సక్సెస్ కు సరైన నిర్వచనం చెబుతున్న అనంతకృష్ణన్

సక్సెస్ కు సరైన నిర్వచనం చెబుతున్న అనంతకృష్ణన్

Tuesday March 22, 2016,

4 min Read

                               

 "మనసుకు నచ్చినది చేస్తేనే మానసిక ప్రశాంతత"....

కార్పొరేట్ మీటింగుల్లో ప్రశంసలు...

వృత్తి జీవితంలో పక్కవారూ ఆసూయపడే విజయాలు...

కుటుంబ సభ్యుల అభినందనలు...

అర్థం చేసుకునే భర్తతో అందమైన పొదరిల్లు లాంటి కుటుంబం...

ఒక రకంగా చెప్పాలంటే అందరికీ అన్నీ లభించవు. కానీ అను అనంత కృష్ణన్ విషయంలో మాత్రం ఇది ఆలోచించి చెప్పాల్సిన మాట. ఎందుకంటే పై వాక్యాలన్నీ ఆమెకు సంబంధించినవే. న్యూయార్క్ కార్పొరేట్ సర్కిల్లో ఆమెకు చిన్న వయసులోనే ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. వ్యాపారంలో పోటీదారులూ ఆసూయపడే విజయాలు సాధించింది. అర్థం చేసుకున్న భర్త... కుటుంబ సభ్యుల ప్రొత్సాహం ఆమెకూ ఎప్పుడూ తగ్గలేదు. మరి అను అనంత కృష్ణన్ హ్యాపీ పర్సనా...?

సంతోషం అనేది వృత్తి జీవితంలో విజయాలతో వస్తుందా..? వ్యక్తిగత జీవితంలో అనుభవాలతో వస్తుందా..?. కుటుంబం ఉన్నత స్థానానికి వెళ్లినప్పుడు వస్తుందా..? నిజానికి సంతోషం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో నిర్వచించలేం. మనిషి మనసుకు నచ్చిన పని ఇష్టంగా చేసినప్పుడే ఆ సంతోషాన్ని అనుభవించగలరు. అను అనంత కృష్ణన్ కి కూడా ఇదే సమస్య...!

ఎన్ని ప్రశంసలు దక్కుతున్నా.. ఎన్ని విజయాలు సాధిస్తున్నా... అనంత కృష్ణన్ కి ఎప్పుడూ మనసులో ఏదో లోటు అనిపిస్తూనే ఉండేది. చేస్తున్న పని ఇష్టంగానే చేస్తున్నా... మరింకేదో చేయాలని అనుకుంటూ ఉండేది. ఏమి చేయాలో స్పష్టత లేక మానసిక ప్రశాంతత కోల్పోయేది ... చివరికి తన అసంతృప్తికి కారణం కనుగొన్నారు.. అనుకున్నది చేస్తున్నారు. ఇష్టంతో చేస్తూ ఎంతో మంది మహిళలు ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యకు తనదైన పరిష్కారం చూపిస్తున్నారు. 

image


మహిళల లింగరీ లగ్జరీ బ్రాండ్ "ఆరియా+లీయా"

"ఆరియా+లీయా" కొత్తగా ఉన్న ఈ పేరు ఇప్పుడు మహిళల అత్యంత క్లిష్టమైన వ్యవహారాన్ని అతి సులవు చేస్తోంది. మహిళలకు లో దుస్తుల ఎంపిక ఎప్పుడూ సమస్యాత్మకమే. ఆడవాళ్లే సేల్స్ మెన్లుగా ఉన్న షాపుల్లోకి వెళ్లినా... మనసు విప్పి ..ఏది కావాలో చెప్పడానికి ఎంతో బిడియపడాల్సి వస్తుంది. ప్రతి రోజూ మొదటగా ధరించే లింగరీస్ విషయంలోనే మహిళలు రాజీపడుతున్నారు. దీన్నుంచి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతోనే అను అనంతకృష్ణన్ "ఆరియా+లీయా" ప్రారంభించారు. మహిళల అభిరుచులకు తగ్గట్లుగా లగ్జరీ లింగరీలను రూపొందించే "ఆరియా+లీయా" బ్రాండ్ విపరీతంగా మహిళలను ఆకట్టుకుంటోంది. మహిళల అభిప్రాయలకే పెద్ద పీట వేసి అందుకు అనుగుణంగా లింగరీను రెడీ చేయడం "ఆరియా+లీయా" ప్రత్యేకత. ఈ ప్రాసెస్ మొత్తం ఆన్ లైన్ ద్వారానే చేస్తున్నారు.

image


ఒకటి నుంచి ప్రారంభం

"ఆరియా+లీయా" ఆవిర్భావం ఆషామాషీగా జరగలేదు. కుటుంబ వ్యాపారంలో ప్రతిభ చూపిస్తున్నా... ప్రతి నిర్ణయం వెనుక ఎవరో ఒకరి ఇన్ ఫ్లూయన్స్ ఉంటుంది. అమలు చేసేవారు వేరే ఉంటారు. అందుకే అనుకి అది తన సొంత విజయంలా భావించలేకపోయింది. ఈ సంఘర్షణతోనే అను.. సొంతంగా ఏదో ఒకటి చేయాలనే లక్ష్యంతో.. ముందుగా వ్యాపారాల నుంచి వైదొలిగారు. కుటుంబసభ్యులకు చెప్పి ముంబైకి వచ్చేశారు. ముంబైకి వచ్చిన తర్వాత కూడా తనకు ఏం చేయాలన్నదానిపై స్పష్టత లేదు. అందుకే ఏడాది పాటు పర్యటనలు చేశారు. కొత్త కొత్త ప్రదేశాలు చూశారు. పుస్తకాలు చదివారు. కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. చివరికి తను ముంబైనే హోమ్ బేస్ గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మహిళకు ఉపయోగపడే పని ఏదైనా చేస్తేనే సంతృప్తిగా ఉంటానని తెలుసుకున్నారు. 

