లేడీస్ ప్యాంటు, షర్టుకు జేబులు ఎందుకు ఉండవో తెలుసా..?  

తయారీదారుల కుట్ర దాగుందనేది ఫెమినిస్టుల మాట

0

మీరు గమనించారో లేదో లేడీస్ వేసుకునే ట్రౌజర్లకు పాకెట్స్ ఉండవు. ఇప్పుడనే కాదు గత శతాబ్ద కాలంగా చూసుకున్నా వారికి షర్టుకు గానీ, ప్యాంటుకు గానీ జేబులుండవు. ఒకవేళ ఉన్నా కనీసం చిన్నపాటి ఫోన్ కూడా పట్టదు. పర్సు సంగతి సరేసరి.

ఎందుకు? కారణమేమై ఉంటుంది? అదే మగవారి దుస్తులకు అనేకానేక జేబులు. పైకి కనిపించేవి కాకుండా ఇన్నర్ పాకెట్స్ కూడా ఉంటాయి. లేడీస్ జిమ్ వేర్ చూసుకున్నా, స్వెట్ ప్యాంట్స్ తీసుకున్నా, ఫార్మల్ ట్రౌజర్స్ విషయంలో అయినా, జీన్స్ పరిశీలించినా, ఈవెన్ ఎథ్నిక్ ఔట్ ఫిట్స్ వెతికినా, పాకెట్ అన్న మాటే ఉండదు. ఉన్నా, నాలుగు చిల్లర కాయిన్స్ వేసుకోడానికి తప్ప అది ఎందుకూ పనికిరాదు. ఎందుకలా..? వాళ్ల దుస్తుల డిజైనింగ్ వెనుక ఏమైనా కుట్ర ఉందా?

ఆడవారు కార్ కీస్ క్యారీ చేయరా? మొబైల్ ఫోన్స్ వాడరా? అవన్నీ చేతుల్లో పట్టుకునే తిరగాలా? జాగింగ్ చేసేటప్పుడు గమనించండి. వేసుకున్న ప్యాంటుకి జేబు ఉండదు. అంటే ఆ సమయంలో కూడా భుజానికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకోవాలా? ఎవరైనా ట్రెడ్ మిల్ ఎక్కి చంకకు బ్యాగ్ వేసుకుంటారా?

దీని వెనుక కుట్ర ఏమైనా దాగుందా? బట్టలు తయారు చేసేవాళ్లకు- హాండ్ బ్యాగులు చేసేవాళ్లకు మధ్య రహస్య ఒప్పందమేమైనా జరిగిందా?

సరే అది పక్కన పెడితే మహిళల కోసం ప్రత్యేకంగా కలర్ కోడ్ ఎందుకు వాడతారు? ఎక్కువ శాతం ఫ్యాషన్ దుస్తుల్లో పింక్ కలరే ఎందుకుంటుంది? ఈ అంశాలపై సోషల్ మీడియాలో చర్చోప చర్చలు నడుస్తున్నాయి.

అనేక మంది మహిళలు, అందులో కొంతమంది మగవారు కూడా లేడీస్ వేర్ విషయంలో, ఎస్పెషల్లీ పాకెట్ మిస్సింగ్ పై ట్విటర్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొందరు ఆవేదన వ్యక్తం చేస్తే మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. చూడ్డానికి ఇదొక సిల్లీ టాపిక్ అనిపించొచ్చు. కానీ తరచి చూస్తే దీని వెనుక శతాబ్దాల కుట్ర దాగుందని అర్ధమవుతుంది. తేనె పూసిన కత్తితో మెడను కోసేస్తున్నట్టు అనిపిస్తుంది.

డ్రస్సులు, వాటికుండే పాకెట్ల సంగతి కాసేపు పక్కన పెడదాం.. మీరెప్పుడైనా లేడీస్ జిమ్ ని పరిశీలించారా? అక్కడ డంబెల్స్ పింక్ కలర్లో దర్శనమిస్తాయి. మగవారికేమో బ్లాక్ కలర్ లో ఉంటే.. వాళ్లకేమో పింక్. జెండర్ స్పెసిఫిక్ టాయ్స్ లాగా.. అంటే బొమ్మకార్లు అబ్బాయిలకు, బార్బీ డాల్స్ అమ్మాయిలకు అన్నట్టు.. మహిళలకు పింక్ కలర్ డంబెల్స్. జిమ్ యాక్సెసిరీస్ లోకి కలర్ కోడింగ్ ఎలా వచ్చింది? అంటే ప్రాడక్ట్ తయారుచేసేవాళ్లు యుటిలిటీ యాంగిల్లో ఆలోచించడం లేదన్నమాట. ఎంతసేపూ ఆడవారిని ఎలా ఆకట్టుకోవాలి అనే దానిపైనే ఫోకస్ చేశారు. ఈ రకమైన ఆలోచన చాలా దుర్మార్గమైనది.

అంతెందుకు ఆటోమొబైల్ విషయంలోనూ మగవారికే ఎక్కువ సేఫ్టీ ఉంది. ఎయిర్ బ్యాగుల సంగతే చూసుకుంటే.. అవన్నీ సగటు మగవారిని ఉద్దేశించే తయారు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే బ్యాగ్ మగవారి ఛాతీ పై భాగం దాకా వస్తుంది. అదే ఆడవారికైతే ముందు అది గదవకు తాకుతుంది. ఆటోమేటిగ్గా తల వెనక్కి విసురుతుంది. దాంతో వెన్నెముకకు తీవ్రంగా దెబ్బ తాకుతుంది. ఈవెన్- కుషన్ కూడా మగవారికి అనుకూలంగానే ఉంటుంది.

ఇలా రెండు మూడు విషయాల్లోనే కాదు. చాలామటుకు యునిసెక్స్ ప్రాడక్ట్స్ అన్నీ మగవారికి అనుకూలంగా వుండేలాగే డిజైన్ చేశారు. పింక్ కలర్, దాని అనుబంధ కలర్ షేడ్స్ కూడా ఆ కుట్రలో భాగమే. ఒకవేళ నిజంగా తయారీదారులకు ఆ ఉద్దేశమే లేకుంటే ఎందుకు ఔటాఫ్ బాక్స్ ఆలోచించరు. కిచెన్ అప్లయన్సెస్ బ్లూ షేడ్ లో పెట్టి మగవారిని ఎందుకు వంట చేసేలా ప్రేరేపించరు? 

Related Stories

Stories by team ys telugu