లక్షన్నరలో లక్షణమైన వెదురు ఇంటి నిర్మాణాలు చేపడ్తున్న వండర్ గ్రాస్‌

మెట్రో నగరాల్లో పెరుగుతున్న నయా కల్చర్ వెదురు భవనాలకు 50 ఏళ్ల లైఫ్

లక్షన్నరలో లక్షణమైన వెదురు ఇంటి నిర్మాణాలు చేపడ్తున్న వండర్ గ్రాస్‌

Sunday June 21, 2015,

4 min Read

ఓల్డ్ ఈజ్ గోల్డ్.. అంటారు.. మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ స్థానాల్లో వెదురు భవనాలు కల్చర్ పెరుగుతోంది. వాతావరణ కాలుష్యం తగ్గడంతో పాటు.. తక్కువ ఖర్చుతో రకరకాల డిజైన్లతో అందమైన నిర్మాణాలు చేయవచ్చంటున్నారు వైభవ్ కాలే..లెట్ చెక్ ది డిటైల్స్.

image


ఇళ్లు, ఇతర భవనాల నిర్మాణాల్లో వెదురు ఒక పురాతన మెటీరియల్స్‌లో ఒకటిగా ఉంది. భవన నిర్మాణాలకు వాడే మెటీరియల్స్ భారీగా ఉండడంతో.. వెదురు నిర్మాణాలపై ఆధారపడుతున్నారు. రెడీగా లభ్యయయ్యే ఈ వెదురును చాలా దేశాల్లో విరివిగా పెంచుతున్నారు. వెదురు సాపేక్షంగా, తక్కువ ధర కావడం, నిర్మాణం తొందరగా పూర్తి కావడం కూడా దీని నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వడానికి కారణమౌతోంది. వెదురు కలప 50 సంవత్సరాలకు పైగా ఉంటుంది. బ్యాంబూ చెట్ల ప్రాధన్యతను గుర్తించిన నిర్మాణ రంగం.. చెట్ల పెంపకాన్ని పెంచింది. అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో ఇళ్లు లేని కుటుంబాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజా లెక్కల ప్రకారం భారత్ లో 39 మిలియన్ల జనాభాకు నివాస్థలం కొరత ఉంది. ఇలా స్థిరంగా జనాభా పెరుగుతుంటే.. ఈ సంఖ్య మరింత పెరగొచ్చు. దీనివల్ల భవన నిర్మాణ మెటిరీయల్స్ పై కూడా ప్రభావం పడుతుంది.

వైభవ్ కాలే, వైభవ్ వండర్ గ్రాస్ వ్యవస్థాపకుడు. కళాకారులతో కలిసి వెదురు ఆధారిత బిల్డింగ్ సిస్టమ్ తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. దీని వల్ల ప్రయోజనాలను వివరిస్తూ, ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

వెదురు నిర్మాణాలు

వెదురు నిర్మాణాలు


గడ్డి వివిధ రకాల నిర్మాణ భాగాలును అందిస్తోంది. వీటి ద్వారా ఇంటి కి అవసరమైన బాదులు, ప్యానెల్స్, స్క్రీన్లు, గోడలకు అవసరమైన ఇంటిరీయర్ యాక్సరీస్ ను అందిస్తుంది.

"వెదురు చెట్లతో భవనాలు. దేశంలో పర్యావరణ వికాసానికి దోహదపడతాయి. చైనా తర్వాత భారత్‌లోనే వెదురు వేగంగా, ఎక్కువగా పెరుగుతుంది. దాదాపు భారత్ ఉపఖండం లో ప్రతిచోటా విస్తారంగా లభిస్తుందని'' వైభవ్ కాలే చెప్తారు

ఆరు సంవత్సరాలు ఉన్న ఈ సంస్థ, ప్రారంభించడానికి గొప్ప ప్రేరణ తన తండ్రే అంటారు. తండ్రి వినూ కాలే రకరకాల డిజైన్లు తయారు చేయడంలో ఉన్న నైపుణ్యంతో బాంబు మాన్‌గా పిలిచేవారు. ఆయన వెదరు గడ్డితో విస్తృతమైన పరిశోధనలు చేశారు. అనేక గ్రామీణ చేతివృత్తుల వారితో కలిసి పనులు కూడా చేశారు. అలా వైభవ్ తన తండ్రి ఆలోచనలు పుణికి పుచ్చుకున్నారు. అప్పటికే ఇంటిరీయర్ డిజైన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వైభవ్. తర్వాత జర్మనీలోని బహస్ విశ్వవిద్యాలయం నుంచి పట్టణ ప్రాజెక్టులలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

