పాతబట్టలతో బొంతలు కుట్టించుకునే అప్ సైక్లింగ్ కల్చర్ మళ్లీ వస్తోంది..  

0

రిపేర్ చేయించుకోవడం.. వేరేలా వాడుకోవడం.. ఇంకోదానికి ఉపయోగించుకోవడం.. మన మధ్యతరగతి ప్రజానీకం జీవన విధానంలో భాగమైంది. ముఖ్యంగా బట్టల విషయంలో మిడిల్ క్లాస్ పీపుల్ తెలివైన వాళ్లే. చిరిగినా పారేయరు. చీకుడు పట్టిందని వదిలించుకోరు. వాటిని మాగ్జిమం వేరే అవసరాలకు ఎలా వాడుకోవాలో నేర్చుకున్నారు.

అది మనిషి గొప్పతనమా లేక, బతకనేర్చిన తనమా అన్నది మేటర్ కాదు. అవసరాలు తీరాయా లేదా అన్నది ముఖ్యం. ఇప్పటికీ పల్లెటూళ్లలో చూస్తునే ఉంటాం. పాతచీరలతో బొంతలు కుట్టడం.. పాత లుంగీలను విండో కర్టెన్లుగా వాడటం.. చిన్నపిల్లల బట్టలన్నీ దిండు కవర్లో దూర్చి కుట్లేసుకోవడం.. పాతదైన టర్కీ టవల్ ని రెండు ముక్కలు చేసి డోర్ మాట్లుగా వాడుకోవడం.. ఇలాంటివన్నీ గ్రామీణ ప్రాంతాలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని చెప్పడం అతిశయోక్తి కాదు. పాతబట్టలకు అలాంటి సొబగులే అద్దుతున్నాడు యాకుబ్ అలీ అనే కుర్రాడు.

నాలుగేళ్ల క్రితం యాకుబ్ అలీ కుటుంబం గుజరాత్ వడోదర నుంచి యూపీ సగర్పూర్ కి వలస వచ్చింది. అతని దగ్గర ఒక హాండ్లూమ్ మిషన్ ఉంది. దాంతో అతను పాతబట్టలకు మెరుగులు దిద్దుతూ, సోఫా కవర్లు కుడుతూ, పాత దుప్పట్లను కలిపి బెడ్ షీట్లుగా కుడుతూ, ఆర్ధికంగా తనకాళ్ల మీద తను నిలబడుతున్నాడు. చిన్నప్పటి నుంచీ ఈ కళలో ఆరితేరిన యాకుబ్ అలీ పనితనాన్ని చూసి అక్కడి జనం అబ్బుర పడుతున్నారు. రోజుకి మూడు నాలుగు ఆర్డర్లొస్తుంటాయి. వాళ్ల అభిరుచికి తగ్గట్టుగా కుట్టి ఇస్తుంటాడు. జనం నుంచి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతుండటంతో యాకుబ్ సంతోషానికి అవధుల్లేవు. లాభసాటిగా ఉన్న ఈ పనిని వదిలిపెట్టను అంటున్నాడు.

ఈ అప్ సైక్లింగ్ కల్చర్ అనేది పల్లె నుంచి పట్టణ ప్రాంతాలకు పాకింది. అర్బన్ ఏరియాల్లో ఇప్పుడిప్పుడే ఈ లైఫ్ స్టయిల్ అలవాటవుతోంది. ఇదొక కొత్త ట్రెండ్ గా కూడా మారింది. కొన్ని దశాబ్దాల కిందటి మనిషి జీవన విధానం మళ్లీ పురుడు పోసుకుంటోంది అని చెప్పడానిక ఇదొక ఉదాహరణ. కాయితపు నవ్వులు.. కార్పొరేట్ హంగుల నుంచి జనం బయటకు వచ్చి సహజత్వం వైపు మళ్లడం శుభ పరిణామం.

Related Stories