ప్లంబర్, కార్పెంటర్, డ్రైవర్, దోభీ.. ఎవరు కావాలన్నా.... ‘ఎస్ బ్రిక్స్’లో సిద్ధం

ప్లంబర్, కార్పెంటర్, డ్రైవర్, దోభీ.. ఎవరు కావాలన్నా.... ‘ఎస్ బ్రిక్స్’లో సిద్ధం

Tuesday August 25, 2015,

3 min Read

హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ‘ఎస్ బ్రిక్స్’(sbricks.com) యుటిలిటీ , సర్వీస్ స్టార్టప్ ఫీల్డ్‌లో మెరుగైన ఆదరణే పొందుతోంది. ప్రారంభమైన కొద్దికాలంలోనే వేలల్లో యాప్ డౌన్‌లోడ్స్ కాగా, వెబ్ సైట్‌కు సైతం రోజూ కనీసం 5వేల మంది యాక్టివ్ యూజర్లలో దూసుకుపోతోంది. హౌస్ క్లీనింగ్ , వాషింగ్‌తోపాటు వివిధ సేవలు కావాలనుకున్న వారు యాప్‌లో వివరాలు అందిస్తే చాలంటున్నారు సిఈఓ నితిన్ రెడ్డి.

image


“ఎస్ బ్రిక్స్‌లో ఇప్పటి వరకూ ఉన్న ప్రధాన కస్టమర్లు వాషింగ్ కోసం రిక్వెస్ట్ చేసేవారే. ఇక్కడ దోభీ సేవలకు ఇంత డిమాండ్ ఉందని నాకిప్పుడే తెలిసింది. ఇలాంటి మరికొన్ని సేవలు అందుబాటులోకి తీసుకు వస్తున్నాం” సిఈఓ నితిన్ రెడ్డి

ఎస్ బ్రిక్స్ టీం

ఎస్ బ్రిక్స్ టీం అనే కంటే దీని వెనక ఎవరున్నారని చెప్పడం అతికినట్లు సరిపోతుంది. నితిన్ రెడ్డి కోఫౌండర్, సిఈఓగా వ్యవహరిస్తున్నారు. వ్యాపార రంగంలో ఒకటిన్నర దశాబ్దాల అనుభవం ఉన్న నితిన్ రెండు మూడు స్టార్టప్స్‌లో పనిచేశారు. ఈయనతో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్ కలిసి దీన్ని ప్రారంభించారు. వీళ్లంతా ఇంజనీరింగ్‌లో క్లాస్‌మేట్స్ కావడం విశేషం. ప్రతీ సేవనీ ఇన్ హౌస్ నుంచే ఆపరేట్ చేస్తోన్న ఎస్ బ్రిక్స్‌లో 40మంది ఉద్యోగులున్నారు. ఇంజనీరింగ్‌తో పాటు ఇతర బ్యాక్ గ్రౌండ్స్ కలిగిన ఉద్యోగుల ఇక్కడ పనిచేస్తున్నారు. ప్రస్తుతం సొంత నిధులతో ఈ సంస్థ తన కార్యకలాపాలను సాగిస్తోంది.

image


ఎస్ బ్రిక్స్ స్టాఫ్ అండ్ సెక్యూరిటీ

నిత్యం అవసరమయ్యే సాధారణ ఇంటి పనులు చేసేవాళ్లు.. అంత పెద్దగా విద్యావంతులై ఉండరు. ఐటిఐ తత్సమాన క్వాలిఫికేషన్‌తో వచ్చే ఎలక్ట్రీషియన్, ప్లంబర్ , మెకానిక్ లాంటి వారిని హ్యాండిల్ చేయడం అంత సులువైన విషయం కూడా కాదు. వ్యవహారం కొద్దిగా అన్‌ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. అలాంటప్పుడు నేరుగా కస్టమర్ల దగ్గరకి ఎంప్లాయిస్‌ని పంపించడం కొద్దిగా ఇబ్బందే. టైం విషయంలో ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకే.. ఇక్కడ అంతా జీపిఎస్‌తో జరిగిపోతుంది. క్లెయింట్ దగ్గరికి ఎప్పుడు చేరుకున్నాడు. పని ఎప్పుడు పూర్తయింది లాంటి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్ డేట్ అవుతాయి. కస్టమర్ ఫీడ్ బ్యాక్ కూడా అప్పుడే తీసుకుంటారు. దీంతో సెక్యూరిటీ పరంగా తాము వంద శాతం గ్యారంటీ ఇస్తున్నారు నితిన్. కస్టమర్లకు అందించే సేవలపై ఉద్యోగులకు ప్రత్యేక ట్రెయినింగ్ కూడా ఇస్తున్నట్టు నితన్ చెబ్తున్నారు. కస్టమర్లతో మాట్లాడే పద్దతితో పాటు వారు కోరితో ఎన్నిసార్లైనా సర్వీసు అందించడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారాయన.

