ఈ ఔత్సాహిక రేడియో గ్రూప్ మీకు తెలుసా?

ఈ ఔత్సాహిక రేడియో గ్రూప్ మీకు తెలుసా?

Monday January 25, 2016,

2 min Read

మొన్న చెన్నై తుఫాన్ , అంతకు ముందు వైజాగ్ హుద్ హుద్ లాంటి ప్రళయాలు వచ్చిప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. రేడియో తరంగాలతో మాత్రమే సాధ్యపడుతుంది. సాధారణ కమ్యూనికేషన్ వ్యవస్థ నిర్వీర్యం అయితే ఈ ఔత్సాహిక రేడియో వ్యవస్థ అవసరం తెలుస్తుంది. దీనికోసం దేశ వ్యాప్తంగా గ్రూపులున్నాయి. సమాజిక బాధ్యతగా ఈ గ్రూపులు తమ సేవలను వినయోగిస్తున్నాయి. ఇలాంటి వాటిలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న లామకాన్ అమేట్యూర్ రేడియో క్లబ్ కూడా ఒకటి.

image


ఎల్ఏఆర్సీ

ఎల్ఏఆర్సీ అంటే లామకాన్ అమేట్యూర్ రేడియో క్లబ్. ఆంధ్రా, తెలంగాణ తోపాటు తమిళనాడు,కర్నాటక ప్రాంతాల నుంచి కూడా ఇందులో సభ్యులున్నారు. చిన్న చిన్న ఎలక్ట్రానిక్ డివైజ్ లను ఉపయోగించి రేడియో కమ్యూనికేషన్ చేసే వారంతా కలసి ఏర్పాటు చేసిన గ్రూప్ ఇది.

“ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగించడం తెలిస్తే చాలు, దీనికి ప్రత్యేక డిగ్రీలు అక్కర్లేదు,” ఫర్హాన్

ఎల్ఏఆర్సీ ప్రధాన సభ్యుల్లో ఫర్హాన్ కూడా ఒకరు. ప్రతి రోజూ తాను గ్రూపు సభ్యులతో కమ్యునికేట్ చేస్తుంటానని అంటున్నారు. కానీ లామకాన్ లో జరిగిన గ్రూప్ మీటప్ లో మొదటి సారి అందరినీ చూడగలిగానని తామీ మీటప్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఇదే అంటున్నారాయన.

ఐబాల్ మీట్

ఎల్ఏఆర్సీ సభ్యులు కలసే మీట్ ని ఐబాల్ మీట్ గా వ్యవహరిస్తున్నారు. దక్షిణ భారత దేశంలో అతి పెద్ద క్లబ్ లలో ఎల్ఏఆర్సీ కూడా ఒకటి. ఈ సభ్యులు ఐబాల్ మీట్ పేరుతో అప్పుడప్పుడు కలుస్తుంటారు. రేడియో కమ్యూనికేషన్ లో ఎప్పుడూ టచ్ లోనే ఉన్నప్పటికీ పర్సనల్ గా కలసి వారి అభిప్రాయాలను ఐబాల్ మీట్ ద్వారా పంచుకుంటారు.

“డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, రైతులు ఇలా చాలా మంది మా గ్రూప్ లో ఉన్నారు,” శరత్

శరత్ హైదరాబాద్ నుంచి ఎల్ఏఆర్సీకి రిప్రజెంట్ చేస్తున్నారు. తమ క్లబ్ లో అన్ని రంగాలకు చెందని వ్యక్తులు ఉన్నారని ఆయన అంటున్నారు. ప్రొఫెషన్ ఏదైనా వారు ఔత్సాహిక రేడియో వినియోగదారులు కావొచ్చంటున్నారు. తమ గ్రూప్ లో చేరడానికి ఆయన ఆహ్వానం పలుకుతున్నారు.

image


ఎమెట్యూర్ రేడియో అంటే ఓ సామాజిక బాధ్యత

ఎమెట్యూర్ రేడియోని కమర్షియల్ గా చూడలేం. ఓ ప్రొఫెషన్ లో ఉండి సామాజిక బాధ్యతగా డివైజ్ లను వాడటం అలవాటు చేసుకోవాలి. వాటితో కమ్యునికేషన్ చేయడం తెలుసుకోవాలి. ఆపద సమయాలు, ప్రమాదాలనే కాదు, నగరం నడి బొడ్డులో అయిన కొన్ని సార్లు మొబైల్ సిగ్నల్స్ పనిచేయని పరిస్థితి. అలాంటి సమయాల్లో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ కచ్చితత్వంతో పనిచేస్తుంది. అయితే మొబైల్ ఫోన్ తో పోలిస్తే కొన్ని పరిమితులున్నాయి. కానీ దీన్ని కమర్షియల్ కమ్యూనికేషన్ గా మార్చనంత వరకూ ఈ పరిమితులు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు ఎల్ఏఆర్సీ సభ్యులు.

image


రైతులకు ఎంతగానో ఉపయోగకరం

ఎమెట్యూర్ రేడియో వ్యవస్థ తో రైతులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ రోజుల్లో టెలివిజన్, మొబైల్ కమ్యునికేషన్ వ్యవస్థ బాగా విస్తరించింది. కానీ అవి ఫెయిల్ అయిన సమయంలో ఇదొక ఆల్టర్ నేట్ కమ్యునికేషన్ సోర్స్ గా ఉపయోగపడుతుంది. వర్షాలు కురిసే సమయాన్ని చెప్పడంతో పాటు డెయిలీ ఫోర్ క్యాస్ట్ లాంటివి రైతులకు ఉపయోగపడే విషయాలు. ఈ సమాచారాన్ని రైతులకు చేరవేసే సాధనంగా ఎల్ఏఆర్సీ లాంటి ఔత్సాహిక రేడియోక్లబ్ లు పనిచేస్తాయి.