ఇప్పడు ఆతిధ్య రంగంపై దృష్టి పెట్టిన వైభవ్... అతను మాస్ హౌసింగ్ యూనిట్లు తయారు చేయడంపై కేంద్రీకరించారు.బెంగుళూర్ NS రాఘవన్ సెంటర్‌లో కొత్త పరిశ్రమలు స్థాపించే వారి కోసం ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ వెదరు నిర్మాణాలతోనే కొనసాగింది. ఈ నిర్మాణం అత్యద్భుతంగా ఉండడంతో ప్రజలు ఆశ్చర్యపోతుంటారని చెప్పుకొస్తారు.

వెదురు తయారీ ఎక్కువ నాగ్పూర్‌లో జరుగుతోంది. అక్కడదట్టమైన వెదురు అడవులు ఉన్నాయి. వండర్ గ్రాస్ కంపెనీకి చెందిన 25 మంది చేతి వృత్తుల ఉద్యోగులున్నారు. రానున్న కొన్ని నెల్లో వైభవ్ భువనేశ్వర్, చెన్నై, పూణెల్లో షో రూమ్స్ ప్రారంభించటానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇలా కొత్త ప్రాంతాలకు విస్తరించడం ద్వారా నిర్మాణ రంగం లో వెదురు ఉపయోగాలు తెలియచేయవచ్చని చెబుతారు.

image


తక్కువ ఖర్చు, వేగంగా ఇంటి నిర్మాణాలు

wondergrassతో అద్భుతాలు చేయవచ్చని ధీమాతో చెబుతారు. వెదురు గడ్డిలో కూడా రకరకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ భవన పరికరాలపై ప్రజల్లో అనుమానాలు కొనసాగుతున్నాయి. ప్రజలు వెదురు నిర్మాణాలు ఎంత వరకు క్షేమము అని ఆలోచిస్తున్నారని..ఎంత వరకు పటిష్ట వంతంగా ఉంటుందనే సందేహాలు ఉన్నాయని చెబుతారు. మొదటిది, వెదురు ప్రజల జీవనంలో భాగంగా మారాలి, ఈ వ్యవస్థ తెలిసిన వారి నుంచి తెలియని వారికి పరిచయం చేయాలంటారు. అలా వారికి వెదురు పై అవగాహన పెంచి... భవన నిర్మాణం చేయవచ్చని నిరూపించవచ్చు. ఇటుక, ఇనుమలతో నిర్మించిన ఇళ్ళను ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే అవి చాలా శక్తిని కలిగిఉంటాయి. అయితే అవి పర్యావరణానికి శత్రువులుగా మారుతున్నాయి. కానీ వెదురు గృహాలు సాంకేతిక ప్రయోజనాలపై అవగాహన కలిగిస్తే.. అనుకున్నది సాధించవచ్చు. క్వాలిటీతో పాటు తక్కువ ఖర్చులో నిర్మాణం పూర్తవుతుంది.

సాధారణంగా గ్రామాల్లో అయితే 400 చదరపు అడుగుల ఇల్లు లక్షా 25 వేల రూపాయిల్లో 3 లక్షల వరకు ఖర్చవుతుంది.ఇదే నిర్మాణాన్ని ఆకర్షణీయంగా 1.25 లక్షల రూపాయిలతో పూర్తిచేయవచ్చని సూచిస్తున్నారు. అంతే కాదు వెదురుతో ఇంటి నిర్మాణానికి తక్కువ సమయం పడుతుంది. మరో ఆసక్తికర విషయం ఏమంటే విపత్తు నిర్వహణ సమయాల్లో కోలుకోవడం తేలిక. ప్రాణ నష్టాన్ని వీలైనంతగా తగ్గించవచ్చు.

నిర్మాణాలను పర్యవేక్షిస్తున్న వైభవ్

నిర్మాణాలను పర్యవేక్షిస్తున్న వైభవ్


టెక్నాలజీ జోడించి..

