లాంగ్ డ్రైవ్ కి వెళ్లానుందా..? జిప్ హప్ ఉందిగా..!

నాలుగు నెలల్లో ఆరు నగరాలకు విస్తరించిన సెల్ఫ్ డ్రైవ్ కార్, బైక్ రెంటల్ స్టార్టప్

లాంగ్ డ్రైవ్ కి వెళ్లానుందా..? జిప్ హప్ ఉందిగా..!

Tuesday April 12, 2016,

4 min Read


మనసుకి హాయిగా ఉన్నప్పుడో..!

పని ఒత్తిడి నుంచి రిలాక్స్ కావాలనుకున్నప్పుడో..!

మిత్రులతో సరదాగా బయటకు వెళదామనుకున్నప్పుడో..!

ఎప్పుడో ఒకప్పుడు... లాంగ్ డ్రైవ్ కి వెళ్లాలని కోరిక పుట్టని యువతరం చాలా తక్కువ. ఇష్టమైన కారో.. బైకో నడుపుకుంటూ ఎంత దూరం వెళ్లామనే లెక్క వేసుకోకుండా.. అలా లాంగ్.. డ్రైవ్ కి వెళ్తే మనసు తేలికపడుతుంది. ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉంటుంది. కానీ కోరిక పుట్టినప్పుడే.. బైక్ దొరకడం ఎలా..? కారు సంపాదించడం ఎలా..?

యువతరం ఎదుర్కొంటున్న ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తోంది జిప్ హప్. నాలుగు నెలల కిందట గోవాలో పురుడుపోసుకున్న ఈ స్టార్టప్ ... ఇప్పుడు ఆరు నగరాలకి విస్తరించింది. దీన్ని బట్టి అది ఎంత బాగా యువత మనసుల్ని చదివేసిందో అర్థం చేసుకోవచ్చు.

స్టార్టప్ కి సెల్ఫ్ డ్రైవ్

ఆఫీసులకు తప్ప.. ఇంకెక్కడికి వెళ్లాలన్న సొంతంగా డ్రైవ్ చేసుకుంటూనే వెళ్లాలనేది ఇండియాలో అరవై నుంచి డెభ్బై శాతం మంది కోరిక. కానీ అందరికీ కామన్ గా ఉండే ప్రతిబంధకం సొంత వాహనం. అది బైక్ కావచ్చు.. కారు కొవొచ్చు. ఒక వేళ సొంతంగా కారు, బైక్ ఉన్నా.. అవి లాంగ్ డ్రైవ్ కి నప్పవు. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో తెలియక సెల్ఫ్ డ్రైవ్ కోరిను అణచి వేసుకుంటున్నారు. వీరి ఆశలు నేరవేర్చేందుకు జిప్ హాప్ గోవాలో ఆవిర్భవించింది. ఐదుగురు కుర్రాళ్ల మది నుంచి వచ్చి ఐడియా... నాలుగు నెలల క్రితం మొలకెత్తింది. తొలుత గోవాలో సేవలు ప్రారంభించారు. రోజుల వ్యవధిలోనే అద్భుతమైన స్పందన రావడంతో నాలుగు నెలలు నిండకుండానే ఆరు ప్రధాన నగరాలకు విస్తరించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, మున్నార్, కొచ్చిన్ లకు సేవలు విస్తరించారు. హోండా యాక్టివా నుంచి హార్లీడేవిడ్ సన్ హైఎండ్ బైక్ వరకూ.. అలాగే కార్లలో హ్యాచ్ బ్యాక్స్ నుంచి SUV వరకూ అన్నీ అందుబాటులో ఉంచారు.

కల నెరవేర్చుకున్న బృందం

జలంధర్ కి చెందిన అపూర్వ అగర్వాల్ ఉద్యోగం కోసం ముంబై వచ్చాడు. టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్ లాంటి సంస్థల్లో వర్క్ చేస్తున్నాడు. ముంబై శివార్లలోని తన రూమ్ నుంచి వర్క్ కోసం వెళ్లిరావడం- ట్రాన్స్ పోర్ట్ పట్టుకోవడం అపూర్వకు చాలా కష్టమయ్యేది. ఇలా ఓసారి బస్సు కోసం వెయిట్ చేస్తున్నప్పుడే.. సొంత రెంటల్ స్టార్టప్ పెడితే ఎలా ఉంటుందా అనే ఆలోచన వచ్చింది. ఎక్కువ మంది కార్లు, బైకులపైనే వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుండటం కూడా తన ఆలోచనకు వాల్యూ యాడ్ చేస్తుందని గ్రహించాడు. రోజువారీ రవాణా అవసరాలకే కాకుండా.. వారాంతాల్లో యువత అభిరుచులకు తగ్గట్లుగా రెంటల్ స్టార్టప్ ఉంటే విజయం సులువనే అంచనాకొచ్చాడు. 

ఐడియాను ఏషియన్ పెయింట్స్ లో బ్రాండ్ మేనేజర్ గా పనిచేస్తున్న అంకిత్ చతుర్వేదితో చెప్పాడు. వారిద్దరూ దానిపై కొన్నాళ్లు చర్చించుకుని స్టార్టప్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. సుమిత్ హబ్లాని, దుష్యంత్ సింగ్, సుధాంశు సక్సెనాను స్టార్టప్ కో ఫౌండర్లు చేరేందుకు ఒప్పించాడు. ఐదుగురు పని విభజన చేసుకుని.. స్టార్టప్ కు కార్యరూపం ఇచ్చారు. అలా డిసెంబర్ లో జిప్ హాప్ ను ప్రారంభించారు.

