ఆన్‌లైన్ ట్రయిల్ రూం.. ఈ 'ట్రయిల్ కార్ట్'

ఆన్‌లైన్ ట్రయిల్ రూం.. ఈ 'ట్రయిల్ కార్ట్'

Sunday October 25, 2015,

4 min Read

గంటల తరబడి షాపింగ్ చేయడం, అన్ని విధాలా నచ్చిన డ్రెస్ కోసం వెతకడం, ఒక చోట నచ్చినది దొరక్కపోతే మరో షాప్ కు వెళ్లడం..! ఈ కష్టాలకు ఫుల్ స్టాప్ పెడుతూ... ఈ- కామర్స్ షాపింగ్‌ను ఈజీగానూ, ఎగ్జైటింగ్‌గా మార్చేశాయి. అయితే ఆన్ లైన్‌లో ఎన్ని వెరైటీలు, ఆఫర్లూ లభించినప్పటికీ.. ఇప్పటికీ ఎంతోమంది ఫ్యాషన్ ఫ్రీక్స్... స్వయంగా దుకాణాలకు వెళ్లే.. దుస్తుల షాపింగ్ చేసేందుకే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే... నేరుగా దుస్తులు కొనుగోలు చేసుకోవడం వల్ల అక్కడికక్కడే వాటిని ట్రై చేసి చూసుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి.

ఈ ఒక్క డ్రాబ్యాక్‌ను అధిగమించేందుకు ఆన్‌లైన్ స్టోర్లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. రిటర్న్ పాలసీలు, డిస్కౌంట్లు ఇందులో భాగమనే చెప్పాలి. అయితే... వర్చువల్ డ్రస్సింగ్ రూముల ద్వారా ఈ లోటు కూడా త్వరలోనే భర్తీ కాబోతోంది. బెంగళూరుకు చెందిన ట్రయిల్ కార్ట్ అనే స్టార్టప్... తమ కొనుగోలుదారులకు ఆన్ లైన్‌లోనే వివిధ దుస్తులను ట్రై చేసి చూసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. స్మార్ట్ ఫోన్ల ద్వారా తమకు ఏది నప్పుతుందో చూసుకుని అదే కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. 

image


అసలు ట్రయిల్ కార్ట్ ఎలా పనిచేస్తుంది ?

మహిళలకు, పురుషులకు వర్చువల్ డ్రస్సింగ్ రూమ్ అనుభూతిని అందించేందుకు రూపొందిన ఏకైక మొబైల్ అప్లికేషనే ఈ ట్రయిల్ కార్ట్. ఇందులో కస్టమర్లు వివిధ ఫ్యాషన్ ప్రోడక్ట్స్‌ను ట్రై చేసుకుని చూడవచ్చు. ఈ యాప్ ద్వారా వెబ్ సైట్లో ఉన్న అప్పరెల్‌ను సెలక్ట్ చేసుకుని ట్రై ఆప్షన్ పై క్లిక్ చేసి అది తమకు లేదా తమ ఫ్రెండ్‌కు సూట్ అవుతుందో లేదో చూసుకోవచ్చు.

ట్రయిల్ కోసం వినియోగించే ఇమేజ్‌ను అప్పటికప్పుడు ఫోన్ కెమెరా సహాయంతోనైనా తీసువచ్చు. లేదా గ్యాలరీలోని ఇమేజ్‌లను కూడా ఉపయోగించవచ్చు. ఇక సెలక్ట్ చేసుకున్న అపెరెల్ లేదా ప్రోడక్ట్‌ను తమ పిక్చర్‌పై కావాల్సిన రీతిలో అమర్చుకునే వెసులుబాటు కూడా ఈ అప్లికేషన్ కల్పిస్తోంది. దీని ద్వారా సదరు ప్రోడక్ట్ తమకు సరిగ్గా సూట్ అవుతుందో లేదో తెలిసిపోతుంది. ఇక ఇలా మ్యాచ్ చేసుకున్న ఔట్‌ఫిట్‌ను సోషల్ మీడియా ద్వారా తమ స్నేహితులు, లేదా కుటుంబ సభ్యులకు పంపి వారి అభిప్రాయం తెలుసుకునే అవకాశం కూడా ఉండటం మరో విశేషం.

