ప్రత్యేకమైన బహుమతులకు పెట్టింది పేరు 'గోగప్ప'

అదరగొడుతున్న ఆన్‌లైన్ గ్రీటింగ్ స్టోర్రొటీన్‌కు భిన్నంగా ఆలోచిస్తామంటున్న ఫౌండర్లుకార్పోరేట్ టార్గెట్‌గా గోగప్ప గిఫ్ట్ ప్యాక్‌లుప్రారంభంకానున్న వైట్ గ్లౌవ్ సర్వీసులు

0

ఈ-కామర్స్ ఇంతగా విస్తరించినా నచ్చిన వాళ్లకివ్వటానికో, వ్యాపారంలో భాగంగా క్లయింట్స్‌కి ఇవ్వటానికో మంచి గిఫ్ట్ కోసం వెతకటం ఆషామాషీ వ్యవహారంలా కనబడ్డంలేదు. సాధారణమైన రకాలు ఎన్నో ఉన్నాయి గాని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ కావాలంటే మాత్రం చాలా కష్టపడి వెతుక్కోవాల్సిందే. సరిగ్గా ఈ సమస్యకు ఒక పరిష్కారమైంది GoGappa. ఈ విషయంలో నిజంగా వాళ్లు చాలా చిన్నపిల్లలే. కానీ వాళ్లు చేసే పనిలో చాలా సీరియస్‌గా ఉన్నారు. మొదటిసారిగా మీరు GoGappa.com చూసినప్పుడు వాళ్ల ఉత్పత్తులు మీకు ప్రతిచోటా కనిపించే రొటీన్ బహుమతుల్లాగా అనిపించవు.

గోగప్ప శాంపిల్ గిఫ్టులు
గోగప్ప శాంపిల్ గిఫ్టులు

తొలి అడుగులు

GoGappa ఒక ఆన్ లైన్ గిఫ్టింగ్ స్టోర్‌లా మొదలై కార్పొరేట్ రంగానికి సేవలందిస్తూ వచ్చింది. ఎన్నో వైవిధ్యభరితమైన కార్పొరేట్ బహుమతులను వాళ్ళు ప్రదర్శించేవారు. అవి కేవలం భిన్నంగా ఉండటానికే పరిమితం కాలేదు. వాటికొక ప్రత్యేక హోదా ఉన్నట్టు హుందాతనం, ఠీవి కొట్టొచ్చినట్టు కనబడేవి. వాళ్ళ క్లయింట్స్‌లో ఆటోడెస్క్, సిట్రిక్స్, బ్లూమ్‌బర్గ్, ఎన్‌బిసి యూనివర్సల్, సోమనీ సెరామిక్స్ లాంటి పెద్దపెద్ద సంస్థలున్నాయి. GoGappa ఎంతగా ఆకట్టుకోగలిగిందంటే తమ క్లయింట్స్ వ్యక్తిగత బహుమతుల కోసం కూడా ఉపయోగపడేలా దాని సేవలను విస్తరించాలని ఆ సంస్థలే పదే పదే కోరుతూ వచ్చాయి. ఆ విధంగా కేవలం ఆన్ లైన్ గిఫ్టింగ్ స్టోర్ గానే కాకుండా GoGappa మరిన్ని అంశాలు జోడిస్తూ మరింత ముందడుగేసింది.

అశుతోష్ అగర్వాల్
అశుతోష్ అగర్వాల్

ఫౌండర్స్

మోనిక, అశుతోష్ 2011 లో GoGappa స్థాపించారు. మద్రాస్ ఐఐటిలో చదువుకున్న అశుతోష్.. ఆ తరువాత వాల్ స్ట్రీట్‌లోని డాయిష్ బాంక్‌లో ఏడేళ్ళపాటు పనిచేశారు. ఆ తరువాతనే ఈ వెంచర్ మీద దృష్టిపెట్టాడు. మోనిక మాత్రం శాన్‌ఫ్రాన్సిస్కో యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. అశుతోష్‌తో కలవటానికి ముందు బే ఏరియా లో రెండు విజయవంతమైన స్టార్టప్స్ లో పనిచేసింది.

