‘ఓయో రూమ్స్’ వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమైనా ఉందా?

యూజర్లను కోల్పోయి పెట్టుబడులను సమకూర్చడం వల్ల లాభం ఏంటి ? ఆన్ లైన్లో కనిపించనంత హడావుడి ఆచరణలో చూపరెందుకు ?బడాకంపెనీల చేసిన తప్పిదాలు చిన్న కంపెనీలపై ప్రభావం చూపుతున్నాయి.యూజర్లకు ప్రయోజనం లేని యాప్ అవసరం ఎవరికి ?- జుబిన్ మెహతా, యువర్ స్టోరి

‘ఓయో రూమ్స్’ వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమైనా ఉందా?

Friday May 22, 2015,

4 min Read

ఆన్ లైన్లో బడ్జెట్ హోటళ్లు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఇందులో అన్నింటికంటే ముందుగా ప్రవేశించిన స్టార్టప్స్‌లో ఓయో రూమ్స్ ఒకటి. 2011లో దీన్ని రితేష్ అగర్వాల్ ప్రారంభించారు. ఆయనకు అప్పడు 18 ఏళ్లు. పీటర్ థీల్ ఫెల్లోషిప్ ప్రొగ్రాంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రితేష్ ఓయ్ రూమ్స్ పేరుతో బడ్జెట్ హోటల్స్ చెయిన్‌ను ఆన్ లైన్లో అందుబాటులోకి తెచ్చారు. ఇటీవలే ఈ కంపెనీ దాదాపు 25 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను సెకోయా, లైట్ స్పీడ్ లాంటి సంస్థల నుంచి ఆకర్షించగలిగింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ ఓయ్ రూమ్స్ వల్ల ప్రయోజనం శూన్యం. ఎంతోమంది ఈ ఆన్ లైన్ కంపెనీని నమ్ముకొని మోసపోయారు.

స్టార్టప్ జర్నలిస్ట్‌గా ఓయ్ రూమ్స్ ఎదుగుదల నాకు తెలుసు. కానీ వారి సర్వీసును వాడుకొనే అవసరం నాకెప్పుడూ రాలేదు. నిరుడు అనుకుంటా. నాకు సరిగ్గా డేట్ గుర్తులేదు. నా కొలిగ్ ఒక అమ్మాయి నా రికమండేషన్ తో ఓయో రూమ్ సర్వీసు వినియోగించుకుంది. అయితే ఆమెకు ఎదురైన ఎక్స్‌పీరియన్స్ మాత్రం టూ వరస్ట్ అనే చెప్పాలి. హోటల్‌లో సరైన రూం ఫెసిలిటీ లేదు కదా కనీసం రిసిప్షన్ లో కూడా ఎవరూ లేరట. లక్కీగా దగ్గర్లో ఉన్న మరో ఫ్రెండ్ ఆమెను పిక్ చేసుకున్నాడు. మరో ముఖ్యవిషయమేంటంటే.. అసలు కస్టమర్ కేర్ నంబర్ పనిచేయలేదు. ఇలాంటి స్టార్టప్ లు రన్ చేస్తున్నప్పుడు వారికి చాలా రకాల సమస్యలు ఉండొచ్చు. కానీ ఇంత మరీ దిగజారిపోతారని అనుకోలేదు. పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాటిలో ఆపరేషన్స్ నిర్వహించడం పెద్ద సవాలే. ఒకసారి కస్టమర్ వెనక్కి వెళ్లిపోతే ఆ అమౌంట్ తీసుకోవడం కష్టమే. సాధారణ సైట్ల లాగా గూగుల్ యాడ్స్ కానీ, హోర్డింగ్ దగ్గర కానీసొమ్ముచేసుకోవడం అంత సులువైన విషయమైతే కాదు.(తర్వాత తెలిసిన విషయం ఏంటంటే.. ఓయో రూమ్స్ లో ఆ హోటళ్లతో పనిచేయడం మానేసింది. ఇలాంటి చెత్త ఎక్స్ పీరియన్స్ కస్టమర్లకు ఇచ్చి కనీసం దిద్దుబాటు చర్యలు ఎందుకు చేపట్టలేదని మేం కనుక్కొనే ప్రయత్నంలో ఇది తేలింది).

