ఇంటికే వైద్యులు, వైద్య సేవలు - ఇదే 'కాల్ హెల్త్' కాన్సెప్ట్

ఇంటికే వైద్యులు, వైద్య సేవలు - ఇదే 'కాల్ హెల్త్' కాన్సెప్ట్

Thursday May 26, 2016,

4 min Read


మన ఇంటి దగ్గరకే వైద్య సేవలు అందుబాటులోకి వస్తే..

ఆన్ లైన్ లో బుక్ చేసిన మెడిసిన్ డోర్ డెలివరీ జరిగిపోతే..

డాక్టర్ అపాయింట్ మెంట్ ఆన్ లైన్ లోనే అయిపోతే..

ఇతర కేర్ గివింగ్ సర్వీసులన్నీ గుమ్మం ముందుకే వస్తే..

ఎంత హాపీయో కదా..

అలాంటి ఐడియాతో పుట్టుకొచ్చింది హైదరాబాదీ స్టార్టప్ కాల్ హెల్త్. ఆరోగ్యానికి సంబంధించిన సేవలన్నిటినీ ఒకే గొడుగు కిందకి తెచ్చి, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. 

image


ఇలా మొదలైంది..

ముందు పెయిన్ రిలీఫ్ కావాలి. ఆ తర్వాత శాశ్వత పరిష్కారం కోసం వెతుకుతాం. ఈ బేసిక్ ప్రిన్సిపుల్ మీదనే కాల్ హెల్త్ స్టార్టప్ ఐడియా జెనరేట్ అయింది. ఒకసారి సంధ్య రాజు అనే కూచిపూడి డ్యాన్సర్ కాలికి దెబ్బతాకింది. హాస్పిటల్ కు పోతే ఆ టెస్టులు ఈ టెస్టులు అని లాబొరేటరీల చుట్టూ తిప్పించారు. ఆ విసుగులోంచే ఆలోచన తట్టింది. అన్ని సర్వీసులు ఒకే గొడుగు కిందకు తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఐడియాపై ఆమె వర్కవుట్ చేశారు. వ్యాపార కుటుంబ నేపధ్యం ఉన్న సంధ్యారాజు ..గ్రౌండ్ లెవెల్ నుంచి రీసెర్చ్ చేసి, డైనమికి సొల్యూషన్ కనిపెట్టారు. అలా అలా అది కాల్ హెల్త్ అనే ఓ ఖతర్నాక్ సొల్యూషన్ ఔట్ పుట్ లా బయటకొచ్చింది. ఇంటిదగ్గర నుంచే అన్ని వైద్యసేవలను పొందడం దీని ముఖ్య ఉద్దేశం.

కాల్ హెల్త్ అందించే సేవలు

చాలా రకాలైన వైద్య సేవలను కాల్ హెల్త్ అందిస్తుంది. ఇందులో ప్రధానంగా కొన్నింటిని ప్రస్తావించారు సీఈవో హరి తాళ్లపల్లి.   

1. 24x7 అందుబాటులో ఉండే డాక్టర్లు ఇందులో చెప్పుకోదగినది. ఎప్పుడెలాంటి అవసరం వచ్చినా డాక్టర్ అపాయింట్ మెంట్ క్షణాల్లో తీసుకోవచ్చు.

2. ఇంటి దగ్గరే అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించొచ్చు. వాటి రిపోర్టులు కూడా క్షణాల్లో పొందొచ్చు.

3. ఇంటి దగ్గరకే కావల్సిన మందులను తెప్పించుకోవచ్చు.

4. ఫిజియోథెరఫీ లాంటి సేవలను ఇంటి దగ్గరి నుంచే పొందొచ్చు.

5. నర్సింగ్ సపోర్ట్ అందిస్తారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఇంటి దగ్గర కావల్సిన నర్సింగ్ ఫెసిలిటీ అందిస్తారు. 

6. ఇంటి దగ్గరున్న పెద్ద వారికి కేర్ గివింగ్ సర్వీసులనూ కాల్ హెల్త్ అందిస్తోంది.

