హైదరాబాదులో సముద్రం లేకపోతేనేం.. స్కూబా డైవ్ చేయండిలా..

హైదరాబాదులో సముద్రం లేకపోతేనేం.. స్కూబా డైవ్ చేయండిలా..

Wednesday March 30, 2016,

3 min Read


సముద్రం లేకుండా స్కూబా డైవ్ ఏంటని టైటిల్ చూసి ఆశ్చర్యపోయారా..? మరదే.. హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. ఏం కావాలన్నా దొరుకుతుంది. చివరికి సముద్రం అడుగుభాగాన స్విమ్మింగ్ చేసే స్కూబా డైవింగ్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా క్లారిటీ రాలేదు కదా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.. 

image


స్కూబా డైవ్. ఇదొక సాహస క్రీడ. బ్రీథింగ్ గ్యాస్ సాయంతో సముద్రం అడుగు భాగానికి వెళ్లి ఈత కొట్టడం. SCUBA అంటే Self-Contained Underwater Breathing Apparatus( నీటి అడుగు భాగంలో శ్వాస ఉపకరణాల సాయంతో స్వీయ నియంత్రణ చేయడం) ఈ మధ్య సెలబ్రిటీలు దీనిపై మోజు పెంచుకుంటున్నారు. 

అయితే సాధారణంగా సముద్రం ఉన్న చోట మాత్రమే ఇలాంటి ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్లు ఉంటాయి. మరి హైదబాదులో సముద్రం లేదుకదా.. ఎలా ట్రైన్ చేస్తారనేగా మీ సందేహం. స్కూబా డైవ్ చేయాలంటే సముద్రమే ఉండాల్సిన పనిలేదండోయ్. సముద్రంలాంటి ఫీల్ వచ్చే స్విమ్మింగ్ పూల్ ఉంటే సరిపోతుంది. పైగా స్విమ్మింగ్ రాకపోయినా స్కూబా డైవ్ చేయొచ్చు. 

బలరామ్ నాయుడు. లైవ్ ఇన్ ఎడ్వెంచర్ ఫౌండర్. నేవీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఎడ్వంచర్లపై ఉన్న మక్కువతో ‘లైవ్ ఇన్ అడ్వంచర్స్’ ని ప్రారంభించారు. నేవీలో స్కూబా డైవ్ చేసే టీంలో సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత వారికి ట్రెయినర్ గా వ్యవహరించారు. వందల మంది నేవీ సిబ్బందికి స్కై డైవింగ్ శిక్షణ ఇచ్చారు. రిటైరైన తర్వాత స్కై డైవింగ్ ఇన్ స్టిట్యూట్ పెట్టాలని భావించారు. కానీ ప్రభుత్వ అనుమతులు రాకపోవడంతో స్కూబా డైవ్ ను ప్రారంభించారు. 

ఇక మరో కో ఫౌండర్ కేశవ్. ఐటి ఉద్యోగి అయిన కేశవ్ అడ్వంచర్లపై ఉన్న మక్కువతో ఇందులోకి వచ్చారు. కేశవ్ ఈ సంస్థలో ఆపరేషన్స్, ప్రమోషన్ వ్యవహారాలు చూస్తున్నారు. మొదటి టార్గెట్ ఐటి ఉద్యోగులను పెట్టుకోవడం వల్ల నెమ్మదిగా మార్కెట్ లోకి రాగలిగామని అంటున్నారాయన. డిస్కవర్ స్కూబా డైవ్ పూల్ సెషన్ పేరుతో ఒక కోర్సును ప్రారంభించారు. నాన్ స్మిమ్మర్స్ కూడా ఈ కోర్సు లో జాయిన్ కావొచ్చని కేశవ్ సలహా ఇస్తున్నారు. స్మిమ్మింగ్ లో మెళకువలు కూడా నేర్పిస్తామని అంటున్నారు. వాటర్ ఫోబియా ఉన్న వాళ్లకి ఉచితంగా స్మిమ్మింగ్ నేర్పించి మరీ స్కూబా డైవ్ టెక్నిక్స్ చెబుతారట. మే నెలలో ప్రత్యేక సమ్మర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. నీటి లోపలకి వెళ్లి ఈత కొట్టిన అనుభూతిని పొందాలంటే తమని సంప్రదించాలంటున్నారు. ప్రతి సెషన్ లో వందల మంది హైదరాబాద్ లోనే స్కూబా డైవ్ చేస్తున్నారు. అప్పుడప్పుడూ ప్రత్యేక సెషన్లపై వైజాగ్ దాకా వెళ్లొస్తున్నారు. 

