సెల్ఫీలతో గిన్నీస్ బుక్‌ ఎంట్రీకి ప్రయత్నిస్తున్న హైదరాబాదీ

సెల్ఫీలతో గిన్నీస్ బుక్‌ ఎంట్రీకి ప్రయత్నిస్తున్న హైదరాబాదీ

Thursday November 05, 2015,

3 min Read

మీరెప్పుడైనా సెల్ఫీ దిగారా ? అదేనండీ మన ఫోటో మనమే తీసుకోవడం. 2014లో దేశంలో వచ్చిన ఓ గొప్ప ఫోటో గ్రఫీ విప్లవంగా సెల్ఫీని చెప్పొచ్చు. స్మార్ట్ ఫోన్ శకంలో సెల్ఫీకున్నంత ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఢిల్లీలో ప్రధాని మోడీ దగ్గర నుంచి గల్లీలో ఉన్న సోగ్గాడి దాకా ఈ సెల్ఫీని దిగి అప్ లోడ్ చేసిన వారే. ఇలా సెల్ఫీ మానియా గురించి చెప్పాలంటే ఓ పెద్ద గ్రంధమే రాయొచ్చు. బహుశా ! సెల్ఫీలతో కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేయొచ్చని కొంతమంది నిరూపించారు. మన హైదరాబాదీ భానుప్రకాశ్ కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే రెండు మూడు రికార్డులు సొంతం చేసుకున్న భాను.. సెల్ఫీతోనే వండర్స్ క్రియేట్ చేయడానికి ఉరకలేస్తున్నారు.

“మా అన్నయ్య ప్రమోద్ మొదటి సారి శాంసంగ్ గ్యాలక్సీ ఫోన్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు. ఆ ఫోనుతో నా మొదటి సెల్ఫీ తీసుకున్నా. అప్పటి నుంచి సెల్ఫీలు తీస్తునే ఉన్నా.” భాను ప్రకాశ్.

ఇప్పుడు సెల్ఫీ తప్పితే మరో వ్యాపకం లేదు. గిన్నీస్ రికార్డు సాధించిన తర్వాత మరిన్ని అవార్డులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని చెబుతున్నారు.

image


సెల్ఫీ కోసం కార్పోరేట్ ఉద్యోగం వదిలి

సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికొస్తున్న సమయంలో సిటీ బస్‌లో కొంతమంది మాట్లాడుకోవడం విన్నాను. సెల్ఫీలతో గిన్నీస్ రికార్డు ట్రై చేసిన వారి గురించి తెలుసుకున్నా. అప్పటి నుంచి సెల్ఫీ ప్రాక్టీస్ చేస్తున్నా. తక్కువ టైంలో ఎక్కువ సెల్ఫీలు ఎలా తీయాలనే దానిపైనే నా మొత్తం రోజు గడిచిపోయేది. దీంతో ఆఫీసుకు సెలవులు పెట్టాల్సి వచ్చింది. పూర్తిగా ఉద్యోగం వదిలేసాను. దాదాపు ఏడాదిన్నరగా సెల్ఫీలు ప్రాక్టీస్ చేస్తున్నారు.

“సెల్ఫీ తీయడానికి ఇంత ప్రాక్టీస్ చేయాలా అని చాలా మంది ఆశ్చర్యంగా అడుగుతుంటారు” - భాను

వందల గంటలు ఏ పనీచేయకుండా సెల్ఫీ ప్రాక్టీస్ చేసిన రోజులున్నాయి. హ్యాండ్ షేకింగ్ లేకుండా ఉండటానికి జింకి వెళ్లి వర్కవుట్ చేస్తున్నా. ఏ ప్యాషన్‌తో నా ఉద్యోగం మానేసానో దాన్ని సాధించడమే నా లక్ష్యం అంటున్నారాయన.

