మంచి కాఫీ లాంటి బొటిక్..కాషాకి ఆశా...

మంచి కాఫీ లాంటి బొటిక్..కాషాకి ఆశా...

Tuesday January 05, 2016,

2 min Read


అమెరికాలో పుట్టింది. ఫ్రెంచి యువ‌కుడిని పెళ్ళి చేసుకుంది. పాండిచేరిని ప్రేమించింది. ఎందుకంటే ఆ న‌గ‌రం ఒక‌ప్పుడు ఫ్రెంచి వాళ్లు గడిపింది కాబట్టి. పైగా ఆమెకి ఇండియా అంటే బోలెడంత ప్రేమ‌. ఇక్క‌డి సంప్ర‌దాయాలు, విలువ‌లు, అన్నిటినీ అభిమానించింది.

కషా వందా. న్యూయార్క్ లో్ని ఓ చిన్న ప‌ట్ట‌ణంలో పుట్టి పెరిగింది. తండ్రి ఆర్కిటెక్ట్. ఆమె అభిరుచి కూడా అదే. న్యూ ఆర్లియ‌న్స్ కాలేజీలో ఆర్కిటెక్చ‌ర్ చ‌దివింది.

image


1992లో క‌షా భ‌ర్త‌కి పాండిచేరిలో లిసీ ఫ్రాంకాయిస్ లో టీచింగ్ కాంట్రాక్ట్ రావ‌డంతో ఆమె కూడ ఇండియాకి వ‌చ్చింది. చెన్నైలో విమానం దిగిన మరుక్ష‌ణమే ఇక్కడి మట్టి మీద ఏదో తెలియని అభిమానం పెంచుకుంది. ఇక్క‌డ త‌ప్ప ఇంకెక్క‌డా బ‌త‌క‌లేమ‌ని అప్పుడే నిర్ణ‌యించుకుంది. కొన్నాళ్లకు ఇక్క‌డ త‌యార‌య్యే హ‌స్త‌క‌ళ‌ల‌ను న్యూయార్క్ ఎగుమ‌తి చేయాలనుకుంది.

అప్ప‌టివ‌ర‌కు ఆమెకు ఒక చోట ప‌నిచేయ‌డం కానీ, షాప్ న‌డ‌ప‌డం కానీ తెలియ‌దు. గతంలో ఒక బొటిక్ ఉన్న ప్లేసులో తను షాప్ ఓపెన్ అయింది. పాండిచెరి చుట్టు పక్క‌ల ప్రాంతాల‌తోపాటు, ఇండియాలోని ప‌లు ప్రాంతాల నుంచి హ‌స్తక‌ళ‌ల‌ని సేక‌రించి అమ్మాలని డిసైడ్ అయింది. వ‌స్తువులు ఖ‌రీదైన‌వేం కాదు. కానీ, అద్భుత‌మైన‌వి, అరుదైన‌వి. లెద‌ర్ హాండ్ బ్యాగ్స్, దుస్తులు, ఆభ‌ర‌ణాలు.. ఇలా అన్నీ దొరుకుతాయి. క‌షా తోపాటు ఎలిసా, వ‌న‌జ‌, సుమ‌తి, మాడెలీన్, సోఫియా అనే మ‌రో అయిదుగురు స్థానిక మ‌హిళ‌లు కూడా ఇందులో పనిచేస్తున్నారు.

image


కేవ‌లం బొటిక్ ఒక్క‌టే కాదు.. ఈ షాప్ లో ఒక గార్డెన్ కేఫ్ కూడా వుంది. ఆర్గానిక్ కాఫీ, హోమ్ మేడ్ కేక్, యూరోపియ‌న్ భోజ‌నం, దోశ‌లు.. ఇలా అన్నీ వుంటాయిక్క‌డ‌. క‌షాకి ఆశ మొద‌లైన రెండేళ్ళ‌కు ఈ కెఫె స్టార్ట్ చేసింది . కాఫీ తాగుతూ రిలాక్స్ డ్ గా పుస్త‌కం చ‌దువుకోవ‌డం అంటే, క‌షాకి కూడా ఇష్ట‌మే. మంచి ఎట్మాస్ఫియర్, సౌక‌ర్య‌వంత‌మైన కుర్చీలు, అంద‌మైన పువ్వులు.. ఇంకేం కావాలి.. క‌స్ట‌మ‌ర్ల‌కి. పాండీ ప్ర‌జ‌లు త‌న‌పై చూపిస్తున్న ప్రేమ‌కు కృతజ్ఞ‌త‌గా పాండీఆర్ట్ పేరుతో త‌న‌దైన సేవ‌చేస్తోంది.. క‌షా.

image


అయితే, పాండిచేరిలో బిజినెస్ అంత ఈజీ కాదు. ఇక్క‌డ టూరిస్టు సీజ‌న్ కేవ‌లం నాలుగు నెల‌లే వుంటుంది. పైగా వచ్చే వాళ్ళు ర‌క‌ర‌కాల మనుషులు. యూరోపియ‌న్ల‌ నుంచి ఇండియ‌న్ల వ‌ర‌కు అంద‌రూ వుంటారు. వారిని మేనేజ్ చేసేందుకు క‌షా అండ్ టీమ్ కష్టపడుతోంది. కొత్త కొత్త ప్రోడ‌క్ట్స్ తో, ప్ర‌త్యేక ఈవెంట్స్ తో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

న‌మ్మ‌కానికి త‌గ్గట్టే క‌స్ట‌మ‌ర్ల ఆద‌రణ కూడా వుంటోంది. రోజూ టూరిస్టులు వస్తంటారు. ఒక‌సారి వ‌చ్చిన‌వాళ్ళు అనుభూతి మరిచిపోరు. మళ్లీ ఎప్పుడైనా పాండిచేరికి ట్రిప్ వేస్తే, ఇదే షాప్ కి మరిచిపోకుండా వస్తుంటారు. మా స్టాఫ్ ఇది త‌మ సొంత‌మ‌నుకోవ‌డం, క‌స్ట‌మ‌ర్ల‌తో క‌లిసిపోవ‌డం.. క‌స్ట‌మ‌ర్లు కూడా అదే స్థాయిలో అభిమానించడం.. ఇంత‌కంటే, కావ‌ల‌సిందేముంటుంది.. అని క‌షా త‌న బొటిక్ గురించి మురిసిపోతూ చెప్పారు.