హోటల్ తో ఎలాంటి సంబంధం లేని ఓయ్ బోర్డు

హోటల్ తో ఎలాంటి సంబంధం లేని ఓయ్ బోర్డు


ఒక్కసారి ఫాస్ట్ ఫార్వాడ్ లోకి వచ్చి చూస్తే. మే1,2015. నేను,ఫ్రెండ్స్ తో కలసి పూణేలో ఉన్నా. కర్వే రోడ్ లో మాకు స్టే చేయడానికి హోటల్ కావల్సి వచ్చింది. ఓయో రూమ్స్ లో ట్రై చేద్దామనుకున్నాం. ఓయో రూమ్స్ సైట్ ఓపెన్ చేయగానే 5హోటళ్లు కనిపించాయి. జెఎం రోడ్ లో ఉన్నదాన్ని మేం తీసుకోవాలనుకున్నాం. ఇద్దరు స్టే చేయడానికి ధర 1999 రూపాయలుగా ఉంది. ఇది తక్కువ అని అనను కానీ రీజన్ బుల్ అని మాత్రం చెప్పగలను. పూణే సిటీ మధ్యలో ఉన్న ఈ హోటల్ లో ఇంత తక్కువ ధరకు హోటలు దొరకడం కొద్దిగ ఆశ్చర్యాన్ని కలిగించింది సుమా. తర్వాత ఆ హోటల్ కి దారి వెతికే ప్రయత్నం చేశాం. జిపిఎస్‌లో ఎంత ప్రయత్నించినా.. మొబైల్ సైట్ లో మ్యాప్ సరిగా పనిచేయని కారణంగా మాకు సాధ్యపడలేదు. మరోసారి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆటో తీసుకున్నాం. ఆటో డ్రైవర్ కి ఓయ్ రూమ్స్ కోసం పెద్దగా అవగాహణ లేనట్లుంది. గుగుల్ జిపిఎస్ ఆన్ చేస్తే. 11మినిట్స్ దూరంలో హోటల్ ఉన్నట్లు సందేశం వచ్చింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. డైరెక్షన్‌ను ఫాలో అవుతూ వెళ్లాం. మధ్యలో హోటల్ బుకింగ్ చేయడానికి ప్రయత్నించా. అయితే కుదలేదనుకోండి. ఆటో దిగి నడుచుకుంటూ హోటల్ కి చేరుకున్నాం. ఓయో రూమ్స్ పేరుతో అక్కడ హోటల్ ఉందేమో అని చుట్టు పక్కల చూశాం. అలాంటి జాడేదీ కనిపించలేదు. హోటల్ డెక్కన్ రోయాలే అని అక్కడ రాసి ఉంది. ఆదగ్గర్లో ఓయ్ రూమ్స్ ఉన్నయేమో. కానీ అక్కడికి చేరుకోడానికి మాకు దారి తెలీదే. మిగిలింది ఇదే కనుక ఇక ఇక్కడే ఉండటానికి నిర్ణయం తీసుకున్నాం. రిసిప్షన్ లోకి వెళ్లి రూం కోసం ఇంక్వయిరీ చేశాం. హోటల్ పరిసరాలు చూడ చక్కగా ఉన్నాయి. మేం హ్యాపీ.