ఆచరణలోకి వచ్చిన ఆలోచన

2015 ఫిబ్రవరిలో హర్ష, జయలక్ష్మీ మనోహర్, విపుల్ దివ్యాన్షు అనే ముగ్గురు ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఈ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టారు. యాప్‌కు సంబంధించిన UX, UI (యూజర్ ఎక్స్‌పీరియన్స్, యూజర్ ఇంటర్‌ఫేజ్‌) విభాగాలను జయలక్ష్మీ చూసుకుంటారు. విపుల్.. బ్యాక్ ఎండ్ టెక్నాలజీని హ్యాండిల్ చేస్తుండగా, హర్ష.. స్ట్రాటజీస్, బిజినెస్‌కు సంబంధించిన కార్యకలాపాలు పర్యవేక్షిస్తుంటాడు. ప్రస్తుతం వీరి వద్ద ఒక్క ఫుల్ టైమ్ ఎంప్లాయ్ మాత్రమే పనిచేస్తున్నాడు.

ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్, ఫ్యాషనారా, జోవీ, యప్‌మీ వంటి వెబ్ సైట్ల నుంచే ఉత్పత్తులను తమ యాప్ ద్వారా మార్కెట్ చేస్తున్నారు. అయితే... ట్రయిల్ కార్ట్ ను వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా ఇంకో వెబ్ సైట్లోకి సైన్ ఇన్, లాగిన్ అవ్వాల్సిన పనిలేదు. ఈ-కామర్స్ సైట్స్ వినియోగదారులు సదరు సైట్ నుంచే తమకి ఇష్టమైన ప్రోడక్ట్స్‌ను నేరుగా ట్రైయిల్ కార్ట్‌లో పరీక్షించుకుని కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ioS ప్లాట్‌ఫాంలో కూడా లాంచ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ట్రయిల్ కార్ట్ యాప్ ఆర్కిటెక్చర్, ఆల్గోరిథమ్స్‌కు సంబంధించిన పేటెంట్ పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం సంస్థ వ్యవస్థాపకులు మరిన్ని నిధులు సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. భవిష్యత్తులో ఆన్ లైన్- ఆఫ్ లైన్ షాపింగ్ మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వినియోగదారులను పెంపొందించుకోవడం పై దృష్టి సారించిన ఈ ఔత్సాహిక వ్యాపారవేత్తలు... నిధుల సమకూర్చుకునేందుకు, తమ మార్కెట్ విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

'ఆన్ లైన్ లో అమ్ముడుపోయే వివిధ ఉత్పత్తుల్లో 28 నుంచి 40 శాతం కస్టమర్ల అసంతృప్తి కారణంగానే తిరిగి వచ్చేస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం ట్రయిల్, ఫిట్టింగ్ సమస్యలే ... ఆన్ లైన్ షాపింగ్ ఎంత సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ మహిళల దుస్తుల విషయంలో కొన్ని సార్లు అది ప్రతికూల ఫలితాలనే ఇస్తోంది. టీ షర్ట్, షర్ట్ వంటివి కొనుగోలు చేసేటప్పుడు అవి తమకు సూట్ అవుతున్నాయో లేదో ట్రై చేసి తెలుకోవాలనుకుంటారు. అక్కడే వారు ట్రయిల్ రూమ్ ఎక్స్‌పీరియెన్స్ మిస్ అవుతున్నారు. దీంతో ఆన్ లైన్‌లో తమకు ఎంతగానో నచ్చి కొనుగోలు చేసిన వాటిని తిరిగి పంపించేస్తున్నార'ని ట్రైయిల్ కార్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన హర్ష చెబుతున్నారు.

image


కాంపిటీషన్

వర్చువల్ డ్రస్సింగ్ రూమ్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ అంశంపై ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. మిక్స్ మీ వంటి వెబ్ సైట్లు తమ వద్ద ఉన్న దుస్తులను మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుండగా... ఫిట్ లీ తమ వినియోగదారులకు వర్చువల్ డ్రెస్సింగ్ రూమ్ ఎక్స్‌పీరియెన్స్ కల్పిసోంది. ఇందుకోసం కొనుగోలుదారులు.. తొలుత మూడు యాంగిల్స్‌తో తమ ఫొటోలను తీసుకోవాల్సి ఉంటుంది. యాప్‌లో వాటిని పోస్ట్ చేయగానే 3డి ఇమేజ్ జెనరేట్ అవుతుంది. తద్వారా సదరు అపరెల్ తమకు సూట్ అవుతుందో లేదో తెలుసుకోవచ్చు. DNA డిజైన్ వారి స్మార్ట్ డ్రెస్సర్ కూడా ఈ కోవకు చెందినదే.