image


ఎస్ బ్రిక్స్ అందించే సేవలు

1. కార్పెంటర్ దగ్గర నుంచి కార్ డ్రైవర్ దాకా, ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి ప్లంబర్ వరకూ, హౌస్ మేడ్ దగ్గరి నుంచి నర్స్ దాకా... ఎలాంటి అవసరానికైనా ఎస్ బ్రిక్స్ పరిష్కారం చూపిస్తోంది.

2. బట్టలు ఉతికే దోబీ సర్వీసు. హోటళ్లకు మాత్రమే పరిమితం అయిన దోబీ సర్వీసును ఇప్పుడు మరింత వ్యవస్థీకరించి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

3. ఇంటి దగ్గరే ఉండి ఎలాంటి సర్వీసు కావాలన్నా.. తాము సిద్ధమంటోంది ఎస్ బ్రిక్స్. ఉదాహరణకి సూపర్ మార్కెట్లో ఉండే వస్తువులను ఇంటి దగ్గరకు తెచ్చే డోల్ డెలివరీ దగ్గర నుంచి , ఫుడ్ డెలివరీ ఇతర ఏ సేవలకైనా ఎస్ బ్రిక్స్ టీం రెడీ .

4. బిల్ పేమెంట్స్‌కు సాయం కావాలంటే కూడా చేయడానికి వీళ్ల టీం రెడీ. ఇంటి దగ్గరకు ఎస్ బ్రిక్స్ టీం వచ్చి కట్టాల్సిన యుటిలిటీ బిల్స్‌ను పే చేయడంలో సాయం చేస్తుంది. ఇందుకు సర్వీసు చార్జీలు తీసుకుంటారు.

5. మొబైల్ ఆధారిత సేవలకు, లేదా ఎలాంటి సర్వీసుకైనా మొబైల్ యాప్‌లో అప్ డేట్ చేస్తే ఎస్ బ్రిక్స్ కాల్ సెంటర్ నుంచి మీ సేవల వివరాలు తెలుసుకొని దాన్ని ప్రొవైడ్ చేస్తారు.

6. క్యాష్ ఆన్ డెలివరీ సర్వీసు ఉండటంతో ఎలాంటి తలనొప్పులు లేకుండా పేమెంట్స్ చేసుకోవచ్చు.

అవసరాన్ని బట్టి ఒక్కో సేవకు కనీసం రూ.250 వసూలు చేస్తున్నారు.

ఎస్ బ్రిక్స్ లోగో

ఎస్ బ్రిక్స్ లోగో


భవిష్యత్ ప్రణాళికలు

అందుబాటులో ఉన్న వివిధ రకాల సేవలను ఎస్ బ్రిక్ కస్టమర్ల వద్దకు తీసుకొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రియల్ ఎస్టేట్ టులెట్ సర్వీస్ కంపెనీలతో టై అప్ అయ్యారు. టులెట్ సేవలను తొందరలోనే అందుబాటులోకి తీసుకువచ్చారు . భవిష్యత్తులో హౌసింగ్ డాట్ కామ్ లాంటి సేవలు తమ సంస్థ అందిస్తుందని నితిన్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. హైదరాబాద్, పూణె, వైజాగ్ కేంద్రంగా సేవలు అందిస్తున్న ఈ సంస్థ త్వరలో బెంగళూరు వంటి మెట్రోలకూ విస్తరించడానికి సిద్ధమవుతోంది.