సిటీలో ఎవరికీ తెలియని హ్యాంగవుట్ ప్లేస్‌లు చూపించడమే వీళ్ల వ్యాపారం

0

అహ్మదాబాద్ కేంద్రంగా వెలిసిన సిటీషోర్.

తెలియని ఎన్నో విషయాలు తెలియజేసే సిటీషోర్.

హాబీ నుంచి పుట్టుకొచ్చిన సిటీషోర్.

ఉద్యోగానికి వెరైటీ అర్హతలు పెట్టిన సిటీషోర్ .

విలియం డాల్రింపుల్ (William Dalrymple) రాసిన ది లాస్ట్ మొఘల్ ( The Last Mughal) పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నాకు ఢిల్లీ మొత్తం కళ్లకు కట్టినట్టయింది. ముఖ్యంగా చివరి మొఘల్ రాజు జాఫర్ హయాంలో నగరం ఎలా ఉందో తెలుసుకోగలిగాను. నాకు తెలియని ఎన్నో ప్రదేశాలు, నిగూఢమైన రహస్యాలు తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యాను. రెండుసార్లు పుస్తకం చదివిన తర్వాత ఢిల్లీ వెళ్లి మొత్తం చూసి వచ్చాను. చివరకు నాకొకటి అనిపించింది. మనమున్న సిటీలో మనకు తెలియని ప్రదేశాలను, నిగూఢాలను వెలికి తీయాలని..!

అహ్మదాబాద్ లో నేను ఎంతోకాలంగా ఉంటున్నాను. కానీ జసుబెన్స్ పిజ్జా (Jasuben’s Pizza) గురించి ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చెప్పేంతవరకూ నాకు తెలియదు. అహ్మదాబాద్ లాంటి నగరాల్లో ఇలాంటివి చాలా ఉంటాయని నాకు చాలా గట్టి నమ్మకం. అంతే.. ఇద్దరం కలిసి చరిత్రాత్మక ప్రదేశాలతో పాటు పర్యటనలో తప్పకుండా చూడదగ్గ ప్రదేశాలను, దుకాణాలను గుర్తించాలనుకున్నాం.

సిటీషోర్ టీం
సిటీషోర్ టీం

అలా పుట్టుకొచ్చిందే సిటీషోర్ (CityShor). దీని వ్యవస్థాపకులిద్దరికీ రెండు విభిన్న అభిరుచులున్నాయి. పల్లవ్ పారిఖ్‌కు ప్రదేశాలు చూడడం ఇష్టం. పంకజ్ పాఠక్‌కు రాయడం వెన్నతో పెట్టిన విద్య. పాతకంపెనీలలో పరిచయస్తులు కావడం వల్ల ఇద్దరూ కలిసి ఏదైనా చేయాలనుకున్నారు. వీళ్లద్దరూ మరో నలుగురినితో కలిసి సిటీషోర్ స్థాపించారు. చహత్ షా, నిర్జారి షా, రాహుల్ పర్దాశాని, శేఖర్ నిర్మల్‌లతో కలిసి కొత్త ప్రదేశాలు, ప్రజలను సిటీషోర్ ద్వారా పరిచయం చేయడం మొదలు పెట్టారు.

సిటీషోర్‌లో ఇంకా ఏముంది..?

సామాన్యులకు - అహ్మదాబాద్‌లోని ఆహారం, ఫ్యాషన్, పర్యాటక ప్రదేశాలు, ఈవెంట్స్, ఇంటీరియర్ డిజైన్స్, ఎంటర్‌టైన్‌మెంట్.. తదితర అంశాలను తెలియజేస్తుంది. ఎవరికీ తెలియని వాటిని మాత్రమే తెలియజేస్తుంది. ఉదాహరణకు అహ్మదాబాద్‌లో బ్లేడ్స్ లేని ఫ్యాన్స్ తయారు చేసే కంపెనీ ఉందని ఎంతమందికి తెలుసు..?

వ్యాపారంకోసం - సిటీషోర్ చూడడానికి పెద్ద ఆన్‌లైన్ కంపెనీలాగా కనిపిస్తుంది. పేపర్, రేడియో, హోర్డింగులు లాంటి ప్రకటనలు లేకుండా వాళ్ల ప్రోడక్టులను ప్రజలకు చేరువ చేయడానికి సిటీషోర్ ఎంతో దోహదం చేస్తుంది.

అహ్మదాబాద్ స్పెషల్ బ్రెడ్ బౌల్‌లో సూప్
అహ్మదాబాద్ స్పెషల్ బ్రెడ్ బౌల్‌లో సూప్

2013 ఏప్రిల్ 10న సిటీషోర్‌ను పూర్తిస్థాయిలో ప్రారంభించారు. అయితే వాళ్లు దీనిపై జనవరి 2013 నుంచే పనిచేస్తున్నారు. ఆన్‌లైన్ బిజినెస్ చేసే ఇతర సంస్థలతో జతకట్టి మరిన్ని బ్రాండ్స్‌ను వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నారు. ప్రచారమే వాళ్ల ప్రధాన ఆదాయ వనరు. స్థానిక ప్రచార మార్కెట్ స్వరూపాన్నే మార్చేయాలనేది వారి ఉద్దేశం.

అహ్మదాబాద్ వాళ్లు కాకపోయినా.. ఆన్‌లైన్ మార్కెటింగ్‌పై వారికి పూర్తి పరిజ్ఞానముంది. ప్రస్తుతం వీళ్లు నిబద్ధత కలిగిన భాగస్వాములకోసం వెతుకుతున్నారు. వాళ్లతో కలిసి సంస్థను మరింత విస్తరింపజేయాలనేది ప్రణాళిక. ఇప్పుడు అహ్మదాబాద్‌ సహా పూణెలో ప్రతి అంశాన్ని సిటీషోర్ ద్వారా తెలియజేస్తున్నారు. త్వరలో మరిన్ని సిటీల సమాచారాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

అహ్మదాబాద్‌లో బెస్ట్ జాబ్ అనే పేరుతో ఇటీవలే రిక్రూట్మెంట్ పూర్తి చేశారు. ఈ ఉద్యోగానికి కావల్సిన అర్హతలు వింటే ఆశ్చర్యపోతారు. అవేంటో తెలుసా.. సినిమాలు చూడడం, తినడం, షాపింగ్ చేయడం, పర్యటించడం, ఈవెంట్స్‌కు హాజరు కావడం, కొత్తవాళ్లలతో మాట్లాడడం, ఫేస్‌బుక్, ట్విట్టర్ విస్తృతంగా వాడడం..! హ హ.. భలే అర్హతలు కదూ…?