ఎప్పుడైనా... ఎక్కడైనా మన్ చాహే గీత్ ! కావాల్సింది మూజిక్ యాప్

వేరెవర్ యూ గో... యువర్ ఫేవరిట్ సాంగ్ ఈజ్ విత్ యూమూజిక్ యాప్ డెవలప్ చేసిన నేహా బెహానీ, కుమరన్ మహేంద్రన్రెస్టారెంట్, కేఫె ఎక్కడున్నా స్మార్ట్ ఫోన్లో ఫేవరిట్ సాంగ్ ఏ రెస్టారెంట్లో ఉన్నా బ్యాక్ గ్రౌండ్ మాత్రం మీకు ఇష్టమైనదేఈ కొత్త కాన్సెప్ట్‌కు ప్రముఖులు నుంచి ఫండింగ్

ఎప్పుడైనా... ఎక్కడైనా మన్ చాహే గీత్ ! కావాల్సింది మూజిక్ యాప్

Sunday June 14, 2015,

6 min Read

ఓ ఇరవైఏళ్ల క్రితం హాలీవుడ్ డిన్నర్ పార్టీల్లో జూక్ బాక్స్‌ తప్పకుండా ఎప్పుడూ ప్లే అవుతూ ఉండేది. ఓ పెన్నీని జూక్ బాక్స్ మెషీన్‌లో పడేసి గాళ్ ప్రెండ్‌కి ఇష్టమైన సాంగ్ ప్లే చేస్తూ...బాల్‌రూమ్‌లో ఎంజాయ్ చేయడమనేది అప్పట్లో పెద్ద ట్రెండ్. సీన్ ఇక్కడ కట్ చేసి ఫాస్ట్ ఫార్వార్డ్ చేసి 21వ సెంచరీలోకి వచ్చి చూస్తే.. మన దేశంలోని ముంబైలో కూడా అలాంటి ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు నేహా బెహానీ, కుమరన్ మహేంద్రన్. మనం ఏ రెస్టారెంట్‌కో, కాఫీడేకో వెళ్లినప్పుడు బ్యాక్ గ్రౌండ్‌లో మనకి ఇష్టమైన పాటలు ప్లే అవుతుంటే ఎలా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకునే 'మూజిక్ (moojic)' అనే స్టార్టప్‌ను ప్రారంభించారు. కస్టమర్ల మొబైల్స్ నుంచే వారికి కావాల్సిన పాటలను వారు ఎంచుకోవడం, ఫుడ్ ప్లాజాల్లో అవి ప్లే అవడం అనే థీమ్‌తో వచ్చిందీ ఈ స్టార్టప్. రెస్టారెంట్స్, కాఫీ బార్‌లో ఈ సదుపాయం ఉంటే రిపీటెడ్ కస్టమర్లూ వస్తారు. వచ్చిన కస్టమర్ తనకు నచ్చిన నంబరే బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే అవుతుంటే హ్యాపీగా ఫీలవడం ఇలా ఇద్దరికీ ప్రయోజనం ఉండడంతో తమ సంస్థ సక్సెస్ అవుతుందని నేహా,కుమరన్‌ల అంచనా.

image


మూజిక్ స్టార్టప్‌కి అండగా నిలిచింది అర్చనా పట్కీరాజన్. మైసిటీవే,హబుల్ లాంటి సక్సెస్‌ఫుల్ ఆన్ లైన్ సర్వీసెస్ కంపెనీలను స్థాపించిన అర్చనా పట్కీరాజన్ నేహా, కుమరన్‌ల స్టార్టప్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. అర్చన తమకు ఇచ్చిన ప్రోత్సాహంతో తమ ఉద్యోగాలు వదిలేశారు నేహా బెహానీ, కుమరన్ మహేంద్రన్. ముగ్గురు సభ్యులతో మూజిక్ స్టార్టప్ ప్రారంభమైంది. ఈ ముగ్గురి పెట్టుబడీ పది లక్షలు.

