అక్షరాలతో యువతరాన్ని తట్టి లేపుతున్నరష్మీ బన్సాల్

పుస్తకం ఒక మంచి నేస్తంపుస్తకం ఒక గురువుపుస్తకం చీకటిని పారద్రోలి వెలుగు దివిటీలు వెలిగిస్తుందిఎంతోమంది మహానుభావులు పుస్తక పఠనంతోనే తమ జీవితాలను మార్చుకోగలిగారు. కొత్త ప్రపంచాన్ని సృష్టించగలిగారు. పుస్తకంతో ఎంతోమందిలోని ప్రేరణ కలిగించవచ్చు.

అక్షరాలతో యువతరాన్ని తట్టి లేపుతున్నరష్మీ బన్సాల్

Wednesday May 13, 2015,

4 min Read

నలుగురు నడిచే దారికి భిన్నమైన మార్గాలను అన్వేషించి ఆ దిశగా సాగడమే యువతరం స్టైల్‌. అందులోనూ తమకు నచ్చిన రంగాన్ని ఎన్నుకుని విజయం సాధించడం అనేది ఎంతో అభినందనీయం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్టు ‘‘రండి కలలు కనండి...వాటిని నిజం చేసుకోండి’’ ఈ మాటలు రష్మీ బన్సాల్ కి బాగా నచ్చినట్టున్నాయి. అందుకే ఆమె ఇటీవల కాలంలో ఇలాంటి స్ఫూర్తిదాయకమయిన అంశాలపైనే దృష్టి పెట్టారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం ఆమె రాసిన అరైజ్ , అవేక్ (లేవండి, మేల్కోండి) రచన సంచలనం రేపుతోంది.

‘‘యువతరం జీవితంతో ప్రయోగాలు చేయాలి. తాము కన్న కలల్ని నిజం చేసుకోవాలి’’ అంటారు అహ్మదాబాద్ కి చెందిన రష్మీ.

బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్ధులతో ఆమె నిరంతరం మమేకమవుతూ వారిలోని ఆలోచనల్ని అక్షరబద్ధం చేస్తుంటారు. వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనల్ని అందరికి తెలియచేస్తుంటారు.

రష్మి బన్సల్

రష్మి బన్సల్


ఖగోళ భౌతిక శాస్త్రవేత్తకు వారసురాలిగా జన్మించిన రష్మి ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో చదువుకున్నారు. ``టీ ఐఎఫ్ఆర్ లో చదువుకోవడం మంచి అవకాశం. మన వ్యక్తిత్వాన్ని, నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశం అక్కడ కలిగింది’’ అంటారు రష్మి. సెయింట్ జోసెఫ్ హైస్కూల్, ఆర్ సీ చర్చ్ కొలాబాలో చదువుకున్న రష్మీ క్లాస్ లోనే టాపర్ గా నిలిచేది. ‘‘స్కూల్ డేస్ నుంచి నాకు క్లాస్ బుక్స్ తో పాటు ఇతర పుస్తకాలు చదవడం ఎంతో ఇష్టం. ఒక్కోసారి స్కూల్ బుక్స్ కంటే ఎక్కువ టైం బయటి పుస్తకాలు చదివేదాన్ని’’ అని తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటారు రష్మి.

రష్మికి మేథమెటిక్స్ అంటే ఇష్టం ఉండేది కాదట. అందుకే బిఏ ఎకనామిక్స్ చదవాలని నిర్ణయించుకుంది. అప్పట్లో కెరీర్ ఆప్షన్స్ మూడు మన చేతిలో ఉండేవి. ఇంజనీరింగ్ లో ఐఐటీ, మెడిసిన్ లో పీహెచ్ డీ అదీ కూడా అమెరికాలో పూర్తిస్థాయి స్కాలర్ షిప్ తో. అంతకంటే మనం ఆలోచించుకునే అవకాశమే లేదంటారు రష్మి. ఇలాంటి కీలక సమయంలో రష్మి తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయపరిచింది. ``రష్మి చాలా తెలివైన పిల్ల. ఇలాంటి నిర్ణయం తీసుకుందేమిటి?’’ అని అంతా ఆశ్చర్యపోయారట. అయితే అలాంటి కామెంట్లకు రష్మి చలించలేదు ``తన నిర్ణయం ఖచ్చితంగా కరెక్టే అని తోచింది. ఆ విధంగానే ముందుకెళ్ళిపోయింది రష్మి.

