ఒకే చోటికి ఇంటి నిర్వాహణా సేవలు. 'గపూన్‌' ను ప్రారంభించిన ఐఐటియన్స్

0

ఇంటికి అవసరమైన సరుకుల నుంచి, సెలూన్ సర్వీసుల వరకు మెట్రో సిటీల్లో ఇపుడంతా ఆన్ లైన్ మయమే. దీంతో ఆన్-డిమాండ్ సర్వీసుల హవా పెరుగుతోంది. అన్ని అవసరాలు ఒకే గొడుగు కిందకు తెచ్చే స్టార్టప్స్, హైపర్ లోకల్ మార్కెట్లో పెరిగిపోతున్నాయి. అయితే ఎన్ని వచ్చినా నిర్వహణా లోపంతో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతున్నారని అంటోంది గపూన్ సంస్థ. అందుకే అందరి కోసం, అన్ని అవసరాలు తీర్చడానికే గపూన్‌ను మొదలుపెట్టాం అంటున్నారు ఐఐటి పూర్వ విద్యార్దులు.

మార్కెట్లో అంతమంది ప్లేయర్స్ ఉన్నా నిర్వహణాలోపం కూడా కనిపిస్తోందనేది వారి వాదన. అన్ని రకాల సేవలు, నిర్ణీత పట్టికలు, ధరల సూచిక లాంటి ఫీచర్లన్నీ ఉన్న ఫుల్లీ ఆటోమెటెడ్ మెనేజ్‌మెంట్ సిస్టం, వెబ్ సైట్/ఆప్ గపూన్. కస్టమర్లకు, వెండర్లకు మధ్య ఎండ్-టు-ఎండ్ సర్వీసులందించడానికి, ఎలాంటి అడ్డంకులూ లేకుండా సరైన పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు గపూన్ నిర్వాహకులు.

ఆలోచనకు ఊపిరి

గత ఏడాది అపూర్వ మిశ్రా ఉద్యోగ రీత్యా బెంగళూరు వెళ్లినపుడు, తన సొంత ఇంటి ప్లంబింగ్, ఎలక్ట్రిక్ వర్క్స్ కోసం పడ్డ కష్టం చూసిన తర్వాతే ఈ ఆలోచన వచ్చిందంటున్నాడు అపూర్వ. అపుడు తనకు కలిగిన అసహనం ఆలోచనగా మారిందని, దాంతో గపూన్‌ను ప్రారంభించానని చెప్తున్నాడు. అందుకే సప్లై, డిమాండ్ మధ్య బాలెన్స్‌ మెయింటెయిన్ చేస్తూనే, సేవల్లో నాణ్యతను, సమయ పాలనను పాటించేలా గపూన్ పనిచేస్తోందని దాని వ్యవస్థాపకుడు, అయిన అపూర్వ చెప్తున్నాడు.

తన రూంమేట్ అంకిత్ బిండల్, ఫ్రెండ్ అంకిత అసైతో కలిసి నిర్వహణా బాధ్యతలను చూస్తున్నాడు అపూర్వ. కస్టమర్లకు అవసరమైన సేవల్ని సులభంగా, నమ్మకంగా చేస్తూ ఎక్కడా నిర్వహణా లోపం తలెత్తకుండా చూస్తున్నారు. ఇందుకోసం మూడు నెలలకు పైగా రీసెర్చ్ చేసి, కంజ్యూమర్ సర్వీసెస్ డొమైన్‌లో బెస్ట్ సూటెడ్ సొల్యూషన్ అందిస్తున్నాం అంటున్నాడు అపూర్వ.


నిర్వహణా లోపంతో కేవలం కస్టమర్లే కాదు, వెండర్లు కూడా అసహనానికి లోనవుతున్న సంగతిని రీసెర్చ్ టైంలో గుర్తించింది గపూన్ టీం. చాలా మంది సర్వీస్ ప్రొవైడర్లు అవసరమైన మేరకు ఆన్ లైన్ లో పనిచేయలేక పోతే, మరికొంతమంది నాణ్యమైన సేవల్ని అందించలేకపోయేవారు. నాణ్యమైన సేవలతో, ఒకే సర్వీస్ ప్రొవైడర్ ద్వారా, యూజర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, హేతుబద్ధంగా ఉండే సర్వీసుల కోసం అంతా ఎదురుచూస్తున్నారు అనిపించింది. దాంతోపాటే వెండర్లు అవసరానికి మించి, చాలా ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారని భావించింది గపూన్ టీం.

