హార్డ్‌వేర్ కంపెనీ ప్రారంభానికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

హార్డ్ వేర్ రంగంపై ఆసక్తి ఉన్న వారికి అవగాహనహార్డ్ వేర్ కంపెనీ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలుఈ రంగంలో రానించడానికి కావాల్సిన మార్గదర్శకాలు.

0

హార్డ్‌వేర్ కొత్త సాఫ్ట్‌వేర్ లాంటిది కాదు, ఓ మంచి హార్డ్ వేర్ ప్రాడక్ట్ తయారు చేయడానికి అంకితభావంతో కృషి చేసే టీమ్ కావాలి. అంతే కాకుండా, ఈ రంగంలో టాలెంట్‌తో పాటు సహనం కూడా అంతే అవసరం.

హార్డ్‌వేర్ ఓ ఎదుగుతున్న రంగం అయినప్పటికీ, ఇండియాలో ఈ రంగంలో రాణించడం కష్టమే. అయితే మన దేశంలో ఆక్సిలరేటర్లు, ఇంక్యుబేటర్ల కొరత ఈ రంగ ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది.

ఇండియాలో ‘MSwipe payments’, ‘Dosamatic dosa maker’, ‘Robots Alive’ లాంటి వాళ్లు సక్సెస్ అయినప్పటికీ, ఈ రంగంలో చెప్పుకోదగిన రోల్ మోడల్స్ లేరు. ఇక మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లాంటి హార్డ్‌వేర్ ప్రాడక్ట్స్‌ని బట్టి వాటికున్న సవాళ్లు కూడా మారుతుంటాయి. ఇప్పటికే ఈ రంగంలో రాణిస్తున్న స్టార్టప్స్ సలహాలు, సూచనలు ఉన్నప్పటికీ వ్యాపారవేత్తల సంఖ్య చాలా తక్కువే. ఇటీవల హార్డ్‌వేర్‌లో ఉన్న వ్యాపారవేత్తలకు వనరులు, నెట్వర్క్ పెంచుకునేందుకు యువర్ స్టోరీ ‘హార్డ్‌వేర్ స్టార్టప్స్ మీట్’ ని హోస్ట్ చేసింది.

హార్డ్ వేర్ గురించి మరిన్ని వివరాల కోసం చదవండి hardware gets its sexy back!

(నోట్ : • పలు స్టార్టప్స్ ఏ క్యాటగిరిలో కూడా ఫిట్ కానందువల్ల కొన్ని చార్ట్స్ 100 శాతం రాలేకపోయాయి. • కొన్ని స్టార్టప్స్ ఒకటి కన్నా ఎక్కువ క్యాటగిరిల్లో ఫిట్ అవ్వడం వల్ల 100శాతానికి పైగా చూపిస్తున్నాయి)

స్టార్టప్ స్టేజ్

• హార్డ్ వేర్ రంగంలో 27 శాతం సొంత పెట్టుబడులతో రాణించగా, 39 శాతం స్టార్టప్స్‌కి, సీరీస్ ఏ లేదా ఫాలో అప్ ఫండింగ్ లభించింది.

• 2 శాతం స్టార్టప్స్‌కు కనీస పెట్టుబడులు లభించగా, 39 శాతం ఇంకా విచారణ స్ధాయిలో ఉన్నాయి.

రంగాలు

• 55 శాతం స్టార్టప్స్ ఎలక్ట్రానిక్స్‌లో ఉండగా, కేవలం 8 శాతం స్టార్టప్స్ విద్యా రంగానికి సేవలు అందిస్తున్నాయి.

• 12 శాతం ఆరోగ్య రంగంలో ఉండగా, 16 శాతం ఈ కామర్స్ లో ఉన్నాయి.

ఉత్పత్తి

• 43 శాతం హార్డ్‌వేర్ ప్రాడక్ట్స్ పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయగా, 2 శాతం విదేశాల్లో తయారవుతున్నాయి.

• 10శాతం ప్రాడక్ట్స్ ఇండియాలోనే డిజైన్ చేయగా, 12 శాతం విదేశాల నుండి దిగుమతి చేసుకున్న పరికరాలతో ఇండియాలో అసెంబుల్ అవుతున్నాయి.

హార్డ్ వేర్ రంగానికి అనుకూల వాతావరణం:

• 49శాతం వ్యాపారవేత్తలు మన దేశంలో ఉన్న హార్డ్ వేర్ రంగం బానే ఉన్నప్పటికీ, ఇంకా బాగుండాల్సిందని అనుకుంటున్నారు, 2శాతం మాత్రమే అనూకూలమని భావిస్తారు.

• 27 శాతం వ్యాపారవేత్తలు ఎంతో కష్టమైనదిగా భావిస్తే, 4 శాతం మాత్రం అసలు అనుకూలంగా లేదని అంటున్నారు.

హార్డ్ వేర్ రంగంలో సమస్యలు

• 47శాతం వ్యాపారవేత్తలు ప్రోటోటైప్ సౌకర్యాలు ఉంటే బాగుంటుందని తెలపగా, 28 శాతం మాత్రం హార్డ్ వేర్ స్టార్టప్ తెలిసున్న మార్గదర్శకులు ఇంకా ఉండాలని కోరుతున్నారు.

• 28శాతం వ్యాపారవేత్తలు హార్డ్ వేర్ పరికరాలపై దిగుమతి సుంకం చాలా ఎక్కువని అంటున్నారు, ఇక మరో 28శాతం హార్డ్ వేర్ నైపుణ్యత ఉన్న వారు దొరకడం సమస్యగా చెబుతున్నారు.

సవాళ్లు:

• 43 శాతం వ్యాపారవేత్తలకు మరింత అవగాహనతో పాటు మార్గదర్శకం అవసరముంది, అలాగే 37 శాతానికి ఈజీ ప్రోటోటైప్ సౌకర్యాలు అవసరముంది.

• 22 శాతం వ్యాపారవేత్తలకు హార్డ్ వేర్ డిజైనింగ్ మరియు ఉత్పత్తిలో నైపుణ్యత ఉన్నఉద్యోగుల అవసరం ఉంది.

• ఇక 16 శాతం హార్డ్ వేర్ ఉత్పత్తులపై ఎక్కువ దిగుమతి సుంకం కారణంతో ఇబ్బంది పడుతుండగా, ఇండియాలో మరో 2శాతం వ్యాపారవేత్తలకు హార్డ్ వేర్ బెంచ్ మార్క్ అవసరముంది.


హార్డ్ వేర్ రంగంలో మీ అభిప్రాయం ప్రకారం ఉన్న సమస్యలు, ఇబ్బందుల గురించి కామెంట్స్ లో తెలపగలరు.