ఈ-కామర్స్ కంపెనీలకు బూస్ట్ "వెబ్ ఎంగేజ్"

Sunday February 28, 2016,

4 min Read

ఈ కామర్స్. వస్తు అమ్మకాల్లో అదొక ప్రభంజనం. కస్టమర్ కడుపులో చల్ల కదలకుండా గడపదగ్గరికే కోరుకున్న వస్తువు తెచ్చిచ్చే సర్వీస్. మొదట్లో వేళ్లమీద లెక్కపెట్టేన్ని సంస్థలుండేవి. క్రమంగా కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఫలితంగా ఒక్క వస్తువును కొనేందుకు వినియోగదారుడు ఎన్నో ఈ కామర్స్ సైట్లు చుట్టేస్తున్నాడు. ఇంతవరకు బాగానే వుంది కానీ, తనకు కావాల్సిన వస్తువు విషయంలో మాత్రం ఏదో ఒక చోట ఆగిపోతున్నాడు. అధి ధర కావొచ్చు... కలర్ కావొచ్చు... డెలివరి కావొచ్చు. కారణం ఏదైనా కార్ట్ దాకా వచ్చిన కస్టమర్ ఆర్డర్ దాకా రాలేకపోతున్నాడు. ఇలాంటి వాళ్లందరికీ ఆయా సైట్లలో వాళ్ల రిక్వైర్ మెంట్ వచ్చిన వెంటనే అలర్ట్స్ పంపే సర్వీసే వెబ్ ఎంగేజ్.

undefined

undefined


ఈ కామర్స్ కంపెనీల ఎదుగుదలకు దారి చూపిస్తూ...దాన్నే తన ఉన్నతిగా మార్చుకుంటున్న స్టార్టప్ వెబ్ఎంగేజ్. ఈ కామర్స్ కంపెనీల విశ్వరూపాన్ని ముందుగానే అంచనా వేసి... వాటిని మరింతగా కస్టమర్లకు చేరువ చేసే ఐడియాలే "వెబ్ ఎంగేజ్" పెట్టుబడి. అవ్లీష్ సింగ్, అంకిత్ ఉట్రేజా అనే ఇద్దరు మిత్రుల ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే వెబ్ ఎంగేజ్. ఆలోచనలే సేల్స్ మెన్లుగా భావించి ఎలాంటి టీమ్ లేకుండా కంపెనీని ప్రారంభించిన వీరిద్దరూ.. ఇప్పుడు ఈ కామర్స్ కంపెనీలకు ఓ రకంగా ముద్దుబిడ్డలు. నాలుగేళ్ల క్రితం "బర్ఫ్" నుంచి బయటకు వస్తున్నప్పుడు వీరిని చూసి అందరూ జాలిపడ్డారు. కానా ఇప్పుడు వెబ్ ఎంగేజ్ దూకుడు చూసి శభాష్ అనకుండా ఉండలేకపోతున్నారు.

వెబ్ సైట్స్, యాప్స్ తేడా లేకుండా అన్నింటికీ టార్గెటెడ్ కస్టమర్ కి సందేశం పంపుతుంది. వెబ్ సైట్ నోటిఫికేషన్స్, పుష్ మెసెజెస్, యాప్ మెసెజెస్, ఈ మెయిల్, టెక్ట్స్ మెసెజెస్.. అన్ని రకాలుగా కస్టమర్ కు సమాచారం పంపుతుంది. తనకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న వస్తువు దొరికినప్పుడు కస్టమర్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడు. ఇదే టాప్ ఈ కామర్స్ కంపెనీలను కట్టిపడేసింది. వెబ్ ఎంగేజ్ క్లయింట్లుగా మార్చింది. ఈబే, ఫ్లిప్ కార్ట్, ఫైజర్, మేక్ మై ట్రిప్, ఎంటీవీ లాంటి బడా కంపెనీలు వెబ్ ఎంగేజ్ 2.0 క్లయింట్లే.

ఆన్ లైన్ ఒక్కటే కాదు... ఆఫ్ లైన్ కూడా...!

ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్( స్టోర్స్ )మార్కెట్ల డాటాతో మరింత మెరుగైన సర్వీస్ అందించేందుకు వెబ్ ఎంగేజ్ ముందుకొచ్చింది. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా ఉన్న కేపిలరీ టెక్నాలజీస్ తో టై అప్ అయింది. కేపిలరీ టెక్నాలజీస్ ప్రస్తుతం ఈ కామర్స్ సంస్థలకు క్లౌడ్ బేస్డ్ కస్టమర్ ఎనలిటిక్స్ మార్కెటింగ్ ఫ్లాట్ ఫామ్ గా పనిచేస్తోంది. హైదరాబాద్ కు చెందిన మల్టీచానల్ కామర్స్ ప్రోవైడర్ మార్ట్ జాక్ ను కాపిలరీ టెక్నాలజీ టెకోవర్ చేసింది. కేపిలరీ టెక్నాలజీస్ తో భాగస్వామ్యం వల్ల ఆఫ్ లైన్, ఆన్ లైన్ వినియోగదారుల అవసరాలు, ఆలోచనలను మరింత లోతుగా విశ్లేషించి.. స్మార్టర్ సేవలను అందించగలరని అవ్లేష్ సింగ్ చెబుతున్నారు. ఈ సేవలు ఈ కామర్స్ కంపెనీలకే కాదు.. రీటైలర్లకు కూడా బాగా ఉపయోగపడతాయి. వినియోగదారుడిని అర్థం చేసుకుంటే వ్యాపారానికి తిరుగే ఉండదనేది జగమెరిగిన సత్యం

undefined

undefined


బయట మార్కెట్లో ఏదైనా వస్తువు వినియోగదారుడు కొన్నప్పుడు కేపిలరీ టెక్నాలజీస్ కు చెందిన పీఓఎస్ వాడితే.. ఆటోమేటిక్ గా సమచారాన్ని ఆన్ లైన్ కు చేరుస్తుంది. ఆ వినియోగదారుని అవసరాల్ని విశ్లేషించగలుగుతారు. దాంతో కస్టమర్ కు వెబ్ ఎంగేజ్ ద్వారా నోటిఫికేషన్ లు పంపుతుంది. ఆఫ్ లైన్ స్టోర్లు కూడా ఇప్పుడు వెబ్ ఎంగేజ్ లో ఫ్లాట్ ఫాం ఓపెన్ చేసుకోవచ్చు. వినియోగదారుని అవసరాలను విశ్లేషించిన తర్వాత... ఆయా వినియోదారునికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు మెబైల్, వెబ్, పుష్ నోటిఫికేషన్లను వెబ్ ఎంగేజ్ 2.0 పంపిస్తుంది. దానికి ద్వారా స్టోర్ లో తనకు కావాల్సిన వస్తువు ఉందని వినియోగదారుడు సులువుగా గుర్తించగలుగుతాడు.

ది కాపిలరీ యాక్షన్

అవ్లీష్ కి కాపిలరీ టెక్నాలజీస్ కో ఫౌండర్ అనీష్ రెడ్డి చాలాకాలం నుంచి తెలుసు. అయితే అవ్లీష్ ఐడియాపై ఉన్న పట్టు గమనించిన తర్వాతే పెట్టుబడి పెట్టడానికి అనీష్ రెడ్డి ముందుకు వచ్చారు. ఎంటర్ ప్రైజ్ ఫోకస్డ్ కంపెనీతో భాగస్వామ్యం అవడానికి వెబ్ ఎంగేజ్ చేసిన ప్రయత్నం కేపలరీ టెక్నాలజీస్ తోనే ప్రారంభం కాలేదు. అంతకు ముందు చాలా కంపెనీలను కలిశాడు. ఉత్సాహవంతంగా చర్చలూ సాగాయి. కానీ రెండో దశలో అవి బెడిసికొట్టాయి. కానీ సమన్వయం, ఆలోచనలు కలసి సాగడంతో కేపిలరీ టెక్నాలజీస్ తో బంధం పెనవేసుకుపోయింది. ఈ రెండు కంపెనీలు కలిసి ఇప్పుడు ఒకరు కస్టమర్ సైడ్ నుంచి మరొకరు వ్యాపారి వైపు నుంచి సేవలు అందిస్తూ దూసుకెళ్తున్నారు.

