స్టార్టప్ కంపెనీలకు సక్సెస్ ఫార్ములా చెప్తున్న జాన్ బ్రాడ్ ఫార్డ్

స్టార్టప్ కంపెనీలకు సక్సెస్ ఫార్ములా చెప్తున్న జాన్ బ్రాడ్ ఫార్డ్

Friday February 05, 2016,

3 min Read

స్టార్టప్ కల్చర్ అనేది పాశ్చాత్య దేశాలనుంచి ఇక్కడకు వచ్చిందే. స్టార్టప్ ప్రారంభంలో అమెరికా, యూరప్ దేశాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడా దేశాల చూపు ఆసియా వైపే. ప్రధానంగా భారత్, చైనా లాంది దేశాల్లో స్టార్టప్ లను ప్రారంభిచాలని అక్కడి నుంచి ఎంతో మంది ఇక్కడకు వస్తున్నారు. ఇక్కడి నుంచి అక్కడకు వెళ్లి సక్సెస్ అయిన వాళ్లు కూడా ఇప్పుడు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

స్పార్క్ 10 సంస్థ ఫౌండర్ అతల్ మాలవియా కూడా అలాంటి వారే. అతనితో పాటు ఇక్కడి పరిస్థితులు అర్థం చేసుకొని భారత దేశంలో తన ఆపరేషన్స్ విస్తరణకు కావల్సిన సాయం అందిస్తామంటూ యూరోపియన్ గాడ్ ఫాధర్ ఆప్ స్టార్టప్ యాక్సిలరేటర్ జాన్ బ్రాడ్ ఫార్డ్ ముందుకొచ్చారు.

image


భారత్ లో స్టార్టప్ నగరాలు

“హైదరాబాద్, బెంగళూరు, ముంబైలే భవిష్యత్ లో స్టార్టప్ నగరాలుగా వెలుగొందుతాయి,” జాన్ బ్రాడ్ ఫార్డ్.

ఇక్కడి పరిస్థితుల గురించి పెద్దగా తెలియదు. కానీ ఇక్కడికి రాడానికి ముందే వ్యాపారానికి అనుకూల నగరాల గురించి తెలుసుకున్నారు. ముమ్మాటికీ హైదరాబాద్ నంబర్ వన్ అవుతుందంటున్నారు. బెంగళూరు లేకుండా స్టార్టప్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనేది అతడి అభిప్రాయం. ఇప్పటికే దేశ వాణిజ్య కేంద్రమైన ముంబై కేంద్రంగా మరిన్ని సంస్థలు పుట్టుకొస్తాయని జాన్ చెప్తున్నారు. భవిష్యత్ లో ఈ మూడు నగరాలు దేశంలో స్టార్టప్ కంపెనీలకు డెస్టినేషన్ గా మారుతాయని జాన్ అంటున్నారు.


స్టార్టప్ కు యాక్సిలరేటర్ చాలా అవసరం

స్టార్టప్ కంపెనీలకు ఫండింగ్ ఎంత అవసరముందో యాక్సిలరేటర్ కూడా అంతే అవసరం అని జాన్ అభిప్రాయడ్డారు.

“యాక్సిలరేటర్ లేకుండా స్టార్టప్ కి ఫండింగ్ ఉపయోగం లేదు. స్టార్టప్ ఉనికి ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఉండదు,” జాన్

సాధారణంగా ఏదైనా స్టార్టప్ కి ఫండింగ్ వచ్చిందంటే దానికి ముఖ్యంగా యాక్సిలరేటర్ అవసరం ఉంటుంది. బూట్ స్ట్రాపుడ్ కంపెనీ అయినా దానికి యాక్సిలిరేటర్ అవసరం మరింత ఉంటుంది. వచ్చిన ఫండింగ్ ని చాకచక్యంగా వినియోగించామా లేదా అన్నది యాక్సిలరేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. స్టార్టప్ బ్రాండ్ బిల్డింగ్ యాక్సిలరేటర్ వల్లనే సాధ్యం అవుతుందనేది జాన్ అభిప్రాయం. భవిష్యత్ లో మరిన్ని ఫండ్స్ రావాలంటే దానికి బ్రాండ్ బిల్డింగ్, పబ్లిక్ రిలేషన్ , ప్రమోషన్ లాంటివి చాలా అవసరం అంటారాయన. దానికి యాక్సిలిరేటర్ సరైన పరిష్కార మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.