మూజిక్ అప్ కాన్సెప్ట్‌కి బీజం పడింది ఓ కెఫే డేలో. అంతకుముందే కుమరన్, నేహాలు ఓ రెండు కాన్సెప్ట్‌లను ముందుకు తెద్దామనుకున్నా ఆవి రెండూ ఫెయిలయ్యాయ్. అలా నిరాశలో ఉండగా ఓ రోజు కేఫెడేలో తాము కలవాలనుకున్న వ్యక్తులు ఆలస్యంగా వచ్చారు. ఈ గ్యాప్‌లో బోర్ కొట్టి... ఆ మాటా ఈ మాటా మాట్లాడుకుంటుండగా గతంలో జూక్ బాక్స్‌లో కాయిన్ వేసి పాటలు ప్లే చేసుకునే టాపిక్ వచ్చింది. వెంటనే తమ చుట్టుపక్కల ఉన్న కస్టమర్లను ఇదే అంశంపై ఫీడ్ బ్యాక్ కోరారు. కెఫేలో ఉండగా మొబైల్ యాప్‌తో ఇష్టమైన పాటను వినగలిగితే ఎలా ఉంటుందనే ఐడియా పై అక్కడి కస్టమర్లు మంచి రెస్పాన్స్ ఇచ్చారట. దాంతో తిరిగి మ్యూజిక్ బేస్డ్ స్టార్టప్ పై ఉత్సాహం మళ్లింది. 

రెండు నెలల్లో ఓ ప్రాథమిక స్థాయి మోడల్ ను డెవలప్ చేసారు. దాని ప్రకారం కస్టమర్లు ముందుగా వాళ్ల ఫోన్ నుంచి ఏ సాంగ్ కావాలో మెసేజ్ ఇస్తే.. దాని ప్రకారం సాంగ్‌ను ప్లే చేయడంతో ప్రోటో టైప్ మోడల్ తయారైంది. ఇదే సమయంలో ఆటోమేటిగ్‌గా మొబైల్ యాప్‌లోనే సాంగ్స్ కేటలాగ్ ఇమడ్చం పై కూడా దృష్టి పెట్టారు. ఆ ప్రొడక్ట్ తయారైన తర్వాత కస్టమర్లకు ఏం కావాలో రెస్టారెంట్స్ ఓనర్‌ను అడగడం ప్రారంభించగానే అంతకు ముందు నేహా,కుమరన్ చెప్తోంది అర్ధం చేసుకోలేని కాఫీబార్ ఓనర్స్.. వాళ్లంతట వాళ్లే అప్రోచ్ అవడం ప్రారంభించారు.

అసలేంటీ కాన్సెప్ట్

మూజిక్ ఓ ఇన్ స్టోర్ రేడియో సర్వీస్. రెస్టారెంట్స్, సెలూన్స్, కేఫేడే, బార్స్,జిమ్స్.. ఇలా ఒకటేమిటి ప్రాంతమేదైనా ఫర్వాలేదు. మామూలుగా అయితే ఓ జూక్‌బాక్స్‌లో ఏ సాంగ్స్ అయితే ఉంటాయో అవే అక్కడి ఓనర్ ప్లే చేయగలడు. అది కూడా అతని ఇష్ట ప్రకారం లేదంటే ర్యాండమ్‌గా సెలక్ట్ చేసినవో ప్లే అవుతాయి. కానీ మూజిక్ యాప్‌ రిజిస్టర్డ్ కస్టమర్లు అక్కడి రెస్టారెంట్స్‌లో ప్లే లిస్ట్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుకుని తనకి ఇష్టమైన సాంగ్ ను వింటూ ఎంజాయ్ చేయవచ్చు. ఫ్రెండ్స్‌తో సరదాగా గడుపుతూ మన ఫేవరెట్ సాంగ్ వింటూ ఉంటే ఇంకా మజా వస్తుంది కదూ... ! రెస్టారెంట్ ఓనర్‌కు కూడా కస్టమర్ ఫ్రెండ్లీ వాతావరణం ఉందనే టాక్‌తో బిజినెస్ కూడా పెరుగుతుంది. దీనికి ఓ స్మార్ట్ ఫోన్‌తో రిజిస్టర్ చేసుకోవడమే చేయాలి, అది కూడా ఫ్రీ.

ఎందుకంత ధీమా ?

