లెస్బియన్ భాగస్వామిని పెళ్లాడిన పంజాబ్ ఎస్సై

లెస్బియన్ భాగస్వామిని పెళ్లాడిన పంజాబ్ ఎస్సై

Wednesday April 26, 2017,

2 min Read

పద్దతులు, సంప్రదాయాలు విషయంలోనే కాదు.. సోషల్ రెస్పాన్సిబిలిటీలోనూ పంజాబ్ సుసంప్నమైంది. అలాంటి సంస్కృతి ఉన్న పంజాబ్ లో మొట్టమొదటిసారిగా వ్యక్తిగత స్వేచ్ఛకు పెద్దపీట వేస్తూ ఒక పెళ్లి జరిగింది. అది సాదాసీదా మ్యారేజీ కాదు. ఇద్దరు లెస్బియన్ పార్ట్ నర్స్ ఒక్కటైన అరుదైన సందర్భం. అలా పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు.. ఒక సబ్ ఇన్ స్పెక్టర్.

image


పంజాబ్ లోని పక్కాభాగ్ లో జరిగిన ఈ వివాహ వేడుక శుద్ధ హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగింది. తన భాగస్వామి పేరు చెప్పడానికి మాత్రం ఆమె ఒప్పుకోకపోయినప్పటికీ, ఇరు కుటుంబాల వాళ్లను ఒప్పించి చేసుకున్నామని గర్వంగా చెప్తున్నారు. చుట్టాలు, పక్కాలు, స్నేహితులు అంతా వీరి పెళ్లికి హాజరయ్యారు. ఐపీసీ సెక్షన్ 377కి వ్యతిరేకంగా జరుపుతున్న ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ పోరాటానికి ఈ పెళ్లిని సింబాలిక్ గా తీసుకుంది.

ఇలాంటిదే మరోపెళ్లి రెండు నెలల క్రితం కోల్ కతాలో జరిగింది. ఘటక్ మహురి అనే ట్రాన్స్ జెండర్ తన చిన్ననాటి స్నేహితుడైన సంజయ్ ముహురీని పెళ్లాడింది. ఇది కూడా ఇందాక చెప్పుకున్నట్టే సోషల్ వెడ్డింగ్. అంతేకాదు దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ చేసుకున్న రిజిస్టర్ మ్యారేజీ.

మగరూపంలో ఉన్న నా ఆడ మనస్తత్వాన్ని ఎవరూ అర్ధం చేసుకోలేదు. నా తల్లిదండ్రులు కూడా అవహేళన చేశారు. మానసిక సంఘర్షణ ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాలేదని ఘటక్ చెప్పుకొచ్చారు.

తనని అర్ధం చేసుకున్న స్నేహితుడిని, వారి స్నేహాన్ని సమాజం తప్పుగా అర్ధం చేసుకుంది. హోమో సెక్సువల్ కమ్యూనిటీ అంటే సంఘంలో ఎంత చిన్నచూపు ఉందో వేరే చెప్కక్కర్లేదు.

సుప్రీంకోర్టు కూడా అలాంటి వివాహాలను ఇంకా చట్టబద్ధం చేయలేదు. స్వలింగ సంపర్కం విషయంలో శిక్షలు కఠినంగానే ఉన్నాయి. పదేళ్లు, అంతకంటే ఎక్కువ, లేదంటే జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉంది. దీనికి వ్యతిరేకంగా చాలా సంస్థలు పోరాడుతున్నాయి. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ తరపున కొన్ని ప్రభుత్వేతర సంస్థలు కూడా గొంతు కలుపుతున్నాయి. ప్రతీ మనిషికి తన భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ, హక్కు ఉందని పలు సంఘాలు నినదిస్తున్నాయి. ఈ విషయాన్ని కోర్టు గుర్తించాలని కోరుతున్నాయి.