క్యాష్ మేనేజ్ మెంట్ కోసం ముచ్చటగా 3 సూత్రాలు !!

క్యాష్ మేనేజ్ మెంట్ కు ప్రిఫరెన్స్ ఇస్తేనే స్టార్టప్ లకు భవిష్యత్తు- పొదుపు పాటిస్తేనే కంపెనీల మనుగడ సాధ్యం -

క్యాష్ మేనేజ్ మెంట్ కోసం ముచ్చటగా 3 సూత్రాలు !!

Tuesday February 09, 2016,

3 min Read

కొత్త వ్యాపార ఆలోచనల్ని ఆచరణలో పెట్టడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ప్రస్తుతం యూత్ అంతా కాలేజీ క్యాంపస్ లు దాటకుండానే ఆంట్రప్రెన్యూర్ అవతారం ఎత్తుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహంతో గతేడాదిలో అనేక కొత్త స్టార్టప్ లకు మనదేశం అడ్డాగా మారింది . ఈ ఏడాది చివరినాటికి భారత్ లో స్టార్టప్ ల సంఖ్య 40శాతం వరకు పెరుగుతుందని అంచనా. 4,200లకు పైగా స్టార్టప్ లు కొత్తగా పుట్టుకొస్తాయన్నది నాస్ కాం అంచనా. అయితే ఇక్కడే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. స్టార్టప్ ల ఏర్పాటుకు ప్రోత్సాహకరమైన పరిస్థితులున్నా చిన్న వ్యాపారులు ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. వ్యవస్థలోని అంతర్గత లోపాలు అసలు కారణమని తెలుస్తుంది.

కొత్తగా బిజినెస్ లోకి అడుగుపెట్టినవారు రోజువారీ క్యార్యకలాపాలు సజావుగా సాగితే చాలనుకుంటారే తప్ప- ఇతర అంశాలపై అంతగా దృష్టి పెట్టరు. ముఖ్యంగా క్యాష్ మేనేజ్ మెంట్ గురించి అంతగా పట్టించుకోరు. కానీ ఈ పొరపాటే భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి చేతిలో చిల్లిగవ్వ ఉండని పరిస్థితి ఎదురవుతుంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, రుణదాతలకు డబ్బు చెల్లించడం మాట అటుంచితే.. కొన్నిసార్లు వ్యక్తిగత ఖర్చులకు కూడా డబ్బు అందుబాటులో ఉండని ఏర్పడుతుంది.

image


వాస్తవానికి కరెంట్ అసెట్స్ లో పెటీ క్యాష్ కేవలం 1 నుంచి 3 శాతం వరకు మాత్రమే పెట్టుకోవడం ఉత్తమం. మనిషి శరీరంలో రక్తంలాగే బిజినెస్ లో డబ్బు ప్రవాహం కూడా నిరంతరంగా కొనసాగాలి. అలా జరగనిపక్షంలో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడం కష్టంగా మారుతుంది. ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొనేందుకు స్టార్టప్ లు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇన్వాయిసింగ్ లో ఆలస్యం, పంపిణీ లోపాలు, మార్కెట్ ఒడుదొడుకులను సమర్థంగా ఎదుర్కొన్నప్పుడు వ్యాపారాభివృద్ధి సాధ్యమవుతుంది. ముఖ్యంగా క్యాష్ ఆన్ డెలివరీ పద్దతిని అనుసరించే వ్యాపారులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కానీ చాలా వరకు స్టార్టప్స్ ఈ విషయాలను పట్టించుకోవడమే లేదు.

క్యాష్ మేనేజ్ మెంట్

క్యాష్ మేనేజ్ మెంట్ క్లిష్టమైనదే అయినా బ్రహ్మపదార్థమేం కాదు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదురయ్యే ఒడిదొడుకులను ఎదుర్కొనేందుకు ఎంట్రప్రెన్యూర్స్ దీని గురించి తెలుసుకుని ఆచరించాల్సిన అవసరం ఉంది.

పొదుపు

బిజినెస్ ప్రారంభించిన మొదటి రోజు నుంచే పొదుపు పాటించడం అలవాటు చేసుకోవాలి. స్టార్టప్ ప్రారంభంలో వచ్చే ఆదాయం కన్నా ఖర్చే ఎక్కువగా ఉంటుంది. అందుకే పెట్టుబడి విషయంలో కంపెనీలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ధరల్లో వచ్చే మార్పులు, మొండి బాకీలు, అమ్మకాలు తగ్గడం తదితర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన క్యాష్ రిజర్వ్ ఉంచుకోవాలి. ప్రొడక్ట్ కంపెనీలైతే ఇన్వెంటరీల విషయంలో తెలివిగా వ్యవహరించాలి. వివిధ రకాల వస్తువుల్ని స్టాక్ లో పెట్టుకుంటే అవి అమ్ముడుపోకపోతే నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మార్కెట్ అవకాశాలను అనుసరించి ఉత్పత్తులను అందుబాటులోకి తేవాలి.

