అతి తక్కువ ధరకే ఏసీ కమ్ కూలర్.. చూస్తే ఆశ్చర్యపోతారు..

అతి తక్కువ ధరకే ఏసీ కమ్ కూలర్.. చూస్తే ఆశ్చర్యపోతారు..

Sunday April 03, 2016,

3 min Read


ఏసీ కొనగానే సంబరంకాదు… దానికయ్యే కరెంట్ బిల్లు కట్టేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి. అతి తట్టుకోలేకే చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ ఏసీల జోలికే పోరు. అయితే మామూలు ఏసీలు వాడితే వచ్చే బిల్లుకన్నా, దాంట్లో పదోవంతు ఖర్చుతోనే ఏసీ కమ్ కూలర్ వచ్చేస్తే ఎంత బాగుంటుంది..? కానీ అదెలా సాధ్యం అంటారా? ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు మధ్యప్రదేశ్ కు చెందిన భార్యా భర్తలు. గంటపాటు ఏసీ వేస్తే 2వేల 4 వందల వాట్స్ కరెంటు కాలుతుంది. అయితే ఈ జంట తయారు చేసిన ఏసీ కమ్ కూలర్ వాడితే జస్ట్ 250 వాట్స్ చాలు. నెలరోజుల పాటు ఏసీ వాడితే 2 వేల బిల్లు చేతికొస్తుంది. దీనికి మాత్రం ఐదొందలు చాలు. అన్నట్టు వాతావరణంలలోకి వేడిని విడిచిపెట్టని ప్రపంచంలోనే ఏకైక ప్రాడక్ట్ ఇది. 

"వాయు" పేరుతో స్టార్టప్ పెట్టి ఈ అద్భుత కూలింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు ఇండోర్ కు చెందిన ప్రణవ్, ప్రియాంక. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజె సింధియా ఈ టెక్నాలజీని ప్రోత్సహించారు. ఐదేళ్లపాటు ప్రయోగాలు చేసి, ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొన్న తర్వాత ఈ టెక్నాలజీ ఆధారంగా వస్తువులను ఉత్పత్తి చేయగలిగారు. 2014 అక్టోబర్ లో వాయు హైబ్రిడ్ చిల్లర్స్ ఉత్పత్తి ప్రారంభమయ్యింది. పేటెంట్ కూడా వచ్చింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం CGTMSE పథకం కింద కోటి రూపాయల ఆర్థిక సాయం చేసింది.

image


ఇండోర్ లోని సన్వార్ రోడ్ లో రెండు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి వంద యూనిట్లపై పలు కంపెనీలు పరిశోధనలు చేశాయి. టెస్టెడ్ ఓకే రిపోర్ట్ వచ్చాక ఆర్డర్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. పర్యావరణహితమే కాదు… మెయింటెనెన్స్ ఖర్చుకూడా బాగా తక్కువ కావడంతో జనం ఎగబడుతున్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్ లో సేల్స్ మొదలయ్యాయి. ఆథరైడ్జ్ డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మాత్రమే కస్టమర్లకు అందిస్తున్నారు.

“మా ప్రాడక్ట్ చాలా కొత్త కాన్సెప్ట్. వాయు ఎక్స్ పీరియన్స్ జోన్స్ త్వరలోనే ఏర్పాటు చేస్తాం. మా వాయు హైబ్రిడ్ కూలర్స్ తోనే జోన్లను చల్లబరుస్తాం. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కస్టమర్లకోసం సేల్స్ అండ్ సర్వీస్ డీలర్స్ ను నియమించాం”-ప్రణవ్
image


నమ్మలేకపోతున్నారా?

వాయు టెక్నాలజీ గురించి ఎక్కడ డెమో ఇచ్చినా జనం ఆశ్చర్యపోతున్నారంటున్నారు ప్రణవ్, ప్రియాంక. ప్రొఫెసర్లు, సైంటిస్టుల సమక్షంలో డెమో ఇచ్చామని... అందరూ ఆశ్చర్యపోయారని చెప్పారు. మామూలు థర్మోడైనమిక్స్ నియమాలకు విరుద్ధంగా అత్యద్భుత ప్రోడక్ట్ తయారుచేశారంటూ ప్రశంసల జల్లు కురిసిందని ప్రియాంక చెప్పారు.

