ఆన్‌లైన్‌ కిరాణం ఈ లోకల్ బన్యా

ముంబైలో వేగంగా విస్తరిస్తున్న లోకల్ బన్యాకస్టమర్ల నాడి పట్టిన కుర్ర బాసులురోజుకు 600 ఆర్డర్లు ప్రాసెస్ రూ.30 కోట్ల సేకరణకు సిద్ధమవుతున్న కంపెనీ

ఆన్‌లైన్‌ కిరాణం ఈ లోకల్ బన్యా

Friday April 17, 2015,

3 min Read

‘భారత్ లో ఈ – కామర్స్ బాగా ప్రచారంలోకి వస్తోంది. ఇప్పుడు మనం దేన్నైనా ఆన్‌లైన్ లో ఆర్డర్ చేయగలుగుతున్నాం. బట్టలైనా, బైక్ విడిభాగాలైనా, కిరాణా సరకులైనా సరే. మొత్తంగా చూస్తే ఇళ్ళలో వాడుకునే సరకులే చిల్లర మార్కెట్ లో అతిపెద్ద విభాగం. బిగ్ బాస్కెట్, జాప్ నౌ, ఆరామ్ షాప్, లోకల్ బన్యా లాంటి వాళ్ళు ఈ రంగంలో ముందుగా ప్రవేశించారు. బిగ్ బాస్కెట్, జాప్ నౌ రెండూ బెంగళూరు మార్కెట్ లో ఆధిపత్యం చెలాయిస్తుంటే బిగ్ బాస్కెట్‌తో బాటు లోకల్ బన్యా ముంబై మార్కెట్‌ను దున్నేస్తున్నాయి. లోకల్ బన్యా 2013 గణనీయమైన పురోగతి సాధించి 2014 లో మరింతగా దూసుకెళ్ళింది. “ 2013 లో ఉద్యోగుల సంఖ్యను వందకు పైగా పెంచుతూ, నిరుడు డిసెంబర్ నాటికల్లా ఉత్పత్తుల సంఖ్యను 8 వేలకు పైగా పెంచుతూ రోజుకు 400 ఇళ్లకు చేర్చే లక్ష్యాన్ని దాటాం.” అని చెబుతున్నారు లోకల్ బన్యా డాట్ కామ్ సహ వ్యవస్థాపకులు, సీవోవో అయిన రాశీ చౌదురి.

తన టీంతో రాశి చౌదురి

తన టీంతో రాశి చౌదురి


నిరుడు కంపెనీ తన కృషినంతా మౌలిక వసతుల కల్పన మీద, వ్యాపారానికి తగిన విలువ లభించేలా చేయటం కోసం వెచ్చించింది. “ బిసిసిఎల్‌లో భాగమైన స్ప్రింగ్ బోర్డ్ వెంచర్స్ నుంచి, కర్మవీర్ అవంత్ గ్రూప్‌ నుంచి పెట్టుబడి నిధులు అందుకుంటూ ఏడాది పొడవునా లోకల్ బన్యా తన కార్యకలాపాలను, టెక్నాలజీని, మార్కెటింగ్‌ని, బ్రాండ్ బిల్డింగ్‌ని, సమర్థంగా భారీ కార్యకలాపాలను నిర్వర్తించగలిగే సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చింది. ” అంటారు రాశీ.

ప్రస్తుతం లోకల్ బన్యా ప్రతిరోజూ ముంబయ్, థాణే, నవీ ముంబయ్‌లో సగటున రోజుకు 600 ఆర్డర్లు పరిశీలించి పంపిణీ చేస్తోంది. ముఖ్యంగా 98 శాతం ఆర్డర్లకు సకాలంలో స్పందించి అందజేయగలుగు తోంది. “ మార్కెటింగ్‌లోనూ, కస్టమర్లను కాపాడుకోవటంలోనూ, కస్టమర్ల సేవల నాణ్యత ఉన్నత స్థాయిలో ఉంచటంలోనూ చూపుతున్న శ్రద్ధతో కొనగోలుదార్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది.” అని వివరించారు రాశీ.

