సెల్ఫీలు, ఫన్నీ వీడియోలు షేర్ చేసే 'జ్నాపిన్'

సెల్ఫీలు, ఫన్నీ వీడియోలు షేర్ చేసే 'జ్నాపిన్'

Friday January 15, 2016,

4 min Read

మీకు ఫేస్ బుక్ లో, వాట్సప్ లో చిన్నచిన్న ఫన్నీ వీడియోలు షేర్ చేసుకోవడం అలవాటా? అయితే మీలాంటి వాళ్ల కోసమే మొదలైందీ స్టార్టప్. ఎవరో పంపిన వీడియోలు షేర్ చేసుకోవడమేంటీ? మీరే మీ వీడియోలు క్రియేట్ చేసి షేర్ చేసుకోవచ్చు. జ్నాపిన్ తో అది సాధ్యం. డబ్ స్మాష్ ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలుసుగా? ఇది కూడా అలాంటిదే. మీ ఫ్రెండ్స్ సెల్ఫీలు, వారికి సంబంధించిన వీడియోలు షేర్ చేసుకునే ప్లాట్ ఫామ్ ఇది. అంతే కాదు... ఫ్రెండ్స్ మధ్య పోటీలు కూడా పెట్టుకోవచ్చు.

image


'ఇండియాలో ఇంటర్నెట్-2015' సర్వే ప్రకారం... అర్బన్ ఇండియాలో 94 శాతం మంది యూజర్లు మొబైల్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నారు. 64 శాతం మంది ల్యాప్ టాప్ ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నా... వారిలో 90 శాతం మంది మొదటి ప్రాధాన్యం మాత్రం మొబైల్ ఫోనే. గత కొన్నేళ్లుగా స్మార్ట్ ఫోన్స్ చాలా శక్తివంతంగా మారుతున్నాయి. స్మార్ట్ ఫోన్ల రూపురేఖలు కూడా మారిపోతున్నాయి. ఈ రోజుల్లో ఐదారు అంగుళాలున్న ఫోన్ తప్పనిసరైంది. స్మార్ట్ ఫోన్లల్లో వీడియో కంటెంట్ కు ఆదరణ పెరగడానికి ఇది కూడా ఓ కారణమే. ఓసారి ఫేస్ బుక్ లో ప్రమోట్ అవుతున్న వీడియోలను చూస్తే విజువల్ కంటెంట్ కు ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.

జరిగిన కథ

జ్నాపిన్... ముంబైకి చెందిన స్టార్టప్. యష్ కోటక్, న్యా శ్రీలు ప్రారంభించిన స్టార్టప్ ఇది. ఆరు నెలల క్రితం ప్రారంభమైన జ్నాపిన్ కేవలం వీడియో కంటెంట్ తో సోషల్ నెట్ వర్క్ ను నిర్మిస్తోంది. ఇక్కడ యూజర్లు ప్రముఖ సినిమాల డబ్బింగ్ వీడియోలను సొంతగా షూట్ చేసి అప్ లోడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ కి షేర్ చేయొచ్చు. సెల్ఫీలకు పోజులిచ్చి ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. ఇవన్నీ చేయడానికి ఓ అకౌంట్ క్రియేట్ చేస్తే చాలు. యూజర్లు వారి స్నేహితులతో టచ్ లో ఉండొచ్చు. సెల్ఫీ, వెల్ఫీ, డబ్, కరావోకే పోటీల్లో పాల్గొనాలని ఫ్రెండ్స్ ని ఆహ్వానించొచ్చు. ఇక ఇందులో కూడా వేర్వేరు కేటగరీల్లో లీడర్ బోర్డులు ఉంటాయి కాబట్టి కాస్త గేమింగ్ యాప్ లా అనిపిస్తుంది. వీడియోని డబ్ చేయడానికి యూజర్లు ప్రముఖ సినిమాలు, టీవీషోలు షార్ట్ క్లిప్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. వాటికే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తే సరిపోతుందన్న మాట.

"జ్నాపిన్ తో యూజర్లు వారి మినీ స్టోరీస్ క్రియేట్ చేయొచ్చు. ఫన్నీ సెల్ఫీలతో చిన్న వీడియో క్రియేట్ చేయొచ్చు. డబ్బింగ్స్ చెప్పొచ్చు. ఈ ఫోటోలు, వీడియోలను సోషల్ నెట్ వర్కింగ్ సైట్లైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్, ట్విట్టర్, వైబర్, హైక్, వైన్ లో... లేదా ఎస్ఎంఎస్ లింక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు"- యష్.

యాప్ యాప్ హుర్రే..!

లేఅవుట్, డిజైన్స్ విషయంలో జ్నాపిన్ ఫన్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది. సరైన థీమ్స్, ఆకట్టుకునే కలర్స్ తో యాప్ ని రూపొందించారు. ఇందులో లీడర్ బోర్డు ఏర్పాటు చేయడంతో ఫ్రెండ్స్ మధ్య పోటీని ప్రోత్సహిస్తోంది. యాప్ లో ఉండే కంటెంట్ తో పాటు... డబ్ వార్స్, టంగ్ ట్విస్టర్స్ లాంటి ఛాలెంజ్ లతో సరదాగా ఉంటుంది. యూజర్లకు ఎక్కడా బోర్ కొట్టకుండా జ్నాపిన్ టీమ్ యాప్ ను చాలా పక్కాగా తీర్చిదిద్దుతోంది. ఇక ఆసక్తిని పెంచే మరో సోషల్ ఫీచర్ ఏంటంటే పించ్, స్లాప్. ఇవి ఫ్రెండ్స్ అటెన్షన్ ని పొందడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ యాప్ లో ఫ్రెండ్స్ తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉండటంతో భవిష్యత్తులో ఈ యాప్ ద్వారానే ఇంటరాక్షన్ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆండ్రాయిడ్ వర్షన్ యాప్ 40 ఎంబీ ఉంటే ఐఓఎస్ వెర్షన్ 20 ఎంబీ. త్వరలో ఆండ్రాయిడ్ యాప్ సైజును మరింత తగ్గించాలనుకుంటున్నారు. తద్వారా యూజర్లను నిలుపుకోవచ్చు. అన్ ఇన్ స్టాల్ రేట్స్ తగ్గించుకోవచ్చు.

image


యాప్ లో మరిన్ని ఫీచర్లు జోడించడం, యాప్ ను మరింతగా డెవలప్ చేయడంపై దృష్టిపెట్టాలనుకుంటున్నారు. ప్రస్తుతం యాండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫామ్స్ పై వీరికి యాభై వేల యూజర్లున్నారు. ప్రస్తుతానికి ఇది ఫ్రీ యాప్. ఆదాయం కోసం కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. కాకపోతే యూజర్ల సంఖ్య పెరిగిన తర్వాత అమలు చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం వీరి టీమ్ లో వేర్వేరు విభాగాలకు చెందిన ఐదుగురు ఉన్నారు. వీరిలో యష్ టెకీ లీడర్. హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, బిహేవియరల్ ప్యాటర్న్స్ లో నిపుణుడు. ఇక న్యాశ్రీ స్టార్టప్ ట్రైనర్, హ్యాకర్. ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, బిజినెస్ డెవలప్ మెంట్, మేనేజ్ మెంట్ స్కిల్స్ లాంటివి ఆమె చూసుకుంటారు. ఇప్పుడిప్పుడే సత్తాచాటుతున్న జ్నాపిన్... టీమ్ ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. మరికొందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చేందుకు ఫండింగ్ కోసం ఎదురుచూస్తోంది.

ఈ రంగం గురించి...

2019 నాటికి ఇంటర్నెట్ లో 80 శాతం ట్రాఫిక్ వీడియోలదే హవా అన్నది నిపుణుల మాట. ఈ విప్లవాన్ని స్మార్ట్ ఫోన్స్ ముందుండి నడుపుతాయని అంచనా వేస్తున్నారు. ఫేస్ బుక్, స్నాప్ చాట్, మీర్కట్, ట్విట్టర్ల లాంటి సంస్థలు కూడా తమ ప్లాట్ ఫామ్స్ పై వీడియో కంటెంట్ కు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నాయంటే వీడియోలకు పెరుగుతున్న ఆదరణ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డబ్ స్మాష్ ఈ రంగంలో అతిపెద్ద ప్లేయర్. ఆగస్టు 2015లో ఇండెక్స్ వెంచర్స్ నుంచి ఐదున్నర మిలియన్ డాలర్ల నిధులు పొందింది. ఇక ఇండియాలో... అడ్వర్టైజింగ్, టైఅప్స్, క్యాంపైన్లు చేస్తున్న వెల్ఫీతో జ్నాపిన్ పోటీ పడుతోంది.

యువర్ స్టోరీ మాట...

జ్నాపిన్... ఆకట్టుకునే వీడియో కంటెంట్ తో మొత్తంగా వినోదాత్మకమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇలాంటిదే అయిన డబ్ స్మాష్ కు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. ఈ వీడియో క్రియేషన్ ప్రాసెస్ కు కేవలం యూజర్ల లిప్ సింకింగ్ , యాక్టింగ్ సరిపోతుంది. కానీ జ్నాపిన్ లో ఇదంతా రివర్స్. ఈ రివర్స్ డబ్బింగ్ ప్రాసెస్ లో యూజర్లు ఉన్న వీడియోకి వాయిస్ ఓవర్ అందిస్తే చాలు. జ్నాపిన్ ప్రమోట్ చేయాలనుకుంటున్నది కూడా ఇదే. సృజనాత్మకతే కాదు... యూజర్లు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిన యాప్ ఇది. కాబట్టి ఆదరణ పొందడం అంత సులువు కాదు. అయితే అనుభవజ్ఞులైన టీమ్ యాప్ పై కృషి చేస్తుండటంతో భవిష్యత్తులో ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ తో జ్నాపిన్ వస్తుందో చూడాలి.