ఈ స్టోరీ కూడా చదవండి

తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందుతున్న యూఏఈకి చెందిన Decluttr Me ను స్టార్టప్స్ ఆదర్శంగా తీసుకోవాలి. ఆర్ట్ వర్క్ ప్రొడక్ట్స్ ను అందించే ఈ స్టార్టప్ ఖరీదైన డిజైనర్లపై ఆధారపడకుండా సంప్రదాయ విధానానికి భిన్నంగా FIVERR, CANVAలతో కలిసి డూ ఇట్ యువర్ సెల్ఫ్ DIY పద్దతిని ఎంచుకుంది. అవసరానికి మించి ఉద్యోగుల్ని నియమించుకోకుండా ఆర్డర్లకు అనుగుణంగా డ్యూటీ టైంతో నిమిత్తంలేకుండా కష్టపడి పనిచేసే టీంను ఎంచుకుంది. ఆఫీసులో ఖరీదైన ఫర్నీచర్, డెకరేషన్ లాంటి ఆర్భాటాలకు పోకుండా సాదాసీదాగా నడుపుతోంది.

చెల్లింపుల్లో వేగం

కస్టమర్లు డబ్బు చెల్లించే విషయంలో ఆలస్యం చేయడం వల్లే స్టార్టప్ లు నిధుల కొరత ఎదుర్కొంటున్నాయన్నది ఓ అధ్యయన ఫలితం. ఈ సవాల్ ను అధిగమించేందుకు స్టార్టప్ లు షార్ట్ బిల్లింగ్ సైకిల్స్ కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా చేసినప్పుడే పెట్టిన పెట్టుబడికి ఫలితం దక్కుతుంది.

కొన్నిసార్లు ప్రాజెక్టు ప్రారంభానికి ముందే డౌన్ పేమెంట్ అడగటం ఎంట్రప్రెన్యూర్స్ ను ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇక కస్టమర్లతో నిజాయితీతో వ్యవహరించినప్పుడే వారికి నమ్మకం పెరుగుతుంది. కస్టమర్లు కంపెనీ పాలసీలను కచ్చితంగా పాటించి, సహకరించినప్పుడు డిస్కౌంట్లు, ఇన్సెంటివ్స్ ఇవ్వడంలో తప్పులేదు.

సమయానుకూల నిర్ణయాలు - టెక్నాలజీ వినియోగం

స్టార్టప్ లకు అప్పుడప్పుడు అనుకోని ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. చాలా మంది ఆంట్రప్రెన్యూర్స్ తమ ప్రొడక్ట్స్, సర్వీసులు మార్కెట్ పోటీని తట్టుకుని సక్సెస్ అవుతాయని భావిస్తారు. అయితే వారి ఐడియాల్లో కొన్ని హిట్ అయితే మరికొన్ని మాత్రం ఫట్ అవుతాయి.. కొన్ని సందర్భాల్లో అసలు తప్పు ఎక్కడ చేశామన్న విషయం కూడా గుర్తించలేం. ఐడియాకు కార్యరూపం ఇచ్చేందుకు మీరు ఎంత కష్టపడ్డా అది కచ్చితంగా సక్సెస్ అవుతుందని మాత్రం చెప్పలేం. అందుకే భవిష్యత్తులో ఎదురయ్యే ఒడిదొడుకులను అంచనా వేసి అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవడం, సందర్భానుసారంగా వ్యాపార వ్యూహాలను మార్చుకోవడం చేస్తుండాలి. ఇది ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతుంది.

ప్రస్తుతం బిజినెస్ కార్యకలాపాల్లో స్మార్ట్ ఫోన్లు వాడకం ఒక భాగమైపోయాయి. స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి ఒక్క బటన్ క్లిక్ తో క్యాష్ ఫ్లో అంచనాలు, పర్యవేక్షణతో పాటు రిపోర్టులను చూసుకునే వెసలుబాటు కలుగుతోంది. వ్యాపారులు తొలుత నగదు రూపంలో లావాదేవీలు జరపే విధానాన్ని విడిచిపెట్టాలి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ఉపయోగించి క్యాష్ మేనేజ్ మెంట్ చేయాలి.

ముగింపు

ఆంట్రప్రెన్యూర్ బిజినెస్ ను ఎంత బాగా నడుపుతున్నారన్న విషయం వారి క్యాష్ మేనేజ్ మెంట్ ను చూసి చెప్పొచ్చు. కొత్త టెక్నాలజీను అందిపుచ్చుకున్నప్పుడే స్టార్టప్ లు సమర్థంగా పనిచేయగలుగుతాయి. ఎంట్రప్రెన్యూర్లు నిధులను సద్వినియోగం చేయడంతో పాటు లౌక్యంగా వ్యవహరించినప్పుడే కంపెనీలు వేగంగా వృద్ధి చెందుతాయి. ఆశించిన రీతిలో లాభాలు ఆర్జిస్తాయి.

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి