ఆఫీసులకు ఆరోగ్యకర ఆహారాన్ని పంపే 'స్పూన్ జాయ్'

చౌక ధరకే హెల్తీ ఆహారంవెనకుండి నడిపిస్తున్న ఫ్లిఫ్కార్ట్ మాజీలు సిఎస్ఓ బెంగుళూరు వాసుల ఫేవరేట్ డిష్ పండ్లు, మొలకలేభవిష్యత్‌లో సప్లై చెయిన్‌లోకి రానున్నస్పూన్ జాయ్

0

ఈరోజుల్లో నగర జీవనం క్షణం తీరిక లేకుండా గడిచిపోతోంది. ఇక సరైన తిండి తినడానికి గానీ వ్యయామం చేయడానికి గానీ సమయం దొరకడం లేదనే చెప్పాలి. ఈ రెండింటినీ న్యూఇయర్ రిసాల్యూషన్స్ గా తీసుకున్నప్పటికీ, చాలామంది జనవరి రెండో వారం నుంచే పాటించలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో ఇలాంటివన్నీ అటకెక్కక తప్పడం లేదు. ఇప్పటి తరాన్ని సౌకర్యవంతమైన జీవితంగా చెప్పాలి. ఎక్కడ ఎలాంటి అసౌర్యం కలగకుండా జీవిస్తోన్న జీవన విధానం ఇది. దీనికోసం హెల్దీ ఫుడ్ ని ఇంటి దగ్గరకి లేదా ఆఫీస్ వద్దకే తెచ్చి ఇవ్వగలిగితే కచ్చితంగా సౌకర్యవంతం. కనుక జనం దాన్ని స్వీకరిస్తారనే భరోసాతో బెంగళూరు కేంద్రంగా స్పూన్ జాయ్ ప్రారంభమైంది. ఆరోగ్యకరమైన ఆహారం చవకైన ధరకే అందరికీ అందించాలనే ఉద్దేశంతో స్పూన్ జాయ్ సంస్థను ఆరంభించారు. అప్పుడే కట్ చేసిన పండ్లు, మొలకలు, ఈ రెండింటిని కలిపి తయారు చేసిన ప్యాక్, లంచ్, స్నాక్స్ లను వీక్లీ సబ్ స్క్రిప్షన్ తో అందిస్తోంది స్పూన్ జాయ్. ఆర్డర్లు ఎక్కడెక్కడున్నాయి. ఎక్కడికి తీసుకెళ్లాలనే దానిపై ఏరోజుకారోజు ఉదయమే నిర్ణయించుకుంటారు. ఇంటికి గానీ, ఆఫీసులకు గానీ స్పూన్ జాయ్ ఉదయం పదిగంటనుంచి సాయంత్రం 6గంటల మధ్యలో యూజర్ల సౌకర్యవంతమైన సమయానికి డెలివరీ చేస్తుంది. 

మనీష్ జెథాని స్పూన్ జాయ్ ఫౌండర్. మనీష్ కి ఇది రెండో స్టార్టప్. గతంలో వెండార్ స్కేల్ పేరుతో బి టు బి రివర్స్ లైన్ ఐడియాతో ఒక కంపెనీని ప్రారంభించారు. అయితే అది ఎంతోకాలం నడవలేదు. అయితే ఫుడ్ సెక్టార్లో విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ నిలదొక్కుకో గలమనే ధీమాతో మనీష్ దీన్ని స్టార్ట్ చేశారు. సారధ్ మోహనన్ స్పూన్ జాయ్ లో మొదటి ఉద్యోగి. ఇప్పుడు తాను మొబైల్ టీంను లీడ్ చేస్తున్నారు. మూడు నెలల్లో వీళ్లిద్దరూ కలసి స్పూన్ జాయ్‌ని మంచి స్థాయికి తీసుకురాగలిగారు. మనీష్ స్నేహితులు సౌరభ్ అగర్వాల్, ప్రతీక్ అగర్వాల్, కనిష్క్ త్యాగిలు ముగ్గురూ ఐఐటి రూర్కీలో బీటెక్ చదివిన వారే. వీళ్లంతా వారి ఉద్యోగాలను వదిలేసి స్పూన్ జాయ్ కంపెనీలో చేరిపోయారు. స్పూన్ జాయ్ టీంకి సాలిడ్ వర్కింగ్ ఎక్స్‌స్పీరియన్స్ ఉంది. మనీష్ సిఈఓగా వ్యవహరిస్తూ ప్రాడక్ట్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్, టీం బిల్డింగ్ లాంటివి చూస్తున్నారు. గతంలో ఫ్యాషన్ అండ్ యూ డాట్ కామ్, అర్బన్ టచ్ డాట్ కామ్, చక్పాక్ డాట్ కామ్, ట్రాన్స్ బిట్ టెక్నాలజీల్లో మనీష్ పనిచేసిన అనుభవంతో ఈ పొజిషన్ని చక్కగా నిర్వర్తిస్తున్నారు.

