చిక్కిపోయిన పర్సు..! బరువెక్కిన ఈ-వాలెట్..!!

దూసుకుపోతున్న ఆన్ లైన్ లావాదేవీలు

చిక్కిపోయిన పర్సు..! బరువెక్కిన ఈ-వాలెట్..!!

Thursday November 24, 2016,

2 min Read

క్రమంగా ఏటీఎం ముందు క్యూ లైన్ తగ్గిపోయింది. బ్యాక్ పాకెట్లో పర్సు తడిమిచూసుకునే అవసరం రావడం లేదు. ఎలక్ట్రానిక్ పేమెంట్లు పెరిగిపోయాయి. భవిష్యత్ క్యాష్ లెస్ ఎకానమీ కళ్లముందు కనిపిస్తోంది. డిజిటల్ వాలెట్ బ్యాలెన్స్ లిమిట్ కూడా 20వేలకు పెరిగిపోయింది. వ్యాపారులు కూడా 50వేల వరకు ఈ వ్యాలెట్ ద్వారా బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈ పరిమితి 10వేల వరకే ఉండేది. ఆర్బీఐ నుంచి ప్రత్యేక గైడ్ లైన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ పరిమితి పెరిగిపోయింది. డిసెంబర్ 30 వరకు ఇదే సీన్ ఉంటుంది.

ఈ-వాలెట్లకు పండగే పండగ

పీపీఐ, సెమీ క్లోజ్డ్ వాలెట్ కంపెనీలు కళకళలాడుతున్నాయి. పాత పెద్ద నోట్ల రద్దుతో వీటి గ్రోథ్ రాకెట్ స్పీడుతో దూసుకుపోతోంది. మొన్ననే పేటీఎం 120 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయని అధికారికంగా వెల్లడించింది. 5 మిలియన్ల మంది కొత్తగా యాడ్ అయ్యారని ఆ సంస్థ తెలిపింది. ఈ పదిరోజుల్లో మొత్తం 45 మిలియన్ల మంది పేటీఎం ద్వారా చెల్లింపులు కొనుగోళ్లు జరిపారు. ఈ దెబ్బతో ఆ సంస్థ తన పరిధిని బీభత్సంగా విస్తరించింది. లక్షా యాభై వేల మంది మర్చెంట్స్ తో నెట్ వర్క్ పెంచుకుంది. దేశవ్యాప్తంగా 10లక్షల మంది వ్యాపారులతో పేటీఎం ఆఫ్ లైన్ లావాదేవీలు జరుపుతోంది.

image


మొబిక్విక్ అనే మరో మొబైల్ వాలెట్ కంపెనీ కూడా పేటీఎం రేంజిలో రెచ్చిపోతోంది. యాప్స్ డౌన్ లోడ్ 40 శాతం పెరిగింది. లక్షమంది వ్యాపారులు, 35 మిలియన్ల కస్టమర్లతో మొబిక్విక్ దూసుకుపోతోంది. 2017 కల్లా ఆ సంస్థ గ్రాస్ మెర్చండైస్ వాల్యూ 10 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.

ఫ్రీచార్జ్ పేమెంట్ గేట్ కూడా ఫుల్ చార్జింగ్ లో ఉంది. రిటైల్ మర్చెంట్ సైన్ అప్స్ ఊపందుకున్నాయి. కొత్త యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. అసంఘటిత వ్యాపారులకు ఇదొక బంగారంలాంటి అవకాశం. నగదుకు తిరుగులేని ప్రత్యామ్నాయం దొరకడంతో వాళ్లు కూడా డిజిటల్ పేమెంట్ హాబిట్ ని ప్రమోట్ చేస్తున్నారు.

ఇప్పుడంటే లిక్విడ్ క్యాష్ కొరత ఉంది.. మరి సీన్ మారాక కూడా వీటి దూకుడు కొనసాగుతుందా? దీనికి సమాధానం అవునే వస్తోంది. కస్టమర్లు ఇప్పుడిప్పుడే ఆన్‌లైన్‌ లావాదేవీల వైపు మొగ్గు చూపుతున్నారు. మున్ముందు అన్ని వ్యాపార సంస్థలు క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లకు మారే అవకాశం ఉంది. కొత్తగా మరికొన్ని సంస్థలు కూడా మొబైల్‌ వ్యాలెట్‌ రంగంలోకి అడుగు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇదే జరిగితే డిజిటల్‌ భారత్‌ కల సాకారమయ్యేందుకు ఎన్నో రోజులు పట్టకపోవచ్చు.