ప్రతినెలా మొదటి, చివరి వారాల్లో కస్టమర్లు జీతాల క్రమం కారణంగా పెద్దమొత్తాల్లో అర్డర్ చేస్తారని ఈ స్టార్టప్ కంపెనీ అనుభవం ద్వారా గమనించింది. “ దీనివలన సగటు ఆర్డర్ పరిమాణం రూ. 1350 ఉంటున్నది. ఇంపోర్టెడ్ వస్తువుల్లాంటి అదనపు రకాలు కూడా చేర్చటం వలన ఆర్డర్ల పరిమాణం బాగా పెరిగింది “ అని కూడా రాశీ చెబుతున్నారు.

ప్రధాన ఆహార సరుకులతో కూడిన కిరాణా సామాను దాదాపు 22 శాతం వాటా ఉంటుండగా, పాల ఉత్పత్తులు 11 శాతం, ఇంట్లోవాడే ఇతర సరకులు 11 శాతం ఉంటున్నాయి. “ చాలా ఆసక్తికరమైన విభాగం పండ్లు, కూరగాయలు. వాటి వాటా 11%. అయితే, నాణ్యతా ప్రమాణాలు, సేకరించి అందించే విధానం మెరుగుపడేకొద్దీ వీటి వాటా పెరుగుతూ వస్తోంది. సహజంగానే కస్టమర్ నాణ్యమైన ఉత్పత్తులవైపు మొగ్గుచూపుతాడు” అని రాశీ విశ్లేషించారు.

ఈ-కామర్స్ లోని ఇతర సంప్రదాయ రూపాలకు భిన్నంగా కిరాణా సరకుల ఈ-టైలింగ్ ఎదుర్కునే సవాళ్లు బహుముఖంగా ఉంటాయి. స్టార్టప్ కంపెనీలు కార్యకలాపాల నిర్వహణ సాధ్యాసాధ్యాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే మార్కెట్లో తమకంటూ స్థానం సంపాదించుకోగలుగుతారు. “ ప్రతి ఆర్డర్ లో సగటున 15 వస్తువులుంటాయి. వాటితో వ్యవహరించే తీరు ఒక్కో వస్తువు స్వభావాన్ని బట్టి మారుతూ ఉండవచ్చు. పంపిణీ చేసే సమయాలు అనువుగా ఉండటం, చెల్లింపులకు అనేక మార్గాలుండటం, ఆర్డర్లు అందుకొని ప్రాసెస్ చేయటంలోనూ అందించటంలోనూ ఖాతాదారు సేవల బృందం మెరుగైన పనితీరు వలన ఖాతాదారు తృప్తి పొందుతాడు. “ అని వెల్లడించారు రాశీ.

సంస్థ కార్యకలాపాల స్థాయిని బట్టి ముంబై లో 2014 జులై నాటికే నష్టాల స్థితినుంచి బైటపడే స్థితి వచ్చింది. అయితే, ప్రతి నగరానికీ విస్తరిస్తున్నకొద్దీ అయ్యే అనుబంధ ఖర్చుల కారణంగా నష్టాలనుంచి బయటపడటం కొంత మేరకు వాయిదా పడుతూ ఉంటుంది. “ గత మూడు నెలలుగా ప్రతి లావాదేవీ మీదా కంపెనీ నగదు లాభాలు నమోదు చేసుకుంటూ వస్తోంది. అమ్మకాల పరిమాణం పెంపు ద్వారా సగటు ఖర్చులు తగ్గుతాయి కాబట్టి లా ఆదా చేసుకోవటం ద్వారా లాభాలను మరింత పెంచుకోవాలని ఆశిస్తున్నాం.” అని రాశీ వివరించారు. మరో మూణ్ణెల్లలో మరో నగరంలో ప్రారంభించటమే కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని నగరాలకు విస్తరించాలనుకుంటున్నారు.

image


బిసిసిఎల్ వారి స్ప్రింగ్ బోర్డ్ ఫండ్ నుంచి, కర్మవీర్ అవంత్ గ్రూప్ నుంచి లోకల్ బన్యా రెండు విడతలుగా పెట్టుబడులు స్వీకరించింది. రెండో విడత విస్తరణ గురించి రాశీ ని అడిగినప్పుడు “ 50 లక్షల డాలర్లతో లోకల్ బన్యా త్వరలో రెండోవిడత సిరీస్ చేపట్టబోతోంది “ అన్నారు.