రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం - యోగా బార్స్ కాన్సెప్ట్

ఆరోగ్యకరమైన చిరుతిళ్లకు కేరాఫ్ అవుతోన్న బార్స్న్యూయార్క్ లో మొదలైన ఆలోచన బెంగళూరులో యోగాబార్స్ తయారీ కేంద్రంపూర్తి సహజసిద్ధమైన పదార్థాలతోనేభవిష్యత్ లో విస్తరించే యోచన

రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం - యోగా బార్స్ కాన్సెప్ట్

Wednesday May 27, 2015,

3 min Read

image


యోగా బార్స్ గురించి మీరెప్పుడైనా విన్నారా ? వినకపోయినా ఫర్వాలేదు కానీ బార్స్ అంటే ఏవో సబ్బులు అనుకునేరు. కాక్ టైల్ మిక్స్ చేసిన బార్లైతే అంతకన్నా కాదు. అలాగని కొన్ని కష్టమైన ఆసనాలను వేయడానికి ఉపయోగపడతాయని కూడా అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే యోగాబార్స్ సహజసిద్ధమైన లేపనాలతో తయారు చేసిన పదార్థాలు. 2014లో సుహాసిని, అనిందితా సంపత్ కుమార్ అనే ఇద్దరు అక్క చెల్లెళ్లు యోగాబార్స్ ను పారంభించారు.

అనందిత, సుహాసిని

అనందిత, సుహాసిని


ఇరువురు అక్కచెల్లెళ్లు న్యూయార్క్ లో ఉంటున్న రోజులవి. ఎర్నెస్ట్ అండ్ యంగ్‌లో అనిందితా పనిచేసేవారు. సుహాసిని వాట్సన్ బిజినెస్ స్కూలు ప్రొగ్రాం ఎక్సేంజ్‌లో ఉండేవారు. సుహాసినికి రోజూ ట్రావెల్ చేయడం తప్పనిసరైంది. ఫిలడల్ఫియాలో తన చదువు, న్యూయార్క్‌లో తను నివాసం కనక జర్నీ చేసేవారు. ప్రయాణంలో అలసట తెలియకుండా ఉండటానికని.. అప్పట్లో తన అక్క బార్స్ బాక్సులను ఇచ్చేవారని సుహాసిని గుర్తుచేసుకున్నారు. అమెరికాలో వారికెదురైన అనుభవం భారత్‌లో ఎనర్జీ స్నాక్స్ వ్యాపారం ఏర్పాటుకు తోడ్పడింది. భారత్‌లో ఇలాంటి వ్యాపారానికి అవకాశాలున్నాయని వారు గ్రహించారు. ఇక్కడ ఎనర్జీ స్నాక్స్ ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు. న్యూయార్క్‌లోని హోల్ ఫుడ్స్‌ను పర్యటించి వీరు కనుగొన్న విషయమేంటంటే.. భారత్‌లో ఎన్నో రకాలైన ఫుడ్స్‌ని తయారు చేయొచ్చు. వ్యాపారానికి ఎన్నో అవకాశాలున్నాయి.

మేకింగ్ ఆఫ్ యోగాబార్స్

భారత్‌కు తిరిగి వచ్చాక వాళ్ల పెద్దక్క ఆర్తి పెట్టుబడికి సాయం చేశారు. జనంలోకి ప్రాడక్ట్ తీసుకెళ్లడానికి వారి నుంచి స్పందన తెలుసుకోడానికి ఇది ఎంతగానో సాయపడింది. దీనిపై అనుకూల స్పందన వచ్చింది. మొదటి స్పందన లింక్డిన్‌లో తనకు అందిందని సుహాసిని చెప్పారు. మంచి వ్యాపార ఆలోచనతో వస్తే భారత్ లో వెన్నుతట్టి సాయం చేసేవారి సంఖ్య ఎక్కువ. మొదట్లో ప్రాడక్ట్ తయారీతో పాటు టీం ను ఏర్పాటు చేయడానికి దీని అవసరం ఎంతైనా ఉంది. మేం ఫ్యాక్టరీ కట్టడానికి ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ ఎంతో సులభంగా పొందగలిగాం. దీంతో విజయా బ్యాంకు మాకు అప్రోవల్ ఇచ్చింది. ప్రభుత్వమే మాకు గ్యారంటర్ గా వ్యవహరించడం సంతోషకరమైన విషయమని సుహాసిని అన్నారు.

బార్స్ ఎలా ఉండాలనే దానిపై 3 రకాల ప్రతిపాదనలు నిర్ణయించారు.

  • వీటిని సహజసిద్ధంగా తయారు చేయాలి. కృత్రిమ ఫ్లేవర్లు, ఉత్పత్తులు వాడకూడదు.
  • దీని ధర అందరికీ అందుబాటులో ఉండాలి.
  • సాధ్యమైనంతలో రుచికరంగా ఉండాలి.