ఎంబీయే పూర్తిచేశాక రష్మి స్వంతంగా ఒక పబ్లిషింగ్ కంపెనీని స్థాపించింది. ఆ కంపెనీ పేరు JAM. ఆ టైంలోనే Stay Hungry Stay Foolishపేరుతో ఒక బుక్ రాసింది. ఈ బుక్ కోసం 25 మంది పారిశ్రామిక వేత్తల్ని కలుసుకుందామె. వారి జీవిత పాఠాలను అక్షరీకరించింది.

మొదటి తరం పారిశ్రామికవేత్తలు జీవితంలో పైకి రావడానికి అనుసరించిన విధానాలను, ఎత్తుపల్లాలను స్వయంగా తెలుసుకుని అందరి ముందు ఉంచింది.

వ్యాపార దిగ్గజాల నుండి సామాన్య చిన్న చిన్న వ్యాపారుల వరకు వారి జీవితాన్ని అధ్యయనం చేసింది. ఏ డిగ్రీలు లేకుండా వారు సాధించిన విజయాలను యువతరానికి ఆందించేందుకు రచనను మార్గం ఎన్నుకుని వారికి అందిస్తోంది. అందుకోసం ఒక జామ్‌ అనే మ్యాగజీన్‌ను కూడా ఆమె నిర్వహిస్తున్నారు.

image


‘‘పక్కా ప్రణాళికలతో వెళ్ళిన వారి సంగతి కాకుండా ఎటువంటి ఆధారం లేకుండా వ్యాపారాలను ప్రారంభించిన వారి పరిస్థితి ఏంటి’’ అన్న ప్రశ్న ఆమెలో మరింత ఆలోచనను రేకెత్తించింది. దీనికి సంబంధించి ఆమె కొన్ని విషయాలను ఎంతో కష్టపడి సేకరించింది. ఎటువంటి స్థాయి లేకుండానే నేడు గొప్పస్థాయికి వెళ్ళిన వారి కి సంబంధించిన విషయాలను అధ్యయనం చేసింది. అటువంటి 20 మందికి సంబంధించిన విశేషాలతో ఒక పుస్తకాన్ని రాసింది. తన పుస్తకాన్ని విడుదల చేస్తూ ఆమె అనేక విషయాలను కూడా తెలియజేసింది. వాటిలో విభిన్న రంగాలు, వయసుల వారికి సంబంధించిన విశేషాలను తెలిపింది. వాటి ద్వారా యువతలో ఆమె ఉత్సాహాన్ని నింపేందుకు కృషి చేస్తోంది.

రష్మి బన్సాల్‌ బిజినెస్‌ విద్యకు సంబంధించి .... ‘బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విద్య అనేది కేవలం ఒక ఆలోచన ఇచ్చేందుకు ఉపయోగపడేది మాత్రమే. దీని ద్వారా మనం ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోగలం అంతే. కానీ మొత్తం వ్యా పారం, లేదా వ్యవస్థాపన దీని ద్వారానే తెలుసుకోలేం. అది అనుభవపూర్వకంగా మాత్రమే తెలుస్తుంది. అందుకే అటువంటి వారి అనుభవాలను తెలియజేయడానికి ప్రయత్నించాను.’ అన్నారు. ఆమె రాసిన పుస్తకంలో కూడా ఎంతో స్పూర్తిధాయక కథనాలను రష్మి పొందుపరిచారు.

రష్మి ఏడాదికి 80-100 స్కూల్స్ కి వెళుతుంటారు. ‘‘ప్రతి స్కూల్ లో డైనమిక్ స్టూడెంట్స్ ఉంటారు. వారిలో చాలామంది ఏదో సాధించాలనే పట్టుదలతో ముందుకు వెళుతూ ఉంటారు. నలుగురిలో భిన్నంగా కనిపిస్తూ ఉంటారు. అలాంటివారి ధైర్యాన్ని మెచ్చుకుని వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఎన్నో అద్భుతాలు సాధిస్తారు’’ అంటారు రష్మి.