ఈ సమయంలోనే తనకు మహిళల ప్రధానమైన లింగరీ సమస్య తెలిసి వచ్చింది. వాస్తవానికి తనకూ అలాంటి సమస్య ఉంది. పైగా తనకు లింగరీ కలెక్షన్ హాబీ. కానీ రాజీపడిపోయేది. కానీ దానివల్ల తను పడే అసౌకర్యం అందరూ పడుతున్నారని ఓ సారి లింగరీ షాపులోనే ఇతర మహిళలతో మాట్లాడినప్పుడు తెలుసుకుంది. అప్పుడే అనుకి తను ఏంచేయాలో... ఏం చేస్తే తనకు మానసిక ప్రశాంతత వస్తుందో అంచనా వేసుకుంది... ! ఆ తర్వాత క్షణం ఆగకుండా పని ప్రారంభించింది.

మహిళలు ఏ మాత్రం మొహమాట పడకుండా తమ అభిరుచులు, అభిప్రాయాలు, సౌకర్యాన్ని కలిగించే ఉత్పత్తుల్ని తయారుచేసే లింగరీ బ్రాండ్ ను తీసుకురావాలని అను నిర్ణయించుకుంది. భర్తకు, కుటుంబ సభ్యులకు వివరించి ఆమోదం తీసుకుంది. అను మానసిక సంఘర్షణ చూసిన వారు కూడా.. తనకు ఇష్టమైన పని చేయమని ప్రొత్సహించారు. ఆ తర్వాత తను ఎంచుకోదలచిన రంగం గురించి కొంత కాలం పాటు పూర్తిగా స్టడీ చేసింది. ఎన్నో పుస్తకాలు చదివింది. మేలైన్ ఫ్యాబ్రిక్ ను ఎంచుకోడంలో మెలకువలు తెలుసుకుంది. అలా అతి తక్కువ కాలంలోనే "ఆరియా+లీయా" బ్రాండ్ ఆవిష్కృతమయింది.

image


" ప్రొడక్షన్ ప్రాసెస్ నాకెంతో నేర్పింది. ఎన్నో పుస్తకాలు చదివా. లింగరీ ఇండస్ట్రీలోని ప్రతి అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశా. నాణ్యమైన ఫ్యాబ్రిక్ ను ఎంచుకునేందుకు ఏ మాత్రం రాజీపడలేదు. మా డిజైన్లు, ఆలోచనలు, ఉన్నతమైన మెటీరియల్స్ కు సరిడే ఫ్యాక్టరీలను గుర్తించేందుకు చాలా శ్రమించాం"- అను 

బీ బోల్డ్.. బీ ట్రూ.. బీ యూ

"ఆరియా+లీయా" బ్రాండ్ భారతీయ మహిళల ఆలోచనలకే పెద్దపీట వేస్తుంది. వారి వ్యక్తిత్వాన్ని, వారి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా లింగరీని డిజైన్ చేయడం కంపెనీ స్పెషాలిటీ. బీ బోల్డ్.. బీ ట్రూ.. బీ యూ అనేది బ్రాండ్ ట్యాగ్ లైన్ కానీ.. ఈ మూడు వాక్యాల్లోనే మొత్తం ఉద్దేశాన్ని వివరించేశారు అను. చేస్తున్నది మానసిక సంతృప్తి కోసం.. లాభాల కోసం కాదు.. .అందుకే ట్యాగ్ లైన్ ను తు.చ. తప్పకుండా అమలు చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఆధునిక సమాజంలో మహిళల అభిప్రాయాలు, అభిరుచులను గౌరవించడమే "ఆరియా+లీయా" సక్సెస్ సీక్రెట్. మారుతున్న మహిళల అభిప్రాయాలు తెలుసుకునేందుకు.. తన ఫ్రెండ్స్ తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతారు అను. 

image


ఆడవాళ్లకు అండగా ఉండటంలో ఉన్న సంతృప్తి అనును ... ఎంతో సంతోషంగా ఉంచుతోంది. అందుకే ఆరియా + లియా బ్రాండ్ ను సామాజిక సేవా కార్యక్రమాలు అందించే ఓ ఎన్జీవోతో అనుసంధానం చేసింది. కోల్ కతా రెడ్ లైట్ ఏరియాల్లో ఉన్నవారిని మార్చేందుకు ఎన్జీవో చేస్తున్న కార్యక్రమాలకు అను సాయం చేస్తున్నారు. ఆరియా+లీయా బ్రాండ్ లింగరీలను ప్యాక్ చేసే సంచుల తయారీని అక్కడి వారికే అప్పగించారు. మహిళా సాధికారిత, స్వేచ్ఛ కోసం అను అనంతకృష్ణన్ నిత్యం ప్రయత్నిస్తున్నారు.

image


మనసుకు నచ్చిన పని చేయడం కోసం...అను కుటుంబాన్ని దూరం చేసుకోలేదు. ముంబైలో ఉంటున్నప్పటికీ.. మూడు వారాలు ఆరియా+లియాకి మరో మూడు వారాలు కుటుంబానికి కేటాయిస్తున్నారు. కుటుంబసభ్యులు కూడా అను ఆలోచనలపై స్పష్టత ఉండటంతో వారూ సహకరిస్తున్నారు. ప్రొత్సహిస్తున్నారు. తన స్టోరీ మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అను అనంతృష్ణన్ భావిస్తున్నారు. ఎందుకంటే మనం మనసా వాచా కర్మనా ప్రయత్నిస్తే అనుకున్నది సాధించవచ్చని ఆమె నిరూపించారు.