" 2011లో నేనూ నేహా బెహానీ ఉద్యోగాలు వదిలేసి సొంతంగా మొబైల్ అడ్వర్టైజింగ్ నెట్వర్క్ ప్రారంభించాం. సోషల్ లోకల్ మొబైల్ సిస్టమ్స్ పైనే ఎప్పుడూ మా ఇంట్రస్ట్ ఉండేది. లోకల్ యాడ్స్ కోసం వ్యాపారస్థులను కలిసేవాళ్లం. కేఫ్ ఓనర్స్, రెస్టారెంట్ ఓనర్లు మేం చెప్పేదానితో ఓ పట్టాన అంగీకరించేవాళ్లు కాదు. మొబైల్ బేస్డ్ పబ్లిసిటీ గురించి వాళ్లకు చెప్తూ..చెప్తూనే ఓ సంవత్సరం గడిచిపోయేది. వాళ్ల బిజినెస్కు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పినా ఆర్డర్లేవీ వచ్చేవి కాదు. అప్పుడే జనం లొకేషన్ బేస్డ్ అప్లికేషన్స్‌కు అంత త్వరగా అలవాటు పడలేకపోతున్నారని, దానికి ఇంకా సమయం ఉందని అర్ధమైంది.." అంటూ గతం గుర్తు చేసుకున్నారు కుమరన్ మహేంద్రన్.

ఆ తర్వాత మొబైల్ బేస్డ్ మ్యూజిక్ స్టార్టప్ ఐడియా రావడంతో..అసలు కస్టమర్లకు ఏం కావాలో...దానితో బిజినెస్ ఎలా పెరుగుతుందో. మర్చంట్స్ కు సులభంగా చెప్పగలిగామంటారు కుమరన్.

రెస్టారెంట్‌ను ఓ పబ్లిసిటీ హౌజ్‌లా మార్చేయొచ్చు !

రెస్టారెంట్స్‌లో ఉన్న ఆడియో సిస్టమ్‌ను ఇన్ స్టోర్ రేడియో ఛానల్‌లా తయారు చేయడం, ఎవరైతే మొబైల్ ద్వారా యాప్‌లో రిజిస్టర్ అవుతారో వారికి తమ ప్రొడక్ట్స్ పబ్లిసిటీ ఇవ్వగలుగుతారు. కారులో వెళ్తున్నా సాంగ్స్ వినవచ్చు. అలానే రెస్టారెంట్‌లోకి అడుగుపెట్టగానే కస్టమర్లకు వెల్కం విషెస్, ఫుడ్ ఆర్డర్స్, టుడే స్పెషల్ డిషెస్...ఇలా ఆ పర్టిక్యులర్ రెస్టారెంట్ యొక్క పబ్లిసిటీ మొత్తం ఇవ్వొచ్చు. అలానే కస్టమర్ల రద్దీని బ్యాలెన్స్ చేయగలగడం కూడా మూజిక్ ఫ్లాట్‌ఫామ్ ప్రత్యేకత. జూక్ బాక్స్‌లో ప్లే లిస్ట్ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతుంటుంది. భవిష్యత్తులో మూజిక్ యాప్ తమ యూజర్లకు ఇన్ స్టోర్ అడ్వర్ట్జైజింగ్ ఆప్షన్‌ను కూడా ఇవ్వబోతోంది. అంటే ఓ చిన్న రెస్టారెంట్ ఓ పబ్లిసిటీ హవుస్‌లా మారిపోతుందన్నమాట.

మూజిక్ పేరుకు తగ్గట్లే సంగీతం,పాటలు ఎక్కడ వినే అవకాశం, సందర్భం ఉంటుందో..ఆయా ప్రదేశాల్లో ..రెస్టారెంట్స్, సెలూన్స్, కెఫే, బార్, జిమ్, మాల్స్, రిటైల్ అవుట్ లెట్స్‌ను అడాప్ట్ చేసుకోవచ్చు. పదిలక్షల అవుట్ లెట్లలో మ్యూజిక్ ను చేర్చాలనేది కుమరన్ మహేంద్రన్ టార్గెట్. అలానే మేజర్ టైర్ వన్ సిటీలతో పాటు..టైర్ టూ సిటీలకు కూడా పాకాలనేది తమ లక్ష్యమని.. ప్రదేశాలను బట్టి తమ ప్రొడక్ట్ ధర కూడా మారుతుందంటారాయన.