‘‘కాలేజీ జీవితంలో కేవలం సంతోషం కోసం...మన సంతోషం, సరదా కోసం ఏదో చేస్తుంటాం. అదే పని పాకెట్ మనీని సంపాదించేందుకు చేస్తే ఎలా ఉంటుంది’’ అని ఆలోచించాలంటారు.


‘‘ఆలోచనను, ఆచరణను రంగరించి వ్యవహరించే 20 మంది ఆదర్శ వ్యాపారవేత్తల కధనాలు. వారు విభిన్న ధ్యేయాలు సాధనకు కట్టుబడి కృషి చేస్తున్నప్పటికి, ఒక విషయంలో మాత్రం ఏకీభావం కనబడుతుంది. నిర్వహణా సూత్రాలను ఎక్కడయినా ఉపయోగించవచ్చునని, తప్పనిసరిగా ఉపయోగించాలన్న విశ్వాసం. ఈ కధనాలన్ని ఒక విషయాన్నీ బిగ్గరగా, స్పష్టంగా చెబుతాయి. మార్పు ఒక వ్యక్తితో ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తీ ఇంటి ప్రక్కనే ఉండవచ్చు. మీలాంటి ఒకరు కూడా కావచ్చు’’ అంటారు రష్మీ భన్సాల్.

image


ప్రతి పారిశ్రామిక వేత్తలోనూ మూడు రకాల కోణాలు మనం చూస్తుంటాం. పట్టుదల, అభిరుచి, ఉద్దేశ్యాలుంటాయి. తమ పై తమకున్న నమ్మకం విజయానికి మూలకారణంగా మారుతుంది. విద్యార్ధి దశలో తమ మదిలోని ఆలోచనలను కొంతమంది అభివ్యక్తీకరిస్తుంటారు. ప్రతి వందమందిలో పదిమందికి పారిశ్రామికవేత్త అయ్యే అర్హతలుంటాయి. Follow Every Rainbow అనే పుస్తకంలో మహిళా పారిశ్రామికవేత్తల గురించి ప్రస్తావించారు. ‘‘కుటుంబ బాధ్యతల్ని, వ్యాపారంలో వచ్చే సవాళ్ళని ఎదుర్కొనే శక్తి వారికి ఉంటుంది. అయితే వాటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. వ్యాపారంపై ఒకేసారి తమ దృష్టిని కేంద్రీకరించడం సాధ్యంకాదు. తమకున్న సమయాన్ని కొంచెం కొంచెం పెంచుకుంటూ పోవాలి’’ అంటారు రష్మీ భన్సాల్.

image


సంపద సృష్టి, సంపద వృద్ధిపై మహిళలకు ఒక విధమైన ఆలోచన ఉండాలి. చిన్నప్పటినుంచీ కుటుంబంలో మనీ మేనేజ్ మెంట్ గురించి తెలుసుకోవాలి. బడ్జెట్ పై అవగాహన ఉండాలి. మహిళలు తమ ప్రాధాన్యతలను గుర్తించాలి. అనవసర విషయాలను పక్కన పెట్టాలి. మంచి మెంటర్ సాయంతో ముందుకెళ్ళాలి’’ అంటారు రష్మి.

ప్రస్తుతం అక్షయ పాత్ర ఫౌండేషన్ కోసం ఒక పుస్తకం, జీ టీవీ ప్రేక్షకుల కోసం ‘‘Ummeed’ (hope)’’ పేరుతో మరో పుస్తకం రాస్తున్నారు రష్మీ.

సామాన్యులకు ఉపయోగపడే, మహిళలు ముందుకు నడిపే వ్యవస్థలు కావాలంటారు రష్మి. నిజమే అన్నిరంగాలను శాసించగలిగే మహిళలు ఇప్పుడు మనకు కావాలి.