దేశంలోనే మొదటిసారిగా బ్యాటరీ ఆటోలతో చెత్తను తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్

దేశంలోనే మొదటిసారిగా బ్యాటరీ ఆటోలతో చెత్తను తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్

Friday July 14, 2017,

1 min Read

పర్యావరణ పరిరక్షణలో ఏపీ మరో అడుగు ముందుకేసింది. దేశంలోనే మొదటిసారిగా చెత్తను తరలించేందుకు బ్యాటరీ ట్రాలీలను వినియోగిస్తోంది. గాయం మొటార్స్ సంస్థ తయారుచేసిన బ్యాటరీ వాహనాలను విజయవాడ మున్సిపాలిటీలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పైకి చూస్తే సాధారణ ఆటో ట్రాలీలా కనిపించినా, దీనికి హైడ్రాలిక్ సిస్టం ఉంది. చెత్తను దానికదే కింద పారబోస్తుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా వీటిని సూపర్ వైజ్ చేస్తారు. ఐఓటీ ద్వారా నిరంతరం ఆటోని ట్రాక్ చేయవచ్చు. చెత్తను ఎక్కడ పారబోసింది, ఎటు వెళ్తోంది అన్న విషయాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్లో చూడొచ్చు.

image


డీజిల్ ఆటో ధర మూడు లక్షలుంటే.. దీని ధర రెండు లక్షలు మాత్రమే. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. లీటర్ డీజిల్ తో పోల్చుకుంటే దీని నిర్వహణ వ్యయం 30 పైసల నుంచి అర్ధరూపాయి మాత్రమే వస్తుంది. మూడు గంటలు చార్జింగ్ చేస్తే చాలు.. వంద కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. పొగ కూడా రాదు. ఇంధన వ్యయంలో ఐదేళ్లకు కలిపి 3లక్షలకు పైచిలుకు ఆదా అవుతుంది. వాయు కాలుష్యం విషయానికొస్తే 35 టన్నుల కార్బన్ తగ్గుతుంది. ఇంజిన్ సమస్య కూడా పెద్దగా రాదు. వీటిని సోలార్ పద్ధతిలో కూడా చార్జ్ చేసుకోవచ్చు. లిథియం బ్యాటరీని వాడటం వల్ల దాదాపు ఐదు సంవత్సరాల పాటు బ్యాటరీకి ఎలాంటి ఇబ్బంది రాదు.

ఇతర దేశాల్లో ఇలాంటి ఆటోలు ఉన్నా మన దగ్గర మాత్రం ఎక్కడా వినియోగించడం లేదు. ఏపీలో మొదటిసారిగా పది ఆటోలను ప్రవేశ పెట్టారు. గతంలో విశాఖపట్టణంలో వంద ఎలక్ట్రికల్ బైకులను ఇదే తరహాలో మున్సిపాలిటీలో తీసుకొచ్చారు. వాటి ద్వారా సిటీలో రోడ్ల మీద ఎక్కడ చెత్త ఉంది.. సిబ్బంది ఎక్కడ పనిచేస్తున్నారనే విషయాన్ని సూపర్ వైజ్ చేస్తున్నారు.

image


తాజాగా విజయవాడ మున్సిపాలిటీలో బ్యాటరీ ఆటోలను ప్రవేశపెట్టారు.. త్వరలో ఈ ఆటోలకు బ్లూటూత్‌తో కనెక్టివిటీ చేసి, ఫేస్‌బుక్‌లో లాగిన్ అయిన వెంటనే ఆటోస్టార్ట్ అయ్యే విధంగా రూపొందిస్తున్నారు.