లొకేషన్ బేస్డ్ మొబైల్ అప్లికేషన్లు. మన చుట్టూ ఉన్న ప్రపంచంతో నిజమైన కనెక్షన్ ఉన్నప్పుడే సక్సెస్ అవుతాయంటారు కుమరన్. మొబైల్ యాప్ వాడుతున్న యూజర్ ఎక్కడైతే ఎంగేజ్ అవుతాడో...అక్కడే మరి కొంత సేపు సమయం గడిపే అవకాశాన్ని ఆ యాప్ ఇచ్చినప్పుడే అది విజయవంతమైనట్లు లెక్క అంటారు. మ్యూజిక్ యాప్ కేవలం లొకేషన్‌ను చెక్ చేయడంతో పాటు నిజంగా అక్కడి కేటగరీని చెక్ చేసి.. (తన మొబైల్ లో) తన మొబైల్ లోని లేని..అక్కడ మాత్రమే దొరికే సాంగ్ ను ప్లే చేయగలిగితే..అప్పుడు యూజర్ ఇంకా హ్యాపీగా ఫీలవుతాడని కుమరన్ నమ్మకం.

మరి మ్యూజిక్ స్టార్ట్ చేసినప్పుడు ఎదుర్కొన్నప్పుడు సవాళ్ల మాటేంటి..వాటినెలా అధిగమించారు..?

"మొదట్లో..కస్టమర్లు(వ్యాపారస్థులు) మా ప్రొడక్ట్ తీసుకోవడానికి, అసలు వినడానికే ఇష్టం చూపించేవాళ్లు కాదు. ముఖ్యంగా POS అంటే పాయింట్ ఆఫ్ సేల్ (క్యాష్ అండ్ క్యారీ టైప్..కావాల్సిన ఐటెమ్‌కి డబ్బులివ్వడం..వెళ్లిపోవడం) బిజినెస్ జరిగే చోట..ఎప్పుడైతే మ్యూజిక్ లాంటి యునిక్ కాన్సెప్ట్ తెచ్చామో..దానితో మా పని సులువుగా జరిగిపోయేది. ఇప్పుడు మూజిక్‌కి 350 అవుట్ లెట్లున్నాయి..ఇవి ఇంకా పెరుగుతున్నాయ్."

" మిగిలిన అడ్డంకులు కంటెంట్ రూపంలో వచ్చాయి. సంగీత ప్రపంచం ఓ సముద్రంలాంటిది. అందులో మంచి పాటలు ఎంచుకోవడం, దానిపై ఎవరికి మ్యూజిక్, కాపీరైట్స్ ఉన్నాయో తెలుసుకుని వారిని అప్రోచ్ అయ్యేవాళ్లం. వారి దగ్గర అనుమతి పొంది కంటెంట్ ప్రొవైడ్ చేసేవాళ్లం. ఓసారి పెద్ద మ్యూజిక్ కంపెనీ అధినేత పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో తమ సాంగ్స్ వాడుకోవడానికి వీల్లేదన్నాడు" అంటూ తమ కష్టాలను గుర్తు చేసుకున్నారు కుమరన్. ఐతే కంటెంట్‌ను ప్రొవైడ్ చేసేది మేం కాదు కాబట్టి లీగల్‌గా మాకు ఎటువంటి వ్యతిరేకతా వచ్చేది కాదు. ఎందుకంటే మొబైల్ యాప్‌లో వాటిని అమర్చడం మాత్రమే మేం చేస్తాం. కానీ వాటిని అమ్మడం,కొనడం ఉండదు కాబట్టి ఆ బాధ్యత అంతా రెస్టారెంట్ ఓనర్‌కే పోతుంది.

