విజ్‌రాకెట్‌లో ఎంటర్ అయితే అందరూ జేమ్స్‌బాండ్‌లే

వెబ్‌సైట్‌కు అవసరమైన అన్ని సర్వీసులు ఒకచోటేబర్ప్ కో ఫౌండర్ ఆనంద్ జైన్ స్టార్ట్ చేసిన మరో ప్రాజెక్ట్కస్టమర్లకు జేమ్స్‌బాండ్ రేంజ్‌లో ట్రీట్మెంట్టెక్నాలజీ అవసరాలకు వన్ స్టాప్ సొల్యూషన్

0

2014 జూన్‌లో నేను ముంబై వెళ్లాను. విపరీతమైన వర్షాలు పడుతున్న ఆ సమయంలో సిటీ ఆఫ్ డ్రీమ్స్‌గా పేరు గాంచిన ఆ మహనగరానికి చేరుకున్నాను. ఓ లోకల్ ట్రైన్‌లో గోర్‌గాన్ వెస్ట్ ప్రాంతానికి వెళ్లి... ఫిల్మిస్తాన్ స్టూడియో దగ్గరకు చేరుకున్నాను. ఆ స్టూడియోలో ఓ వెంచర్ ప్రారంభించాలనేది నా ఐడియా. అయితే.. ట్విట్టర్‌లో నేను చాలాసార్లు చాటింగ్ చేసిన ఓ వ్యక్తిని కలిసేందుకు నేనిప్పుడు ఇక్కడకు వచ్చాను. ఏడాదిగా చాలాసార్లు ఆన్‌లైన్‌లో కలుసుకున్నా... నేరుగా మాట్లాడ్డం మాత్రం ఇదే మొదటిసారు. అతను ఎవరో కాదు నెట్వర్క్18 కొనుగోలు చేసేసిన బర్‌ప్(burrp) సహ వ్యవస్థాపకుడు ఆనంద్ జైన్.

విజ్‌రాకెట్

మన దేశంలో స్టార్టప్‌లను ఓ బూమ్ స్థాయికి చేర్చిన కంపెనీ ‘బర్ప్’. ఈ రేంజ్‌కు చేరేలోపు ఆనంద్ చాలా కష్టపడ్డారు. అసెంబుల్డ్ కంప్యూటర్లు విక్రయించడం నుంచి... ఆపసోపాలు పడ్డ అనేక టెక్నాలజీ కంపెనీల్లోనూ పని చేశారు.

విజ్‌రాకెట్ ఆఫీసులోకి వెళ్లగానే మొదట కలిసింది ఫ్రాన్సిస్ అనే వ్యక్తిని. ఈయన ఆపరేషన్స్ విభాగం చూసుకుంటున్నారు. ఆనంద్ జైన్ తన మీటింగ్ పూర్తి చేసి వచ్చేలోపు.. ఫ్రాన్సిస్‌తో కాసేపు ముచ్చట్లాడాను. ఈ సమయంలో ఆఫీస్ అడ్మిన్ ఒకరు మాకు టీ సర్వ్ చేశారు. ఈయన విజ్ రాకెట్ టీంలో ఒక భాగం మాత్రమే కాదు... ఆనంద్‌ గత వెంచర్లలోనూ తనతో కలిసి పని చేయడం విశేషం.

విజ్‌రాకెట్ ఒక టెక్నాలజీ కంపెనీ. దీన్ని సునీల్ థామస్ (గతంలో నెట్వర్క్18, ఇన్ఫోస్పేస్, మైక్రోసాఫ్ట్‌లలో పని చేశారు), సురేష్ కొండమూడి(ఐఐటీ-ఎం గ్రాడ్యుయేట్, నెట్వర్క్18, జి గ్రాహక్‌లలో పని చేశారు)లతో కలిసి... ఆనంద్ జైన్ నెలకొల్పారు.

జేమ్స్‌బాండ్ ట్రీట్మెంట్

ఒకసారి జేమ్స్‌బాండ్‌కు ఎలాంటి ట్రీట్మెంట్ అందుతుంతో గుర్తు చేసుకోండి. అతను ఓ డోర్‌లోంచి లోపలికి ప్రవేశించగానే.. అక్కడున్నవారందరికీ బాండ్‌కి ఏం కావాలో తెలుసు. అతని సూట్ రెడీగా ఉంటుంది. అతను రిఫ్రెష్ అయి బయటకు రాగానే ఫేవరేట్ డ్రింక్ తెచ్చిస్తారు. ఆ వెంటనే ఆస్టన్ మార్టిన్ కూడా కావలసిన సమయానికి సిద్ధంగా ఉంటుంది. ఇది ఆన్‌లైన్ ప్రపంచంలో సాధారణ వ్యక్తులకు ఊహించడానికి సాధ్యమేనా.