హరి తాళ్లపల్లి, కాల్ హెల్త్ సిఈఓ

హరి తాళ్లపల్లి, కాల్ హెల్త్ సిఈఓ


వీటితో పాటు మరిన్ని సర్వీసులను, సేవలను అందిస్తున్నారు. ఇలాంటి చాలా సేవలకు ఒకే ఫ్లాట్ ఫాం కాల్ హెల్త్ అని హరి చెప్పుకొచ్చారు. “టెక్నాలజీ ఉపయోగించి , సర్వీసులను మరింత సరళతరం చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చాం” అని అంటున్నారు హరి తాళ్లపల్లి. చేతిలో మొబైల్ ఉంటే చాలు.. కావల్సిన హెల్త్ సేవలు ఉన్నట్లే అని హరి చెప్పుకొచ్చారు. కాల్ హెల్త్ ప్రతి ఇంటి ఫ్యామిలీ డాక్టర్ లాంటిదంటారాయన. రిజిస్ట్రర్ యూజర్ల కోసం ఫ్యామిలీ డాక్టర్ ను అపాయింట్ చేస్తారు. డాక్టర్ సలహా మేరకు వారి అన్ని రకాల సమస్యలను పరిష్కారం చూపుతామని హరి చెప్పుకొచ్చారు.

ప్రధాన సవాళ్లు

1. మెడికల్ ఈకో సిస్టమ్ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేయడం ఒకే ఫ్లాట్ ఫాం లోనికి తీసుకు రావడం పెద్ద సవాల్ అని హరి తాళ్లపల్లి చెప్పుకొచ్చారు. క్లినిక్స్, హాస్పిటల్స్, ఎక్స్ రే ల్యాబ్ లన్నింటికీ తమ దగ్గర పరిష్కారం ఉందంటున్నారు. ఇవన్నీ ఈ సర్వీసును ఎడాప్ట్ చేసుకోవడం తమకొక చాలెంజ్ అని తెలిపారు. ప్రపంచ స్థాయి సొల్యూషన్ తో రావడం వల్ల దీన్ని అధిగమించామని చెప్తున్నారు. 

2. 2014 నవంబర్ నుంచి సర్వీసులను ప్రారంభించరు. జనంలోనికి ఈ కాన్సప్ట్ తీసుకెళ్లడం కూడా మొదట్లో ఓ పెద్ద సమస్యగా మారింది. సాంప్రదాయ పద్దతిలో మెడికల్ సర్వీసులను వినియోగించుకుంటున్న జనం వీరి డోర్ స్టెప్ సర్వీసును స్వీకరించడం ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు. ఈ సవాల్ ని అధిగమిస్తామనే దీమా వ్యక్తం చేశారు హరి.

3. ఈ రెండూ ఒక ఎత్తయితే హెల్త్ కేర్ రంగం వీరి టెక్నాలజీని ఎడాప్ట్ చేసుకోడానికి మొదట్లో సిద్ధంగా లేదు. డాక్టర్ల దగ్గరి నుంచి పాజిటివ్ గా రెస్పాన్స్ వచ్చినా, మిగిలిన వారి నుంచి మొదట్లో తిరస్కరణే ఎదురైంది. దీన్ని నెమ్మదిగా అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తియితే ఇక హెల్త్ కేర్ రంగంలో తమకు తిరుగులేదని అంటున్నారు హరి తాళ్లపల్లి.

టీం, టెక్నాలజీ

కాల్ హెల్త్ అనేది ప్రస్తుతానికి ఆన్ లైన్ హెల్త్ కేర్ గానే ఉంది. భవిష్యత్ లో మొబైల్ యాప్ ప్లాట్ ఫాం లోకి ప్రవేశించనుంది. టెలి కాలింగ్ తో సేవలను అందిస్తున్నారు. దీని ఫౌండర్ సంధ్య రాజు. వ్యాపార కుటుంబ నేపధ్యం ఉన్న ఆమె విజన్ కి రూపమే ఈ సంస్థ. సీఈవో హరి తాళ్లపల్లి పనిచేస్తున్నారు. హెల్త్ కేర్ తో పాటు ఇతర రంగాల్లో దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఉంది ఆయనకు. 850 మంది ఆన్, ఆఫ్ రోల్ ఉద్యోగులున్నారు. 450 మంది అసెర్ట్ బిల్డింగ్ ఫ్లాట్ ఫాం, కాల్ సెంటర్ లో పనిచేస్తారు. 400 మంది గ్రౌండ్ లెవెల్.. అంటే డాక్టర్లు, నర్సులు ఇతర కేర్ గివింగ్ సర్వీసులో అందుబాటులో ఉంటారు. రోజులో 24 గంటలూ సేవలు అందుబాటులో ఉంటాయి.