image


గంటలో 1800 క్లిక్స్

గంటకు 1800 క్లిక్స్ తీస్తే గిన్నీస్ రికార్డ్ వస్తుంది. ఇప్పటి వరకూ ఈ ఫీట్ సాధించిన వారు లేరు. నా ప్రాక్టీస్‌లో 1800 కంటే ఎక్కువే తీయగలుగుతున్నా. మొదటి సారి రికార్డుకు యత్నించినప్పుడు వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. మరోసారి ప్రయత్నిస్తున్నా. సెల్ఫీ కేమెరా ముందు నిలబడి సెల్ఫీ తీయడం, నాతో పాటు జాయిన అయిన వారిని కలుపుకుపోవాలి. సెల్ఫీ రికార్డ్ బ్రేక్ చేయాలి.

“ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఇప్పటి వరకూ నా రికార్డును నేనే పదిసార్లు బ్రేక్ చేశాను.” భాను

ఇప్పుడు వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయాలి. అదే లక్ష్యంతో ముందుకు పోతున్నా అని చెప్పుకొచ్చారు.

image


భాను ప్రకాశ్ గురించి

బీ ఫార్మసీ పూర్తి చేసిన భానూది హైదరాబాదే. భాను నాన్న గారి సొంతూరు మేడ్చల్. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేశారు. సెల్ఫీ రికార్డులకి ఉద్యోగం అడ్డుపడుతుండటంతో పూర్తిగా దానికి గుడ్ బై చెప్పి సెల్ఫీ ప్రాక్టీస్ ప్రారంభించారు. సెల్ఫీలపై రీసెర్చ్ చేయడం, మొబైల్ హోల్డింగ్ (పట్టుకునే) టెక్నిక్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. సెల్ఫీలు తీసుకోవడం, వీడియో సెల్ఫీలు తీసుకోవడమంటే ఇష్టం.


ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సపోర్ట్

నేను తీసిన ప్రతీ సెల్ఫీని అమ్మకు చూపిస్తా. మరిన్ని సెల్ఫీలు తీయమని ఆమె సలహా ఇస్తుంది. పని మానుకొని ఈ ఫోటోలో తీసుకోవడం ఏంటి అని ఎప్పుడూ అడగలేదు. మా నాన్న, అన్నయ్య మద్దతుతోనే నేనీ స్థితిలో ఉన్నా. మరిన్ని రికార్డులు సాధించడానికి వారిచ్చే ప్రోత్సాహం నాకు చాలంటారు భాను. ఇక ఫ్రెండ్స్ ఇచ్చే సపోర్ట్ అంతా ఇంతా కాదు. నా ప్రాక్టీస్ కోసం ఆఫీసులు మానుకొని మరీ వస్తున్నారు. ఒకరితో సెల్ఫీ దిగడం కంటే ఎక్కువ మందితో కలసి దిగితేనే రికార్డు అవుతుంది. ఆ క్రమంలో చేసే ప్రాక్టీస్ కోసం నా ఫ్రెండ్స్ నాకు ఎంతగానో మద్దతిస్తున్నారు.

image


భవిష్యత్ ప్రణాళికలు

ఈ ఏడాది జనవరి 27న ప్రాట్రిక్ పీటర్సన్ అనే వ్యక్తి గంటలో 1499 సెల్ఫీలు తీసి గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేశారు. దీన్ని 1800సెల్ఫీలు తీసి బద్దలగొట్టాలి. ఫండింగ్ వస్తే మరిన్న రికార్డులు బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. సెల్ఫీ అనే కాన్సెప్ట్ సరికొత్త శకానికి నాంది పలకాలని చూస్తోన్న ఈ హైదరాబాదీ.. తనకు అందరి మద్దతు కావాలంటున్నారు. భారత దేశం నుంచి ఈ ఫీట్ సాధించడానికి అడుగేసిన మొదటి వ్యక్తి భానూ ప్రకాశ్ కావడం విశేషం.

“ఈ ఫీల్డ్ లో ఏం సంపాదించుకున్నా దాన్ని సేవాకార్యక్రమాలకు వినియోగిస్తానని ముగించారు భాను”