image



లైవ్ ఇన్ అచీవ్ మెంట్స్

1. చాలా మంది కపుల్స్ కు నీటి లోపల ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకోవాలని ఉంటుంది. ఆ విష్ ని వీళ్లు ఫుల్ ఫిల్ చేశారు. నీటిలో మ్యారేజ్ యానివర్సిరీలు కూడా చేపడతారు. 

2. చిన్నారులతో కలసి పేరెంట్స్ అండర్ వాటర్ పిక్చర్స్ ( నీటిలోపల ఫోటోలు) తీసుకోడానిక ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేశారు.

3.మెరైన్ లైఫ్ రీసెర్చి లాంటి వాటిపై ప్రత్యేక ఈవెంట్స్ చేపడుతున్నారు.

4. వైజాగ్ బీచ్ లో ఏర్పాటు చేసిన సెషన్లో.. లాబ్ స్టర్, చేపలతో కలసిన ఎక్స్ పీరియెన్స్ ని అందించారు. అయితే ఇది ప్రాపర్ ట్రెయినింగ్ తర్వాతనే సాధ్యమవుతుంది.

5.ఇప్పటి వరకూ ఈ స్కూబా డైవ్ లో చిన్నా పెద్దా కలిసి 300 మంది దాకా పాల్గొన్నారు.

కేశవ్ రామ్ తో బలరామ్

కేశవ్ రామ్ తో బలరామ్


ప్రధాన సవాళ్లు

1.సాధారణంగా జనానికి వాటర్ ఫోబియా ఉంటుంది. అదే పెద్ద సమస్య అంటున్నారు కేశవ్. అయితే స్మిమ్మింగ్ రాకపోయినా స్కూబా డైవ్ చేయొచ్చనే సంగతిని ప్రచారం చేసి ఈ సవాల్ ని అధిగమిస్తామంటున్నారు.

2.మామూలు ఎడ్వంచర్ స్పోర్ట్స్ తో పోలిస్తే ఇది ఖర్చుతో కూడుకున్నది. సెఫ్టీ కోసం తాము ఉపయోగించే పరికరాలు చాలా ఖరీదైనవి. అందుకే ఎఫర్ట్ చేసే వాళ్లు దొరకడం కూడా సవాలే అంటున్నారు కేశవ్.

భవిష్యత్ ప్రణాళికలు

ఖమ్మం ప్రాంతంలో స్కై డైవ్ అనుమతుల కోసం అప్లై చేశారు. దాని అనుమతులు రావల్సి ఉంది. అవి వస్తే మలేషియా, సింగపూర్ వెళ్లి స్కై డైవ్ చేయక్కర్లేదు. వైజాగ్ కేంద్రంగా స్కూబా డైవ్ స్కూల్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు బలరామ్ తెలిపారు. బే ఆఫ్ బెంగాల్ లో మెరైన్ లైవ్ ఈవెంట్స్ కోసం ఆంధ్రా టూరిజం అధికారులతో చర్చలు జరుపుతున్నామని బలరాం అన్నారు. సిటీలో మరిన్ని పూల్స్ లో స్కూబా డైవ్ ఈవెంట్స్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ కలసి వస్తే ప్రతి స్కూల్లో స్కూబా డైవ్ ఏర్పాటు చేయడానిక సిద్ధంగా ఉన్నట్లు బలరామ్ ప్రకటించారు. పారా సెయిలింగ్, పారా గ్లైడింగ్, పారా ట్రిక్ ఇన్ సౌతిండియా లాంటి మరిన్ని ఎడ్వంచర్ స్పోర్ట్స్ ను తీసుకొస్తామని చెప్పుకొచ్చారు.


website