హైదరాబాద్ లో అడవిని నిర్మిస్తున్న భీమవరం బుల్లోడు..!

హైదరాబాద్ లో అడవిని నిర్మిస్తున్న భీమవరం బుల్లోడు..!

Tuesday May 03, 2016,

3 min Read


టైటిల్ చూసి కంగారు పడ్డారు కదా..? కచ్చితంగా పడుంటారు. ఎందుకంటే.. ఈ మహానగరంలో మనిషికే చోటు లేదు మొక్కలు బతికాలంటే అయ్యే పనేనా..? బాల్కనీలో నిలబడి ఉదయాన్నే కాస్త పచ్చిగాలి పీల్చిన అనుభూతి ఎంతమందికి ఉంది చెప్పండి..? అందుకే కాంక్రీట్ జంగిల్ లా మారిపోయిన నగరంలో చెట్లను నాటే పని ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు. అయితే ఎటొచ్చీ వాటి ఆలనా పాలనా చూసే నాథుడు లేడు. మరోవైపు ఈ సమ్మర్- సిటీ జనానికి మంచి సవాల్ విసిరింది. చెట్టు విలువేంటో చాటి చెప్పింది. సిటీలో ఎలాగూ సాధ్యపడదు. కనీసం సిటీ శివార్లలో అయినా చెట్లున్నాయా అంటే అదీ లేదు. రియల్ ఎస్టేట్ పుణ్యమాని అవి కూడా కనుమరుగయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడొక అడవిని నిర్మించాలంటే సాధ్యమవుతుందా? అయ్యే పనేనా..? కానీ దాన్ని నిజం చూపించాడు భీమవరం బుల్లోడు వేణు.

image


“భీమవరం తాతయ్య వాళ్లింటికి వెళ్లినప్పుడు చెట్లకింద ఆడుకునే ఆనందమే వేరు”- వేణు

ది విలేజ్ పేరుతో జంగల్ వెంచర్

సాధారణంగా పల్లెటూర్లలో ఇళ్లంటే- చుట్టుపక్కట అనేక రకాల పండ్లచెట్లు, వేప, చితంచెట్టులాంటివన్నీ కనిపిస్తాయి. సిటీలో అది ఎట్టిపరిస్థితుల్లో సాధ్యపడదు. ఇరుకిరుకు అపార్ట్ మెంట్స్ లో జనం ఉండటానికే సరిపోదు. మిగిలింది కార్లు, స్కూటర్లు పార్కింగ్ చేసుకోవడమే. ఇక చెట్లను పెంచడం సంగతి సరేసరి.

“నేను కూడా అపార్ట్ మెంట్లలో పెరిగాను. అందుకే చెట్లంటే విలేజిలో మాత్రమే ఉంటాయని అనుకునేవాడిని” -వేణు

చిన్ననాటి నుంచి హైదరాబాద్ లో పెరిగిన వేణు, చిన్నప్పుడు గ్రామాల్లో మాత్రమే చెట్లుంటాయని అనుకున్నారట. నిజానికి ఇది వాస్తవమే. ఎందుకంటే ఇక్కడ జనాలు వాటిని పెంచడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. ఉన్న వాటిని నరకడమే పనిగా పెట్టుకుంటారు. రియల్ ఎస్టేట్ గా మారి ఇంచుఇంచు కాంక్రీట్ వనంగా తయారైంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగి భయపెడుతున్నాయి. సిటీ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉందీ ‘ది విలేజ్’. 500 నుంచి 2వేల చదరపు అడుగుల వెంచర్స్ ని ఏర్పాటు చేశారు. అయితే వీటిచుట్టూ చెట్లను పెంచారు. అగ్రికల్చర్ చేయాలనుకునే వారికి కూడా స్థలం ఇస్తారు. పూర్తి పల్లె వాతావరణం కల్పిస్తారు. ఇక్కడున్న చాలారకాల చెట్లు సాధారణ ఉష్ణోగ్రత కంటే 3 నుంచి 5 డిగ్రీలను తగ్గించే శక్తి ఉన్నవి. పూర్తిగా ఆర్గానిక్ పద్దతిలో వెంచర్ మొత్తం చెట్లను పెంచారు.

image


“తారు రోడ్డు వేస్తే వర్షపు నీరు ఇంకదు. అందుకే వెంచర్లో ఆ తరహా రోడ్లు వేయలేదు”- వేణు

ఇంకుడు గుంతలు, చెట్లను ఏర్పాటు చేయడంతో పాటు పండ్ల మొక్కలు ఇక్కడ ప్రత్యేకమని అంటున్నారాయన.