దీన్ని సుసాధ్యం చేసింది విజ్‌రాకెట్. తమ దగ్గరకు వచ్చే ప్రతీ ఔత్సాహిక వ్యాపారవేత్తనూ... ఓ జేమ్స్‌బాండ్ తరహాలో ట్రీట్ చేయాలని భావిస్తారు. ఏ వ్యాపారమైనా ఏ స్థాయిలో ఉండాలి, తాము వారికే ఏం సర్వీసులు అందించాలి, ప్రారంభించడానికి ఎలాంటి సదుపాయాలు అవసరం.. ఇలా వన్ స్టాప్ షాప్ మాదిరిగా అన్ని సొల్యూషన్స్ గురించి చెప్పే సంస్థ విజ్‌రాకెట్.

తాము ఇతరులకు సలహాలిస్తూ... స్వయంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉన్న సూపర్ ప్రోడక్ట్ విజ్‌రాకెట్. ఒక వ్యాపారాన్ని పలు సెగ్మెంట్లుగా విభజించడం, విశ్లేషించడం, లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన వ్యూహాలను అందిస్తుంది. ఇందులో విశ్లేషణలకు సంబంధించిన విభాగాన్ని ఇప్పటికే చాలా కంపెనీలకు అందించారు విజ్‌రాకెట్ టీం. ఆనంద్ చూపించిన డెమో నన్ను షాక్‌కు గురి చేసింది. వారి దగ్గరున్న టెక్నాలజీ ఆధారంగా 25కోట్లకు సంఘటనలను సెకనులో విశ్లేషించవచ్చంటే... ఆశ్చర్యం వేయకమానదు.

విజ్‌రాకెట్ రూపొందించిన టూల్ సహాయంతో... సైట్‌ను ప్రస్తుతం ఎవరు ఎక్కడ నుంచి విజిట్ చేస్తున్నారు, ఎంత సమయం ఒక్కో పేజ్‌పై వెచ్చిస్తున్నారు, ఎన్నిసార్లు పేమెంట్ పేజ్‌ను విజిట్ చేశారు వంటి వివరాలతో సహా ప్రతీ చిన్న అంశాన్నీ డీకోడ్ చేసి ఇవ్వగలదు. ఒకసారి టార్గెట్ కస్టమర్లు ఎవరో తెలిశాక... ఆ డేటా ఆధారంగా... వివిధ సెగ్మెంట్లలో ఉన్న విజిటర్లకు వెబ్ మెసేజింగ్, పుష్ నోటిఫికేషన్స్, యాప్‌లోని అంతర్గత మెసేజింగ్ ద్వారా సమాచారం అందించచ్చు. అలాగే, ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారానూ వారికి ఏమైనా సమస్యలకు పరిష్కారాలు చూపొచ్చు.

విజ్‌రాకెట్ భవిష్యత్ ప్రణాళికలు

ప్రస్తుతం విజ్‌రాకెట్‌లో 10మంది మెంబర్ల టీం ఉంది. మరికొంతమంది త్వరలోనే వచ్చి చేరనున్నారు. స్టార్టప్‌లకు సీడ్ ఫండింగ్ చేసే అమెరికా సంస్థ వైకాంబినేటర్ దగ్గరకు ఇంటర్వ్యూకు వెళ్లిన అతి కొద్ది స్టార్టప్స్‌లో విజ్‌రాకెట్ కూడా ఒకటి. అయితే ఇది సక్సెస్ కాలేదు. కానీ 1.6మిలియన్ డాలర్లను యాస్సెల్ పార్ట్‌నర్స్ దగ్గరనుంచి సేకరించగలిగారు. ముంబైలో నిర్వహిస్తున్న పరిశీలించదగ్గ స్టార్టప్‌ల జాబితాలో 2014లో టాప్5లో స్థానం సంపాదించుకుంది విజ్‌రాకెట్.

ప్రస్తుతం వీరి లక్ష్యం టార్గెట్ కస్టమర్ల విభాగాన్ని పూర్తి చేయడం. దీన్ని పూర్తి స్థాయిలో రూపొందించాక... ప్రస్తుత కస్టమర్లకు అందించి లోటుపాట్లు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాక ప్రపంచవ్యాప్తంగా లాంఛ్ చేస్తామని చెబ్తున్నారు ఆనంద్.

Website: http://wizrocket.com


Sr. Correspondent @ yourstory.com

Related Stories

Stories by ABDUL SAMAD