అడ్వెంచర్ టూరిజం సంస్థ థ్రిల్లోఫిలియాకు 2 లక్షల డాలర్ల ఫండింగ్ ఎందుకొచ్చింది ?

భార్యాభర్తలే వ్యవస్థాపకులుకంపెనీని సమర్థవంతంగా నడుపుతున్న చిత్ర, అభిషేక్72 నగరాల్లో పర్యాటక సంస్థలతో అనుబంధంపర్యాటకరంగంలో కొత్తకోణం చూపించే థ్రిల్లోఫిలియా

అడ్వెంచర్ టూరిజం సంస్థ థ్రిల్లోఫిలియాకు 2 లక్షల డాలర్ల ఫండింగ్ ఎందుకొచ్చింది ?

Tuesday August 25, 2015,

3 min Read

థ్రిల్లోఫిలియా (Thrillophilia) బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న ఓ అడ్వెంచర్ టూర్ ప్లానింగ్ కంపెనీ. ఇందులో హైదరాబాద్ ఏంజెల్స్ సహా 4 ఏంజిల్ ఇన్వెస్టర్లు, ఐఐఎం ఇంక్యుబేషన్ సెంటర్‌ పెట్టుబడులు పెట్టాయి. . భార్యాభర్తలు చిత్ర గుర్నాని దాగా, అభిషేక్ దాగా ఈ కంపెనీని స్థాపించారు. ఐదేళ్లుగా వీళ్లు దీనిపై పనిచేస్తున్నారు. 2011లో ఒక అమెరికన్ ఇన్వెస్టర్ పెట్టుబడులతో ఇది ప్రారంభమైంది. రెండేళ్ల క్రితమే ఈ కంపెనీలోకి 2 లక్షల డాలర్ల మొత్తం సిరీస్ ఏ ఫండింగ్‌లా వచ్చింది.

Image credit - thrillophilia

Image credit - thrillophilia


ప్రస్తుతానికి థ్రిల్లోఫిలియా 2500లకు పైగా టూర్స్ ప్లాన్ చేస్తోంది. బెంగళూరు కేంద్రంగా ఉన్న ఈ కంపెనీకి 72 ఇతర నగరాల్లో స్థానికి ఆపరేటర్లతో భాగస్వామ్యం ఉంది. 450 ప్రాంతీయ సర్వీస్ ప్రొవైడర్లతో థ్రిల్లోఫిలియాకు అనుబంధం ఉంది. 2015 ఆగస్ట్ నాటికి 90 వేల మంది వీళ్ల సంస్థ ద్వారా పర్యటించారు. గూగుల్, నోకియా, ఐసిఐసిఐ, రిలయన్స్, ఫిలిప్స్.. సిప్లా.. ఇలా ప్రముఖ కార్పొరేట్ సంస్థలన్నీ వీళ్ల క్లైంట్ల లిస్ట్‌లో ఉన్నాయి.

థ్రిల్లోఫిలియా స్టార్టప్ ను ప్రారంభించాలనుకున్నప్పటి నుంచి దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకునేందుకు వ్యవస్థాపకులు పడిన కష్టాన్ని తెలుసుకోవడం.. దాని భవిష్యత్ ఆలోచనలు కనుక్కోవడం గొప్ప అనుభూతి.

పెట్టుబడి పెద్ద సవాల్

కార్పొరేట్ ఉద్యోగి వ్యాపారస్తుడి అవతారమెత్తేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉంటాయో.. థ్రిల్లోఫిలియా స్థాపించేటప్పుడు చిత్ర, అభిషేక్‌లకు అవే సమస్యలు ఎదురయ్యాయి. తాము కూడబెట్టుకున్న సొమ్ములనే పెట్టుబడిగా పెట్టారు. పెట్టుబడి అతి పెద్ద సవాల్ అంటారు చిత్ర. థ్రిల్లోఫిలియా లాభాల్లోకి వెళ్లిన తర్వాత ఇద్దరూ జీతం తీసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మా ఇల్లు కూడా నడవాలిగా.. అంటారు చిత్ర.

చిత్ర ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) లో చేరింది. ఎక్కడో ఓ చోట ఉద్యోగంలో చేరుదామనే ఉద్దేశంతో కాదు.. థ్రిల్లోఫిలియాను పూర్తిస్థాయిలో స్థాపించేందుకు. “అభిషేక్ తను పనిచేస్తున్న కంపెనీలో కొనసాగాడు. అతనికి మంచి జీతం వచ్చేది. అది ఇల్లు గడవడానికి కేటాయించేవాళ్లం. కొంతకాలానికి మాకు లాభాలొచ్చాయి. ఆ తర్వాత ఓ ప్రైవేటు పెట్టుబడిదారుడు కంపెనీలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చారు” అని చెప్పింది చిత్ర.

చిత్ర గుర్నానీ, అభిషేక్ దాగా - థ్రిల్లోఫిలియా వ్యవస్థాపకులు

చిత్ర గుర్నానీ, అభిషేక్ దాగా - థ్రిల్లోఫిలియా వ్యవస్థాపకులు


“పెట్టుబడిదారుల వెంట పరుగుపెట్టలేదు”

స్టార్టప్ కంపెనీని స్థాపించేటప్పుడు పెట్టుబడి పెద్ద సమస్య. అయితే.. ఇన్వెస్టర్ల కోసం చిత్ర, అభిషేక్ పరుగులు పెట్టలేదు. “మేము కొన్ని పోటీల్లో పాల్గొన్నాం.. ఉదాహరణకు CIME అహ్మదాబాద్ నిర్వహించిన పవర్ ఆఫ్ ఐడియాస్ కంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేశాం. అంతేకాకుండా నేను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పూర్వ విద్యార్థిని. బిజ్ క్వెస్ట్ ఈవెంట్ లో కూడా పాల్గొన్నాను. దాన్ని TIE, ISB సంయుక్తంగా నిర్వహించాయి. ఆ ప్రైజ్ గెలుచుకోవడంతో కోటి రూపాయలు బహుమతిగా వచ్చాయి. అంతేకాకుండా వివిధ మార్గాల్లో మా ఆలోచనలు పంచుకోవడం ద్వారా ఫండింగ్ సమకూర్చుకోగలిగాం.” అని చెప్పారు చిత్ర.

