాలనుంచి మేం స్ఫూర్తి పొందుతాం. అదే సౌందర్యం, హుందాతనం పొందికగా అమర్చటానికి ప్రయత్నిస్తాం. తాజాదనాన్ని కాపాడటం మరో పెద్ద సమస్య. రుచుకరంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాల్సి ఉండటం ఒక సవాలు. అన్నీ సమన్వయం చేసుకుంటూ సమతుల్యత సాధించుకుంటూ చేసే ఈ ఏర్పాటు వల్ల శీతలప్రదేశంలో అది కనీసం ఐదారు రోజులపాటు నిల్వచేసుకోలిగేలా ఉంటుంది ” అన్నారు అల్పన. ప్రస్తుతానికి పశ్చిమ ఢిల్లీలోని సెంట్రల్ కిచెన్ నుంచి ఇది పనిచేస్తోంది. నేషనల్ కాపిటల్ రీజియన్ అంతటా కార్యకలాపాలున్నాయి. ఈ-స్టోర్ ప్రారంభించాక కాన్ అఫెట్టో దక్షిణ ఢిల్లీలోనూ గుర్‌గావ్ లోనూకియోస్క్ లు ప్రారంభించే పనిలో ఉంది. ప్రధాన తయారీ బేకరీ ఉత్పత్తులే అయినా, ప్రీమియం గిఫ్ట్‌గా పూలగుత్తులు తయారుచేస్తున్నారు. తినగలిగే బహుమతుల కంపెనీగా ఒక ప్రీమియం స్థానం సంపాదించటం వీళ్ళ లక్ష్యం. భారతదేశంలోని వివిధ నగరాలకు విస్తరించటం మీద దృష్టి సారించారు.