మిస్సింగ్ ఓయ్

నా క్యూరియాసిటీ ఆపుకోలేక, రిసీప్షన్ లో ఓయో రూమ్స్ కోసం మీకు తెలుసా అని అడిగా. అవుననే సమాధానం వచ్చింది. అయితే అదొక బుకింగ్ సైట్ అట. హోటల్ టరిఫ్ చూపించాడు ఆ రిసిప్షన్ అబ్బాయి. అయిదే అందులో, నెట్ లో చూపించిన దానికంటే 15శాతం ఎక్కవ రేటుంది. ఇదేంటని అడిగితే ఓయో రూమ్స్‌లో బుక్ చేసుకుంటే తగ్గుతుంది అనే సమాధానం ఇచ్చాడా అబ్బాయి. ఇంకేముంది నేను మరోసారి ట్రై చేశా. కానీ ఫలితం లేదు. మేక్ మై ట్రిప్‌లో ట్రై చేశా. అందులో చక్కగా జరుగుతోంది. కానీ ఓయ్ రూమ్స్ లో మాత్రం కనీసం బుకింగ్ పేజ్ ఓపెన్ కావడం లేదు. మా ఫ్రెండ్ హోటలోళ్లతో మాట్లాడి మంచి డిస్కౌంట్ సాధించాడు. మేం రూం తీసుకున్నాం. నేను ఓయ్ సైట్ లో ట్రై చేసి ఫెయిలయ్యా. ఇదొక బ్రోకెన్ ఎక్స్ పీరియన్స్

ఓయో సైట్లో చూపబడిన వివరాలు

ఓయో సైట్లో చూపబడిన వివరాలు


ఇక్కడ కొన్ని ప్రశ్నలు మదిలోమెదిలాయి

టెక్నాలజీ తో మాత్రమే అంతా సాధ్యం కాదు

టెక్నాలజీ కంపెనీ కి పెట్టుబడులను ఆకర్షించడం సులువైన పనే. కానీ ఇది మొత్తం పనితో పోలిస్తే చాలా చిన్న విషయం. కంపెనీని నడపడమే కాదు మార్కెట్ లో ఎలాంటి రిమార్కు రాకుండా సేవలను కొనసాగించాలి. అది టెక్నాలజీతో సాధ్యం కాదు. పర్యవేక్షన్ చేయడం అంత సులువైన విషయమైతే కాదు.

మొబైల్ ఆధారిత కంపెనీ సంగతేంటి ?

మొబైల్ పై చాలా టాపప్స్ వస్తుంటాయి. యాప్ ని డౌన్ లోడ్ చేసుకోమని సందేశాలుంటాయి. వీటిని ఎంతవరకు నమ్మాలి. అనేది ఇప్పుడొక మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఇప్పటికే చాలా ఈకామర్స్ కంపెనీలు తమ మొబైల్ యాప్ లను షట్ డౌన్ చేసేసాయి.

అసలిది ఏ మోడల్ ?

ఓయ్ విషయంలో ఈ ప్రశ్న కచ్చితంగా లేవనెత్తాల్సిన విషయం ఉంది. ఆన్ లైన్లో ఓయ్ రూమ్స్ కి బ్రాండ్ వేల్యూ లేదనుకుందాం. అలాంటప్పుడు ఇదేమైన డిస్కవరీ చానెలా? ఎవరైనా ఓయ్ రూమ్ బుక్ చేస్తే ..వారికి ఓయ్ అనే సైన్ బోర్డ్ మాత్రమే చూపిస్తారా? ఇలాంటి కంపెనీకి యూజర్ల అవససరం లేనప్పుడు.. అసలీ కంపెనీ అవసరం జనానికి అక్కర్లేదు కదా. మన ఆర్టికల్ సబ్జక్ట్ ఇది కాదనుకుందాం. కానీ ఓయ్ కంపెనీ దాదాపు 125 కోట్ల పెట్టుబడులను సమకూర్చుకుంది. దాని సంగతేంటి. ఇప్పుడు గనక దీన్ని నిరోదించనట్లైతే.. మరింత నష్టం జరగడం ఖాయమనే దీన్ని నేను రాయాల్సి వచ్చింది.

(యువర్ స్టోరీ లో నా కలీగ్ కు ఎదురైన అనుభవంతో రాసిన కథ ఇది)

ఈ స్టోరీ ప్రచురితమైన తర్వాత ఓయో రూమ్స్ అధినేత ఈ కింది వివరణ ఇచ్చారు.

image