పల్లె ఆవిష్కరణలకు అందలం.. NIRDPR ఆధ్వర్యంలో రేపట్నుంచి రెండ్రోజుల మెగా ఈవెంట్  

0

గ్రామీణ ఆవిష్కరణలకు సరైన వేదిక కల్పించాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చింది రూరల్ ఇన్నోవేషన్ స్టార్టప్ కాంక్లేవ్ 2017. రూరల్ ఆంట్రప్రెన్యూర్లను వెన్నుతట్టి ప్రోత్సహించడం, వారికి మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపరడచం, అసరమైతే మెంటారింగ్, ఫండింగ్ ఏర్పాటు చేయడం, అవార్డులతో ప్రోత్సహించడం.. రూరల్ ఇన్నోవేషన్ స్టార్టప్ కాంక్లేవ్ (RISC) మెయిన్ కాన్సెప్ట్. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు, గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ ఐడియాలు, వాటర్-హెల్త్, వేస్ట్ మేనేజ్మెంట్, సస్టెయినబుల్ హౌజింగ్, ఇతర జీవనోపాధి అంశాలు.. ఇలా ఆరు సరికొత్త ఇన్నోవేషన్స్ కు అన్నిరకాలుగా చేదోడువాదోడుగా ఉండాలన్నదే RISC ప్రధాన ఎజెండా.

నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ మరియు పంచాయతీరాజ్(NIRDPR) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మెగా ఈవెంట్ మార్చి 23, 24 తేదీల్లో జరగబోతోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఇండస్ట్రియలిస్టులు, అకాడమిక్స్, ఆంట్రప్రెన్యూర్స్, వెంచర్ కేపిటలిస్టులు, ఏంజిల్ ఇన్వెస్టర్లతో పాటు ఆంట్రప్రెన్యూరియల్ ఈకో సిస్టమ్ నుంచి అనేక మంది వక్తలు, టెక్నాలజిస్టులు, కార్పొరేటస్ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. వికాస్ ఆడిటోరియంలో జరిగే రెండు రోజుల ప్రోగ్రాం షెడ్యూల్ ఇలా వుంది.

ప్రోగ్రామ్ షెడ్యూల్

ఉదయం 8.30 నుంచి 9.30 వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఇనాగరల్ సెషన్. ఉదయం 11 వరకు కొనసాగుతుంది. 9.30కి స్వాగత వచనాలు. జాతీయ గీతాలాపన తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్‌ఐఆర్‌ డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డా. డబ్ల్యూరెడ్డి మాట్లాడతారు. నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన ఉంటుంది. అనంతరం తాగునీరు, పారిశుధ్య శాఖ సెక్రటరీ, రిన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ సెక్రటరీ, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ అమర్ జీత్ సింగ్ ప్రసంగిస్తారు. తర్వాత కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మాట్లాడతారు. అనంతరం డా. వై గంగిరెడ్డి వోట్ ఆఫ్ థాంక్స్ చెప్తారు. ఉదయం 11 గంటలకు ట్రీ బ్రేక్.

టీ బ్రేక్ తర్వాత బిజినెస్ సెషన్, పానెల్ డిస్కషన్ ఉంటాయి. దేశంలోని గ్రామీణ ఆవిష్కరణలపై చర్చ నడుస్తుంది. తర్వాత ప్రశ్నోత్తరాల కార్యక్రమం. రూరల్ ఇన్నోవేషన్స్ లో హార్డ్ వేర్ లోపంపై డిస్కషన్ ఉంటుంది. దానిపైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటలకు స్టార్టప్ పెవిలియన్ సందర్శన ఉంటుంది. ఒంటిగంటన్నరకు లంచ్ బ్రేక్. భోజన విరామం తర్వాత ఈకో సిస్టమ్ బలోపేతంపై ఇన్వెస్టర్ల కోణంలో చర్చ జరుగుతుంది. దానిపైనా ప్రశ్నోత్తరాలు ఉంటాయి. మార్కెట్ ఛానల్స్ బలోపేతం చేసే అంశంపై డిస్కషన్, క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. సాయంత్రం 4 గంటలకు టీ బ్రేక్. తర్వాత రూరల్ ఇన్నోవేషన్ లో డిజిటల్ టెక్నాలజీ పాత్ర, దానిపై ప్రశ్నోత్తరాలు ఉంటాయి. రాత్రి 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి 8.30కి డిన్నర్.

ఇక రెండో రోజు(మార్చి 24) ఉదయం 9 గంటలకు రూరల్ టెక్నాలజీ పార్క్ సందర్శన ఉంటుంది. పది గంటలకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై వక్తలు ప్రసంగిస్తారు. పదిన్నరకు రెన్యూవబుల్ ఎనర్జీపై ప్రజెంటేషన్ ఉంటుంది. అనంతరం తాగునీరు, ఆరోగ్యం, పారిశుధ్యం అనే అంశంపై వక్తలు ప్రసంగిస్తారు. దాని తర్వాత సస్టెయినబుల్ హౌజింగ్ టెక్నాలజీ, వేస్ట్ టు వెల్త్, లైవ్‌లీహుడ్స్ టెక్నాలజీస్ తదితర అంశాలపై పై స్పీకర్స్ మాట్లాడతారు. లంచ్ బ్రేక్ తర్వాత బిజినెస్ సెషన్ లో పిచింగ్ ఉంటుంది. సాయంత్రం నాలుగున్నరకు బెస్ట్ స్టార్టప్ లకు అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. సాయంత్రం ఐదింటికి వోట్ ఆఫ్ థాంక్స్ తో రెండ్రోజుల కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. 

Related Stories