సాంకేతిక అనేది నిజజీవితంలో సమస్యల పరిష్కారానికి ఉపయోగపడాలని మనీష్ నమ్ముతారు. గతంలో మనీష్ పనిచేసిన కంపెనీలో సౌరభ్ సహఉద్యోగి. చాలా స్టార్టప్ కంపెనీల్లో పనిచేసి ఎన్నో సరికొత్త ప్రాజెక్టులను అమలు చేసిన అనుభవం అతనిది. అన్‌ బాక్స్డ్‌ ఇంక్ అనే కంపెనీలో పనిచేసేటప్పుడు ఫ్లిప్‌కార్ట్, మింత్ర లాంటి వాటికి ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్‌ ప్లాట్‌ఫాంపై అకౌంటింగ్‌ని బిల్డ్ చేశారు. ఐఐఎం కోల్‌కతా డైరెక్టర్ల మెరిట్ లిస్ట్ నుంచి బయటకొచ్చిన ప్రతీక్ మెకిన్సేలో జాయిన్ అయ్యారు. అప్పటికే అదే ఫీల్డ్‌లో అనలిస్ట్ ఉన్న కనిష్క్‌తో కలసి పనిచేశారు. వీళ్లిద్దరూ ఇన్వెస్ట్‌మెంట్‌తో పాటు ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను ప్లాన్ చేస్తారు.

కనిష్క్, మనీష్, సౌరభ్, ప్రతీక్
కనిష్క్, మనీష్, సౌరభ్, ప్రతీక్

ఫండింగ్

ఇటీవల సూన్ జాయ్ ఫండ్‌ని కూడా రెయిజ్ చేయగలిగింది. ఏంజిల్ ఫండింగ్ సాయంతో ఫ్లిఫ్‌కార్ట్ డాట్ కమ్ కో ఫౌండర్, సిపిఓ లైన సచిన్ బన్సాల్, మెకిన్ మహేశ్వరి లు పెట్టుబడులు పెట్టారు. ట్రాక్సిన్ ఫౌండర్ అభిషేక్ గోయల్, డెలివరి కో ఫౌండర్ సాహిల్ బారువాలు సైతం స్పూన్ జాయ్‌లో నిధులు కుమ్మరించినవారే. ఈ మొత్తాన్ని టెక్నాలజీతో పాటు ఆపరేషన్స్ బిల్డప్ కోసం వినియోగించారు.

ఎలా పనిచేస్తోంది ?

జాయ్ డాట్ కామ్ రోజుకి 350 నుంచి 400 ఆర్డర్లను తీసుకుంటోంది. ఇందులో తొంబైశాతం ఆఫీసుల నుంచి వస్తుంటే పదిశాతం ఇళ్లనుంచి వస్తున్నాయి. పండ్లు, మొలకలు అనేవి ఇందులో పాపులర్ ఐటమ్. బెంగళూరులో పండ్లు, మొలకలకు ఎక్కడికైనా డెలివరీ చేస్తారు. లంచ్, స్నాక్స్ మాత్రం కొన్ని ప్రాంతాలకే పరిమితం అయింది. ఇప్పటి వరకూ బిటిఎం, హెచ్ఎస్ఆర్ తోపాటు కొరమంగళ లో మాత్రమే ఈ సర్వీస్ ఉంది. ఇటీవల మొబైల్ యాప్ ని కూడా లాంచ్ చేశారు.

భవిష్యత్ ప్రణాళికలు

వచ్చే 8నెలల్లో బెంగుళూరులోని ప్రతి ఏరియాకి విస్తరించాలని టీం చూస్తోంది. ఎక్కువ మంది వినియోగదారులకు చేరువ కావాడం తదుపరి లక్ష్యం. వచ్చే మూడు నెలల్లో ఐఓఎస్ యాప్ ని కూడా లాంచ్ చేయాలని చూస్తోంది.

Website : SpoonJoy, Android App

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik