నాలుగేళ్ల తర్వాత ఓ స్టార్టప్ మొదటి చెక్ అందుకుంటే ఆ కిక్కే వేరప్పా !

టివి ఎంగేజ్‌మెంట్ స్పేస్‌లో దూసుకుపోతున్న ఐడబ్బాప్రత్యేక సెగ్మెంట్లో మెరుగైన వృద్ధినాలుగేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే గాడిలో పడ్తున్న కంపెనీటివి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో చెప్పేసే ఐడబ్బామీడియా హౌజ్‌లు, టివి సంస్థలకు ఎంతో ఉపయోగపడే సమాచారం

నాలుగేళ్ల తర్వాత ఓ స్టార్టప్ మొదటి చెక్ అందుకుంటే ఆ కిక్కే వేరప్పా !

Sunday July 05, 2015,

3 min Read

మొదటి చెక్ ఎప్పటికీ స్పెషలే. అది ఎంత తక్కువ మొత్తమైనా కావొచ్చు. దాని ప్రత్యేకతే వేరు. అదే స్టార్టప్ విషయానికి వస్తే.. ఆ టీమ్ అప్పటి వరకూ పడిన కష్టమంతా మరిచిపోయి దాన్ని చూసి మురిసిపోతారు. స్పష్టమైన ప్రణాళికలు, గమ్యం ఎక్కడుంతో తెలియకుండా కేవలం ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకున్న నడుస్తున్న స్టార్టప్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా కాలం తర్వాత తమ సేవలు నచ్చి ఇప్పుడు డబ్బులిచ్చి మరీ వాటిని కొనుగోలు చేస్తే ఆ ఆనందమే వేరు. ఇప్పుడు iDubba పరిస్థితీ అంతే.

అశీశ్ కుమార్, రబీ గుప్తా- ఐడబ్బా వ్యవస్థాపకులు

అశీశ్ కుమార్, రబీ గుప్తా- ఐడబ్బా వ్యవస్థాపకులు


ఐడబ్బా అనేది మొదట్లో ఒక టివి గైడ్‌లా మాత్రమే ప్రారంభమైంది. ఆ తర్వాత మెల్లిగా icouchAppగా (ఐకౌచ్ యాప్) కూడా లాంచ్ చేసింది. ఈ సంస్థ కో ఫౌండర్ రబీ గుప్తాతో యువర్ స్టోరీ కాసేపు ముచ్చటించింది. భవిష్యత్ ప్రణాళికలతో పాటు ఇంత వరకూ తమ జర్నీ ఎలా సాగింది, మొట్టమొదటి మైల్ స్టోన్‌ అధిగమించిన వివరాలను పంచుకుంటూ ఆయన తెగ సంతోషపడిపోయారు. రబీ మాటల్లోనే..

మూడేళ్ల కష్టం వెనుక 

''టివి ఎంగేజ్‌మెంట్ స్పేస్ అనేది ఎప్పటికీ ఇంట్రెస్టింగ్‌ బిజినెస్. ఇందులోకి చాలా మంది స్టార్టప్స్ వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ అందరూ ట్విట్టర్‌లా ఇన్ఫర్మేషన్ పంచుకునే స్థాయికి మాత్రమే వచ్చారే కానీ టివి చూసే వాళ్ల అభిరుచులను పట్టుకోలేకపోయారు. మేం మొదట ఐడబ్బా పేరుతో టివి గైడ్, అలర్ట్స్ మోడల్‌ను మొదలుపెట్టాం. కానీ ఇప్పుడు ఐకౌచ్ పేరుతో అంతకంటే పెద్ద వ్యాపార అవకాశం ఉన్న సెకెండ్ స్క్రీన్ మోడల్‌వైపు వెళ్తున్నాం. మమ్మల్ని సరైన దారిలో నడిపిస్తూ వెన్నుతట్టి ప్ర్తోత్సహించేందుకు అద్భుతమైన మెంటర్లు ఉన్నాయి. వీళ్లకు తోడు మా కుటుంబ సభ్యులు కూడా మాకు నిత్యం ఉత్సాహాన్ని నింపుతూనే ఉన్నారు. మా లాంటి స్టార్టప్స్‌ నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూ వృద్ధి సాధించాల్సి ఉంటుంది. అవకాశాల కోసం నిత్యం ఫ్లెక్సిబుల్‌గా ఆశావహ దృక్ఫధంతో ఉన్నాం. అంత వరకూ మాకు ఎన్నో కొత్త ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. కస్టమర్ల నుంచి సరైన ఫీడ్ బ్యాక్ కూడా రావడం మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోంది. మా బ్యాంకు ఖాతాలో డబ్బు ఉండేంత వరకూ మా జోరు కొనసాగుతూనే ఉంటుంది (నవ్వుతూ...)

మొదటి చెక్

నిజం చెప్పాలంటే ఇప్పుడే మొదటి సర్కిల్ పూర్తైంది. ఆదాయం లేకపోతే ఏ వ్యాపారానికీ పరిపూర్ణత ఉండదు. ఆదాయం కొద్దిగా అయినా అది ఫర్వాలేదు. దీన్ని బట్టి మా ఉత్పత్తికి గుర్తింపు లభించినట్టైంది. మా ఆలోచనలు సరైన దారిలోనే వెళ్తున్నాయి అనేందుకు ఇదే సాక్ష్యం.

రెవెన్యూ మోడల్

ఐకౌచ్ యాప్ చుట్టే మా రెవెన్యూ మోడల్ నడుస్తోంది. త్వరలో ఐ డబ్బా, ఐ కౌచ్ యాప్‌లను విలీనం చేసేస్తాం. అప్పుడే అది ఓ పర్ఫెక్ట్ ప్రొడక్ట్ అవుతుంది.

ఐకౌచ్ యాప్ అనేది ప్రొడక్ట్, ఎంగేజ్‌మెంట్, ఎనలిటిక్స్‌ల కలబోత. దీన్ని మేం టివి ఛానల్స్, మీడియా హౌజ్‌లకు ఇస్తాం. ఇదో కస్టమైజ్డ్ సొల్యూషన్ లాంటిది. ఆడియన్స్‌తో రియల్ టైంలో కనెక్ట్ అయ్యేందుకు మా ప్లాట్‌ఫామ్‌ ఎంతో ఉపయోగపడ్తుంది. గూంజ్ ల్యాబ్స్ సహకారంతో ఇండస్ట్రీ సాండర్డ్ ఎనలిటిక్స్ కూడా అందజేస్తున్నాం. దీని వల్ల ఆడియన్స్ ఏం చేస్తున్నారు, ఎంత సేపు చూస్తున్నారు అనే విషయాలను మీడియా హౌజ్‌లు సులువుగా తెలుసుకోవచ్చు.

మార్గదర్శి తోడుంటే..

మాకు కొంత మంది సరైన మెంటర్స్ దొరికారు. వాళ్లలో ఇన్వెస్టర్లు కూడా ఉన్నారు. సమీర్ గుగ్లాని, రాజన్ ఆనందన్, కంచన్ కుమార్, యజ్దీ లష్కరీ, శ్రీకాంత్ శాస్త్రి, రఘువంటి వాళ్లు ఉన్నారు. మాకు ఎప్పుడూ సరైన మార్గదర్శనం చేస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా మాపై నమ్మకాన్ని వాళ్లంతా ఉంచారు.

మంచి టీమ్ - మేం మెల్లిగా మా టీమ్‌ను పెంచుకుంటున్నాం. గొప్ప ప్రొడక్ట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాళ్లంతా కలిసి కృషి చేస్తున్నారు.

ఫీడ్ బ్యాక్ - నేర్చుకోవడమనేది స్టార్టప్స్‌ జర్నీలో అతి కీలకమైనది. కస్టమర్ల అనుభవాలను శ్రద్ధగా వినడంతో మేం మా ప్రొడక్ట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ఆస్కారం లభిస్తుంది.

మొబైల్ జోరు - ఇండియాలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఏడు కోట్లు దాటింది. ఇది ఇంకా పెరుగుతూనే ఉంది. సరైన సమయంలో, సరైన ప్లేసులో, సరైన ఉత్పత్తిని అందించగలిగితే మాకు తిరుగుండదు.

భవిష్యత్ ప్రణాళికలు

సెకెండ్ స్క్రీన్ యాప్‌పై దృష్టి సారించాం. ఏడాదికిపైగా నుంచి మా ఐకౌచ్ యాప్ మార్కెట్లో ఉంది. టివి ప్రేక్షకుల అవసరాలేంటో మాకు ఖచ్చితంగా తెలుసు. అంతకంటే మెరుగైన, పవర్‌ఫుల్‌ యాప్‌ను తెస్తున్నాం. మా బిటుబి క్లైంట్ల విషయానికి వస్తే ప్రతీ నెలా కొత్త క్లైంట్లు యాడ్ అవుతూనే వస్తున్నారు. బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో ఉన్నాం.

స్టార్టప్స్‌కు సలహా

మొదట అద్భుతమైన ప్రొడక్ట్‌ను తయారుచేయండి. అది చాలా ధృడంగా ఉండాలి. మేం ఇప్పటికీ కష్టపడుతూ అభివృద్ధి చేస్తూనే ఉన్నాం. మార్కెట్‌కు నప్పే ఉత్పత్తి చేయడమే ఉత్తమం.

"ఎప్పటికీ మీ కళ్లు, చెవులు తెరిచే ఉండాలి. కొత్త కొత్త వాళ్లను కలవాలి. వాళ్లతో మాట్లాడాలి, సలహాలు తీసుకోవాలి. రఘువెంకట్రామన్‌ను ఒకసారి యధాలాపంగా కలవడం వల్లే మా రెవెన్యూ మోడల్‌కు ఒక రూపు వచ్చింది. సరైన భాగస్వాములను ఎంచుకోండి. మీ ఆలోచనను ఆచరణలో పెట్టండి''.