మజ్నుగా వచ్చిన నేచురల్ స్టార్

8

ఈగతో అష్టాచెమ్మాతో ఆడుకున్న పిల్ల జమీందార్ వీరప్రేమగాధ విన్న మనం ఇతగాడు జెంటిల్‌మెనా లేక మజ్నూనా ? ఇంతసేపూ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో  ఈ పాటికే అర్థమై ఉంటుంది. అతడే నేచురల్ స్టార్ నాని. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు మినమం గ్యారెంటీ హీరో ట్యాగ్ లైన్ తెచ్చుకున్న ఘంటా నవీన్ బాబు ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరో. సినిమాలే శ్వాసగా చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమను పెంచుకున్న నాని ఇప్పుడు మజ్నుగా మురిపిస్తున్నాడు.


విరించి వర్మ కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వంలో వచ్చిన మజ్ను సినిమాలో హీరోగా నాని, హీరోయిన్లుగా అను ఇమాన్యుయెల్, ప్రియా శ్రీ నటిస్తున్నారు. గోపీ సుందర్‌ మ్యూజిక్‌ను అందించాడు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కేవా మూవీస్ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమాకు గీతా గొల్ల, పి. కిరణ్‌ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు.

రూ. 3500 జీతంతో కెరీర్ మొదలెట్టిన నాని ఈ స్థాయికి ఎలా వచ్చాడు ?

చిన్నప్పుడు తెలుగు మీడియంలో చదివి ఇంగ్లిష్‌లో YES అనే పదం తప్ప ఏమీ రాని నాని మినిమం గ్యారెంటీ హీరో ఎలా అయ్యాడు ?