అగ్రి టూరిజం టార్గెట్

ఇప్పటి తరం పిల్లలకి అసలు ఫార్మింగ్ అంటే ఏంటో తెలియదు. మనకు ఆహారం ఎలా వస్తుందనే దానిపై అవగాహన ఉండటం లేదు. సిటీలో ఉన్న పిల్లలు ఇక్కడకు వచ్చి వ్యవసాయం గురించి తెలుసుకోవాలనేది మా టార్గెట్. 100 మంది కుటుంబాలు ఒకేసారి వచ్చి ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈవెంట్లు చేపడుతున్నాం. ప్రాజెక్టు పూర్తయితే వచ్చే ఏడాదికి అన్ని అందుబాటులోకి వస్తాయిని వేణు చెప్పుకొచ్చారు.

“వ్యవసాయం పై ఆసక్తి ఉన్నవారు, ఇక్కడక వచ్చి సాగు చేయొచ్చు”- వేణు

వెకేషన్ తీసుకుని ఫార్మింగ్ చేయడాన్ని అగ్రిటూరిజం అంటారు. హైదరాబాద్ లో ఈ తరహా టూరిజం కొత్తది. తమ వెంచర్ ప్రారంభం అయితే భవిష్యత్ లో మరిన్ని వెంచర్లు రావడానికి ఆస్కారం ఉంది. తాము దీనికి నాంది పలకడం ఆనందంగా ఉందని అన్నారాయన. ఐటి కంపెనీ ఉద్యోగులు ఔటింగ్ తీసుకుని ఇక్కడ ఫార్మింగ్ చేయొచ్చు. స్కూల్ పిల్లలు ఇక్కడకు రావొచ్చని చెప్పుకొచ్చారు.

image


ప్రధాన సవాళ్లు

1.ఇలాంటి ప్రాంతాల్లో ఫారెస్ట్ రిసార్ట్ లు ఏర్పాటు చేయాలంటే వాటర్ రిసోర్స్ పెద్ద సమస్య. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం ద్వారా దీన్ని అధిగమిస్తామని అన్నారు.

2. ఇక్కడ పనిచేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ప్రాజెక్టు కోసం ఉద్యోగులను హైర్ చేయడం కూడా మరో సవాలని అంటున్నారు.

3. సివిల్ కల్టివేషన్ ద్వారా అన్నింటినీ పూర్తి చేయాలి. దీన్ని అధిగమించాల్సి ఉంది.

ది విలేజ్ టీం

టీం విషయానికొస్తే ప్రధానంగా చెప్పుకోదగిన వ్యక్తి ఫౌండర్ వేణు. వేణు సొంతూరు భీమవరం. డిగ్రీ పూర్తి చేసి ఎఫ్ బార్ అనే సంస్థను రన్ చేశారు. అనంతరం మరో వ్యాపారం చేశారు. చాలా వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నారు. సీరియల్ ఆంట్రప్రెన్యూర్ అయిన ఆయన.. ఈ విలేజ్ రూట్స్ ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. గడిచిన మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పై 4 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేశారు. 45 మంది ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారు.

image


భవిష్యత్ ప్రణాళికలు

వచ్చే ఏడాదికల్లా ప్రాజెక్టు పూర్తవుతుంది. ఫాం హౌస్ తో పాటు క్లబ్ హౌస్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అనుబంధంగా గ్రామీణ వాతావరణం కనపడేలా ప్రాంతాలను నిర్మిస్తున్నారు. భారీగా ప్లాంటేషన్ చేసి చిన్న తరహా అడవిని నిర్మిస్తున్నారు. రెయిన్ హార్వెస్ట్ వాటర్ హార్వెస్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇలాంటి వాతావరణం కోరుకునే వారికి ఇక్కడ వెంచర్ ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇప్పటికే చాలా ప్లాట్లు సేల్ అయిపోయాయి. రిసార్ట్ లాగానే ఉన్నప్పటికీ నేచర్ కు దగ్గరగా దీన్ని మార్చడమే మా ప్రధాన లక్ష్యం అంటున్నారు వేణు.