ఇతను అరటి నార నుంచి జీన్స్ తయారు చేశాడు..!! 

0

జీన్స్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది డెనిమ్. అందులో స్కినీ, స్లిమ్, రెగ్యులర్, లూజ్ అంటూ డిఫరెంట్ టైప్స్ చూజ్ చేసుకుంటాం. ఇంకా ట్రెండీగా కావాలంటే టోర్న్ అనీ, ఫేడెడ్ అనీ, షేడెడ్ అనీ రకరకాలు ఉండనే ఉన్నాయి. అయితే అవేవీ కాకుండా, అరటినారతో చేసిన జీన్స్ గురించి మీరెప్పుడైనా విన్నారా? అరటి నారతో జీన్సేంటని నోరెళ్లబెట్టకండి.

చెన్నయ్ సబర్బన్ ఏరియా అనకపుతూర్- వీవర్స్ విలేజ్ గా ప్రసిద్ధిగాంచింది. తెలంగాణలో సిరిసిల్లలాగా. అక్కడే గత కొన్నేళ్లుగా విభిన్న రకాల చేనేత వస్త్రాలు నేసి శేఖర్ పాపులర్ అయ్యాడు. అతని అపూర్వ సృష్టే ఈ అరటినార జీన్స్. నాచురల్ కలర్స్ డై తో తయారు చేసిన ఈ జీన్స్ కి బటన్లు కూడా సహజసిద్ధంగానే అమర్చాడు. కొబ్బరి టెంకతో గుండీలు కుట్టాడు. రెగ్యులర్ డెనిమ్ జీన్స్ కంటే నీటిని అధికంగా పీల్చుకునే ఈ జీన్స్.. వేసవిలో చాలా సౌకర్యంగా ఉంటుంది. సింథటిక్ మెటీరియల్ కి ఇదొక తిరుగులేని ఆల్టర్నేట్.

అరటినార జీన్స్ గురించి తెలుసుకుని అండమాన్ నికోబార్ దీవుల నుంచి ప్రత్యేక బృందం శేఖర్ దగ్గరికి వచ్చి ఆరాతీసింది. ఎలా తయారు చేయాలో తమ దగ్గర కళాకారులకు నేర్పించమని ఆ టీం కోరింది. అన్నట్టు ఇతను తయారు చేసిన అరటి నార జీన్స్ ఖరీదు ఎంతో చెప్పనేలేదు కదూ.. జస్ట్ రూ. 5వేల మాత్రమే.

శేఖర్ గతంలో అరటి చీరనూ నేశాడు. వెదురు నార నుంచి కూడా శారీ తయారు చేశాడు. ఇప్పుడు అరటినార జీన్స్, స్కర్ట్ నేసి, వార్తల్లో వ్యక్తయ్యాడు. 

Related Stories

Stories by team ys telugu