తమ తదుపరి కార్యాచరణపై చిత్రకు స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి. “ఇప్పుడు ఉన్న దానితో మేం చాలా సంతృప్తిగా ఉన్నాం. ఇలా నడపడానికి అది సరిపోతుంది.. కానీ.. మేం మరింత పెట్టుబడిని ఆహ్వానించాలనుకుంటున్నాం. అలాగని అందరినీ ఆహ్వానించదలుచుకోవట్లేదు. అలా చేస్తే వ్యవస్థ మొత్తం కలుషితమైపోతుంది.” అనేది చిత్ర మాట.


బిజినెస్ టు కస్టమర్ సమస్య

థ్రిల్లోఫిలియా (Thrillophilia) కార్పొరేట్ క్లయింట్స్ నుంచి పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అయితే చిత్ర, అభిషేక్ మాత్రం కస్టమర్ల చెంతకు బిజినెస్ ను తీసుకెళ్లడానికి ఇంకా అవకాశం ఉందనుకుంటున్నారు. “ ఒక కస్టమర్ గోవా లేదా రాజస్థాన్ కు వెళుతున్నారనుకోండి.. కేవలం అక్కడి ప్రదేశాలను చూస్తే సరిపోదు.. అక్కడి ప్రజల జీవన విధానం, అక్కడి ప్రజల ఆచార అలవాట్లు, విశేషాలు.. ఇలా అన్ని అంశాలను తెలుసుకోవాలి. ఇలాంటి అన్ని అంశాలను అందించే సంస్థ నుంచి వాళ్లు టికెట్స్ బుక్ చేసుకోవాలి. స్థానిక అనుభవాలను కూడా మేం పర్యటనలో చేర్చనున్నాం. అది ఒక రోజు కావచ్చు లేదా.. టీ ప్లాంటేషన్ కు నడుచుకుంటూ వెళ్లే రెండు గంటల సమయం కావచ్చు” అంటారు అభిషేక్.

దాన్ని దృష్టిలో పెట్టుకుని థ్రిల్లోఫిలియా బిజినెస్ టు బిజినెస్ కాన్సెప్ట్ ను ముందుకు తీసుకొచ్చింది. “ బిజినెస్ టు బిజినెస్ కాన్సెప్ట్ వల్ల నష్టమేం లేదు. పైగా అదే మా బలం. 250 కార్పొరేట్ కంపెనీల క్లయింట్లకు ఇలాగే సేవలందించాం. అయితే బిజినెస్ టు కస్టమర్ లాగానే మా సేవలు కొనసాగించాం..” అన్నారు అభిషేక్.

ప్రస్తుతం థ్రిల్లోఫిలియా వెబ్, యాప్‌కు 30 మంది సభ్యుల బృందం పర్యవేక్షిస్తోంది. అయితే.. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. “ ఇప్పటివరకూ మా దగ్గరికి వచ్చినవాటిలో క్వాలిటీ బాగున్న అనుభవాలను మాత్రమే అప్ లోడ్ చేశాం. అయితే భవిష్యత్తులో కుప్పలుతెప్పలుగా ఎక్స్‌పీరియెన్సెస్ వచ్చే అవకాశముంది. వీటన్నింటినీ కూడా పొందుపరచాల్సి ఉంటుంది ” అన్నారు అభిషేక్.

image


భార్యాభర్తలుగా బృందాన్వేషణ

భార్యాభర్తలుగా మీరు ఎలా పనిచేస్తున్నారని అడిగినప్పుడు “ మేం ఆఫీసులో, ఇంట్లో గొడవపడుతూ ఉంటాం.. అందరిలాగే మా మధ్య కూడా అభిప్రాయబేధాలు వస్తుంటాయి. అయితే అదంతా వృత్తిలో భాగమే. ప్రారంభంలో ఇవన్నీ సహజమే. అన్నిటికీ మించి మా ఇద్దరికీ ఆఫీసులో ప్రత్యేకమైన బరువు బాధ్యతలున్నాయి. ఒకరి పనిలో మరొకరం జోక్యం చేసుకోం. వ్యవస్థాపకులుగా ఇద్దరినీ ఒకరికొకరం బాగా గౌరవించుకుంటాం” అంటారు చిత్ర.

“ వ్యాపారంలో వ్యక్తిగత, వృత్తిపరమైన బంధాలకు మధ్య గీత ఉంటుంది. అయితే మా మధ్య అసలు అలాంటి గీతే లేదు. వ్యాపారం గురించి మేం ఇంట్లో, సెలవు రోజు ఇలా ఎక్కడపడితే అక్కడ మాట్లాడుకుంటూ ఉంటాం.. అయితే అది అన్ని సందర్భాల్లో గొప్ప కాదు. అయితే పెట్టుబడిదారులుగా, టీం ను నడిపే వ్యక్తులుగా.. బిజినెస్ ను సమర్థవంతంగా నడుపుతున్న వ్యవస్థాపకులుగా మాకు తప్పదు” అంటారు అభిషేక్.