ఆంధ్రలో రూ.1670 కోట్లతో సోలార్ పరికరాల తయారీ చేపట్టనున్న చైనా సంస్థ

ఆంధ్రలో రూ.1670 కోట్లతో సోలార్ పరికరాల తయారీ చేపట్టనున్న చైనా సంస్థ

Thursday September 24, 2015,

1 min Read

image


ఆంధ్రప్రదేశ్‌లో సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీకి చైనా సంస్థ జియాన్ లాంగ్‌ఐ సిలికాన్ మెటీరియల్స్ కార్ప్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. మొదటి దశలో రూ.1670 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్టు కంపెనీ వెల్లడించింది. దీని వల్ల ప్రత్యక్షంగా 1000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపింది. వివిధ దశల్లో తాము రూ.8000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సుముఖంగా ఉన్నామని, దీని వల్ల 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని కూడా జియాన్ లాంగ్‌ఐ ప్రతినిధులు వివరించారు. చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీసిటీలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జియాన్ ఛైర్మన్ బవోషెన్ జాంగ్, శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.