గపూన్ టీం

గపూన్ ప్రారంభించడానికి ముందు అపూర్వ బిజినెస్ కన్సల్టెంట్ గా 18 నెలల పాటు, ఫ్రాక్టల్, సంస్థల్లో ఇన్సూరెన్స్, రిటైల్, టెలికాం రంగాల్లో పనిచేశాడు. ఇక సహ వ్యవస్థాపకురాలు, అయిన అంకిత ష్లంబర్గర్‌లో ఫీల్డ్ ఇంజనీర్‌గా నార్త్-ఈస్ట్ ఇండియాలో పనిచేసింది. కో ఫౌండర్, అయిన అంకిత్ ప్రొడింటల్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశాడు. టెక్ జంకీ అయిన అంకిత్.. వెబ్‌సైట్, యాప్ డెవలప్మెంట్, కంపెనీ బాక్ ఎండ్ సపోర్ట్‌ను చూసుకుంటాడు. కాన్పూర్‌లో ఐఐటి చేసిన ఈ ముగ్గురూ మంచి మిత్రులు. ఇక నిఖిల్ గుప్తా ఢిల్లీలో 2013 లో ఐఐటి పూర్తిచేసి, ఫ్రాక్టల్ అనలిటిక్స్‌లో బిజినెస్ కన్సల్టెంట్‌గా చేశాడు. ప్రస్తుతం గపూన్‌లో ఆపరేషన్స్ చూసుకుంటున్నాడు.

యూజర్లకు గపూన్ వన్‌స్టాప్ ప్లాట్‌ఫాంలా పనిచేస్తుంది. సర్వీస్ ప్రొవైడర్లకు నాణ్యమైన సేవల్ని ఆన్‌లైన్లో అందిస్తుంది. దీంతో వారి సమయంతో పాటుగా మనీ కూడా ఆదా అవుతుంది.

గపూన్ ఏం చేస్తుంది ?

ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్, కార్పెంట్రీ, పెయింటింగ్, పెస్ట్ కంట్రోల్‌తో పాటుగా అన్ని రకాల విద్యుత్ ఉపకరణాలు, లాప్ టాప్ రిపేర్లు అన్నీ ఒకే గొడుగు కిందకు తెస్తుంది. సరసమైన ధరల్లో, ఫుల్లీ ఆటోమేటెడ్ సేవలు, ఫాలో అప్‌లతో నిర్వహణా లోపాన్ని అధిగమించేలా పనిచేస్తుంది గపూన్. "అన్ని సర్వీసులనీ ప్రామాణీకరించుకుంటేనే అనుకున్న లక్ష్యాల్ని చేరుకోగలం" అంటారు అపూర్వ.

ఫండింగ్

2015లో ప్రారంభమైన గపూన్ ఇప్పటివరకు 3,500 మంది కస్టమర్లకు సేవలను అందించింది. విజిటర్లు, కంప్లీట్ అయిన ఆర్డర్లు, తమ దగ్గరకు వచ్చిన సందేహాలను తీర్చడంలో 100 శాతం వృద్ధిని ప్రతీ నెలా సాధిస్తోంది. బెంగళూరులో అన్ని రకాల సర్వీసుల కోసం ప్రతీ రోజూ 150 ఆర్డర్ల వరకు వస్తున్నాయి.

బెంగళూరు, ముంబైల్లో ఏడు నెలల క్రితమే ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి సీడ్ రౌండ్ పూర్తిచేసుకుంది గపూన్. వచ్చే కొన్ని నెలల్లోనే బెంగళూరులో ప్రతీ రోజు 1000 ఆర్డర్లను సాధించాలనే లక్ష్యం తోపాటుగా, వచ్చే మూడు నెలల్లో భారత్ లోని వివిధ నగరాలకు విస్తరించాలని భావిస్తున్నారు.