మాకు పోటీ మేమే

మిగిలిన ఇన్ స్టోర్ రేడియో ప్రొవైడర్స్ కు మ్యూజిక్ భిన్నమైనది కావడంతో.. ఈ రంగంలోకి మాకు వేరే పోటీ పెద్దగా లేదంటారు నేహా బెహనీ, కుమరన్ మహేంద్రన్ లు. ఇది మిగిలినవాటికి ఎలా భిన్నమంటే..రిటైల్ అవుట్ లెట్లలో సాంగ్స్ ప్లే లిస్ట్ అల్రెడీ ఇన్ బిల్ట్ గా ఉంటుంది..కానీ మేం తయారు చేసే మోడల్ లో ఆ ఓనర్ ఇష్టాియిష్టాలను బట్టి ప్లే లిస్ట్ తయారవతుంది. సదరు రెస్టారెంట్ పబ్లిసిటీ కార్యక్రమం, మధ్యలో విషెస్..సూచనలు ఇవన్నీ వేరే చోట సాధ్యం కాదని చెప్తారు వీరు. అలానే భవిష్యత్తులోఇంకా మొబైల్ యాప్ లో ఫీచర్స్ డెవలప్ చేస్తామని..అవి కూడా ఆటోమేటిగ్గా తమ యూజర్లకు చేరతాయని చెప్పారు కుమరన్..

నేహా బెహానీ ప్రొఫైల్ చూస్తే బెంగళూరు మౌంట్ కార్మెల్ కాలేజ్ లో బిబిఎం చేసి ఫిలిఫ్పైన్స్ లో ఎంబీఏ చేశారు. ఫిలిఫ్పైన్స్ లో 2009లో ఏసియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో ఎంబీఎ చేసిన తర్వాత సింగపూర్ లో హెచ్ పీ లో ప్రొడక్ట్ మేనేజర్ గా పని చేసిన అనుభవం ఆమె సొంతం. బ్రాండింగ్, మార్కెటింగ్ లో నేహాకు చాలా అనుభవం ఉంది. ప్రస్తుతం మూజిక్ కంపెనీ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న నేహా విధి నిర్వహణలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారట. కొన్నిసార్లు ఆమెను డ్రాగన్ లేడీ అని కూడా సిబ్బంది పిలుచుకోవడమే దీనికి నిదర్శనం

కుమరన్ మహేంద్రన్ విషయానికి వస్తే ఫిిలిఫ్పైన్స్ ఏసియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో ఎంబీఏ గ్రాడ్యుయేట్. నేహాకు క్లాస్ మేట్ కూడా కావడంతో వీళ్లిద్దరి మధ్యా మంచి అవగాహన ఉంది. వీళ్లిద్దరితో పాటు జబల్ పూర్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేసిన గౌతమ్ వర్ కూడా జతయ్యారు. గౌతమ్ ప్రస్తుతం మ్యూజిక్ కు సీటీఓ గా వ్యవహరిస్తున్నాడు.

పెట్టుబడి విషయానికి వస్తే..మొదట్లో నేహా బెహనీ, కుమరన్ మహేంద్రన్,గౌతమ్ వర్మ పెట్టిన 10లక్షలతోనే మూజిక్ ప్రారంభమైంది. ఆ తర్వాత గూగుల్ ఇండియా ఎండీ రాజన్ ఆనందన్ సహా పలువురు ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ప్రస్తుతం మూజిక్ మొత్తం 10వేల ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలబడింది. ఇప్పుడు ప్రొడక్ట్‌ను మరింత డెవలప్ చేసి, విస్తరించేందుకు ప్రి సిరీస్ ఫండింగ్ కు వెళ్లబోతున్నట్లు చెప్పారు కుమరన్.

ప్రస్తుతం 8 నగరాల్లోని 350 స్టోర్స్ లో మ్యూజిక్ ప్లే అవుతోంది.. 60శాతం కస్టమర్లు ముంబైలోనే ఉన్నా.. త్వరలోనే బెంగళూరు, ఢిల్లీ, పూణేలకు మ్యూజిక్ విస్తరించే ఆలోచనలో ఉంది. ప్రస్తుతానికి పదిమంది సభ్యులతో నడుస్తున్న మూజిక్ ఈ కెరీర్ లోకి రావాలనుకునేవారికి రెడ్ కార్పెట్ వేస్తోంది.