మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో 3 నెలలకే రెట్టింపైన స్టార్టప్

మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో 3 నెలలకే రెట్టింపైన స్టార్టప్

Thursday May 05, 2016,

3 min Read


హరినారాయణ్, అనిల్ చతుర్వేది బెంగళూరులోని ఫోరస్ హెల్త్ లో పనిచేసేవారు. వృత్తిలో భాగంగా ఐ డాక్టర్స్, కంటి ఆస్పత్రుల సిబ్బందితో తరచూ మాట్లాడేవారు. కంటి ఆస్పత్రుల్లో ఉపయోగించే ఫండస్ కెమెరాలను విదేశాల నుంచి తెప్పించేవారు. అవి చాలా ఖరీదైనవి. ఫండస్ కెమెరాలో లో అటాచ్డ్ కెమెరాతో కూడిన లో పవర్ మైక్రోస్కోపులుంటాయి. దానికోసం లక్షలకు లక్షలు పోసి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏముందన్న ఆలోచన ఇద్దరిలో వచ్చింది. భారత్ లోనే వాటిని తయారు చేయలేమా అనిపించింది.

అనుకున్నదే తడవుగా ఇంట్యూవిజన్ పేరుతో 2014 ఫిబ్రవరిలో స్టార్టప్ ప్రారంభించారు. తక్కవ ధరకే హై క్వాలిటీ పోర్టబుల్ ఫండస్ కెమెరాలను తయారుచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మూడు రకాల ఇంట్యూ కెమెరాలను తయారుచేస్తున్నారు. జనరల్ ఆప్తమాలజిస్టులకోసం ఇంట్యూక్యామ్ 45,జనరల్ ఫిజీషియన్స్ – డయగ్నాస్టిక్ సెంటర్స్ కోసం ఇంట్యూక్యామ్ ప్రైమ్, టీచింగ్, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులకోసం ఇంట్యూక్యామ్ ఎఫ్ఎఫ్ఏ తయారుచేశారు. మారుమూల డయగ్నాస్టిక్ సెంటర్లకు టెలి మెడిసిన్ సేవలను సైతం అందిస్తున్నారు. పోటీ సంస్థలకన్నా 20 నుంచి 30 శాతం తక్కువ ధరకే ఇంట్యూక్యామ్స్ అందిస్తున్నారు. ఒక్కో ఉత్పత్తి నుంచి 70 శాతం మార్జిన్ వస్తోంది.

పెరుగుతున్న అంధత్వం

2020 నాటికి ప్రపంచ జనాభా 790 కోట్లకు పెరుగుతుందని అంచనా. వారిలో 7 కోట్ల 60 లక్షల మందికి అంధత్వం వస్తుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది. ప్రజల్లో అవగాహన పెరగడంతో చాలామంది కంటి చెకప్ చేయించుకుంటున్నారు. దీంతో ఫండస్ కెమెరాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. కోయంబత్తూర్ కు చెందిన రెటీనా స్పెషలిస్ట్ ఫండస్ కెమెరా ఉండే స్మార్ట్ ఫోన్ కనిపెట్టారు. సెల్ ఫోన్ తో రెటీనాను ఫొటో తీసుకుంటే సమస్య ఏమిటో తెలిసిపోతుంది. 2011లో ప్రపంచ వ్యాప్తంగా హైబ్రిడ్ కెమెరాలు వచ్చాయి. ఫండస్ కెమెరాల వాడకం ఇప్పుడు బాగా పెరుగుతోంది. గ్లోబల్ ఐరిష్ రికగ్నిషన్ మార్కెట్ 15 కోట్ల డాలర్లకు చేరుకుందని ఫ్రోస్ట్ అండ్ సులివన్ అనే సంస్థ తెలిపింది. ఇది 2019 నాటికి 17 కోట్లకు చేరుకోనుంది.

image


డిజైన్ అండ్ డెవలప్ మెంట్

ఇంట్యూవిజన్ వ్యవస్థాపకులు ఇజ్రాయెల్, యూరోపియన్ దేశాలు, అమెరికా, చైనాలో పరిశోధనలు చేశారు. భారత్ లో ఉన్న సమస్యలను అవగతం చేసుకున్నాక స్టార్టప్ ప్రారంభించారు. ఫండస్ కెమెరాను ఆల్ ఇండియా ఆప్తాల్మిక్ సొసైటీ కాన్ఫరెన్స్ 2015లో ప్రారంభించారు. వెంటనే 250 కెమెరాలు కావాలంటూ ఆర్డర్స్ వచ్చాయి. శంకర నేత్రాలయకు చెందిన ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ భార్గవ ఈ కెమెరాలో ఒక లోపాన్ని కనిపెట్టారు. దాన్ని సరిచేశారు. మరింతగా పరిశోధనలు చేసి 2015 అక్టోబర్ లో ఇంట్యూక్యామ్ -45ను మార్కెట్లోకి తీసుకొచ్చారు.