వెదురు నిర్మాణాలకు టెక్నాలజి జోడిస్తే మంచి ఫలితాలు వస్తాయి. గ్రామాల్లో మూస పద్ధతిలో నిర్మాణాలు చేస్తున్నారని.. వారు నైపుణ్యాలు పెంచుకోవడం వల్ల స్వయంగా నిలదొక్కకొనే అవకాశం వస్తుంది . "గ్రామస్తులు తెలుసుకోవడానికి, నైపుణ్యాలు పెంచుకోవడానికి మైక్రో ఎంటర్‌ప్రైజెస్ స్థాపించడం వల్ల ... వాళ్ల నిర్మాణాలు వారే పూర్తి చేసుకోవచ్చు. ఇళ్ళు నిర్మించడానికి, ఇతరులపై ఆధార పడకుండా సమీపంలోనే ఉండే వెదురుతో పూర్తి చేసుకోవచ్చు. బయట నుంచి సిమెంట్ ఇతర వస్తువుల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేదని వైభవ్ వివరిస్తారు..

వెదురుతో హౌసింగ్ కాకుండా ఇంకా వివిధ రకాల వెదురు నిర్మాణాలు చేసుకోవచ్చు. గ్రామీణ కమ్యూనిటీ హాల్, పాల స్టాక్స్, ఆవుల కోసం చిన్న చిన్న గృహాలు ఇలా ఏదైనా... ఈజీగా నిర్మాణాలు పూర్తి చేసుకోవచ్చని సూచిస్తున్నారు. "గత రెండు సంవత్సరాల నుంచి కంపెనీ మంచి వృద్ధి రేటు కొనసాగిస్తోందని చెప్పారు. వెదురు కార్బన్ డయాక్సైడ్ గ్రహించి, వాతావరణంలోకి 35% ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అంతే కాదు వెదురు చెట్లకు ఎరువులు, పురుగుమందులు, హెర్బిసైడ్లు అవసరం ఉండదు.

వెదురు నుంచి తక్కువ వేస్ట్

వెదురు పండించిన తర్వాత, దాదాపు మొక్కలో ప్రతి భాగం ఏదోరకంగా ఉపయోగిస్తారు. ఇంకా వెదురు వల్ల నేల సుసంపన్నం అవుతుంది. వెదురు చెట్లను రకరరాలుగా వాడుకోవచ్చు. పేపర్, ఫ్లోరింగ్, ఫర్నిచర్, బొగ్గు, నిర్మాణ వస్తువులు..ఇలా ఎన్నో రకాలుగా వినియోగించవచ్చు. ఇవి ఫైబర్స్ కలప కంటే బలమైనవి. వాతావరణ పరిస్థితులుకు తగ్గట్టుగా ఎండలు ఉన్నప్పుడు చల్లదనాన్ని, చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనాన్ని పంచుతాయి.

వెదురుతో తయారైన ఇంటి నమూనా

వెదురుతో తయారైన ఇంటి నమూనా


భద్రత - వెదురు .. తక్కువ బరువుతో ఉండడం వల్ల..భూకంపం ఒత్తిడి అడ్డుకోవటానికి ఉపయోగపడుతుంది.

కంఫర్ట్- ప్రజలు వెదురు ఇష్టపడతారు. ఎందుకంటే వేసవిలో అధికంగా ఉష్ణోగ్రత ఉన్నప్పుడు వేడి లోపలకు చేరకుండా ఆపుతుంది.

టెక్నాలజీ - కనీస సాంకేతిక అవసరం. ఎక్కువ వెదురు ఇళ్ళు స్థానికంగా ఉండే టెక్నాలజితోనే పూర్తవుతున్నాయి. నూతన టెక్నాలజీ వాడడంతో ఆర్ధికంగా ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు.

మన్నిక - వెదురు తో నిర్మాణాలకు 50 ఏళ్ల వరకు లైఫ్ ఉంటుంది. వెదురులో ఇంకా సాధారణ పదార్థాలు, పాతవి ఎప్పటికప్పుడు మార్చుకోవడం ద్వారా ఇళ్లకు లైఫ్ పెంచుకోవచ్చని సూచిస్తున్నారు.

మట్టికి రక్షణ - వెదురు మూలాలు సాగు తర్వాత నేలలో సారం పెరుగుతోంది. అవి క్రమక్షయాన్ని నిరోధించి..తర్వాత వేసే పంటలకు పోషకాలను అందచేస్తాయి.