ప్రస్తుతం కొనుగోలుగదారుల స్టైల్‌కు తగ్గట్టు అపరెల్స్‌ను అందివ్వడం భారత్‌లో ఓ ట్రెండ్‌గా కొనసాగుతోంది. వూనిక్. కామ్ వారు తమ కస్టమర్ల స్టైల్, టేస్ట్, ఆహార్యానికి తగ్గట్టు కొన్ని దుస్తులను సూచిస్తున్నారు. తద్వారా ఇటీవలే వారు సెకోయా క్యాపిటల్ నుంచి ఐదు మిలియన్ డాలర్ల ఫండింగ్ అందుకున్నారు.

ట్రయిల్ కార్ట్‌లో సానుకూలతలు

ఈ యాప్ వివిధ రకాల టాప్స్ ట్రై చేసేందుకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. షర్ట్స్, టీ- షర్ట్స్, సూట్స్, జాకెట్స్, బ్లేజర్స్ వంటి వివిధ రకాల టాప్స్‌ను సులభంగా ట్రై చేసి చూసుకోవచ్చు. ఇక కావాల్సినప్పుడు పించ్ చేసేందుకు గానీ, జూమ్ చేసుకోవడం, రీ -అడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. సరిగ్గా తీయని ఫొటోల పైనా వివిధ రకాల టాప్స్‌ను ట్రై చేసి చూసుకోవచ్చు. ఇక అప్పటికప్పుడు తీసుకున్న ఫొటోలు, గ్యాలరీలో ఉన్న ఫొటోల ద్వారానూ ట్రైయిల్ కార్ట్ ను వినియోగించుకునే అవకాశం ఉంది.

image


దృష్టి సారించాల్సిన అంశాలు

అయితే... వివిధ రకాల టాప్స్ ను ట్రై చేసుకునేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉన్నప్పటికీ... ట్రౌజర్ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మోడల్ తమ చేతులను ప్యాంట్ జేబులో ఉంచుకున్నప్పుడు ఈ యాప్ అల్గొరిథమ్... దాన్ని సపోర్ట్ చేయలేకపోతోంది. దీనివల్ల జీన్స్ వంటివి ట్రై చేసినప్పుడు చేతుల దగ్గర రెక్టాంగ్యులర్ ప్యాచ్ లు కనిపిస్తున్నాయి. అయితే... ఈ సమస్యను అధిగమించే ప్రయత్నాల్లోనే ఉన్నట్లు ట్రైయిల్ కార్ట్ వ్యవస్థాపకుడు హర్ష చెబుతున్నాడు. ఓ నెల వ్యవధిలోనే ఈ సమస్యకు పరిష్కారం కనుగొననున్నట్లు తెలిపాడు. 'లోవర్ బాడీ క్లోత్స్ కు మా అల్గోరిథమ్ 80శాతం ఆక్యురసీ మాత్రమే ఇస్తోంది. త్వరలోనే దీన్ని అధిగమిస్తా'మని హర్ష నమ్మకంగా చెబుతున్నాడు.

ప్యాంట్లు, జీన్స్ వంటి దుస్తులకు రూపొందించిన వర్చువల్ ఫ్రేమ్స్ చాలా దృఢంగా ఉంటాయి. మోడల్ ఇచ్చిన ఫోజ్ లపైనే అది ఆధారపడి ఉంటుంది. కొన్ని సార్లు వారు నిఠారుగా నించుంటారు, మరి కొన్ని సార్లు ఒక కాలిపైనే నిలుచుని ఫోజ్ ఇస్తుంటారు. కాబట్టి, ఇలాంటి దుస్తులు ట్రై చేయాలనుకున్నప్పుడు మోడల్ ఏ యాంగిల్ లో నించుందో వినియోగదారులూ అదే యాంగిల్ లో నించుని ఫొటోలు దిగాల్సి ఉంటుంది.

యువర్ స్టోరీ అభిప్రాయం

ఏమైనా.... ట్రయిల్ కార్ట్ విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందివ్వడంలో కొంతమేర విజయం సాధించింది. ఈ యాప్ 1.2 ఎంబీ స్పేస్ మాత్రమే తీసుకుంటోంది. ప్రస్తుతం ట్రయిల్ కార్ట్ బృందం మెరుగైన సేవల కోసం AR ప్లగిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. మరి... ముందు ముందు ట్రయిల్ కార్ట్ చేసే అద్భుతాలేంటో చూడాలి.