వెబ్ఎంగేజ్ దారి రహదారి

అరవై మంది అద్భుతమైన క్రియేటివ్ వర్క్ ఫోర్స్ తో వెబ్ ఎంగేజ్ దూసుకెళ్తోంది. వీరంతా ఇంజినీరింగ్, డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వెబ్ ఎంగేజ్ ఇప్పటికే 32వేల మెబైల్ ఇన్ స్టాల్స్ ను ను నమోదు చేసుకుంది. వెయ్యి మందికిపైగా పెయిడ్ కస్టమర్లను సాధించింది. ఈ స్టార్టప్ ప్రపంచం అంతా విస్తరిస్తోంది. వెబ్ ఎంగేజ్ ప్రస్తుతం 50 శాతం ఆసియా, యూఎస్, యూకే కలిపి 30శాతం, లాటిన్ అమెరికాలో పదిశాతం, మిగతా దేశాలకు కలిపి పదిశాతం మార్కెట్ సాధించింది. నెలవారీగా 300 మిలియన్ల మంది యూజర్స్ వెబ్ఎంగేజ్ ను వాడుతున్నారు.

మార్కెట్లో వెబ్ఎంగేజ్ లాంటి మరికొన్ని కంపెనీలు ఉన్నా... తన సృజనాత్మకతో అందరికీ రోల్ మోడల్ గా ఉండగలననే దీమాగా ఉన్నాడు అవ్లీష్. అందుకోసం రెండు మార్గాలను ఎంచుకున్నాడు.

1. జర్నీ బిల్డర్ : విజువల్ మోడల్ తో వినియోగదారుని డాటా, ఈవెంట్స్ ద్వారా ఆటోమోటిక్ గా మెసెజెస్, నోటిఫికేషన్స్ ను పంపండి. వీడియో ద్వారా మరింత సవివరంగా తెలుసుకోవచ్చు.

2. మిస్టర్ x: వెబ్ఎంగేజ్ 2.0 తర్వాత కంపెనీ ఇప్పుడు మరో వినూత్నమైన ప్రొడక్ట్ ను సిద్దం చేస్తోంది. మూడో త్రైమాసికంలో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు వెబ్ఎంగేజ్ ఇంజినీర్లు రెడీ అవుతున్నారు.

భవిష్యత్ ప్రణాళికలు

మోబ్ఎంగేజ్, క్లెవర్ టాప్ ప్రస్తుతం వెబ్ ఎంగేజ్ కు పోటీదారులు. ట్విస్ట్, మెల్టాగ్, కస్టమర్ 360( అమెరికన్ కంపెనీ ఎక్వైర్ చేసింది ) లాంటి కంపెనీలు కూడా మార్కెట్ పై కన్నేశాయి. ప్రస్తుతం వెబ్ఎంగేజ్ ఐదులక్షల డాలర్ల పెట్టుబడిని బ్లూమ్ వెంచర్స్, జీటీఐ క్యాపిటల్స్ నుంచి సేకరించింది. ఇప్పటికే ఉన్న వాటాదారులు మరింత కన్వర్టబుల్ బాండ్ల రూపంలో మరింత పెట్టుబడి పెడుతున్నారు. కాపిలరీ టెక్నాలజీ పెట్టుబడి దీనికి అదనం. ఎంత ఎక్కు పెట్టుబడి వస్తే అంత ఎక్కువ ఎదుగుతారు. ఆర్ధికంగా స్థిరత్వం సాధించడానికి కొంత సమయం పడుతుంది. పనితీరు ప్రచారమే సాన్ కంపెనీకి బిగ్గెస్ట్ సోర్స్.. వెబ్ ఎంగేజ్ కు అలాంటి ప్లస్ పాయింటే వుందంటారు అవ్లీష్. 

కొత్త ప్రొడక్ట్ ను సిద్దం చేసిన తర్వాతే కొత్త పెట్టుబడి కోసం చూడాలని అవ్లీష్ నిర్ణయించుకున్నాడు. వెబ్ఎంగేజ్ కొత్త ఉత్పత్తి మరో మూడు నెలల తర్వాత బయటకు రానుంది. వచ్చే ఐదేళ్లకి వంద మిలియన్ డాలర్ల రెవిన్యూను అవ్లీష్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. వెబ్ఎంగేజ్ ఆలోచనలు, క్రియేటివిటి ముందు ఈ లక్ష్యం చాలా చిన్నగానే ఉంటుంది.