image


మార్కెట్ పొటెన్షిల్ 

ఒక్క భారతదేశంలోనే హెల్త్ కేర్ రంగంలో 160 బిలియన్ల మార్కెట్ ఉంది. 2020 నాటికి ఇది దాదాపు 280 బిలియన్లకు చేరుతుందని అంచనా. ఏడాదికి 17శాతం పెరుగుదలతో ఆన్ లైన్, ఆఫ్ లైన్ హెల్త్ కేర్ రంగం దూసుకుపోతోంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ సేవలను కలుపుతూ కాల్ హెల్త్ ఈ మార్కెట్ లోకి ప్రవేశించింది.

ఇప్పటి వరకూ కాల్ హెల్త్ లో 5వేల మంది రిజిస్ట్రర్ యూజర్లున్నారు. వీరితో పాటు చాలా క్లినిక్స్, మెడికల్ ల్యాబ్స్, ఫార్మా కంపెనీలు, ఇన్సూరెన్స్ లాంటి సంస్థలతో టై అప్స్ పెట్టుకున్నారు. అవి రోజురోజుకీ విస్తరిస్తున్నాయి. ప్రస్తుతానికి హైదరాబాద్ కేంద్రంగా సేవలు అందిస్తున్నారు. సాధారణ ఆసుపత్రులతో సమానంగా లేదా వారికంటే తక్కువ ధరలకే మెడకల్ టెస్టులను చేస్తున్నారు. డయాగ్నోస్టిక్ సర్వీసులను మార్కెట్ కంటే 15శాతం తక్కువ ధరకే అందిస్తున్నారు. మెడిసిన్ బల్క్ తీసుకుని విక్రయిస్తారు కనక సాధరణంగా మెడికల్ షాప్ వాళ్లిచ్చే ధర కంటే 20శాతం తక్కువకే ఇస్తున్నారు. మెరుగైన సేవలను అత్యంత తక్కువ ధరకు ఇవ్వడం తమ వల్లనే సాధ్యమని హరి చెప్పుకొచ్చారు.

పోటీదారులు, భవిష్యత్ ప్రణాళికలు

ప్రాక్టో , ఈకిన్ కేర్ లాంటి హెల్త్ కేర్ స్టార్టప్ లు ఈ రంగంలో ఉన్నాయి. అయితే ప్రాక్టో ఒక్క డాక్టర్ అపాయింట్ మెంట్ కు మాత్రమే పరిమితం అయింది. ఈకిన్ కేర్ లాంటికి కొన్ని సేవలు మాత్రమే చేస్తున్నాయి. కానీ కాల్ హెల్త్ అపరిమితమైనది. ఎమర్జెన్సీ సర్వీసు వచ్చినప్పుడు మాత్రం 108కు సమాచారం అందిస్తారు. ఈ రకంగా చూస్తే ప్రస్తుతానికి దేశంలో తాము మాత్రమే అన్నింటా ముందున్నామని హరి అంటున్నారు.

image


వైద్యసేవలు అవసరం అయిన వారికి కాల్ హెల్త్ అనేది ఓ సామాజిక అవసరంగా మార్చడానికి తాము పనిచేస్తున్నామని హరి అన్నారు. అన్ని మెట్రో నగరాలకు ఈ ఏడాది చివరి కల్లా విస్తరిస్తామని తెలిపారు. వచ్చే 36 నెలల్లో దేశంలో ఉన్న 60 పట్టణాల్లో సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి నిధులను సమీకరించుకున్నారు. వచ్చే 6-9 నెలల్లో మరోసారి ఈ రకంగానే నిధులను సమకూర్చుకుంటామని హరి అన్నారు.

వచ్చే ఐదేళ్లలో హెల్త్ కేర్ రంగంలోనే కాదు దేశంలోనే అనూహ్యంగా మార్పులు రానున్నాయి. దానికి కాల్ హెల్త్ నాంది పలకనుంది. ఆరోగ్య భారతంలో కాల్ హెల్త్ కి కొన్ని పేజీలు ఉండాలనేదే తమ ప్రయత్నమని చెప్పి హరి ముగించారు.