2015 నవంబర్ నాటికి ఐదు కెమెరాలను తయారుచేశారు. 2016 వరల్డ్ ఆప్తమాలజీ కాంగ్రెస్ లో వాటిని ప్రదర్శించగా… ప్రశంసల జల్లు కురిసింది. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కంటి డాక్టర్లు వీటిని ఆసక్తిగా గమనించారు. ఈ ఫండస్ కెమెరా తయారీకి 60 శాతం పరిరకాలను దిగుమతి చేసుకుంటుండగా… 40 శాతం సొంతంగా తయారు చేస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో 75 శాతం రా మెటీరియల్ స్థానికంగానే తయారు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఫండస్ కెమెరాను కనిపెట్టడానికి చేసిన ప్రయోగాలకు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చయ్యింది. ఈ నాలుగుకోట్లు సొంతంగానే పెట్టుకున్నారు. తర్వాత తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కొంత లోన్ తీసుకోవాల్సివచ్చింది.

“మేం చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నాం. కాటరాక్ట్ సర్జరీ చేసుకున్నవారిపై ఆప్టికల్ సిస్టమ్ పనిచేయలేదు. మేం చాలా ఆప్టికల్ కాంబినేషన్స్ పై పనిచేశాం. మా ఉత్పత్తులను టెస్ట్ చేయించుకునేందుకు చాలా ఐ ఆస్పత్రులకు వెళ్లాం. చాలా మందిపై ప్రయోగాలు చేశాం. “ అనిల్ 

కంపెనీ ఎదుగుదల

ప్రస్తుతం ఇంట్యూవిజన్ లో 28 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో 11 మంది, ప్రొడక్షన్ డిపార్టమెంట్ లో ఆరుగురు, సేల్స్ అండ్ ఇతర విభాగాల్లో ఏడుగురు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 30 ఇంట్యూక్యామ్స్ 45 అమ్మారు. 79 లక్షల రూపాయల వ్యాపారం చేశారు. ఇంకో వంద ఆర్డర్స్ వచ్చాయి. ఒక్క బెంగళూరు నుంచే కాదు… హైదరాబాద్, ముంబై, జల్గావ్, అహ్మదాబాద్, సూరత్, బరోడా, ఉదయ్ పూర్, జలంధర్, ఢిల్లీ, గౌహతి, కోల్ కతా నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఇజ్రాయెల్ కు చెందిన ఒక కంపెనీ సైతం ఆర్డర్ ఇచ్చింది.

బెంగళూరులో 15 వందల చదరపు అడుగుల తయారీకేంద్రాన్ని ఇంట్యూవిజన్ ఏర్పాటు చేసుకుంది. నెలకు 50 ఇంట్యూక్యామ్స్ తయారు చేయగలిగే సామర్థ్యముంది. దీనికి ఐఎస్ఓ సర్టిఫికెట్ కూడా వచ్చింది.

“ మేం చాలా మంది డయాబెటిక్, బీపీ పేషెంట్లను చూశాం. తరచుగా వారు డాక్టర్ల దగ్గరకు వెళ్తుంటారు. వారికి రెటీనా దెబ్బతినే అవకాశం ఉంది. వారిలో విజన్ ను కంట్రోల్ చేయగలం గానీ సరి చేయలేం.” హరి, ఐఐఎం బెంగళూరు.

image


గత త్రైమాసికంలో ఇంట్యూవిజన్ 50 వేల డాలర్లను ఆర్జించింది. ఇంకా లక్ష డాలర్లు సంపాదించేందుకు అవసరమైన బుకింగ్స్ చేతిలో ఉన్నాయి. మూడు నెలల్లోనే నూరు శాతం వృద్ధిరేటు నమోదు చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోకి విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఏడాది 5 వందలకుపైగా డివైసెస్ అమ్మి 30 లక్షల డాలర్ల వ్యాపారం చేయాలని టార్గెట్ పెట్టుకుంది.