యోగా బార్స్ తయారీలో ఉపయోగించే అన్ని పదార్థాలూ దేశంలో వివిధ ప్రాంతాలనుంచి తీసుకొచ్చినవే. ఏదైనా రాష్ట్రం యాలకులకు ప్రాశస్త్యం అయితే అక్కడి నుంచి యాలకులతోనే బార్‌ను తయారు చేయాల్సి ఉంటుంది.అయితే వీళ్లు జొన్నల గంజిని, విటమిన్స్ కలిగిన పదార్థాలను తమ ప్రాడక్టుల్లో కలపరు. సాధారణంగా బార్స్ జీవితకాలం మూడు నెలలే. అందుకే ఆర్టిఫిషియల్ పదార్ధాలు బార్స్‌లో లేకుండా జాగ్రత్తపడ్డారు. మూడు నెలలు దాటితే పదార్థాలు పాడవుతాయి. అయినా ఫర్వాలేదు, తాము అనుకున్న ఉత్పత్తి సహజసిద్దంగా ఉండాలనేదే వీళ్ల ఆలోచ.

వ్యాపార విస్తరణ

స్థానికంగా తయారు చేసిన ప్రాడక్టులను తాము అమ్మకానికి పెడతామని సుహాసిని చెప్పారు. పెట్టుబడి పెట్టి ప్రాడక్టు బయటకి రావాలంటే ఆరు నెలల వ్యవధి పడుతుంది. తమని ఫాలో అయ్యే వ్యక్తులను ముందుగా గుర్తించగలగాలి. తర్వాత వారిని ఒప్పించాలి. తర్వాత అమ్మకాలు మొదలు పెట్టాలి. దాదాపు రెండేళ్లు కష్టపడి నగరంలో 50 బేకరీలను అమ్మకానికి ఫైనలైజ్ చేశారు. తర్వాత బార్స్ తయారు చేయడానికి కావల్సిన మెషీన్ల కోసం దేశం మొత్తం తిరిగారు. భారత్ లో వ్యాపారం చాలా విభిన్నమైనది. ప్రతి ఒక్కరిని కలసి , మాట్లాడి ఒప్పించాలి. చాలా ఫుట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది హార్డ్ వర్క్ మాత్రమే కాదు చాలా ఉత్తేజ్జాన్నిచ్చే అంశం. ఎలాగైతేనేం ఇద్దరూ కలసి దొమలూరు ఇండస్ట్రియల్ ప్రాంతంలో స్థలాన్ని పొందారు.

టార్గెట్ మార్కెట్

యోగా బార్స్ టార్గెట్ మార్కెట్ 25 నుంచి 35 ఏళ్ల జనాలు. వీరిది యాక్టివ్, బిజీ లైఫ్‌స్టైల్‌. వీళ్లకు మాత్రమే వారి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ ఉంటుంది. ఇలాంటి వస్తువులు దొరికితే కొనడానికి ఈ వయస్సు వాళ్లంతా ఆసక్తిగానే ఉంటారరని గమనించారు.


image


మార్కెట్ సైజ్

2016 నాటికి ఫుడ్ బార్ మార్కెట్ అమెరికాలో 8.3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.రైట్ బైట్, నేచర్స్ వ్యాల్యూ భారత్‌లో మంచి పాపులారిటీనే పొందుతున్నాయి. ఇవి 2005-2006 లో ప్రారంభమయ్యాయి. కానీ యోగా బార్స్ భారత్‌లో అడుగుపెట్టిన వేళా విశేషం చాల గొప్పది. సరైన సమయంలో మార్కెట్ లోకి వచ్చిందీ సంస్థ. భారత్‌లో ఫిట్‌నెస్‌తో పాటు హెల్తీ ఫుడ్ మార్కెట్ 40 శాతానికిపైగా వృద్ధి సాధిస్తోంది. దీంతో యోగా బార్స్ తనదైన మార్కెట్ లో దుమ్మురేపుతోంది.


భవిష్యత్ ప్రణాళికలు

ప్రస్తుతం యోగా బార్స్ బెంగళూరులోని హెల్త్ కార్ట్, బిగ్ బాస్కెట్ , గోద్రేజ్, నాంధారి లాంటి కొన్ని రిటైల్ షాపుల్లో లభిస్తున్నాయి. గూగుల్, లింకిడిన్ , ఇన్ మోబి లాంటి కార్పోరేట్ కార్యాలయాల్లో దొరుకుతున్నాయి. నిరుడు ఆగస్టులో ప్రారంభమై ఇప్పటి వరకూ 2వేల బార్స్ ను అమ్మారు. మరో 20నుంచి 30వేల బార్స్ అమ్మడానికి టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇందులో 30నుంచి 40శాతం ఆన్ లైన్లో మిగిలిన 60శాతం ఆఫ్‌లైన్‌ మార్కెట్లో అమ్మాలని నిర్ణయించుకున్నారు. మొదట్లో ప్యాకేజింగ్‌ని ఔట్ సోర్స్ చేసేవారు. ఆ ప్యాకేజింగ్ కూడా బాగానే ఉండేది కానీ .. తామేంటో తెలియాలంటే తమ ప్యాకేజి చూసి తెలుసుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. యోగా బార్స్ తీసుకుంటే శక్తి,ప్రశాంతత, ప్రేమ, రుచి తోపాటు మంచి ఆరోగ్యగం లభిస్తుందని ప్యాకెట్ చూడగానే అనిపించాలట. దీంతో ఈఏడాది జూలై నుంచి తమ ప్యాకింగ్ తామే చేయాలని నిర్ణయించుకున్నారు. పూర్తి స్థాయి బ్రాండింగ్ చేసిన తర్వాతనే అన్నిస్టోర్ లలో అందుబాటులోకి వస్తామని సుహాసిని ముగించారు.