ఒకేసారి 10 స్టార్టప్స్ కంపెనీలకు ఫండింగ్ అందించిన స్పార్క్10

0


యూరోపియన్ స్టార్టప్ యాక్సిలరేటర్ స్పార్క్10 హైదరాబాద్ పై తనకున్న ప్రత్యేక ప్రేమని మసారి చూపించుకుంది. గతేడాది యాక్సిలరేట్ ప్రొగ్రాంని ప్రకటించి శుభవార్తను మోసుకొచ్చిన ఈ సంస్థ- ఇప్పుడు 10 స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో భాగ్యనగరంలోని స్టార్టప్ ఇకో సిస్టమ్ కి మంచి బూస్టింగ్ ఇచ్చినట్లైంది. తలదన్నే ఐడియాలు, దానికి మించిన టెక్ సపోర్ట్ తో పాటు సకల సౌకర్యాలున్న మన హైదరాబాద్ స్టార్టప్ లకు ఫండింగ్ అనేది ఓ పెద్ద సవాలు అనిపించేది. ఈ సమస్యను అధిగమించడానికి స్పార్క్ 10 లాంటి సంస్థలు గతేడాది నుంచే క్యూ కట్టాయి. అందిరికంటే ముందుగా ఇదే సంస్థ పది స్టార్టప్ లకు ఫండింగ్ చేయడం విశేషం.

500 అప్లికేషన్లు

స్పార్క్10 యాక్సిలరేట్ ప్రొగ్రాం ప్రకటించిన రోజు నుంచి మంచి స్టార్టప్ ను ఎంచుకోవడం ఓ పెద్ద సవాలుగా నిలిచిందని ఆ సంస్థ ఫౌండర్ అతల్ మాలవ్యా అన్నారు. యాక్సిలరేట్ చేస్తే దానంతట అదే మార్కెట్ క్రియేట్ అవుతుందని నమ్మానని అతల్ తెలిపారు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ పెట్టుబడులు పెడితేనే లాభం ఉంటుందని కూడా తనకు చాలామంది చెప్పారని, కానీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడున్న పరిస్థితులే కారణమని అన్నారాయన. ఇప్పటికే బెంగళూరు, ముంబైలో స్టార్టప్ ఇకో సిస్టమ్ తో పాటు ఫండింగ్ సర్క్యులేట్ అయిందని, భవిష్యత్ అంతా హైదరాబాద్ లోనే ఉందన్న సంగతి తాము గుర్తించామని అన్నారాయన. అప్లికేషన్లు ఆహ్వానిస్తే 500 లకు పైగా వచ్చాయని, వాటిల్లో 50 స్టార్టప్ లను ఫిల్టర్ చేశామని, వాటి నుంచి ఓ పదివరకు యాక్సిలరేట్ ప్రొగ్రామ్ కి ఎంపిక చేశామని తెలిపారు.

10 లక్షల ప్రైజ్ మనీ

ఈ కార్యక్రమంలో సెలెక్ట్ అయిన స్టార్టప్ లకు 10లక్షల ప్రైజ్ మనీతో పాటు యాక్సిలరేట్ చేస్తామని స్పార్క్ 10 ప్రకటించింది. దీంతో పాటు వారిని మానటరింగ్ చేస్తుంది. మొబైల్ యాప్ డిజైన్ చేయడం లాంటి అదనపు సర్వీసులు అందిస్తారు.

“2 నెలల్లో స్పార్టప్ లను ఫిల్టర్ చేయడం గొప్ప విషయం,” జయేష్ రంజన్

ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ఐటి సెక్రటరీ జయేష్ రంజన్ స్పార్క్ 10 పనితీరుని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్ ఈకో సిస్టమ్ కు సాయం అందిస్తుందని. స్థానిక సంస్థల్లో స్పార్క్ 10 పెట్టుబడులు పెట్టడం శుభ సూచకమని అన్నారాయన. టీ హబ్ లాంటి ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న ఇంక్యుబేషన్ సెంటర్ ఉన్న హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి మరింత మంది ఇన్వెస్టర్లు రావాలని పిలుపునిచ్చారు.

ఐడియాని స్టార్టప్ గా మార్చిన హైదరాబాదీలు

స్పార్క్10 యాక్సిలరేట్ ప్రొగ్రాంకి సెలెక్ట్ అయిన స్టార్టప్ లన్నీ సరికొత్త ఐడియాని స్టార్టప్ గా మార్చినవే. అన్ని రంగాలకు చెందిన 10 స్టార్టప్ లు ఎంపిక కావడం విశేషం.

“ఐడియాలని స్టార్టప్ లుగా మార్చండి. తర్వాత ఫండింగ్ కోసం ప్రయత్నించండి,” సుబ్బరాజు

స్పార్క్10 కో ఫౌండర్ అయిన సుబ్బరాజు స్టార్టప్ ఐడియాలతో ఇక్కడకు వచ్చిన వారికి సలహా ఇచ్చారు. స్టార్టప్ ప్రారంభించి ట్రాక్షన్ చూపిస్తే ఫండింగ్ పెద్ద సమస్య కాదని అన్నారాయన. సెల్ఫ్ సస్టేయినబుల్ మోడల్ లోకి ప్రవేశించిన స్టార్టప్ లనే తాము సెలక్ట్ చేశామని చెప్పుకొచ్చారు.

“స్టార్టప్ ల సక్సెస్ అనేది ఎవరూ చెప్ప లేరు” పాల్ స్మిత్

స్టార్టప్ సక్సెస్ ఫెయిల్యూర్ లను ఎవరూ అంచనా వేయలేరని, ఎఫర్ట్ వదిలేకూడదని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన పాల్ అభిప్రాయపడ్డారు. స్టార్టప్ కమ్యూనిటీకి సలహాలు, సూచనలు చెప్పారాయన.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories