వెజిటేరియన్ల కోసం ఉద్యమం లేవదీశారు..

వెజిటేరియన్ల కోసం ఉద్యమం లేవదీశారు..

Thursday March 03, 2016,

2 min Read


ఏదైనా సాధించాలనే తపన, లక్ష్యాన్ని చేరుకోవాలన్న పట్టుదల ఉంటే...అనుకున్నది సాధించడం అంత కష్టమేమి కాదు. ఈ మాటలే ఇద్దరి స్నేహితులను లక్ష్య సాధన దిశగా అడుగులు వేయించాయి. జంతువులపై వారికున్న అవ్యాజమైన ప్రేమ, జాలి, దయ ఓ సరికొత్త ఉద్యమానికి తెరలేపాయి. ఫ్యూర్ వెజ్ ను ఇష్టపడేవారి కోసం శాఖహార ఉద్యమాన్ని మొదలుపెట్టి ప్రపంచ దేశాల మార్కెట్ నే తమవైపు తిప్పుకున్నారు. 

రితికా జైన్, శృతి జైన్. 2012లో అనుకోకుండా ఓ దేవాలయంలో కలిశారు. ఒకరి అభిరుచులు మరొకరు తెలుసుకున్నారు. అప్పటి నుంచి వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా మారారు. రితికా, శ్రుతి జంతు ప్రేమికులు. ప్యూర్ వెజిటేరియన్లు. నాన్ వెజ్ తినేవారిపై చాలాసేపు, చాలారోజులు చర్చించుకున్నారు. వారి జిహ్వ చాపల్యం కోసం అమాయక జీవులను చంపి తింటున్నారని ఆవేదన చెందారు. ఆఖరికి మేకప్ కోసం వాడే బ్రష్ మీద వెంట్రుకలు కూడా మూగజీవాలవేనా అని కలత చెందారు. ఆ సంఘర్షణలోంచే పుట్టింది శాఖాహార ఉద్యమం. అది కూడా ఓ కొత్త పద్ధతిలో ఉద్యమాన్ని ప్రారంభించాలని సంకల్పించారు. శాఖాహార లైఫ్‌ స్టైల్, ఫ్యాషన్ బ్యూటీని స్టార్ట్ చేశారు.

అసలేంటి ఈ వెజిటేరియ్ రివల్యూషన్..?

బాలకార్మికుల ప్రమేయం లేకుండా, జంతువులకు సంబంధించిన పదార్థాలు లేని ఫ్యాషన్ ఫాలో అవడమే వెజిటేరియన్ అజిటేషన్ కాన్సెప్ట్. ఆరోగ్యానికి హానీ కలగకుండా ఉండే వస్తువులతోనే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అదేకాదు ప్రపంచంలో చాలామందికి తమ లైఫ్ స్టయిల్ లో ప్యూర్ వెజ్ పద్ధతిని పాటించాలని కోరుకుంటారు. కానీ అందుకు పరిస్థితులు అనుకూలించవు. అలాంటి వారి కోసమే 2014జూన్ లో వేగన్ ఫ్యాషన్ ఆన్ లైన్ మ్యాగజైన్ స్టార్ట్ చేశారు. ఈ మ్యాగజైన్ లో పూర్తిగా జంతు సంబంధిత పదార్థాలు లేని బ్యూటీ ప్రాడక్ట్స్, వాటితోపాటు ఫ్యాషన్ వేర్ ను అందుబాటులో ఉంచారు.

image


వేగన్ ఈ-కామర్స్ సైట్ ద్వారా జైపూర్, ఇండోర్, దుబాయ్ కి చెందిన మార్కెట్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ప్రధానంగా 16 నుంచి 40 ఏళ్ల యువతే వీరి మార్కెటింగ్ టార్గెట్. సైట్ కోసం సుమారు 10మంది ఎస్ఈవో నిపుణులు, రైటర్స్ వర్క్ చేస్తున్నారు. అంతేకాదు శాఖాహార ప్రాడక్ట్స్ గుర్తించి సైట్ లో అందుబాటులో ఉంచేందుకు నిపుణుల హెల్ప్ కూడా తీసుకుంటున్నారు.

సాధారణంగా యూకే, యూఎస్ ల‌లో ఈ వేగ‌న్ మార్కెట్‌కి ఎక్కువ‌గా డిమాండ్ ఉంది. ఆ ప్రాంతాల నుంచే ఎక్కువ‌గా ఆర్డర్లు వ‌స్తుంటాయి. అంతేకాదు శాఖాహార ఫ్యాష‌న్ ఎలా ఫాలో కావ‌ల‌నే సందేహాలు కూడా ఆ ప్రజలే ఎక్కువగా అడుగుతుంటారు. వారి సందేహాలను నివృత్తి చేయ‌డం కూడా ప‌నిలో భాగంగానే పెట్టుకున్నారు. అలాగే సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ ద్వారా మార్కెటింగ్ ను విస్తరిస్తున్నారు. 

image



ఈ - కామర్స్ లో ఎదురయ్యే స‌వాళ్లు..

ఆన్ లైన్ బిజినెస్ అంటే మాటలు కాదు. అందునా వీళ్లు ఎంచుకున్న దారి అస్సలు ఈజీ కాదు. పైగా ఈ రంగంలో ఎక్కువ‌గా పోటీ ఉంది. దీంతో శృతి, రితికా ప్రఖ్యాత బ్రాండ్స్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రితికా విదేశాల్లోని మార్కెట్ పై ఎక్కువ‌గా దృష్టి సారిస్తే... శృతి టెక్నిక‌ల్ స‌పోర్ట్ మీద దృష్టి పెట్టింది. శృతి ఎస్ఈవో కావ‌డంతో పోర్టల్ అభివృద్ధిపై దృష్టి సారించింది.

క‌ల‌ల‌ను సాకారం చేసుకునే దిశ‌గా..

కలలను సాకారం చేసుకునే దిశగా వీరిద్దరూ పయనిస్తున్నారు. పురుషులు, స్త్రీల మధ్య అంతరాలు తొలగాలని....ఈ పోటీ ప్రపంచంలో అందరూ సమానంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నారు. త్వరలోనే వ్యాపారాన్ని మరింత విస్తరించాలన్న ధీమాతో ఉన్నారు. ప్రస్తుతం ప్రాడక్టులకు కొత్త మార్కెట్ సృష్టించే పనిలో బిజీగా ఉన్నారు.