జిప్ హప్ టీం<br>

జిప్ హప్ టీం


బోలెడన్ని స్పీడ్ బ్రేకర్స్

నాలుగు నెలల్లోనే వీరు బోలెడన్ని స్పీడ్ బ్రేకర్స్ ను ఎదుర్కొన్నారు. అందులో ప్రధానమైది వెహికల్ ఎవైలబిలిటి. అందుబాటులో ఉన్న వెహికల్స్ ను రియల్ టైం ట్రాకింగ్ లో పెట్టడం వీరికి పెద్ద సవాల్ గా మారింది. ఎందుకంటే రెంటల్ పార్టనర్స్ ఈ విషయాల్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడంలో పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. అయితే వేగంగానే దీనికి పరిష్కారం మార్గం కనుగొన్నారు. పార్ట్ నర్ యాప్ ను రూపొందించారు. అందులో కరెంట్ ఎవైలబిలిటీ చెకప్ ను ఎప్పటికప్పుడు ఆటోమేటిక్ గా అప్ డేట్ అయ్యే వ్యవస్థను రూపొందించారు. బుక్ చేసుకున్న వ్యక్తి వెండర్ షాపు దగ్గర్నుంచి వాహనం తీసుకున్న వెంటనే ఆటోమేటిక్ గా యాప్ లో ఆ వాహనం ఎవైలబులిటి బ్లాక్ అయిపోతుంది.

గేరు మార్చే వ్యూహాలు

జిప్ హప్ లో కారు, బైక్ బుక్ చేసుకోడం చాలా తేలిక. ఈ కామర్స్ సైట్లలో ఓ వస్తువు కొన్నంత ఈజీ. బుక్ చేసుకున్న తర్వాత వెండర్ పాయింట్ వద్దకు వెళ్లి వాహనాన్ని తీసుకోవచ్చు. రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఆన్ లైన్ లో కంప్లీట్ చేయవచ్చు. తనకు కావాల్సిన లోకేషన్, వెహికల్ టైప్ ని ఫిల్టర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. మిత్రులతో కల్సి గ్రూప్ గా కొన్ని వెహికల్స్ తీసుకుని వెళ్లాలనుకున్నా ఆ అవకాశం కూడా ఉంటుంది. వేర్వేరుగా బుక్ చేసుకునే పని లేకుండా. కార్ట్ కి యాడ్ చేసుకోవడం ద్వారా గ్రూప్ కి కావాల్సినన్ని వెహికల్స్ యాడ్ చేసుకోవచ్చు. అన్నీ సెలక్ట్ చేసుకున్న తర్వాత పెమేంట్ ఆప్షన్ వస్తుంది. పేమెంట్ కూడా పూర్తయిన తర్వాత బుకింగ్ కన్ఫర్మేషన్ మెసెజ్, ఈమెయిల్- అటు కస్టమర్ కి ఇటు వెహికల్ వెండర్ కి కూడా వస్తుంది. ఇంటర్నేషనల్ కస్టమర్స్ కోసం పేపాల్ ద్వారా పేమెంట్ ఆప్షన్ కూడా కల్పిస్తున్నారు.

ఇప్పటికి ఆరు నగరాల్లో 20 మంది భాగస్వాములతో ఒప్పందాలు చేసుకున్నారు. వీరు వంద కార్లు, 900 బైకులు అందుబాటులో ఉంచుతున్నారు. రోజుకు వెబ్ సైట్ లో 3వందల మంది రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే 250 బుకింగ్స్ నమోదయ్యాయి. మొత్తం 800 బుకింగ్ డేస్ నమోదయ్యాయి. ఈ స్టార్టప్ వారానికి ఇరవై శాతం పెరుగుదల నమోదు చేస్తోంది. కార్లు, బైకుల రెంటల్ మాత్రమే కాకుండా.. జాకెట్స్, హెడ్ గేర్, స్టోరేజ్ కంపార్ట్ మెంట్స్ కూడా రెంటల్ కు ఇస్తూ ఆదాయం పొందుతున్నారు. త్వరలో సైకిళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

మార్కెట్ పెద్దదే..!

సొంతంగా వెహికల్ లేకపోయినా లాంగ్ డ్రైవ్ ఆశలున్నవారికి ఇండియాలో కొదువలేదు. అందుకే మార్కెట్ పరిధి అంతకంతూ పెరుగుతోంది. ఈ రంగంలోకి ఇప్పటికి కొన్ని స్టార్టప్స్ సక్సెస్ బాటలో నడుస్తున్నాయి. జూమ్ కార్, జస్ట్ రైడ్, రెవ్, వోలర్ కార్స్, కార్జన్ రెంట్, మైల్స్, కార్ స్టియన్, లెట్ మి డ్రైవ్ లాంటివి ముందడుగు వేస్తున్నారు. సెల్ఫ్ డ్రైవ్ అనే కాన్సెప్ట్ అమెరికా, జపాన్ లో అద్భుతంగా సక్సెస్ అయింది. ఈ మార్కెట్ తోనే అక్కడ హెర్టజ్, జిప్ కార్ లాంటి పెద్ద సంస్థలు అవతరించాయి.

వెబ్ సైట్