image


యూరప్, ఇండియా మధ్య తేడాలు..స్వారూప్యాలు

భారతదేశంలో స్టార్టప్ కల్చర్ యూరప్, అమెరికాల నుంచే తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అక్కడున్న పరిస్థితులు ఇక్కడ లేవు. కానీ భవిష్యత్ లో అక్కడి కంటే ఎక్కువ వసతులు, టెక్నాలజీ ఇక్కడ దొరుకుతుంది. అక్కడ ఉద్యోగం చేసే కంటే ఇక్కడే కొత్త కంపెనీ ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. అయితే అక్కడ స్టార్టప్, వ్యాపారం, సంపద- పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇక్కడ ఇంకా అలాంటి పరిస్థితి లేదు.

“వినియోగదారులను కస్టమర్లను గుర్తించడంలో అక్కడెలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది,” జాన్

మన ప్రాడక్టుకి సరైన వినియోగదారుడ్ని గుర్తించడం ఇక్కడా అక్కడా సమస్యే అని జాన్ అన్నారు. ఎందుకంటే ప్రాడక్ట్ టార్గెట్ మార్కెట్ లోకి విడిచిపెడితే అక్కడి వినియోగదారుడు ఈ ప్రాడక్టుని గుర్తించలేకపోతున్నాడు. అంటే సరైన వినియోగదారుడి దగ్గరికి ప్రాడక్ట్ వెళ్లడానికి సమయం పడుతోంది. ఈ సమస్యను అధిగమించాల్సి ఉంది. సాధారణంగా స్టార్టప్ లకు ఉండే అతి పెద్ద సమస్య ఇదే అని అభిప్రాయపడ్డారు.

ఈ స్టోరీ చదవండి

image


యాక్సిలరేటర్ కంపెనీలకు ప్రధాన సవాళ్లు

స్పార్క్ 10 లాంటి యాక్సిలరేటర్ కంపెనీలకు ప్రధాన సవాళ్లపై కొన్న ఆసక్తి కరమైన విషయాలను జాన్ వెల్లడించారు.

“స్టార్టప్ ను గుర్తించడం అతి పెద్ద సవాల్,” జాన్

యాక్సిలిరేటర్ కంపెనీ, సరైన స్టార్టప్ ని గుర్తించడం అతి పెద్ద సవాలు. ఎందుకంటే ఫౌండర్ క్వాలిఫికేషన్ బాగున్నప్పటికీ ప్రాడక్టు ఫెయిలైన స్టార్టప్స్ చాలా ఉన్నాయి. ప్రాడక్టును జనం గుర్తించినా లాభాలు రావడం అంత సులువైన విషయం కాదు. స్టార్టప్ కు లాభాల బాట పట్టించడమే యాక్సిలరేటర్ ప్రధాన ఉద్దేశం. లాభాల రానప్పుడు బ్రాండ్ వేల్యూ ఉన్నప్పటికీ యాక్సిలరేటర్ కంపెనీ ఫెయిల్ అయినట్లు లెక్క. ఈ సవాల్ ని అధిగమించడంపైనే యాక్సిలరేటర్ కంపెనీల జయాపజయాలు ఆధారపడి ఉంటాయి.

భవిష్యత్ ప్రణాలికలు

జాన్ చెప్పిన ప్రకారం తనకు భవిష్యత్ అంటే ప్రస్తుతమేనట. సక్సెస్ ఉన్నంత కాలమే భవిష్యత్ ఉంటుందనేది జాన్ నమ్మకం. తన ప్రణాళికలు చెప్పడానికి వెనకడుగు వేసిన జాన్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా కంపెనీలను యాక్సిలరేటర్ చేయడమే భవిష్యత్ ప్రణాళిక అని ముగించారు.

మొత్తం ఇంటర్వ్యూని చూడండి!


ఈ స్టోరీ చదవండి

ఈ స్టోరీ చదవండి

ఈ స్టోరీ చదవండి