వాయు ఎలా పనిచేస్తుంది?

వాయు చిల్లర్ ను స్విచ్ ఆన్ చేసిన వెంటనే కంప్రెషర్ పనిచేస్తుంది. రెఫ్రిజరేటర్ కూలింగ్ కాయిల్ లోకి వెళ్లి నీటిని చల్లబరుస్తుంది. పంప్స్ ద్వారా ఆ చల్లని నీరు ప్యాడ్స్ లోనికి వెళ్తుంది. బయటనుంచి వచ్చే వేడిగాలి.. చల్లని నీటిని తాకుతుంది… అక్కడి నుంచి గాలి వస్తుంది. వెంటనే టెంపరేచర్ కూల్ అయిపోతుంది. థెర్మోస్టార్ట్ సాయంతో టెంపరేచర్ ఎంతకావాలో అంతవరకే అడ్జెస్ట్ చేసుకోవచ్చు. కండెన్సర్ వల్ల హ్యుమిటిడీ కూడా కంట్రోల్ అవుతుంది. ఈ మెషిన్ పెట్టినచోట గాలి మొత్తం చల్లబడుతుంది. ఏసీ అంత చల్లగా కాకపోయినా పరిసరాలన్నింటినీ మాగ్జిమం చల్లబరుస్తుంది. గాల్లోని తేమను సైతం కంట్రోల్ చేస్తుంది. అచ్చం ఏసీ లాంటి ఫీలింగే వస్తుంది. వాయు చిల్లర్స్ అచ్చం ఏసీలాగే కనిపిస్తుంది. వీటి ఖర్చు తక్కువ ఇన్ స్టాలేషన్ కూడా తేలిక.

2016 -17 ఆర్థిక సంవత్సరంలో మరో పది రాష్ట్రాల్లో తమ ఉత్పత్తులను విక్రయించాలని కంపెనీ నిర్ణయించింది. వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోని పలుదేశాలకు హైబ్రిడ్ చిల్లర్స్ ను ఎగుమతి చేయనున్నారు. మెక్సికో, యూఏఈ, ఆఫ్రికా దేశాల నుంచి ఇప్పటికే ఆర్డర్లు వస్తున్నాయి. వెంచర్ క్యాపిటలిస్టులు పెట్టుబడులు పెడితే… ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతిచేసే అంశాన్ని ఆలోచిస్తామంటున్నారు ప్రణవ్.

image


పవర్ కపుల్

ప్రణవ్ భార్య ప్రియాంక పెళ్లి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన ప్రణవ్… హీటింగ్, వెంటింగ్, ఎయిర్ కండిషనింగ్ లో డిప్లోమా కూడా చేశారు. క్యారియర్, శాంసంగ్, ఎల్జీ లాంటి మల్టీ నేషనల్ కంపెనీల్లో 14 ఏళ్లపాటు ప్రోడక్ట్ మేనేజర్ గా పనిచేశారు. టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకునేందుకు అనుక్షణం తపించే ప్రణవ్.. 2008లోనే ఏసీ సేల్స్ అండ్ సర్వీసెస్ అనే కంపెనీని సొంతంగా ప్రారంభించారు. ప్రియాంక మార్కెటింగ్ లో ఎంబీఏ, పీహెచ్డీ చేశారు. సొంత కంపెనీలో పనిచేస్తూనే ఇండోర్ లోని పలు విద్యాసంస్థల్లో గెస్ట్ లెక్చర్లిస్తుంటారు.

image


యువర్ స్టోరీ కో మీడియాగా స్పాన్సర్ చేసిన మేగా లాంచ్ ప్యాడ్ అవార్డును వాయు సంస్థ గెలుచుకుంది. ఇటీవలే స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అండ్ స్కాచ్ బెస్ట్ ఎస్ఎంఈ అవార్డులను గెలుుచుకుంది. ముంబైలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో వీటిని ప్రదానం చేశారు. ప్రధాని డ్రీమ్ ప్రాజెక్టు… స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా కు… మధ్యప్రదేశ్ ప్రభుత్వం నామినేట్ చేసిన ఐదు స్టార్టప్ లలో వాయు ఒకటిగా నిలిచింది.