మోనికా
మోనికా

The X Factor

మనం సాధారణంగా చూసేవాటికి భిన్నంగా, ప్రత్యేకంగా తన ఉత్పత్తులు ఉండాలని, చూడగానే అందరినీ ఆకట్టుకోగలగాలనీ GoGappa కోరుకుంటుంది. భారత్ లో ఆన్ లైన్ స్టోర్స్ కేవలం ఉత్పత్తుల ’అమ్మకాల’ మీదనే దృష్టిసారిస్తాయన్నది వీళ్ల అభిప్రాయం. కానీ వీళ్ళు మాత్రం ఎవరూ నడవని బాటలో నడుస్తూ ఏదైనా ప్రత్యేకమైనది కావాలని కోరుకునే కస్టమర్ అవసరాలు తీర్చటం మీదనే దృష్టి సారిస్తారు. అందుకే వాళ్ళ ఉత్పత్తులన్నీ జాగ్రత్తగా సరిచూసి, నాణ్యతను పరిశీలించి, ఒక్కొక్కటీ హుందాతనంలో ఏమాత్రమూ తీసిపోని విధంగా ఉన్నట్టు నిర్థారించుకున్నమీదటే అమ్మకానికి పెడతారు. షాపింగ్ పరిశ్రమలో ఇంకా ఎవరూ పెద్దగా పట్టించుకొని మరో విభాగంలోకి కూడా GoGappa ప్రవేశించింది. ఆ బహుమతి మీద వ్యక్తిగతమైన ముద్రవేయటమే ఆ ప్రత్యేకత. అంతమాత్రాన పైన ఒక స్టిక్కర్ వేయటమో, ఫొటో వేయటమో లాంటి నాటు పద్ధతులు కానే కావు. ఒక సున్నితమైన పద్ధతిలో వ్యక్తిగత గుర్తింపును సూచనప్రాయంగా తెలియజేయటం. అది కూడా ఆ బహుమతిలోని సహజమైన అందానికి ఎలాంటి నష్టమూ కలగకుండా అందులోనే చొప్పించటం. దీన్ని GoGappa బాగా అర్థం చేసుకుంది.

డీటైలింగ్ మీద శ్రద్ధ

ఈ వెబ్ సైట్ చాలా అందంగా రూపొందించారు. లే ఔట్ బాగా ఆకట్టుకుంటుంది. ప్రత్యేకంగా ఆఫర్ చేయటానికి ఎన్నో ఉన్నాయని చూడగానే అర్థమవుతుంది. ఇందులో ప్రధానంగా మూడు సెక్షన్లున్నాయి. స్టోర్‌లో హోం అండ్ డెకార్, ఫైన్ ఫుడ్, ట్రావెల్, బాగ్స్ అండ్ కేసెస్ తదితర విభాగాలు కనిపిస్తాయి. ఇక గిఫ్ట్ షాప్ విషయానికొస్తే, అందులో సందర్భాల వారీగా చాలా ఉంటాయి. అంటే, పెళ్ళిళ్లు, ప్రత్యేకంగా ఇచ్చే గిఫ్ట్ హాంపర్లు లాంటివి. లాస్ట్ మినిట్ అనే మరో కేటగిరీ అద్భుతంగా హిట్టయింది. అదేంటంటే, మతిమరుపు భర్తలకూ, బాయ్ ఫ్రెండ్స్‌కి బాగా పనికొస్తాయవి. కార్పొరేట్ స్టోర్లో దీపావళి, కొత్త సంవత్సరం లాంటి సందర్భాలకు సరిపడే బహుమతులతో బాటు ఇతర కార్పొరేట్ బహుమతులూ ఉన్నాయి. ఏదైనా ఒక ప్రత్యేక సందర్భానికి తగినట్టుగా కావాలంటే కంపెనీలు కేటలాగ్ కావాలని కూడా కోరవచ్చు. అప్పుడు వాళ్లకు తగినట్టు ఏం చేసివ్వగలరో చెప్పి మరీ ఆర్డర్ తీసుకుంటారు.

దీర్ఘకాల లక్ష్యాలు

దీర్ఘకాలంలో ఏం చేయాలన్న విషయంలో GoGappaకి ఒక ప్రత్యేకమైన విజన్ ఉంది. త్వరలోనే వైట్ గ్లౌవ్ సర్వీస్ ప్రారంభించాలనుకుంటున్నారు. ప్రతి కస్టమర్‌కీ వ్యక్తిగతమైన సేవలందించటమే దీని లక్ష్యం. అంటే కొంతమంది కస్టమర్స్‌కి ప్రత్యేకంగా ఒక GoGappa ఉద్యోగిని కేటాయిస్తారు. వాళ్ళని Gappa లు అంటారు. ఒక కస్టమర్ ఏదైనా కావాలంటే ఆ Gappa స్వయంగా వెళ్ళి డెలివరీ చేస్తాడు. ఎవరో తెలియని కొరియర్ సర్వీస్ మీద ఆధారపడాల్సిన పనే లేదు. ప్రస్తుతం ఈ పథకం నిర్మాణ దశలో ఉంది. దీన్ని త్వరలో పెద్ద ఎత్తున అమలుచేసే ఆలోచన ఉంది.అలా ప్రతి చిన్న అంశం మీదా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టటం ద్వారా GoGappa ఒక విశిష్ఠమైన సేవలందించే ఆన్ లైన్ స్టోర్ గా వ్యాపారాన్నీ, కస్టమర్ రిలేషన్స్ నీ సమున్నత స్థానానికి చేర్చబోతున్నది.

మీ బాస్ పుట్టిన రోజు దగ్గరపడుతున్నదంటే ఈ వెబ్ సైట్ లో ట్రై చేసి మీరొక ప్రత్యేకమైన గిఫ్ట్ ఎంచుకోండి. మీ బాస్ దగ్గర మార్కులు కొట్టేయండి. మీ అనుభవాన్ని మాతో పంచుకోవటం మరువకండి.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik